SV Krishna Reddy
-
ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథ.. కన్నీళ్లు వచ్చాయి: రేణూ దేశాయ్
‘1000 వర్డ్స్’ సినిమా చూసి కన్నీళ్లు వచ్చాయి అని అన్నారు నటి రేణూ దేశాయి. అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘1000 వర్డ్స్’(1000 Words movie). ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. కే రవి కృష్ణా రెడ్డి కో- ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఈ సినిమాకు డా.సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. శివ కృష్ణ సంగీతం అందించారు. తాజాగా చిత్రబృందం ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకి రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ము ముఖ్య అతిథులుగా విచ్చేశారు. షో అనంతరం రేణూ దేశాయ్(Renu Desai) మీడియాతో మాట్లాడుతూ.. ‘రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఆయన ఓ కథ చెప్పాడు. బాగానే అనిపించింది. కానీ ఎలా తీసి ఉంటారా? అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీశారు. సినిమా చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. ఇంత మంచి సినిమా తీసిన టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘1000 వర్డ్స్’ అద్భుతమైన చిత్రం. అందరినీ కంటతడి పెట్టించారు. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయి. ప్రతీ ఒక్కరి హృదయాల్ని కుదిపేస్తుంది. చాలా రోజులకు ఓ చక్కటి సినిమాను చూశానని అనిపిస్తుంది’ అని అన్నారు.హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ ప్రాజెక్టులో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రమణ గారితో ఓ సారి ఫోటో షూట్ చేశాను. మీరు ఎప్పుడైనా సినిమా చేస్తే నాకు చెప్పండి సర్ అని అన్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, పాత్రను చక్కగానే పోషించానని అనుకుంటున్నాను. సూపర్ హీరో ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్లో నాకు గాయమైంది. దాదాపు ఎనిమిది నెలలు పని లేకుండా అలా బెడ్డు మీదే ఉండిపోయాను. ఆ టైంలోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ దేవుడే రమణ గారిని నా దగ్గరకు పంపాడనిపిస్తుంది. సంకల్ప్, శివ కృష్ణ, శివ రామ్ చరణ్‌లు ఈ ప్రాజెక్ట్‌కు చాలా కష్టపడ్డారు. వాళ్లు చాలా ఎత్తుకు ఎదుగుతారనిపిస్తుంది. మేఘన గారు, దివి గారు అద్భుతంగా నటించారు. నూరీ ఈ చిత్రానికి హీరో. నా మూడేళ్ల కొడుకు అధ్విక్ కృష్ణ మొదటి సారిగా నా సినిమాను స్క్రీన్ మీద చూశాడు. ఈ మూవీ నాకెంతో ప్రత్యేకం. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.డైరెక్టర్, నిర్మాత రమణ విల్లర్ట్ మాట్లాడుతూ.. ‘గత 20 ఏళ్లుగా నేను ఓ మంచి సినిమాను చేయాలని తపిస్తూనే ఉన్నాను. నాకు కథలు రాయడం రాదు. నేను చాలా కథలు వింటూ వచ్చాను. అప్పుడే సంకల్ప్ ఈ కథతో వచ్చారు. ఓ తల్లి బిడ్డను కనేప్పుడు పడే బాధను చెప్పాలని, చూపించాలనే ఈ సినిమాను తీశాం. రేణూ దేశాయ్ గారు నాకు సోదరి వంటి వారు. ఆమెకు ఈ కథ చెప్పగానే ఎమోషనల్ అయ్యారు. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తానని ఆమె ముందుకు రావడం ఆనందంగా ఉంది’ అన్నారు. -
ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి
ఎస్వీ కృష్ణారెడ్ఢి.. పోస్టర్‌పై ఈ పేరు కనిపిస్తే చాలు... ఇంటిల్లిపాదీ కలిసి సినిమాకి వెళ్లేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతారు. స్వచ్ఛమైన వినోదంతో పాటు మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలకి పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు. ఆయన చిత్రాల్లో యమలీల ఓ సంచలనం అయితే మాయలోడు చిత్రం కూడా ఒక సెన్సేషనల్ హిట్.. అలా ఆయన నుంచి ఎన్నో హిట్ చిత్రాలు వెండితెరపై మెరిశాయి. ఒక్కపాటతో 365 రోజులు ఆడిన సినిమా 'మాయలోడు' సినిమాలో 'చినుకు చినుకు సాంగ్' అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ పాటలో బాబూమోహన్- సౌందర్య కలిసి వేసిన స్టెప్పులు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. సుమారు 30 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సాంగ్ వింటూనే ఉన్నాం. ఆ ఒక్క పాట కోసం ఏకంగా 365 రోజులు సినిమా ఆడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాబుమోహన్ చెప్పారు. ప్రేక్షకులు సినిమాకు రావడం ఆ పాట పూర్తికాగానే థియేటర్ నుంచి వెళ్లిపోయేవారని ఆయన చెప్పారు. ఇదే పాటను శుభలగ్నం చిత్రంలో ఆలీ,సౌందర్యతో కూడా మళ్లీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్.. కానీ ఒక కమెడియన్‌తో సాంగ్ తీయడం ఏంటి..? అనే సందేహం చాలామందిలో ఉండేది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఎస్వీ కృష్ణారెడ్ఢి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మాయలోడు సినిమాలో హీరోగా ఉన్న రాజేంద్రప్రసాద్ సరైన సహకారం ఇవ్వకపోవడం వల్లే ఆ పాటను బాబూ మోహన్‌తో తెరకెక్కించినట్లు ఆయన ఇలా చెప్పారు. 'మాయలోడు సినిమా పూర్తి కానున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఇబ్బంది పెట్టారు. 'నువ్వూ డ్యాన్సులు చేస్తావట కదా.. నువ్వూ స్టెప్పులు వేస్తావట కదా..' అంటూ నాపట్ల రాజేంద్రప్రసాద్ వెటకారంగా మాట్లాడారు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. సినిమా పూర్తి అవుతుందని అనుకున్న సమయంలో రాజేంద్రప్రసాద్ డేట్స్ తక్కవ కావడంతో అదనపు డేట్స్ కోసం అడిగేతే కనీసం కూడా సహకరించలేదు. ఎలాగైనా పాట చిత్రీకరణ చేయాలని ఆయన్ను బతిమాలుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఎలా చేస్తావో చూస్తా అన్నారు ఫైనల్‌గా రాజేంద్ర ప్రసాద్‌తో మిగిలిన డేట్స్ తో డబ్బింగ్ పూర్తి చేయించాను. అది కూడా సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను తన మేనేజర్ చూసిన తర్వాతే డబ్బింగ్ చెప్పాడు. ఒక రోజులో ఎలాగూ డబ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుందని ఆయన అనుకున్నారు. సినిమా మొత్తం 1200 అడుగుల రీల్ వస్తే, ఎడిటర్‌ను రిక్వెస్ట్ చేసి, మొత్తం ఒకే రీల్‌గా మార్చాను. ఆ విషయం రాజేంద్రప్రసాద్‌కు తెలియదు. దీంతో మధ్యాహ్నం 1గంటకే డబ్బింగ్ పూర్తి చేయడంతో ఆశ్చర్యపోయారు. ‘ఇంకా పాట చేయాలి కదా. ఎలా చేస్తావో చూస్తా’ అన్నారు. ఆ తర్వాత పాట షూటింగ్‌కు రమ్మని పిలిస్తే, ‘నాకు కుదరదయ్యా.. సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావు కదా చేసుకో పో’ అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతటితో రాజేంద్రప్రసాద్ నిష్క్రమించగా.. ఇక ఆయన్ను బతిమాలాల్సిన అవసరం లేదని భావించానని కృష్ణారెడ్ఢి తెలిపారు. ఆపై వెంటనే బాబూమోహన్‌తో సాంగ్ తీయాలని నిర్ణయించుకుని బాబూమోహన్‌తో మాట్లాడి ఒప్పించినట్లు తెలిపాడు. బాబుమోహన్, సౌందర్యతో పాట తీస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత కొందరి మధ్యవర్తులను తన వద్దకు పంపినట్లు చెప్పాడు. సాంగ్ తీసేందుకు రాజేంద్రప్రసాద్ రెడీగా ఉన్నారని వారు చెప్పారు. అయితే ఇక నాకు ఆ అవసరం లేదని, ఇప్పటికే బాబూమోహన్‌కు మాట ఇచ్చేశానని చెప్పడంతో వారు వెళ్లి పోయారు. కావాలాంటే రాజేంద్రప్రసాద్ షూటింగ్ స్పాట్ వద్దకు రావొచ్చని, చూసి వెళ్లొచ్చని చెప్పాను. అని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. చిత్రపరిశ్రమలో తాను దర్శకుడిగా ఎదగడానికి ప్రధాన కారణం రాజేంద్ర ప్రసాద్ అని ఎస్వీ కృష్ణారెడ్ఢి చెప్పారు. తన సినీ జర్నీలో రాజేంద్ర ప్రసాద్ సహకారం ఎంతో ఉందని కూడా ఇదే సందర్భంలో అన్నారు. కానీ మాయలోడు సినిమా విషయంలో మాత్రం తనను రాజేంద్రప్రసాద్ తీవ్రంగా బాధపెట్టారని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. గతేడాది 'ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు' అనే చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్ఢి దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. -
యాక్టర్లుగా మారుతున్న దర్శకులు.. తెరపై సత్తా చూపిస్తుందెవరు?
నటీనటులు...వెండితెర మీద మెరిస్తే, దర్శకుడు అనే వాడు..అన్ని శాఖలను ముందుండి నడిపిస్తాడు. ఓ యాక్టర్ నుండి ఎంత పర్ఫామెన్స్ రాబట్టాలో అనేది డైరెక్టర్ వర్క్. అయితే సెట్లో యాక్షన్ కట్ చెప్పే కొందరు...ముఖానికి రంగేసుకొని..నటనాభినయం చూపిస్తున్నారు. అంటే దర్శకులు కాస్తా...యాక్టర్లుగా మారుతున్నారు. ఈ మధ్యకాలంలో యాక్టర్స్‌గా రాణిస్తున్న దర్శకులపై ఓ లుక్కేద్దాం. ఫ్యామిలి సబ్జెక్టులు తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల..నారప్పా లాంటి ఊరా మాస్ మూవీ తెరకెక్కించి అందరికి షాక్ ఇచ్చారు.లేటెస్ట్ గా పెద కాపు 1 లో విలన్ గా నటించాడు. ఈ పాత్ర కోసం తొలుత ఓ మలయాళ నటుడిని సెలక్ట్ చేసుకున్నారు. అయితే అనుకోకుండా ఈ యాక్టర్ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు.దాంతో శ్రీకాంత్ నెగిటివ్ రోల్ లో వెండితెర మీద కనిపించాడు. మరో దర్శకుడు కూడా వెండితెర మీద విలన్ పాత్రలు పోషించటానికి రెడీ అయిపోయాడు. పలాస 1978 దర్శకుడు కరుణా కుమార్...ప్రస్తుతం మట్కా మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఓ మూవీకి యాక్షన్ కట్ చెప్తునే...నాగార్జున హీరోగా నటిస్తున్నా ...నా సామి రంగ లో విలన్‌గా కనిపించబోతున్నాడు.ఈ మూవీ గ్లింప్స్‌లో తాను నెగిటివ్ రోల్లో ఎలా ఉంటాడో చూపించాడు షార్ట్ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన తరుణ్ భాస్కర్..పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా మారాడు.విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ...బాక్సాఫీసు ముందరా హిట్ కొట్టింది.తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే యూత్ ఫుల్ సినిమాను కూడా దర్శకత్వం చేసాడు తరుణ్ .ఇక విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి మీకు మాత్రమే చెప్తాను అనే మూవీని రూపొందించాడు.ఈ మూవీలో కథానాయకుడిగా తరుణ్ బాస్కర్నే సెలక్ట్ చేసుకున్నాడు. తరుణ్ హీరోగా నటించిన మీకు మాత్రమే చెప్తాను సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే నటుడిగా మాత్రం మంచి మార్కులు వేసుకున్నాడు.ఆ తర్వాత సీతా రామం,దాస్ కా దమ్కీ లాంటి సినిమాలలో నటించాడు.పిట్ట కథలు లాంటి వెబ్ సిరీస్‌లలో కనిపించాడు.తొందర్లో స్వీయ దర్శకత్వంలో కీడా కోలా సినిమాతో రాబోతున్నాడు. ఎస్వీ కృష్ణారెడ్డి ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న దర్శకుడు.ఈ బహుముఖ ప్రజ్ణాశాలి నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాడు.కాని..దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకున్నాడు.తనలోని కోరికను..ఉగాది సినిమాతో తీర్చుకున్నాడు. ఈ మూవీలో కథానాయకుడిగా నటించాడు. ఆతర్వాత అభిషేకం మూవీతో మరోసారి హీరోగా ట్రై చేసాడు. అయితే ఈ మూవీలు ఆకట్టుకోలేకపోయాయి. ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమకు,భారీ విజయాలను అందించిన దర్శకులంతా,ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు గానూ, విలన్స్ గానూ నటిస్తున్నారు. గౌతమ్ వాసు దేవ్ మీనన్, సముద్రఖని, ఎసే జే సూర్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. దర్శకులు ..నటులుగా మారటం అనేది ఇప్పటిది కాదు.ఎప్పటి నుండో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్‌తో సహా చాలామంది పెద్ద దర్శకులు నటులుగా మంచి పేరు సంపాదించారు. దాసరి శిష్యుడు కోడి రామకృష్ణ కూడా వెండితెర మీద కనిపించారు. దాసరి మరో ప్రియ శిష్యుడు..ఆర్ నారాయణ మూర్తి...స్వీయ దర్శకత్వం పలు చిత్రాలు వచ్చాయి . దాసరి నారాయణ..నటుడిగా..ప్రత్యేక ముద్రవేసాడు. ఈయన కోసమే కొన్ని పాత్రలు పుట్టాయా అన్నంతగా..మెప్పించాడు. -
Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
‘సాక్షి’ ప్రారంభమై పదిహేనేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రారంభ వేడుకకి మొన్న మొన్నే వెళ్లినట్లుగా అనిపిస్తోంది. ఆ వేడుక ఇంకా గుర్తుంది. ‘సాక్షి’కి నా ప్రత్యేక అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘సాక్షి’ దినపత్రిక ఆరంభమై నేటితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా బ్రహ్మండంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిడ్డి. ‘‘సాక్షి’ ఇలాంటి విజయవంతమైన వసంతాలను ఎన్నో చూడాలి’’ అన్నారు కన్నడ హీరో శివరాజ్‌కుమార్. ‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుని, పదహారో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వాస్తవాలను అందించాలని, స్ఫూర్తినిచ్చే వార్తలు ఇవ్వాలనే ప్రజాసంకల్పాన్ని ధ్యేయంగా చేసుకుని అందులో విజయం సాధిస్తూ, ప్రతి ఏడాది ప్రజలకు మరింత చేరువవుతున్నందుకు అభినందనలు’’ అన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఇంకా హీరోలు ‘అల్లరి’ నరేశ్, అది సాయికుమార్, కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, నటులు తనికెళ్ల భరణి, సుమన్, సాయికుమార్, ‘సీనియర్’ నరేశ్, అలీ, దర్శకులు కృష్ణవంశీ, బి.గోపాల్, నందినీ రెడ్డి, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్’ రాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్ తదితరులు ‘సాక్షి’కి శుభాకాంక్షలు తెలిపి, మరిన్ని విజయవంతమైన వసంతాలను చూడాలని ఆకాంక్షించారు. -
మామ.. అల్లుడు వస్తున్నారు
