నటీనటులు...వెండితెర మీద మెరిస్తే, దర్శకుడు అనే వాడు..అన్ని శాఖలను ముందుండి నడిపిస్తాడు. ఓ యాక్టర్ నుండి ఎంత పర్ఫామెన్స్ రాబట్టాలో అనేది డైరెక్టర్ వర్క్. అయితే సెట్లో యాక్షన్ కట్ చెప్పే కొందరు...ముఖానికి రంగేసుకొని..నటనాభినయం చూపిస్తున్నారు. అంటే దర్శకులు కాస్తా...యాక్టర్లుగా మారుతున్నారు. ఈ మధ్యకాలంలో యాక్టర్స్‌గా రాణిస్తున్న దర్శకులపై ఓ లుక్కేద్దాం.
ఫ్యామిలి సబ్జెక్టులు తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల..నారప్పా లాంటి ఊరా మాస్ మూవీ తెరకెక్కించి అందరికి షాక్ ఇచ్చారు.లేటెస్ట్ గా పెద కాపు 1 లో విలన్ గా నటించాడు. ఈ పాత్ర కోసం తొలుత ఓ మలయాళ నటుడిని సెలక్ట్ చేసుకున్నారు. అయితే అనుకోకుండా ఈ యాక్టర్ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు.దాంతో శ్రీకాంత్ నెగిటివ్ రోల్ లో వెండితెర మీద కనిపించాడు.
మరో దర్శకుడు కూడా వెండితెర మీద విలన్ పాత్రలు పోషించటానికి రెడీ అయిపోయాడు. పలాస 1978 దర్శకుడు కరుణా కుమార్...ప్రస్తుతం మట్కా మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఓ మూవీకి యాక్షన్ కట్ చెప్తునే...నాగార్జున హీరోగా నటిస్తున్నా ...నా సామి రంగ లో విలన్‌గా కనిపించబోతున్నాడు.ఈ మూవీ గ్లింప్స్‌లో తాను నెగిటివ్ రోల్లో ఎలా ఉంటాడో చూపించాడు
షార్ట్ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన తరుణ్ భాస్కర్..పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా మారాడు.విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ...బాక్సాఫీసు ముందరా హిట్ కొట్టింది.తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే యూత్ ఫుల్ సినిమాను కూడా దర్శకత్వం చేసాడు తరుణ్ .ఇక విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి మీకు మాత్రమే చెప్తాను అనే మూవీని రూపొందించాడు.ఈ మూవీలో కథానాయకుడిగా తరుణ్ బాస్కర్నే సెలక్ట్ చేసుకున్నాడు. తరుణ్ హీరోగా నటించిన మీకు మాత్రమే చెప్తాను సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే నటుడిగా మాత్రం మంచి మార్కులు వేసుకున్నాడు.ఆ తర్వాత సీతా రామం,దాస్ కా దమ్కీ లాంటి సినిమాలలో నటించాడు.పిట్ట కథలు లాంటి వెబ్ సిరీస్లలో కనిపించాడు.తొందర్లో స్వీయ దర్శకత్వంలో కీడా కోలా సినిమాతో రాబోతున్నాడు.
ఎస్వీ కృష్ణారెడ్డి ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్న దర్శకుడు.ఈ బహుముఖ ప్రజ్ణాశాలి నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాడు.కాని..దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకున్నాడు.తనలోని కోరికను..ఉగాది సినిమాతో తీర్చుకున్నాడు. ఈ మూవీలో కథానాయకుడిగా నటించాడు. ఆతర్వాత అభిషేకం మూవీతో మరోసారి హీరోగా ట్రై చేసాడు. అయితే ఈ మూవీలు ఆకట్టుకోలేకపోయాయి.
ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమకు,భారీ విజయాలను అందించిన దర్శకులంతా,ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు గానూ, విలన్స్ గానూ నటిస్తున్నారు. గౌతమ్ వాసు దేవ్ మీనన్, సముద్రఖని, ఎసే జే సూర్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.
దర్శకులు ..నటులుగా మారటం అనేది ఇప్పటిది కాదు.ఎప్పటి నుండో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్‌తో సహా చాలామంది పెద్ద దర్శకులు నటులుగా మంచి పేరు సంపాదించారు. దాసరి శిష్యుడు కోడి రామకృష్ణ కూడా వెండితెర మీద కనిపించారు. దాసరి మరో ప్రియ శిష్యుడు..ఆర్ నారాయణ మూర్తి...స్వీయ దర్శకత్వం పలు చిత్రాలు వచ్చాయి . దాసరి నారాయణ..నటుడిగా..ప్రత్యేక ముద్రవేసాడు. ఈయన కోసమే కొన్ని పాత్రలు పుట్టాయా అన్నంతగా..మెప్పించాడు.
Comments
Please login to add a commentAdd a comment