సోహెల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమాని మార్చి 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘ఫ్యామిలీ, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ వచ్చేస్తున్నారు
బిగ్‌బాస్ ఫేం సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. మార్చి 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషం. సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్‌ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర లాంటి సీనియర్ నటులంతా ఇందులో ఉన్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. -
సినిమా చేయడానికి స్వీట్ షాపు నడిపాను: ఎస్వీ కృష్ణారెడ్డి
ఎస్వీ కృష్ణారెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు, మధ్యతరగతి విలువలు, భాదల్ని చెప్పే సినిమాలు తీస్తూ ఎన్నో విజయాలు అందుకున్న దర్శకుడు ఆయన. ‘‘మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అభిషేకం, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, పెళ్ళాం ఊరెళితే, ఘటోత్కచుడు, యమలీల, ఎగిరే పావురమా’’ వంటి ఎన్నో హిట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు ఎస్వీ కృష్ణారెడ్డి. కేవలం డైరెక్టర్‌గానే కాదు తన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్‌గా, నటుడిగా, రచయితగా కూడా పని చేశారు. చివరిసారిగా 2014లో యమలీల 2 తీశారు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. దాదాపు ఎమిమిదేళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్బంగా తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘మాది మంచి ఉన్నతమైన కుటుంబమే. కానీ సినిమాలు తీసేంత డబ్బు లేదు. పీజీ పూర్తి చేశాక హీరో అవుదామని మద్రాస్ వెళ్లాను. కానీ అది అంత తేలికైన విషయం కాదని నాకు అర్థమైంది. నా తొలి సినిమా పగడాల పడవులు. ఇందులో సెకండ్ హీరోగా చేశాను. ఆ సినిమా చూసి అచ్చిరెడ్డి ‘నువ్వు ఇది కాదు చేయాల్సింది అనిపిస్తోంది అన్నారు’. మనమే సినిమా తీద్దాం, నువ్వు హీరోగా చేయాలి అన్నారు. డబ్బు లేదు కదా ఎలా అని ఆలోచించాం. డబ్బు సంపాదించి సినిమా తిద్దాం అన్నారు. అందుకోసం అచ్చిరెడ్డి పేరు మీదే స్వీట్ షాప్ పెట్టాం. అందులో నేను కాజాలు.. లడ్డూలు చేసేవాడిని. అదే సమయంలో నేను ఆడిషన్స్ ఇస్తుండేవాడిని. అలా మా బిజినెస్‌తో కూడబెట్టిన డబ్బుతో ‘కొబ్బరిబొండం’ సినిమా తిశాం. తొలి ప్రయత్నంతోనే హిట్ కొట్టాం’ అంటూ చెప్పుకొచ్చారు. ‘‘ఆ తర్వాత అంతా మొదట్లో నాకు ఏం రాదంటూ అందరు విమర్శించేవారు. ‘ఎస్వీ కృష్ణారెడ్డికి డైరెక్షన్ రాదు .. సంగీతం రాదు.. ఘోస్ట్‌లను పెట్టుకుని మ్యానేజ్ చేస్తుంటాడు’ అని అంతా కామెంట్స్ చేసేశారు. వారు అలా అనుకోవడం తప్పులేదు. ఎందుకంటే నేను ఎవరి దగ్గర పని చేయలేదు. డైరెక్షన్ డిపార్టుమెంటులో కానీ, సంగీతంలో కానీ ఎవరి దగ్గర చేరలేదు. ఇక నాటకాలు కూడా రాయలేదు. అందువల్లే అందరూ నేను టీం పెట్టుకుని నడిపిస్తున్నా అనుకునేవారు. అలా నాపై తరచూ విమర్శలు వస్తుండేవి. అది సహజమే. కానీ సినిమా అనే పిచ్చి ఉంటే అది ఏ పనైనా చేయిస్తుంది’’ అని ఆయన అన్నారు. -
ఆయన అభిమానుల్లో నేనూ ఒకణ్ణి
‘‘ఎస్వీ కృష్ణారెడ్డిగారి సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒక క్రేజ్. ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను కూడా ఒకణ్ణి. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంతమంది కాంబినేషన్ అయినా సెట్లో కూల్‌గా ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకున్నాను. ఆయన గోల్డెన్ డేస్‌ని ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ రిపీట్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డైరెక్టర్ వీవీ వినాయక్. రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో సోహైల్, మృణాళిని జంటగా నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించారు. ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అల్లసాని వారి అల్లిక..’ అనే పాటని సి. కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వినాయక్ విడుదల చేశారు. ఈ పాటని శ్రీమణి రచించగా, శ్రీకృష్ణ, హరిణి ఆలపించారు. ఈ సందర్భంగా కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్‌గారి సహకారంతో ఆయన భార్య కోనేరు కల్పన నిర్మాతగా నా సమర్పణలో ఈ సినిమా నిర్మించే అవకాశం రావడం హ్యాపీ’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ అరిటాకులో వడ్డించిన అచ్చ తెలుగు భోజనం’’ అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ–‘‘నా గత చిత్రాల్లోని అన్ని అంశాలను.. అంతకు మించి ఈ చిత్రంలో పొందుపరిచి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాం’’ అన్నారు. -
ఎనిమిదేళ్ల విరామం తరువాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రీ ఎంట్రీ
సాక్షి, తూర్పుగోదావరి(రాజానగరం): ‘కథ పాతదే అయినా చెప్పే విధానం కొత్తగా ఉంటే ప్రేక్షక్షులు ఎప్పుడూ ఆదరిస్తారు. ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తున్న ‘కాంతార’, ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన ‘కార్తికేయ –2’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. పరమ మూఢభక్తితో కూడిన కథాంశంతో తీసిన చిత్రాలను కూడా ఈ రోజు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంటే వారు ఎప్పుడూ ఒకే మూసలో ఉండే చిత్రాలను కాకుండా కొత్తదనం ఉన్న చిత్రాలనే ఆదరిస్తారని అర్థమవుతోంది’ అంటున్నారు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. తూర్పు గోదావరి జిల్లాలోని కొంకుదురుకు చెందిన ఈయన రాజానగరంలో శుక్రవారంఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. 2014లో యమలీల–2 సినిమా తీసి, విరామం తీసుకున్న ఆయన తాజాగా మెగాఫోన్ పట్టారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడిగా ఎనిమిదేళ్ల విరామం తరువాత ఇస్తున్న రీ ఎంట్రీ గురించి వివరించారు. ప్రశ్న: రాజేంద్రుడు–గజేంద్రుడు, మాయలోడు, వినోదం, మావిచిగురు, యమలీల, శుభలగ్నం వంటి అనేక సూపర్ హిట్లు ఇచ్చిన మీరు చాలా కాలంగా సినిమాలు తీయడం లేదు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? జవాబు: ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ అనే చిత్రాన్ని తీస్తున్నాను. దాదాపుగా షూటింగ్ పార్టు అంతా పూర్తయింది. జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంలో సహాయ్లరగర్, మృణాళిని హీరో హీరోయిన్లు కాగా ఆర్గానిక్ మామగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. అలాగే మీనా, సునీల్, అజయ్‌ఘోష్, సూర్య, హేమ ఇలా అనేకమంది తారాగణం ఉన్నారు. గతంలో నేను తీసిన చిత్రాలలో కనిపించే కుటుంబ నేపథ్య వాతావరణంతోపాటు హాస్యరసం, కష్టాలు, కన్నీళ్లు, చక్కటి సంగీతంతో కూడిన వినోదం.. అన్నీ ఉంటాయి. ప్రశ్న: ఎనిమిదేళ్ల అనంతరం ఈ సినిమా తీయడానికి కారణం? జవాబు: కాలంతోపాటు ప్రేక్షకుల ఆదరణలో వస్తున్న మార్పులను గమనిస్తున్న నేను ఖాళీగా కుర్చోవడం ఎందుకని ఒక కథ తయారు చేశా. దానికి స్క్రీన్‌ప్లే, మాటలు కూడా రాసిన తరువాత రూ. 10 కోట్ల వ్యయంతో ఈ సినిమాను తీశాను. క్లైమాక్స్‌లో కూడా నవ్వులు కురిపించే చిత్రంగా వచ్చింది. గతంలో మాయలోడు, వినోదం సినిమాలు వచ్చాయి. వాటిని మరింపిచే రీతిలో ఈ సినిమా ఉంటుంది. దీనిలో వ్యక్తుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, పగలు, ప్రతీకారాలు, అన్నీ మిళితమై ఉంటాయి. ప్రతి అంశంలోను కామెడీ ఉంటుంది. ప్రశ్న: మీ సినిమాలో సందేశం ఏమైనా ఉంటుందా? జవాబు: ‘ప్రేమను ప్రేమతోనే కలుపుకోవాలి గాని, పగలు, ప్రతీకారాలతో కాదనే’ సందేశంతో ఈ సినిమాను రూపొందించాం. ప్రేమించడం చేతనైన వాడికి కష్టం తెలియదు, పగతో రగిలిపోయేవాడికి సుఖం దొరకదు, ఇది జగమెరిగిన సత్యం. ప్రశ్న: తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో మీ స్పందన ఏమిటి? జవాబు: తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడిక్కెడికో పరుగులు పెడుతోంది. ఆనందమే, కానీ బడ్జెట్ విషయంలో కాస్త కంట్రోలు ఉంటే బాగుంటుంది. కథ డిమాండ్‌ని బట్టి వ్యయం ఉండాలిగాని, గొప్పగా చెప్పుకునేందుకు కాలాన్ని, డబ్బును వృథా చేయకూడదు. వృథా చేస్తే డబ్బు సంపాదించుకోవచ్చునేమోగాని, కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. ప్రశ్న: దర్శకుడిగా కెరీర్ కొనసాగిస్తారా? జవాబు: కొంతకాలం పాటు సినిమాలు తీయడం కొనసాగిస్తాను. ప్రేక్షకుల ఆదరణ కూడా ఉంటే.... -
యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా ?: ఎస్వీ కృష్ణారెడ్డి
‘ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు అంటే ఒక రిలీఫ్. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలను చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలలో కమర్షియల్ హంగులతో పాటు పిల్లలకు కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి. ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’ మూవీ కృష్ణారెడ్డికి మంచి కమ్‌బ్యాక్ సినిమా అని ప్రముఖ దర్శఖుడు శేఖర్ కమ్ముల అన్నారు. సోహైల్, మృణాళినీ రవి జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా ‘ఆర్గానిక్ మామ– హైబ్రీడ్ అల్లుడు’. ఈ సినిమాను కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పన గారికి యూనిట్ సభ్యులకు నా కృతజ్ఞతలు. కృష్ణారెడ్డి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత సీ.కల్యాణ్ మాట్లాడుతూ.. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆలీని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణారెడ్డి గారు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత మళ్లీ సోహెల్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తుండటం మేం సెంటిమెంట్‌గా భావిస్తున్నాం. చిరంజీవి గారు కెరీర్ ప్రారంభంలో ఎలా కష్టపడ్డారో అలాగే ఈ సినిమా కోసం సోహెల్ కూడా కష్టపడ్డాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా అందరికీ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆర్గానిక్ మామ ` హైబ్రిడ్ అల్లుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది అంటే దానికి నేను కూడా ఒక కారణం తప్ప.. నేనే కారణం కాదు. నేను 40 దాకా సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన గారి డెడికేషన్, ప్లానింగ్ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నా కెరీర్లో ది బెస్ట్ అని చెపుతున్నాను. ఈ సినిమా విషయంలో అచ్చిరెడ్డి గారికి, నిర్మాత కల్పన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. 44 రోజుల్లోనే సినిమా పూర్తయిపోయింది. ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా నేను బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలకు చిన్న వారిని, కొత్త వారిని ప్రపోజ్ చేసినా, ఆమె మాత్రం పేరున్న ఆర్టిస్ట్‌లను మాత్రమే తీసుకోవాలని పట్టుబట్టి మరీ వారి డేట్స్ సంపాదించారు. సోహైల్ కథ విని ఈ సినిమా చేస్తే నేను ఎక్కడికో వెళ్లిపోతాను సార్ అని ఆనందపడిపోయాడు. అతని కలవగానే.. యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా అనిపించింది. రాజేంద్రప్రసాద్ గారు అయితే.. డబ్బింగ్ టైంలో కొన్ని సీన్లు చూసి ఏంటి నేను ఇంత బాగా చేశానా, ఇంత ఎమోషన్ ఈ కేరెక్టర్లో ఉందా? అని ఆశ్చర్య పోయారు. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది?. ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. కచ్చితంగా అందరికి నచ్చుతుంది’ అన్నారు. ‘చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన దర్వకత్వంలో నటించడం అంటే ఇప్పటికీ నమ్మలేని విషయంగానే అనిపిస్తుంది. నాలోని టాలెంట్‌ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కల్పన గారికి నా థ్యాంక్స్. బిగ్‌బాస్ వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఇక ప్రతి కుటుంబానికి చేరువౌతాను అనే నమ్మకం ఉంది. ప్రతి సినిమా కోసం ఇలానే కష్టపడతాను’అన్నారు సోహైల్. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి , నటుడు అలీ, హేమ, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అందరికి నచ్చుతుంది: అలీ
కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేక్ ఇది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 28న ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్, టీజర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శక, నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ టైటిల్ వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మలయాళం లో చూసిన ‘వికృతి’ సినిమా నచ్చి తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో తనే నిర్మాతగా మారి సీనియర్ నటులందరినీ తీసుకొని తీసిన ఈ సినిమాకు కొత్త దర్శకుడిని, మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేయడం గొప్ప విషయం’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ... ‘నేను, అలీ ఒకే టైమ్‌లో కేరీర్ స్టార్ట్ చేశాము. అలీ, నేను కలసి చూసిన మెదటి సినిమా ‘మనీ’. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గార్లు యమలీల సినిమా ద్వారా ఆలీని హీరోగా పరిచయం చేశారు. అప్పట్లో అది ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఆలా ఎదుగుతూ వచ్చిన ఆలీ ఈ రోజు మంచి సబ్జెక్టును సెలెక్ట్ చేసుకొని, చాలా మంది సీనియర్ నటులను సెలక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు. అలీ మాట్లాడుతూ.. మలయాళం లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నరేష్ గారు నేను పోటాపోటీగా నటించాం . 27 ఏళ్ల తరువాత మంజు భార్గవి గారితో కలిసి మళ్ళీ నటించడం ఆనందంగా ఉంది. ఒక మంచి వాతావరణంలో దాదాపు అందరూ సీనియర్ ఆర్టిస్ట్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ కిరణ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ నెల 28న ఆహా లో విడుదల అవుతున్న ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు. ‘ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ నెల 28న విడుదల అవుతున్న ఈ సినిమా అందరూ ఆదరించి ఆశీర్వాదించాలని కోరుతున్నాను’అని దర్శకుడు కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చిరెడ్డి, చిత్ర నిర్మాత కొణతాల మోహనన్ కుమార్ ,నటులు పృథ్వీ , శివబాలాజీ, భద్రం తదితరులు పాల్గొన్నారు. -
ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ‘గణా’ ఫస్ట్‌లుక్
దుర్మార్గుడు ఫేం విజయ్ కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం గణా. సుకన్య తేజు హీరోయిన్స్ నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ తాజాగా రిలీజ్ అయ్యింది. ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడఇ మాట్లాడుతూ.. ‘నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన మరో వ్యక్తి పేరు కూడా క్రిష్ణారెడ్డే. కాకపోతే విజయ్ క్రిష్ణా రెడ్డి. విజయ క్రిష్ణా రెడ్డి కృషితో, పట్టుదలతో, దీక్షతో గణా చిత్రాన్ని రూపొందించారు. ఆయన హీరోగా నటిస్తూ కథ, స్క్రీన్ ప్లే, ప్లస్ డైరెక్షన్ కూడా చేశారు. అంతేకాదు ఆయన ప్రొడ్యూసర్‌గా కూడా. అన్నీ ఆయనే చేస్తూ సినిమా తీయడమంటే మామూలు విషయం కాదు’ అని అన్నారు. కాగా రాధా మమతా ప్రెజెంట్స్, ఎస్.కె. ఆర్ట్స్ బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ నిర్మించారు. -
‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘నైన్త్ అవర్’ చిత్రం
విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ జంటగా ఆనంద్ కొలగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నైన్త్ అవర్’. రాజు గుడిగుంట్ల నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత ఏయం రత్నం టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఆనంద్ కొలగాని మాట్లాడుతూ.. ‘‘వినూత్నమైన అడ్వెంచర్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. సెప్టెంబర్ 6న మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్ర కథ వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు రాజు గుడిగుంట్ల. ‘‘హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విశ్వ కార్తికేయ. ‘‘ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు రిషికా కపూర్. నిర్మాతలు అచ్చిరెడ్డి, ప్రసన్న కుమార్, డీయస్ రావు పాల్గొన్నారు. -
ఆయన నాకు దేవుడు ఇచ్చిన వరం: ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘నన్ను నేను దర్శకుడిగా నిలబెట్టుకోవడానికి ఎంత శ్రమించానో.. ఎంత తపనపడ్డానో ఇప్పుడూ అంతే తపనతో సినిమాలు చేస్తున్నాను. ఆడవారిని కించపరిచే విధంగా ఎప్పుడూ సినిమా తీయను. కొందరు నన్ను ఆ మార్గంలో సినిమా తీయమన్నారు. అచ్చిరెడ్డిగారు వద్దని చెప్పి, మన శైలిలో వెళితే ఎప్పుడో ఒకప్పుడు మార్గం దొరుకుతుందన్నారు. ఆయన నాకు దేవుడు ఇచ్చిన వరంలా భావిస్తున్నాను’’ అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. సోహైల్, మృణాళినీ రవి జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా ‘ఆర్గానిక్ మామ– హైబ్రీడ్ అల్లుడు’. ఈ సినిమాను కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. (చదవండి: ‘మేజర్’ చూసి వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు :శశికిరణ్ తిక్క) బుధవారం (జూన్ 1) ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ సినిమా సెట్స్‌లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అనంతరం ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆర్గానిక్ మామ– హైబ్రీడ్ అల్లుడు’ కథ విని నిర్మాత కల్పనగారు నాన్‌స్టాప్‌గా నవ్వారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ కూడా అలానే నవ్వుతారు. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతూనే ఉంటాను. సోహైల్ మంచి కమర్షియల్ లక్షణాలున్న హీరో. మృణాళిని మంచి నటి’’ అన్నారు. ‘‘ఎస్వీ కృష్ణారెడ్డిగారి కెరీర్‌కు ఈ సినిమా గొప్ప మలుపు కావాలి’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘ఈ సినిమా నా లైఫ్‌లో ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సోహైల్. ‘‘మంచి ఎంటర్టైనింగ్ మూవీ చేస్తున్నందుకు హ్యాపీ’ అన్నారు కల్పన. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మృణాళినీ రవి, నటుడు కృష్ణభగవాన్, కెమెరామేన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్వీ కృష్ణారెడ్డి కారుకు జరిమానా, డైరెక్టర్ షాకింగ్ రియాక్షన్
కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి కార్లను తనిఖీ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ ఫిలింస్ ఉన్నాయని గత కొన్ని రోజులుగా చాలా మంది సెలబ్రిటీల కార్లకి చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కారుకి కూడా జరిమానా విధించారు. మంగళవారం సుల్తాన్ బజార్ బ్యంక్ స్ట్రీట్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి కారును పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఆయన కారుకు ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చలానా విధించారు. చదవండి: హిందీ బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చిన కరణ్ జోహార్ ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణా స్పందించిన తీరు అందరిని షాక్‌కు గురి చేస్తోంది. తప్పు తనదేనని, నెంబర్ ప్లేట్ సరి చేసుకుంటానని ఆయన పోలీసులు వివరణ ఇచ్చారు. అనంతరం ఈ మండుటెండల్లో సైతం బాధ్యతగా విధులు నిర్వహిస్తోన్న ట్రాఫీక్ పోలీసులను డైరెక్టర్ అభినందించారు. కాగా టాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆయన కామెడీ సినిమాలతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ జోనర్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్టర్‌గా, నిర్మాతగా, నటుడిగా మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా, రైటర్‌గా కూడా ఆయన మల్టీ టాలెంట్ చూపించారు. ఇక కొంతకాలంగా దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం బిగ్‌బాస్ సోహైల్ హీరోగా ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1601343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మజిలీ బ్యూటీతో బిగ్‌బాస్ సోహైల్ రొమాన్స్
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న ‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఇందులో ‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్ హీరోగా, ‘మజిలీ’ ఫేమ్ అనన్య హీరోయిన్గా నటిస్తున్నారు. కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సీన్‌కి నిర్మాత కె. అచ్చి రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కొబ్బరి బోండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు’ వంటి హిట్ చిత్రాలను నాతో తీసిన కృష్ణారెడ్డితో మళ్లీ చాలా కాలం తర్వాత సినిమా చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘నేను, కృష్ణారెడ్డి చెన్నైలో ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. తన దర్శకత్వంలో సినిమా నిర్మించాలనే నా కోరిక ఈ సినిమా ద్వారా తీరుతోంది’’ అన్నారు సి. కల్యాణ్. ‘‘అమెరికాలో ఒక ఇంగ్లిష్ సినిమా చేయడానికి నాకు మూడేళ్లు పట్టింది. అందుకే అక్కడ ఉండాలనిపించలేదు. తెలుగువారి ఆదరణ ఎప్పుడూ మనసుకి నిండుగా తృప్తిగా ఉంటుంది. అవే కావాలనుకుని ‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు’ స్టార్ట్ చేశా’’ అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
ప్రతిభ ఉన్న బాల నటులకు చక్కని వేదిక: ఎస్వీకృష్ణారెడ్డి
హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో న్యూ టాలెంట్‌కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, అలాగే మంచి ప్రతిభ కలిగిన నటులను పరిచయం చేసేందుకు చక్కని వేదికలు కూడా అందుబాటులోకి వచ్చాయని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం (ఏప్రిల్ 11, 2021) నుంచి ప్రారంభం కానున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్ ది నెక్ట్స్ సూపర్‌స్టార్ 5వ ఎడిషన్‌కు ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకుంటూ...గత కొన్ని ఎడిషన్ల ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన బాల నటులు ప్రస్తుతం మంచి కెరీర్‌ను అందుకుంటూ నటనలో రాణిస్తున్నారని చెప్పారు. మరింత మంది ప్రతిభావంతుల అభినయాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులతో సహా తానూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు. జడ్జిల ప్యానెల్లో రేణూ దేశాయ్, సునీత... ఇటీవలే తన పెళ్లి ద్వారా టాక్ ఆఫ్ ద మీడియా గా మారిన ప్రముఖ గాయని సునీత డ్రామా జూనియర్స్‌లో మరో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అలాగే సినీనటి, నిర్మాత రేణూదేశాయ్ సైతం జడ్జిల ప్యానెల్లో ఉన్నారు. ఈ కార్యోక్రమం ప్రతి ఆదివారం రాత్రి 8గంటల నుంచి ప్రసారం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభినయ కౌశల్యాన్ని ప్రదర్శించనున్నారు. ( చదవండి: కంగనాకి అక్షయ్ కుమార్ సీక్రెట్ కాల్! ) -
వెండితెరపై చెన్నూరు చిన్నది..!
సాక్షి, చెన్నూర్: చిన్ననాటి నుంచి ఆమెకు నాటకాలు, డ్రామాలు అంటే మక్కువ. ఆ మక్కువే నేడు సినిమాలో చాన్స్ దక్కించింది. చదువుకునే సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంలో వెబ్‌సీరిస్‌లోకి అడుగుపెట్టింది. “వరంగల్ వందన’ వెబ్‌సీరిస్‌లో తన నటనకు మంచి మార్కులు దక్కించుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌లో నంబర్‌వన్ స్థానంలోకి చేరింది. ఇటీవల సినిమాలో సైతం చాన్స్ దక్కించుకుంది. ఫలితంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం నుంచి వెండితెరపై మెరవనున్న తొలి మహిళగా సుష్మగోపాల్ నిలవనుంది. సినీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డితో సుష్మగోపాల్ చెన్నూర్‌కు చెందిన సుష్మ... చెన్నూర్‌కు చెందిన ప్రైవేట్ వైద్యుడు తిప్పార్తి వేణుగోపాల్, శ్రీకళ దంపతుల కుమార్తె సుష్మగోపాల్. చెన్నూర్‌లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంది. 2019న హైదరాబాద్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా.. వరంగల్ వందన వెబ్‌సీరిస్‌లో చాన్స్ దక్కింది. రచయిత ప్రజా ప్రభాకర్, డైరెక్టర్ శృతి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వెబ్ సీరిస్‌లో నటించింది. ఇప్పటివరకు 80కి పైగా వెబ్ సీరిస్‌లో నటించిన సుష్మగోపాల్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ట్రెండింగ్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. ఓవైపు వెబ్‌సీరిస్‌లో నటిస్తూనే ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో డిగ్రీ చేస్తూ మరోవైపు వెబ్ సీరిస్‌ల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం సినిమాలో నటించే చాన్స్ రావడంతో సుష్మగోపాల్తో పాటు ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో .. సినీ రంగ ప్రవేశం వెబ్‌సిరీస్‌లో రాణిస్తున్న సుష్మగోపాల్కు ఒక్కసారిగా వెండితెరపై నటించే అవకాశం వచ్చింది. సినీ నటుడు అలీ, నరేశ్ నటిస్తున్న అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాను శ్రీపురం కిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. సినిమాలో ప్రధాన పాత్రధారి చెల్లె పాత్రలో సుష్మ నటిస్తోంది. 10 లక్షల చేరువలో వెబ్‌సీరిస్ వరంగల్ వందన వెబ్‌సీరిస్ ఏడాదికి లక్ష మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. దీంతో వరంగల్ కలెక్టర్ పాటిల్ ప్రశాంత్‌జీవన్ వెబ్ సిరీస్ బృందాన్ని అభినందించి మెమోంటో అందజేశారు. ప్రస్తుతం వరంగల్ వందన యూట్యూబ్ వెబ్ సిరీస్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 10లక్షల సబ్ స్క్రైబర్‌కు చేరువలో ఉంది. సుష్మగోపాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 50వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. చదువుతో పాటు... చదువుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లాను. మా అన్నయ్య విష్ణు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటర్ చదువుతూనే వెబ్‌సిరీస్‌లో నటించాను. మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఓ సినిమాలో చాన్స్ వచ్చింది. రానున్న రోజుల్లో మంచి పేరు తీసుకువచ్చే పాత్ర చేస్తా. మంచి నటిగా పేరు సంపాదించాలనేదే నా లక్ష్యం. – తిప్పార్తి సుష్మగోపాల్, సినీనటి, చెన్నూర్ -
అలీ అడిగితే కాదంటారా!
వీకే నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అందరూ బావుండాలి, అందులో నేనుండాలి’. మలయాళంలో విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి ఈ సినిమా రీమేక్. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీ సమర్పణలో బాబా అలీ, మోహన్‌కుమార్ కొణతాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రాణస్నేహితులు దర్శక-నిర్మాతలు కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుతూ.. ‘‘అలీతో 27 ఏళ్ల క్రితం మేం ‘యమలీల’ చిత్రం చేసినప్పుడు ఎలా ఉన్నాడో 1100 చిత్రాల్లో నటించిన తర్వాత కూడా ఏ మాత్రం మార్పు లేకుండా అలానే ఉన్నాడు. అలీ ఫోన్ చేసి నేను నిర్మాతగా, హీరోగా సినిమా చేస్తున్నాను. మీరు నా సినిమాలో చిన్న పాత్ర చేయాలని అడిగాడు. అలీ అడగటం.. మేము కాదనడమా? అందుకే ఓకే అని చక్కని సీన్లో నటించాం’’ అన్నారు. అలీ మాట్లాడుతూ.. ‘‘27 ఏళ్ల క్రితం నాకు ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ చిత్రంలో వేషమిచ్చిన ఈ ఇద్దరూ తర్వాత నన్ను ‘యమలీల’తో హీరోగా నిలబెట్టారు. అందుకే నేను ఏ పనిచేసినా వాళ్లు లేకుండా చేయను. సెంటిమెంట్‌గా ఈ సినిమాలో వాళ్లిద్దరికీ చిన్న వేషం ఇచ్చాను. ఈ చిత్రం తర్వాత ఇద్దరూ నటులుగా బిజీ అవుతారు (నవ్వుతూ)’’ అన్నారు. -
S.V. కృష్ణారెడ్డి బర్త్ డే స్పెషల్..
-
యమలీలకు పాతికేళ్లు
కమెడియన్ అలీ టాప్ ఫామ్‌లో కొనసాగుతున్న సమయంలో అలీని హీరోగా పరిచయం చేస్తూ ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన చిత్రం ‘యమలీల’. కిశోర్ రాఠి సమర్పణలో కె. అచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేటితో (ఏప్రిల్ 28) పాతికేళ్లు పూర్తి చేసుకుంది. తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు నిండి ఉండటం చిత్రవిజయానికి ఓ కారణం. తల్లిగా మంజు భార్గవి, యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడు పాత్రలో బ్రహ్మానందం, తోట రాముడిగా తనికెళ్ల భరణి ఇలా సినిమాలో ప్రతి పాత్రా ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. ‘నీ జీనూ ప్యాంటు చూసి బుల్లోడో..’, సిరులొలికించే చిన్ని నవ్వులే..., జుంబారే జుంజుంబారే...’ పాటలు హైలైట్. సూపర్ స్టార్ కృష్ణ, ఇంద్రజ ఓ స్పెషల్ సాంగ్ చేయడం స్పెషల్ అట్రాక్షన్. రిలీజ్ అయిన కొన్ని కేంద్రాల్లో ఏడాది పాటు ఏకధాటిగా ప్రదర్శితం అవ్వడం విశేషం. అలా ‘యమలీల’ అలీ కెరీర్లో ఓ మరపురాని చిత్రంగా నిలిచిపోతుంది. -
జగన్ చేసేదే చెబుతాడు : ఎస్వీ కృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయగలిగిందే చెబుతారని, ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పడుతున్న తపన తనను కదిలించిందన్నారు. పాదయాత్ర ద్వారా వైఎస్జగన్ ప్రజల బాధను అర్థం చేసుకున్నారని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్‌లాగే ఆయన ప్రజల కోసం తపిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌లాగే జగన్ ఆలోచనలు ఉన్నాయన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరు హర్షణీయం అన్నారు. ఆయన లాంటి స్పూర్తి అందరికి రావాలని చెప్పారు. ప్రజలతో మమేకమై నవరత్నాలు ప్రకటించారని, అవి పేద ప్రజలకు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల భవిష్యత్ బాగుంటుందన్నారు. వైఎస్ జగన్‌లాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రానికి అవసరమని, ఆయనను గెలిపించాలని ప్రజలను కోరారు. హైదరాబాద్‌లో సంతోషంగా ఉన్నాం : అచ్చిరెడ్డి రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించవద్దని ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి కోరారు. తాము హైదరబాద్‌లో సంతోషంగా ఉన్నామన్నారు. సినీ ఇండస్ట్రీలో ప్రాంతీయ బేధాలు లేవని, అంతా కలిసే ఉంటామని చెప్పారు. ఎన్టీఆర్, వైఎస్సార్‌లాగే వైఎస్ జగన్ ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారని, ఆయన ఓపిక అభినందనీయమని ప్రశంసించారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు చూసిన జగన్.. ఒక విజన్‌తో కృషి చేస్తున్నాన్నారు. వైఎస్ జగన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. -
వైఎస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది
-
‘మా’ అధ్యక్షుడిగా నరేశ్
‘మా’ నూతన అధ్యక్షుడు ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది. సీనియర్ నరేశ్ మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికోసం సీనియర్ నరేశ్, శివాజీరాజా ప్యానళ్ల మధ్య హోరాహోరీ పోరు సాగగా నరేశ్ విజయం సాధించారు. ‘మా’ అసోసియేషన్‌లో దాదాపు 800 ఓట్లు ఉండగా 472 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సారి పోలింగ్‌కు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడంతో కౌంటింగ్ ఆలస్యమైంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. నరేశ్‌కు 268 ఓట్లు పోల్ కాగా, శివాజీ రాజాకు 199 ఓట్లు వచ్చాయి. దీంతో 69 ఓట్ల ఆధిక్యంతో నరేశ్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ‘మా’ ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, జాయింట్ సెక్రటరీగాలుగా గౌతమ్‌రాజు, శివబాలాజీ, కోశాధికారిగా రాజీవ్ కనకాల విజయం సాధించారు. కాగా హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందడం విశేషం. ‘మా’ ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) సభ్యులుగా అలీ, రవిప్రకాశ్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వీ, జాకీ, సురేశ్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటే కల్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. -
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ చిత్రం అంకితం
‘‘ఈశ్వర్‌కు హీరో కావాలనే గొప్ప కల ఉంది. ఆ కలను అతని తల్లి దండ్రులు ప్రోత్సహిస్తున్నారు. సినిమా ఫీల్డ్‌లోనే కాదు. ఏ రంగంలో అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆశీర్వాదం లేకుంటే రాణించడం కష్టం’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఈశ్వర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘4 లెటర్స్’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే..’ అన్నది ఉపశీర్షిక. అంకిత, టువ హీరోయిన్లుగా నటించారు. ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బ్యానర్ లోగోను నిర్మాత కిరణ్, ట్రైలర్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఆడియో బిగ్ సీడీని నిర్మాత అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి విడుదల చేశారు. ‘‘చిన్న చిత్రాలు హిట్టయితే ఇండస్ట్రీకి మంచిది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు అచ్చిరెడ్డి. ఆర్. రఘురాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని 75 రోజుల్లో పూర్తి చేశాం. టీమ్ ఎంతగానో సహకరించారు. ఇందులో మంచి సందేశం ఉంది. ఈ సినిమాను ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ సినిమా సెకండాఫ్‌లో ఓ డిఫరెంట్ పాయింట్‌ను టచ్ చేశాం’’ అన్నారు. ‘‘ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 8న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఉదయ్ కుమార్. ‘‘తొలి సినిమాలోనే అన్నపూర్ణమ్మ, పోసాని, సురేష్‌గార్ల వంటి సీనియర్ నటులతో నటించడం హ్యాపీ. ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఈశ్వర్. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, నటుడు సురేశ్, కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్, గీత రచయిత చంద్రబోస్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు భీమ్స్, అంకిత, టువ మాట్లాడారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఎస్వీ కృష్ణారెడ్డి,అచ్చిరెడ్డి
-
భగీరథ విలక్షణమైన రచయిత
‘‘జర్నలిస్ట్ భగీరథలో ఓ విలక్షణమైన రచయిత ఉన్నాడు. ఆయన రచించిన ‘భగీరథ పథం’ చదివితే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎంత మంచి జర్నలిస్టో, అంతకు మించిన రచయిత కూడా. ఆయన నుంచి మరిన్ని పుస్తకాలు రావాలని కోరుకుంటున్నా’’ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన ‘భగీరథ పథం’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నటి జమున మాట్లాడుతూ –‘‘నా జీవితాన్ని ‘జమునాతీరం’ పేరుతో భగీరథ రచించారు. ఆ పుస్తకం నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. ‘భగీరథ పథం’ పుస్తకంలో చాలా విషయాలను నిష్పక్ష పాతం గా రాశారు. ఎన్టీ రామారావు జాతీయ అవార్డు నాకు రావడానికి భగీరథే కారణం’’ అన్నారు. ‘‘స్వరూపా నందేంద్ర స్వామివారి చేతుల మీదుగా నా ‘భగీరథ పథం’ పుస్తకావిష్కరణ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని రచనలు చేస్తా’’ అన్నారు భగీరథ. నిర్మాత రమేష్ ప్రసాద్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె. అచ్చిరెడ్డి, రచయిత సాయినాథ్, రచయిత్రి పల్లవి, సీనియర్ జర్నలిస్ట్, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శి టి. ఉదయవర్లు పాల్గొన్నారు. -
బాలయ్య హీరోగా ఫాంటసీ మూవీ..!
నందమూరి బాలకృష్ణ వంద సినిమాలు పూర్తి చేసిన తరువాత మరింత స్పీడు పెంచాడు. తన 101వ సినిమాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తమిళదర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ‘జై సింహా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తరువాత తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తాజా బాలకృష్ణ చేయబోయే మరో సినిమాపై ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గతంలో బాలయ్య హీరోగా టాప్ హీరో సినిమాను తెరకెక్కించిన ఎస్వీ కృష్టారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాను ఫాంటసీ కథాంశంతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన లేకపోయినా.. ఇప్పటికే కథ కూడా ఓకె అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. -
కసి ఉంటేనే అనుకున్నది సాధిస్తాం – ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘ప్రతీక్ హీరోగా నటించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ చూసుకుంటూ డైరెక్ట్ చేశాడు. ఇవన్నీ చేయాలంటే కసి ఉండాలి. కసి ఉండబట్టే నేను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్‌ప్లే రైటర్, హీరో అయ్యా. ‘వానవిల్లు’ టీమ్‌లో మంచి కసి కనపడుతోంది. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ప్రతీక్ ప్రేమ్‌కరణ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘వానవిల్లు’. శ్రావ్య, విశాఖ హీరోయిన్లు. లంకా కరుణాకర్ దాస్ నిర్మాత. ప్రభు ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ప్రతీక్ ప్రేమ్‌కరణ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పట్నుంచి డైరెక్టర్ కావాలనే కోరిక ఈ రోజు నిజమైంది. నాన్న దగ్గరకు వెళ్లి నేను డైరెక్టర్ అవుతాననగానే, ఆయన ఎంకరేజ్ చేసి ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. రెండున్నరేళ్లుగా ఈ సినిమాతో జర్నీ చేస్తున్నా. ఈ సినిమా సక్సెస్ అయినా కాకపోయినా మళ్లీ సినిమా చేస్తా. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆ కష్టం తెరపై కనపడతుంది’’ అన్నారు. లంకా కరుణాకర్, ప్రభు ప్రవీణ్, నిర్మాత బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకుడు కోటి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్: ఎస్.డి. జాన్. -
101వ సినిమా ఎవరితో..?
నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. అంఖడ భారతాన్ని పరిపాలించిన తెలుగు చక్రవర్తి శాతకర్ణి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రం తరువాత బాలకృష్ణ చేయబోయే సినిమా ఏంటి..? అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. బాలయ్య 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే సందేశాత్మక చిత్రం చేస్తాడని భావించారు. అదే సమయంలో యువ దర్శకుడు అనీల్ రావిపూడితో రామారావు గారు అనే సినిమా కూడా ప్రధానంగా వినిపించింది. తాజాగా మరో షాకింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చాలా ఏళ్ల కిందట బాలయ్యతో 'టాప్‌హీరో' లాంటి ఫ్లాప్ సినిమా తీసిన ఎస్ వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ.. ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతానికి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. వారాహి చలనచిత్ర బ్యానర్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. -
సైంటిఫిక్ థ్రిల్లర్
కాలేజ్ నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ ‘కుర్ర తుఫాన్’. తేజ, తరుణ్, మాస్టర్ శ్రీరామ్ కాంబినేషన్లో కృష్ణమోహన్ దర్శకత్వంలో సిక్స్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్ ఇచ్చారు. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని కృష్ణమోహన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: టి.పి. భరద్వాజ్, కెమెరా: గోపాల్ సామరాజు. -
నాపై అలాంటి స్టాంప్ వేసేశారు - తేజ
‘‘తేజ సినిమా చేయడం మొదలుపెడితే హోరాహోరీగా పోరాడతాడు. అతను పరిచయం చేసే హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు కూడా అంతే హోరాహోరీగా ఉంటారు. ఈ సినిమాతో పరిచయమవుతున్న దిలీప్ గొప్పగా ఎదుగుతాడని పిస్తోంది’’ అని సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. దిలీప్, దక్ష జంటగా తేజ దర్శకత్వంలో శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న ‘హోరాహోరీ’ చిత్రం పాటల వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. కల్యాణి కోడూరి స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని హీరో సుమంత్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లా డుతూ - ‘‘తేజ ఎప్పుడు ఏ సినిమా డెరైక్ట్ చేసినా పరిశ్రమలోకి కొత్త నీరు వస్తుంది. తేజకు స్టార్స్ అవసరం లేదు. నేను, తేజ రెండేళ్లు రూమ్మేట్స్గా ఉన్నాం. తనెప్పుడూ నాకు వండర్గానే అనిపిస్తాడు’’ అని చెప్పారు. ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ, ‘‘తేజ తెలివితేటల్లో యాభై శాతం నాకు ఉంటే వంద సినిమాలు డెరైక్ట్ చేసేవాణ్ణి. తేజ ఒక అద్భుతం. నిర్మాత దాము నాకు ఆత్మబంధువు’’ అని చెప్పారు. ఈ సినిమా ప్రచార చిత్రం చూస్తుంటే ‘జయం’ గుర్తుకొస్తుందని దర్శకుడు వీవీ వినాయక్ పేర్కొన్నారు. తేజ మాట్లాడుతూ, ‘‘నేను ఏ సినిమా తీసినా అందరూ ‘జయం’తో పోలుస్తున్నారు. నేను వేరే తరహా సినిమాలు చేసినా తేజ లవ్‌స్టోరీలే తీస్తాడనే స్టాంప్ వేసేశారు. గత పదేళ్లుగా కాస్త సెలైంట్‌గా ఉన్న నేను మళ్లీ అగ్రెసివ్‌గా మారాను. ఈ సినిమాలో కూడా నా అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది. లైట్లు, మేకప్ లేకుండా ఈ సినిమా చేశాం. కల్యాణి కోడూరి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు’’ అని చెప్పారు. దామోదరప్రసాద్ మాట్లాడుతూ - ‘‘కర్ణాటకలో 53 రోజులు షూటింగ్ చేశాం. మా నాన్నగారి స్ఫూర్తితో నా కుటుంబ సభ్యులు, స్నేహితుల అండతో నిర్మాతగా ఎదుగుతున్నాను’’ అని తెలిపారు. తొలి చిత్రాన్నే ఓ టాప్ డెరైక్టర్‌తో చేస్తున్నందుకు హీరో దిలీప్ సంతోషం వెలిబుచ్చారు. ఈ వేడుకలో అచ్చిరెడ్డి, ‘జెమినీ’ కిరణ్, బసిరెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, గోపీచంద్ మలినేని, జీవిత, భీమనేని, నాగశౌర్య, ఆర్పీ పట్నాయక్, ప్రతాని రామకృష్ణ గౌడ్, పెద్దాడ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నన్ను విజేతని చేసిన రాత్రి!
నిద్రలేని రాత్రులు నెంబర్‌వన్ అనడంలో కాస్త అహంకారం ధ్వనిస్తోంది.కృష్ణగారు చాలా మంచి వ్యక్తి. అహంకారమన్నదే తెలియని మనిషి. ఆయనకు అనవసరంగా అహంకారాన్ని ఆపాదిస్తున్నానేమో అని కలత చెందాను. ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని నిద్రలేని రాత్రులు తప్పకుండా ఉంటాయి. నాకూ ఉన్నాయి. కానీ అన్నీ పంచుకోవాలని నేను అనుకోవడం లేదు. ఓ వ్యక్తి దూరమయ్యాడనో, ఓ సంఘటన కలిచి వేసిందనో నిద్ర లేకుండా గడిపిన క్షణాల్ని పంచుకోబోను. ఎందుకంటే నేను సింపథీ కోరుకోను. అందుకే నన్ను విజేతని చేసిన ఓ రాత్రి గురించి చెబుతాను. అప్పుడు నా కెరీర్ మంచి వేగంగా పరిగెడుతోంది. రాజేంద్రుడు - గజేంద్రుడు, మాయలోడు చిత్రాలు వరుసగా సక్సెస్ అయ్యాయి. తరువాతి సినిమాను కృష్ణ గారితో తీయాలని నిర్ణయం అయిపోయింది. ఆ చిత్రం పేరు ‘నెంబర్‌వన్’ అని అనౌన్స్ చేసేశాను. అప్పుడు మొదలయ్యింది అసలు సమస్య. అప్పటికి చిరంజీవి, బాలయ్య తదితరులు మంచి స్వింగ్‌లో ఉన్నారు. కృష్ణగారికి కాస్త సినిమాలు తగ్గాయి. అలాంటి సమయంలో ఆయనతో ‘నెంబర్‌వన్’ అనే సినిమా తీయడంలో ఉద్దేశమేమిటి, ఆయనే ఇండస్ట్రీలో నెంబర్‌వన్ అనా? అనే ప్రశ్న తలెత్తింది. అది చాలా ఇబ్బంది పెట్టే ప్రశ్న. నాకసలు అలాంటి ఉద్దేశమే లేదు. కానీ అందరికీ మాత్రం నా టైటిల్ అదే సందేహాన్ని కలిగించింది. కొందరైతే స్వయంగా నా దగ్గరకు వచ్చారు. ‘కెరీర్ బాగుంది, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు, ఇందుకు ఇలాంటి రిస్క్, మీకు చెడ్డపేరు వస్తుంది’ అన్నారు. దాంతో నాకు భయమేసింది. అనవసరంగా కమిటయ్యానా అనిపించింది. ఆలోచనలో పడ్డాను. రెండు మూడు రోజులు అదే టెన్షన్లో ఉన్నాను. ఓ రోజు రాత్రయితే అసలు నిద్రే పట్టలేదు. అయితే టైటిల్ మార్చాలన్న ఆలోచన మాత్రం నాకు రాలేదు. ఎందుకంటే... ‘కొబ్బరిబొండాం’ టైటిల్ పెట్టినప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయి. కొబ్బరిబొండాం, జాంగిరి, జిలేబీ కూడా సినిమా పేర్లేనా అని కొందరు కామెంట్ చేశారు. అప్పడాలు, సాంబార్లు కూడా సినిమా పేర్లుగా పెట్టేస్తారా అంటూ ఎంతోమంది విమర్శించారు. కానీ సినిమా రిలీజయ్యాక మాత్రం ఆ పేరు కరెక్ట్ అని అందరూ అంగీకరించారు. ఇప్పుడు కూడా నా టైటిల్ కరెక్ట్ అని నాకు తెలుసు. కానీ అపార్థాలు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి, టైటిల్‌ని ఎలా జస్టిఫై చేయాలి, ఆడియెన్స్‌ని ఎలా కన్విన్స్ చేయాలి అన్నదే నా తపన. ఆ రాత్రంతా కంటి మీదికి కునుకు రాలేదు. అందరూ అనేదాంట్లో తప్పు లేదు. నెంబర్‌వన్ అనడంలో కాస్త అహంకారం ధ్వనిస్తోంది. కృష్ణగారు చాలా మంచి వ్యక్తి. అహంకారమన్నదే తెలియని మనిషి. ఆయనకు అనవసరంగా అహంకారాన్ని ఆపాదిస్తున్నానేమో అని కలత చెందాను. నాలుగున్నర, ఐదు కావస్తుండగా మనసులో ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ‘ఇంటి బాధ్యతలు ఎవరు తీసుకుంటారో అతడే ఆ ఇంటికి పెద్ద, ఆ కుటుంబంలో అతడే నెంబర్‌వన్’... ఇదే ఆ ఆలోచన. ఆనందం వచ్చేసింది. మనసు తేలిక పడింది. నా సమస్య పరిష్కారమైపోయిందనిపించింది. దాంతో గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోయాను. ఉదయం రచయిత దివాకర్‌బాబు గారి దగ్గరకు వెళ్లి నా ఆలోచనను చెప్పాను. ఆయన దానిని అందమైన ఫార్మాట్‌గా మార్చారు. ఆ ఫార్మాట్లోనే ‘నెంబర్‌వన్’ రిలీజయ్యింది. మంచి సక్సెస్ అయ్యింది. నెగిటివ్ ఆలోచనలకు, కామెంట్లకు ఫుల్స్టాప్ పెట్టింది. ప్రశంసల జల్లు కురిపించింది. ఈ అనుభవం నాకో గొప్ప సత్యాన్ని అవగతమయ్యేలా చేసింది. అదేంటంటే... విజయాల్ని అందుకునే ప్రయత్నంలో నిద్రలేని రాత్రులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. నిద్రపోకుండా చేసిన ఆలోచనలు కొన్నిసార్లు మన జీవితాల్నే మార్చేస్తాయి. - సమీర నేలపూడి -
గల్లీలో చెల్లి పెళ్లి... జరగాలి మళ్లీ మళ్లీ...
హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: యమలీల (1994); డెరైక్ట్ చేసింది: ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా తీసింది: కె.అచ్చిరెడ్డి; మాటలు రాసింది: దివాకర్‌బాబు అనగనగా ఓ తోటరాముడు. పేరు చూసి వీడెవడో ‘పాతాళ భైరవి’లోలాగా వీరుడూ శూరుడూ అనుకోవద్దు. నీచనికృష్ట పాపిష్టి మానవుడు వీడు. బీరు తాగినంత సునాయాసంగా దోపిడీలు, బ్రేవ్‌మని తేన్చినంత ఈజీగా ఘోర హత్యలు, టీవీలో వార్తలు చూసినంత అవలీలగా మానభంగములు చేసెడివాడు. నరకలోకపు హెచ్ఆర్ మేనేజర్ చిత్రగుప్తుడికి సైతం వీడి చిట్టా మెయింటైన్ చేయలేక హెడేక్ మీద హెడేక్ వచ్చేసింది. ఈ తోట రాముడికి తిక్క... వెర్రి... పిచ్చి... ఉన్మాదం... మదం... పొగరు... బలుపు... ఇలా సకల అవలక్షణాలూ కలవు. తనో పెద్ద తోపు అని తోటరాముడికి ఫీలింగ్. వీడికో బ్యాట్ బ్యాచ్ కలదు. ఎవడైనా తోటరాముడు తెలియదన్నాడంటే వాడి తాట తీసిపారేస్తాడు. ఈ నగరమనే నరకానికి తానే ‘యముండ’ అని చెప్పుకుంటుంటాడు. ఎవణ్ణి ఎప్పుడు ఖతం చేయాలో తానే డిసైడ్ చేస్తుంటాడు. ఇంతోటివాడికి రగతం చూస్తే కళ్లు తిరుగుతాయి. తన బ్యాట్బ్యాచ్ ఎవడినైనా చంపుతుంటే, తాను వెనక్కి తిరిగి ఆ చావుకేకల్ని వింటూ తన్మయానికి గురవుతుంటాడు. ఇదే నగరంలో ఓ గరం పోరీ ఉంటుంది. పేరు లిల్లీ. ఆమెకో చైన్ బ్యాచ్. ఈ రెండు బ్యాచ్లకీ టెస్ట్మ్యాచ్ల్లాగా నిరంతరం గొడవలే. ఈ తోటరాముడికి ఎవడైనా అమాయకుడు కనబడ్డాడా... వాణ్ణి బకరా చేసి ఆడించేస్తాడు. తమాషా చూస్తాడు. ఇదో శాడిజం వాడికి. ఈ తోట రాముడికి కపిత్వంలో పాటు కవిత్వం కూడా ఇష్టం. ఆ రోజు ఏమి జరిగినదంటే... ఓ వారపత్రిక కార్యాలయమది. సంపాదకుడు మహా బిజీగా ఉన్నాడు. అక్కడికి తోటరాముడు ప్రవేశించేసరికి కార్యాలయం మొత్తం కల్లోలం. ఈ ఆఫీసుని కబ్జా చేయడానికే వచ్చాడని ఆ సంపాదకుడు భావించి తట్టాబుట్టా సర్దేసుకోవడానికి సిద్ధమైపోయాడు. కానీ, తోటరాముడు మాత్రం పెళ్లిచూపులకు వచ్చినవాడిలా సిగ్గుపడుతూ సంపాదకుని ముందు కూర్చున్నాడు. అతగాడు భయపడుతూ చూస్తున్నాడు. తోటరాముడు జేబులోంచి తీశాడు. కత్తి కాదు... కాగితం! ‘‘నేనీ మధ్య కవిత్వం రాయడం షురూ చేసినా...’’ అంటూ మెలికలు తిరిగిపోయాడు తోటరాముడు. సంపాదకుడికి సృ్పహ తప్పినంత పనయింది. తోటరాముడే నీళ్లు జల్లి లేపాడు. ఇక తప్పించుకోవడం అసాధ్యమని తేలిపోయి ‘‘చెప్పండి సార్’’ అని వినయంగా వేడుకున్నాడు సంపాదకుడు. తన అసిస్టెంట్ చిట్టి వైపు ఓ లుక్కిచ్చి సగర్వంగా చదవడం మొదలుపెట్టాడు తోటరాముడు.‘‘నాకొక బుల్లి చెల్లి...’’ అని ఒక లైను చదివాడో లేదో, చిట్టిబాబు ‘వహ్వా వహ్వా’ అంటూ భజన మొదలుపెట్టేశాడు. సంపాదకుడు కూడా పొగడాలి కదా. లేకపోతే గుండు రామకీర్తన పాడుతుందని తెలుసు. అందుకే తనూ పొగడ్డం మొదలెట్టాడు. ‘‘సిస్టర్ సెంటిమెంట్ అన్నమాట... కానివ్వండి కానివ్వండి’’ అన్నాడు. తోటరాముడు ఛాతీ రెట్టింపైంది. ‘‘నాకో బుల్లి చెల్లి నేడే గల్లీలో దానికి పెళ్లి ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ’’ అని కవిత చదవడం పూర్తి చేసి, తోటరాముడు చాలా ఉత్సుకతగా సంపాదకుడి వైపు చూశాడు. ఆ సంపాదకుడి పరిస్థితి చూడాలి. యాక్సిడెంటై అంబులెన్స్ ఎక్కితే, ఆ అంబులెన్స్‌కే యాక్సిడెంట్ అయినట్టుగా ఉంది. ‘‘చెల్లి పెళ్లి... ఒక్కసారి కాదు... జరగాలి మళ్లీ మళ్లీ... బావుంది... చాలా బావుంది. కొత్తగా ఉంది. అద్భుతంగా ఉంది’’ అని పొగడ్డానికి పదాలు రాక... కాదు కాదు దొరక్క... అలా పొగుడుతూనే ఉన్నాడు. హుస్సేన్ సాగరంలో నిమజ్జనం చేసే వినాయకుడిలాగా తోటరాముడు తెగ సంబరపడిపోయాడు. ‘‘అయితే ఈ కవితను ప్రింట్ చేయాలని డిసైడ్ చేసినా’’ అన్నాడు. తోటరాముడు డిసైడ్ చేశాడంటే వార్ వన్‌సైడ్ అయిపోయినట్టే. కవిత పబ్లిషైంది. తోటరాముడు ఖుష్షో ఖుష్షు. సరిగ్గా అదే సమయంలో అసిస్టెంటు పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘అన్నా అన్నా... నీకోసం పోస్టల్ వ్యాన్ వచ్చినాదే’’ అని చెప్పాడు. ‘‘అరె చుప్... నా కోసం వస్తేగిస్తే పోలీసు వ్యాను రావాలే. పోస్టల్ వ్యాను రావడమేంటి?’’ అని తోటరాముడు కసురుకున్నాడు. కానీ నిజంగానే పోస్టల్ వ్యాను వచ్చి, 5 బస్తాల ఉత్తరాలు అతని ముందు పడేసి పోయింది. తోటరాముడికి ఏం అర్థం గాలేదు.‘‘తొలి కవితతోనే ఎంత పాపులరైపోయారు సార్’’ అంటూ సంపాదకుడు ఉబ్బేశాడు. తోటరాముడు చాలా హుషారుగా ఓ ఉత్తరం తీసి చదవమన్నాడు. ‘‘తోటరాముడు గారికి... గత వారం వారపత్రికలో మీరు రాసిన ‘చెల్లి పెళ్లి’ కవిత చదివా. చెల్లికి మళ్లీ పెళ్లేంట్రా గాడిదా... నికృష్టుడా... దరిద్రుడా... అప్రాచ్యుడా... నీకు దినం పెట్టా...’’ ... ఇలా ఆ ఉత్తరమంతా తిట్ల సునామీ. తోటరాముడి మొహం మాడిపోయిన మసాలాదోశెలా అయిపోయింది. ఇంకో ఉత్తరం తీస్తే... అందులో అంతకన్నా ఎక్కువ తిట్లు.సంపాదకుడి వైపు కొరకొరా చూశాడు తోటరాముడు. ‘‘నా కవిత్వం బాగుందని అన్‌పాపులర్ చేస్తావురా. నన్ను కవిని చేయమంటే బద్నామ్ చేస్తావ్. నేను నిన్ను బద్నామ్ చేస్తా’’ అని సంపాదకుణ్ణి చెడుగుడు ఆడేశాడు. చూశారా... ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని తెలుసు మనకి. కానీ ఒక కవిత కూడా జీవితాన్ని ఎలా డిసైడ్ చేసేసిందో! ఫైనల్‌గా ఈ స్టోరీకి కన్‌క్లూజన్ ఏంటంటే - ఈ తోటరాముడు, సాక్షాత్తూ యమధర్మరాజునే డిసైడ్ చేసేయాలని చూశాడు.భూమ్మీదకు పొరపాటున జారిపడ్డ ‘భవిష్యవాణి’ పుస్తకం కోసం యమధర్మరాజు, చిత్రగుప్తుడు వెతుకుతుంటే, తోటరాముడు దాన్ని దొరకబుచ్చేసుకు న్నాడు. ఎంతో ఉత్సాహంగా, ఆత్రంగా ఆ ‘భవిష్యవాణి’ ఓపెన్ చేసి చూస్తే ‘నేటితో నీ చరిత్ర సమాస్తం’ అని రాసి ఉంది. అదేంటో యమధర్మరాజు గదతో గట్టిగా గదిమితే తప్ప తెలియలేదు. తోటరాముణ్ణి యమధర్మరాజు అట్లా డిసైడ్ చేసినాడు మరి! ఈ తోటరాముడి ప్రసారం ఇంతటితో సమాప్తం. - పులగం చిన్నారాయణ ‘యమలీల’ సినిమాలో యముడు ఎంత ఇంపార్టెంటో, తోట రాముడు కూడా అంతే ఇంపార్టెంటు. తన కామెడీ విలనీతో ఈ తోట రాముడు సినిమాను ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులూ తిప్పాడు. ఈ తోటరాముడు పాత్ర తనికెళ్ల భరణి కెరీర్‌ను చాలా గొప్పగా డిసైడ్ చేసేసిందంతే..! ‘‘ఆ రోజు... నేను ఇంటికి వెళ్లగానే ఓ వార్త. ఎస్వీ కృష్ణారెడ్డిగారు అర్జంట్‌గా కాల్ చేయమన్నారట. అప్పట్లో సెల్‌ఫోన్స్ లేవు. మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కానీ, ఎస్టీడీ సౌకర్యం లేదు. దాంతో ఎస్టీడీ బూత్‌కెళ్లి ఫోన్ చేశా. ‘యమలీల’లో మెయిన్ విలన్ వేషం ఇస్తున్నట్టు కృష్ణారెడ్డిగారు చెప్పగానే, ఆనందంతో ఉప్పొంగిపోయా. కానీ డేట్ల సమస్య. అవే డేట్లు ‘పల్నాటి పౌరుషం’ సినిమాకిచ్చా. రాజమండ్రిలో షూటింగ్. నిర్మాత ‘ఎడిటర్’ మోహన్‌గారిని బతిమిలాడా. కృష్ణంరాజులాంటి బోలెడుమంది ఆర్టిస్టులతో కాంబినేషన్. కుదరదన్నారు. అయ్యో... బ్రహ్మాండమైన అవకాశం మిస్సయ్యిందే అనుకుంటూ కృష్ణారెడ్డిగారికి ఫోన్ చేసి విషయం చెప్పా. ఆయన ‘‘ఏం పర్లేదు... మీరు వేరే డేట్లు ఇవ్వండి. అప్పుడే చేద్దాం’’ అని నాకు ఊపిరి పోశారు. అలా నాకు ‘తోటరాముడు’ పాత్ర దక్కింది. దాదాపు 20 రోజుల వేషం. ఆ రోజు లాస్ట్డే. నేను వెళ్లడానికి రెడీ అవుతుంటే... ‘‘మీ మీద పాట ఉంది’’ అని చెప్పారు. ఆశ్చర్యపోయా. క్లైమాక్స్‌లో నాతో సరదాగా ‘చినుకు చినుకు అందెలతో...’, ‘రగులుతోంది మొగలిపొద...’ పాటలకు స్టెప్పులేయించారు. ఈ సినిమా నా జీవితాన్ని ఎంతలా మలుపు తిప్పిందంటే - ఇక నేను రైటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించేశాను. ఒకే ఏడాది దాదాపు 37 సినిమాలు ఒప్పుకునేంత బిజీ అయిపోయా. నేనెక్కడికి వెళ్లినా ‘డిసైడ్ చేస్తా’ అంటూ అభిమానులు సరదాగా మాట్లాడేవారు. ‘చెల్లి పెళ్లి’ కవిత చెప్పమనేవారు. నేను తెలంగాణలో పుట్టి పెరిగా కాబట్టి, ఈ డైలాగులు నేను రాశానని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఒక్క అక్షరం కూడా నాదికాదు. నూటికి నూరు శాతం ఈ క్రెడిట్ రచయిత దివాకర్ బాబుదే.’’ - తనికెళ్ల భరణి -
నాతో సినిమా చేయడానికి ఎందుకు వెనకాడతారు!
పరిచయ వాక్యాలు అవసరం లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటివాళ్లల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. దర్శకునిగా, నటునిగా, సంగీతదర్శకునిగా, రచయితగా.. ఆయన సాధించిన విజయాలు తెలియనవి కావు. నేడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు. త్వరలో ఓ చిత్రం ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారాయన. ఇక, ఎస్వీకేతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని విశేషాలు తెలుసుకుందాం... అప్పట్లో మీరు వంద రోజులు, ‘యమలీల’కైతే 350 రోజుల పండగ చేశారు. ఇప్పుడు 50 రోజులు కూడా గగనమే. సినిమా విడుదలైందా? వారం రోజుల్లో వసూళ్లు వచ్చేశాయా అనే ఈ ట్రెండ్‌లో ఇమడగలుగుతారా? హండ్రెడ్ పర్సంట్. సమయాన్నిబట్టి మారాలి. ఒకప్పుడు బస్సులో వెళ్లేవాళ్లం. ఆ తర్వాత ట్రైన్, ఫ్లయిట్లో ప్రయాణం చేసేదాకా ఎదిగాం. ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్ దాకా వచ్చాం. ఆ మార్పుని అంగీకరించినప్పుడు, సినిమాల పరంగా వచ్చిన మార్పునూ అంగీకరించాలి. ‘ఐ లవ్ దిస్ చేంజ్’. ఇంకా కొత్త కొత్త మార్పుల కోసం ఎదురు చూస్తున్నా. ఒకప్పుడు మీ సినిమాలు ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పటి ట్రెండ్ ఎలా అనిపిస్తోంది? ట్రెండ్ అనేది ఉండదు. సక్సెస్‌ని కొలమానంగా తీసుకుంటాం కాబట్టి, ఏదైనా సినిమా విజయం సాధిస్తే అదే ట్రెండ్ అనుకుంటాం. అలా అనుకుని అదే పంథాలో వెళితే, మనం క్యూలో ఉన్నట్లే లెక్క. ‘క్యూలో నిలబడొద్దు.. కొత్త క్యూ తయారు చెయ్’ అనేది నా పాలసీ. నా చిత్రాల్లో ‘ఘటోత్కచుడు’ని తీసుకుందాం. 20 ఏళ్ల క్రితం ఆ చిత్రంలో రోబో అనే పాత్ర పెట్టి, ప్రేమకథ తీశా. ఆ రోబో కథే ఇరవయ్యేళ్ల తర్వాత ‘రోబో’గా శంకర్ తీశారు. అప్పట్లో ఇంత కాదు కదా.. టెక్నాలజీ జీరో. అప్పట్లోనే రోబో కారెక్టర్‌తో సినిమా తీసి, చాలా అడ్వాన్స్ అయ్యా. ఇరవయ్యేళ్ల క్రితమే ఇరవయ్యేళ్లు ముందు ఉంటే, ఇవాళ ఎన్ని సంవత్సరాలు ముందు ఉండి ఉంటానో ఊహించుకోండి. మీ మనసు వయసు చాలా తక్కువ అనిపిస్తోంది. కానీ, సినిమా మేకింగ్ పరంగా మీకేమైనా వయసైపోయిందనే ఫీలింగ్ ఉందా? అస్సల్లేదండి (నవ్వుతూ). నా కెరీర్ ఇప్పుడే మొదలైందనే సంతోషంలో ఉన్నాను. గత ఇరవెరైండేళ్లల్లో నలభై సినిమాలు చేశాను. భవిష్యత్తులో అత్యద్భుతమైన సినిమాలు చేస్తాననీ, చేసే అవకాశం వస్తుందనే ఉత్సాహంలో ఉన్నాను. ఎందుకంటే, నా నలభై సినిమాల అనుభవం, సాంకేతికంగా వచ్చిన అభివృద్ధి ఇప్పుడు నాకు ఇంకా హెల్ప్ అవుతాయి. ఇంత ఉత్సాహం ఉన్న మీరు సినిమాలు తగ్గించేశారు? నాకు రెండు లక్ష్యాలు ఉండేవి. ఆర్టిస్ట్ కావాలని వచ్చి, డెరైక్టర్ అయ్యాను. ఆ అదృష్టాన్ని ఉపయోగించుకుని, హీరో అయ్యి, రెండు సినిమాలు చేశాను. దాంతో సంతృప్తిపడ్డాను. రెండో లక్ష్యం ఇంగ్లిష్ సినిమా చేయాలని. పూర్తిగా హాలీవుడ్ తారలతో, సాంకేతిక నిపుణులతో ‘డైవోర్స్ ఇన్విటేషన్’ చేశాను. ఏడాదిలో పూర్తి చేయొచ్చు అనుకున్నాను కానీ, మూడేళ్లు పట్టేసింది. ఓ భారతీయ దర్శకుడికి.. అందులోనూ దక్షిణాది దర్శకుడికి హాలీవుడ్ డెరైక్టర్స్ అసోసియేషన్‌లో మెంబర్ షిప్ ఉన్న ఘనత నాకే దక్కింది. ప్రస్తుతం కథల కొరత ఉందంటున్నారు.. తీసిన కథలనే అటూ ఇటూ మార్చి సినిమాలు తీసేస్తున్నారు. మరి.. మీ దగ్గర కొత్త కథలు ఉన్నాయా? మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు, యమలీల, శుభలగ్నం, ఆహ్వానం... ఇలా అన్ని చిత్రాలనూ కొత్త కథలతోనే చేశా. కథలు కొరత ఉందని నేననుకోవడంలేదు. నా దగ్గర బోల్డన్ని కొత్త కథలున్నాయి. అయితే, ఇప్పటివరకూ ఒక స్టయిల్లో వెళ్లాను, ఇప్పుడు కమర్షియల్ టచ్‌లో వెళ్లాలనుకుంటున్నాను. అంటే.. సుమోలు గాల్లోకి ఎగరడం, విలన్లను ఒంటి చేత్తో హీరో చితగ్గొట్టడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇలాంటివా? కథ డిమాండ్ మేరకు సుమోలే కాదు... ఏ వాహనాన్నయినా గాల్లోకి ఎగరేస్తా. మంచి ఫైట్స్ ఉంటాయి కానీ, రక్తపాతాలు ఉండవు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అస్సలుండవు. చక్కని ఎమోషన్స్ ఉంటాయి. టికెట్ ధర పెరిగింది కాబట్టి, ప్రేక్షకుడి డబ్బుకి న్యాయం జరగాలంటే వాళ్లెలా ఆశిస్తున్నారో అలాంటి సినిమా చేస్తా. అప్పట్లో మీలాంటి దర్శకులు మీ సినిమా కథలు మీరే రాసుకునేవాళ్లు. ఇప్పుడు అలా రాసేవాళ్లని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.. నలుగురైదుగురు రచయితలతో ఓ కథ తయారు చేయించే ఈ పరిణామంపై మీ ఫీలింగ్? ఒక ప్రొఫెషనల్ డాక్టర్, కుక్ ఉన్నట్లు మేమంతా ‘ప్రొఫెషనల్ ఫిలిం మేకర్స్’. ఇప్పుడు చాలామంది సినిమాని సైడ్ బిజినెస్‌లా భావిస్తున్నారు. కుదిరితే చూద్దాం.. లేకపోతే వేరే పని చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ, మాలాంటివాళ్లం ‘చావో.. రేవో.. ఇక్కడే’ అనుకుంటాం. అందుకే మేమే కథ , కథనం రాసుకునే వాళ్లం. శ్రద్ధగా సినిమా తీసేవాళ్లం. వీబీ రాజేంద్రప్రసాద్‌గారు, రామానాయుడుగారిలాంటి వాళ్లు అద్భుతమైన చిత్రాలు అందించడానికి కారణం వాళ్ల శ్రద్ధే. వేరే వాళ్ల కథను ఇంకొకరు తెరకెక్కించడం అనే ప్రక్రియలో ఎంతవరకూ పరిపూర్ణత ఉంటుంది? ఆ సినిమ సక్సెస్ అయితే వాళ్లందరూ ఐక్యభావంతో పని చేసినట్లు, పరిపూర్ణత ఉన్నట్లు లెక్క. సినిమా ఇండస్ట్రీలో ‘ఇదే విధానం’ అని ఏదో ఒకదాన్ని డిసైడ్ చేయలేం. ఒకళ్లే కథ రాసుకోవడం కరెక్టే.. నలుగురూ కలిసి రాసుకోవడమూ కరెక్టే.. ఏదైనా సక్సెస్సే కొలమానం. ఇప్పుడు స్టార్ హీరోతో సినిమా తీస్తేనే, బిజినెస్ సేఫ్. మరి.. మీరు స్టార్‌తో తీస్తారా? కథే స్టార్ అనుకుంటారా? అఫ్కోర్స్ కథకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ, స్టార్స్ మీదే సినిమా బిజినెస్ ఆధారపడి ఉంది కాబట్టి, వాళ్లకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. వాళ్లకు అనుగుణంగా కొత్త కథలు తయారు చేసుకుని సినిమాలు చేస్తా. మీరడిగితే స్టార్ హీరోలు డేట్స్ ఇస్తారనే నమ్మకం ఉందా? వంద శాతం ఉంది. వాళ్లకి కొత్త కథలు కావాలి. నా దగ్గర అవి ఉన్నాయి. మంచి ఆత్మవిశ్వాసం ఉన్న దర్శకుడు కావాలి. నా దగ్గర అది మెండుగా ఉంది. వాళ్లకో ‘వారియర్’ కావాలి. నేను వారియర్‌నే. కమర్షియల్‌గా ఎలా చూపించాలో నాకు తెలుసు. అందుకు నా గత చిత్రాలే ఉదాహరణ. మరి.. నాతో సినిమా చేయడానికి ఎందుకు వెనకాడతారు! - డి.జి. భవాని -
ఎంద చేట...
బొందితో స్వర్గానికి వెళ్లినవారి గురించి మనం పురాణాల్లో చదువుకున్నాం. కానీ, చేటతో స్టార్డమ్ తెచ్చుకున్న నటుడు గురించి మీకు తెలుసా? అయితే అర్జంటుగా మీకు మరోసారి ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ సినిమా చూపించాల్సిందే. ఛలో ఛలో... హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: రాజేంద్రుడు-గజేంద్రుడు (1993) డెరైక్ట్ చేసింది: ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా తీసింది: కె. అచ్చిరెడ్డి మాటలు రాసింది: దివాకర్‌బాబు సీన్ నం.1 ‘‘నమష్కారం’’ ‘‘ఆ... నమస్కారం నమస్కారం’’ చెప్పాడు సూర్య బ్యాంకు మేనేజర్. ఆ నమష్కారం పెట్టినతను బక్కపలచగా ఉన్నాడు. తమాషాగా ఉన్నాడు... కొంటెగా ఉన్నాడు... చిత్రాతి చిత్రంగా ఉన్నాడు. పై నుంచి కింద వరకూ ప్యాంటూ చొక్కా అంతా గళ్లమయం. ‘నీకేం కావాలి బాబూ?’’ అడిగాడు బ్యాంకు మేనేజర్. ‘‘ఎంద చేట...ఎంద తూమారీ... జుంజుబిల సదస్సు నటశ్రీ బిల కాంభోజిని బిల సత్యాల కాదిని...హరిమిలై ఒరు కాట్రవల్లి కండో... కండీసరు కండెల్లు మనసిలాయ... చేట... ఒరు కారీమర... ఎంద కాట్రవల్లి కండ్రో... పల్లి... సుక్కుమరు సుర్ర... చేట... బజ్జల గూడో... చేట ఒరు కారుమిందలి... చేట... చేట... బెల్లం కుడికల్లి...’’ ఇలా ఆ కుర్రాడు ఏదో భాషలో చెప్పుకుంటూ పోతున్నాడు. బ్యాంకు మేనేజర్‌కి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. రోహిణికార్తె ఎండలో రోజంతా తిరిగినా వడదెబ్బ తగలనివాడు, ఈ చేట దెబ్బకు మాత్రం కుదేలైపోయాడు. కకావికలైపోయాడు. గ్లాసుడు మంచి నీళ్లు గటగటా తాగిపారేశాడు. ‘‘ఒరేయ్... నువ్వట్టా మాట్టాడమాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా? తమిళమా? మలయాళమా? పంజాబీనా? నాకర్థం కావడం లేదు. చేట అంటావు. బెల్లమంటావు... నీ అమ్మ కడుపు మాడా...’’ అంటూ తన టేబుల్ మీదున్న ఫైల్స్‌తో అతణ్ణి దబదబా బాది పంపించేశాడు. అమ్మయ్యా... సునామీ వెళ్లిపోయింది. సీన్ నం.2 ఆ రోడ్డులో తిరుగుతూ సబ్బులమ్ముకుంటున్నాడతను. ఈ రోజు ఈ సబ్బులన్నీ అమ్మేసి, తన మరదలితో పెళ్లి సంబంధం ఖాయం చేయించేసుకోవాలి. అదీ ప్లాను. ఇంతవరకూ ఒక్క సబ్బు సేల్ కాలేదు. ఎవడైనా బకరా దొరికితే బాగుణ్ణు. అబ్బ... దొరికేశాడు. సైకిల్ మీద వస్తున్నాడు. చిత్రవిచిత్రమైన గళ్ల డ్రెస్సు. అర్ధమైందిగా... అతనెవరో?! ఆ కుర్రాణ్ణి ఆపాడు. ‘‘సబ్బులు.. సువాసనల సబ్బులు... సినీతారలు వాడే సబ్బులు... ఒక సబ్బు కొంటే ఒక సబ్బు ఫ్రీ’’ అన్నాడు సబ్బులోడు. ఆ కుర్రాడు చాలా అమాయకంగా మొహం పెట్టి ‘‘ఎంద చేట’’ అన్నాడు. ఈ సబ్బులోడు వదిలిపెట్టేలా లేడు. ‘‘చేట కాదు సార్... సబ్బులు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వాడే సబ్బులు’’ చెప్పాడు గొప్పగా. దానికా కుర్రాడు ‘‘ఎంద చిరుయో... ఎంద బాలయో... ఎంద నాగయో... ఎంద వెంకియో... ఎంద పరంద చేట’’ అన్నాడు. ఈ సబ్బులోడికి తిక్క రేగింది. కాస్త గొంతు పెంచి ‘‘చేట కాదు సబ్బు... ఇది వాడితే గజ్జి, తామర, చిడుమూ, వంటినొప్పులు, పంటి నొప్పులు పోతాయి’’ అని చెప్పాడు. దానికా చేటగాడు ‘‘ఎంద గజ్జియో.. ఎంద తామరయో... ఎంద చుండ్రుయో... ఎంద పరింద చేట...’’ అన్నాడు. సబ్బులోడికి ఎక్కడో కాలింది. వీణ్ణి ఎలాగైనా ఓ పట్టు పట్టాలని డిసైడ్ అయిపోయాడు. ‘‘ఈ సబ్బు రాస్తే నలుపు పోతుంది. నాలా తెల్లగా తయారవుతావు’’ అని చెప్పాడు. ఆ చేటగాడు వెర్రి మొహం పెట్టి ఆ సబ్బు వంక, అతని కలర్ వంక కాసేపు చూశాడు. ‘‘ఎంద పరంద ఇంద ఫేసు’’ అని కోపంతో ఓ సబ్బు లాక్కుని నేలకేసి కొట్టాడు. ఆ సబ్బులోడిక్కూడా కోపం వచ్చినట్టుంది. తన దగ్గరున్న సబ్బుల్ని విసిరికొట్టాడు. మొత్తానికి సబ్బులన్నీ నేలపాలయ్యాయి. సీన్ నం. 3 బ్యాంకు మేనేజర్ ఇంట్లో చాలా బిజీగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎంటరయ్యాడు మన చేటగాడు. వెళ్లి నమష్కారం పెట్టి ‘‘ఎంద చేట’’ అన్నాడు. బ్యాంకులో ఒక్కసారిగా చెక్కులన్నీ బౌన్స్ అయినంతగా కంగారు పడిపోయాడు మేనేజర్. ‘‘నువ్వెక్కడ దాపురించావురా... నేనేం అపకారం చేశాన్రా’’ అంటూ అక్కడున్న కుర్చీ తీసుకుని చేటగాడికి ఒక్కటి తగిలించాడు. సీన్ నం. 4 బ్యాంకు మేనేజర్ దగ్గర మళ్లీ ప్రత్యక్షమయ్యాడు చేటగాడు. ఎలాగైనా ఈ రోజు ఈ చేట గురించి తేల్చేయాలని డిసైడైపోయాడు బ్యాంకు మేనేజర్. యాడ్స్ మధ్యలో సినిమాలాగా సబ్బులోడొచ్చాడు. ఈసారి అతని దగ్గర సబ్బుల్లేవు. పెన్నులున్నాయి. ఈ రోజు ఎలాగైనా పెన్నులమ్మేయాలని డిసైడ్ అయిపోయి మరీ వచ్చాడు. బ్యాంక్‌లో అయితే మొత్తం కొనేస్తాడని ఆశ. ‘‘వాడి దగ్గర చేట అంటే ఏంటో కనిపెడితే నీ పెన్నులన్నీ కొనేస్తా’’ ఆఫరిచ్చాడు బ్యాంకు మేనేజర్. పాళీ విరిగి ఇంకులో పడినంత ఆనందపడిపోయాడు పెన్నులోడు. కురుక్షేత్రం మొదలైంది. ఇటు చేటగాడు... అటు పెన్నులోడు. వాడు చేట అంటాడు. వీడు బుచికి బుచికీ అంటాడు. ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదు. పిచ్చి భాష... పిచ్చి పిచ్చి మాటలు... ఫైనల్‌గా పెన్నులోడు ‘‘పోలీసు బుచికీ’’ అనే మాట వాడాడు. పోలీసు మాట వినగానే చేటగాడికి కంగారు పుట్టింది. దడ పుట్టింది. బోల్డంత భయమేసేసింది. ‘‘నన్ను క్షమించండి సార్’’ అంటూ బ్యాంకు మేనేజర్ కాళ్లు పట్టుకున్నాడు. ‘‘తెలుగు రాదని చెప్పి నన్ను ఇన్నాళ్లూ హింసించావు కదరా’’ వాపోయాడు బ్యాంకు మేనేజర్. వాడు నసుగుతూ, నట్లు కొడుతూ అసలు విషయం చెప్పాడు. ‘‘నేను చేటల వ్యాపారం పెట్టుకుందామను కుంటున్నా. మీ బ్యాంకులో లోను ఇస్తారేమోనని... ఇలా వెంటపడుతున్నా...’’ ఇక బ్యాంకు మేనేజర్ ఫేసు చూడాలి. చేటంత ఫేసు చెల్లాచెదురై పోయింది. - పులగం చిన్నారాయణ ఈ చేట నా జీవితాన్నే మార్చేసింది! ‘‘నటునిగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయమది. సరిగ్గా ఆ టైమ్‌లోనే నాకో మంత్రపదం దొరికింది. అది నా జీవితాన్నే మార్చేసింది. ఆ పదమే ‘చేట’. అసలు ఈ పదం ఎలా పుట్టిందంటే... అప్పట్లో మద్రాసులో ఏమీ తోచక సినిమాలకు వెళ్లేవాణ్ణి. చివరకు మలయాళ సినిమాలు కూడా వదిలేవాణ్ణి కాదు. మమ్ముట్టి నటించిన ‘సీబీఐ డైరీ’ నాకు బాగా నచ్చేసింది. ఆ సినిమాలో సౌండ్స్ గుర్తు పెట్టుకుని పిచ్చి మలయాళం మాట్లాడేవాణ్ణి. మలయాళంలో ‘చేట’ అంటే ‘అన్న’ అని అర్థం. వైజాగ్‌లో ‘జంబలకిడి పంబ’ షూటింగ్లో సరదాగా ‘చేట’ అంటూ మాట్లాడుతుంటే, రచయిత దివాకర్‌బాబు ఆసక్తి కనబరిచారు. ఆయనే ఎస్వీ కృష్ణారెడ్డిగారికి చెబితే ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’లో ఈ పాత్ర సృష్టించారు. ఈ పాత్ర ఎంత పాపులరైందో, నాకెంత బ్రేకిచ్చిందో మీ అందరికీ తెలుసు.’’ - అలీ ఆ రెండు పాత్రల్ని బట్టి స్క్రిప్ట్ ప్లాన్ చేశాం! ‘‘మద్రాసులోని దేవర్ ఫిలిమ్స్ వాళ్ళ దగ్గర ఓ ఏనుగుపిల్ల ఉండేది. మావటివాడు ‘జూ... లగ’ అంటే, తల నిలువుగా ఊపడం, అడ్డంగా ఊపడం, కుంటడం లాంటి నాలుగు పనులు చేసేది. ఆ ఏనుగును చూసి, అది చేయగల పనులను బట్టి ఆ పాత్ర, అలీ మ్యానరిజమ్ చూసి ‘చేట’ పాత్ర - రెండూ అల్లుకొని, దాన్ని బట్టి సినిమా స్క్రిప్ట్ ప్లాన్ చేసుకున్నాం. ‘చేట’ డైలాగ్, ఆ పాత్ర అలీకి ఎంతటి స్టార్ స్టేటస్ తెచ్చాయంటే, చివరకు అలీని హీరోగా పెట్టి నేనే ‘యమలీల’ సినిమా చేశా. ఇవాళ్టికీ ‘చేట’ పాత్ర, ఆ సినిమా, ప్రతిభావంతుడైన అలీ గొప్ప ఆర్టిస్ట్‌గా ఎదిగిన తీరును చూస్తుంటే నాకెంతో ఆనందంగా, కించిత్ గర్వంగా ఉంటుంది.’’ - ఎస్.వి. కృష్ణారెడ్డి, డెరైక్టర్ -
కామెడికి పెద్ద లోటు: ఎస్వీ కృష్ణారెడ్డి
-
కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాను : కేవీ సతీశ్
‘‘సినిమాల్లో నటించాలనే నా చిన్నప్పటి కల ‘యమలీల-2’తో నెరవేరింది. కుటుంబ ప్రేక్షకులకు దగ్గర కావాలనే ఆశయంతో చేసిన చిత్రమిది. పెద్దవాళ్లు మాత్రమే కాదు.. ఐదేళ్ల పిల్లలు కూడా నన్ను గుర్తుపడుతున్నందుకు ఆనందంగా ఉంది. నేను ఫ్యామిలీ హీరో అనిపించుకోవడానికి కారణం ఈ చిత్రబృందం. నా తదుపరి చిత్రాలు కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గవిగానే ఉంటాయి’’ అని డా. కేవీ సతీశ్ అన్నారు. ఆయన హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘యమలీల 2’ గత వారం విడుదలైన విషయం తెలిసిందే. కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో డీయస్ మ్యాక్స్ సమర్పణలో క్రిష్వీ ఫిలింస్ పతాకంపై ఆశా సతీశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విజయోత్సవ సభలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ -‘‘మోహన్‌బాబు, బ్రహ్మానందంలాంటి సీనియర్స్ కాంబినేషన్లో ఓ కొత్త నటుడు నటించడం చిన్న విషయం కాదు. సెంటిమెంట్, యాక్షన్ సన్నివేశాల్లో సతీశ్ బాగా నటించారు. మాస్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఫైట్స్ చేశారు. తదుపరి చిత్రం సతీశ్‌ని మరో మెట్టు ఎక్కేలా చేస్తుంది. అలాంటి సినిమా చేయబోతున్నాం’’ అన్నారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ -‘‘ప్రథమార్ధంలో కూల్‌గా, ద్వితీయార్ధంలో హీరోయిజమ్‌ని ఎలివేట్ చేసే పాత్రను సతీశ్ బాగా చేశారు. ఆయన మంచి వ్యక్తి కూడా. హుద్ హుద్ తుఫాను బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సతీశ్ పది లక్షల రూపాయలు విరాళమందించారు’’ అన్నారు. వసూళ్లు బాగున్నాయనీ, 500 థియేటర్లలో 50 రోజులాడటం ఖాయమని సహ నిర్మాత డీకే అరుణ్ కుమార్, విజయ్‌భాస్కర్ చెప్పారు. -
కృష్ణలీల
-
ఎస్వీ కృష్ణారెడ్డితో చిట్ చాట్
-
ఆ క్రమశిక్షణ సతీశ్‌లో కనిపించింది : మోహన్‌బాబు
‘‘ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. కథ ఎలా ఉన్నా... దాన్ని తెరపై అందంగా ఆవిష్కరించేది దర్శకుడే. అలాంటి దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఆయన దర్శకునిగా మారి దాదాపు పాతికేళ్లు అయ్యింది. 40 ఏళ్లుగా నేను ఈ రంగంలో ఉన్నా... ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇప్పుడు కలిగింది’’ అని మోహన్‌బాబు అన్నారు. కె.సతీశ్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.ఆశా సతీశ్ నిర్మించిన చిత్రం ‘యమలీల-2’. మోహన్‌బాబు ఇందులో యమునిగా నటించిన విషయం తెలిసిందే. ఎస్వీ కృష్ణారెడ్డి స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. ‘‘ఇంత క్రమశిక్షణగా మేం నడుచుకుంటున్నామంటే కారణం ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరిగార్లు నేర్పిన క్రమశిక్షణే. ఈ చిత్ర కథానాయకుడు సతీశ్‌లో కూడా అదే క్రమశిక్షణ కనిపింది. ఇందులో నేను పోషించిన యముడి పాత్ర నాకు ప్రత్యేకం’’ అని మోహన్‌బాబు తెలిపారు. ఆడియోలాగే సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని హీరో కె.సతీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ‘‘సతీశ్ కోసమే ఈ స్క్రిప్ట్ తయారు చేశాను. అభినయంతో పాటు డాన్సులు, ఫైట్లు అద్భుతంగా చేశాడు. యముడిగా మోహన్‌బాబు, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం పాత్రలు ఈ చిత్రానికి హైలైట్’’ అని నమ్మకం వెలిబుచ్చారు. నటునిగా మోహన్‌బాబు 40వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందని కె.అచ్చిరెడ్డి అన్నారు. ‘యమలీల’ టైమ్‌కి తాను ఓ ప్రేక్షకుణ్ణి మాత్రమేననీ, ‘యమలీల-2’కి వచ్చే సరికి పంపిణీదారుని స్థాయిలో జ్ఞాపిక అందుకోవడం ఆనందంగా ఉందనీ ‘దిల్’ రాజు సంతోషం వెలిబుచ్చారు. ఈ వేడుకలో భాగంగా అప్పటి ‘యమలీల’ కథానాయకుడు అలీని ఈ ‘యమలీల-2’ యూనిట్ ఘనంగా సత్కరించింది. -
'యమలీల 2' మూవీ న్యూ స్టిల్స్
-
ఆ సినిమాలానే... ఇది కూడా!
‘యమలీల’ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి యమధర్మరాజు నేపథ్యంలోని కథాంశంతో తెరకెక్కించిన చిత్రం ‘యమలీల-2’. డా. కేవీ సతీశ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ఆశా సతీశ్ నిర్మాత. ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటిం చారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ-‘‘‘యమలీల’ లాగే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నటునిగా సతీశ్‌కి గొప్ప భవిష్యత్తు ఉంది. యమునిగా మోహన్‌బాబు, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం అద్భుతంగా నటించారు. పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా ద్వారా హీరోగా పరిచయమవడం ఆనందంగా ఉందనీ, మోహన్‌బాబు, బ్రహ్మానందం లాంటి సీనియర్స్‌తో నటించడం అదృష్టంగా భావిస్తున్నాననీ సతీశ్ అన్నారు. త్వరలోనే పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపుతామనీ, 500 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తామనీ సహ నిర్మాత డి.కె.అరుణ్‌కుమార్ తెలిపారు. దియా నికోలస్ నాయికగా నటించిన ఈ చిత్రానికి మాటలు: గంగోత్రి విశ్వనాథ్-భవానీ ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్. -
యూరప్‌లో యమ హంగామా
ఇరవై ఏళ్ల క్రితం బాక్సాఫీసు వద్ద ‘యమలీల’ సినిమా చేసిన మేజిక్కు అంతా ఇంతా కాదు. మళ్లీ ఆ మేజిక్‌ని రిపీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘యమలీల-2’గా ఆయన రూపొందిస్తున్న ఈ చిత్రంలో యముడిగా డా. మోహన్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రగుప్తునిగా పాత ‘యమలీల’లోని పాత్రనే బ్రహ్మానందం పోషిస్తుండగా, డా. కేవీ సతీశ్ హీరోగా నటిస్తూ, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దియానికోలస్ ఇందులో కథానాయిక. రెండు పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 28 నుంచి ఆగస్ట్ 8 వరకూ యూరప్‌లో ఈ పాటల్ని చిత్రీకరించనున్నట్లు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, గ్రాఫిక్స్‌కు ఎక్కువ అవకాశమున్న కథ కావడంతో టీమ్ మొత్తం శ్రమించి పని చేస్తున్నారని ఎస్వీకె అన్నారు. సతీశ్ అనుకున్నదానికంటే వంద రెట్లు బాగా చేస్తున్నాడని, ప్రేక్షకుల్ని వందశాతం ఆనందింపజేసే సినిమా అవుతుందని కృష్ణారెడ్డి నమ్మకం వెలిబుచ్చారు. ‘‘ఒక మంచి కుటుంబకథను నిర్మించాలని, కృష్ణారెడ్డిగారితో మొదలుపెట్టిన ఈ సినిమా అనుకున్నదానికంటే గొప్పగా వస్తోంది. కృష్ణారెడ్డి ఎంతో కష్టపడి, ఇష్టంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. మా క్రిష్వి ఫిలింస్ సంస్థకు, పనిచేస్తున్న అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అని డా. కేవీ సతీశ్ అన్నారు. భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘యమలీల-2’ ఒకటి అని సహ నిర్మాత డి.అరుణ్‌కుమార్ చెప్పారు. -
అయిదు వందల రూపాయల పాకెట్ మనీతో...
‘‘అయిదువందల రూపాయల పాకెట్‌మనీతో వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్లాను. కష్టాల్ని కూడా ఇష్టంగా స్వీకరించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాను. భవిష్యత్తులో సినీ రంగంలో కూడా రాణిస్తాను’’ అని డా. కేవీ సతీష్ చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘యమలీల 2’ చిత్రం ద్వారా ఆయన హీరోగా పరిచయమవుతున్నారు. నేడు సతీశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘ఎప్పటికైనా నా సొంత డబ్బుతో సినిమా తీసి, హీరో కావాలనేది నా లక్ష్యం. కుటుంబ కథాచిత్రాలు తీయడంతో మంచి నేర్పు ఉన్న కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుందనుకున్నా. ఆయన ఇప్పుడు కుదరదన్నా, కన్విన్స్ చేశాను. ఆయన మూడు, నాలుగు కథలు చెబితే, నాకు ‘యమలీల 2’ నచ్చింది. ఇందులో యమధర్మరాజుగా మోహన్‌బాబు, చిత్రగుప్తుడుగా బ్రహ్మానందం అయితేనే బాగుంటుందని కృష్ణారెడ్డి అన్నారు. లక్కీగా వీళ్లు కూడా ఒప్పుకోవడంతో ఈ చిత్రం ప్రారంభమైంది. అందరి సహకారంవల్ల బాగా నటించగలుగుతున్నా. ఎడిటర్ గౌతంరాజుగారైతే ‘పది సినిమాల అనుభవం ఉన్నవాడిలా చేశావ్’ అని ప్రశంసించారు. మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. ఇకనుంచి ప్రతి ఏడాదీ నేను హీరోగా మా సంస్థ నుంచి ఓ సినిమా వస్తుంది’’ అని చెప్పారు. కర్నాటకలో నేను స్థాపించిన కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల దాదాపు 60 మందికి కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామని, కేన్సర్ రోగులకు సహాయం చేస్తున్నామని, హెచ్ఐవి సోకిన పిల్లల కోసం అనాథ శరణాలయం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సతీష్ తెలిపారు. తన మాతృభాష తెలుగు కాబట్టి, తెలుగువారి కోసం కూడా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలన్నదే తన ఆశయం అని ఆయన పేర్కొన్నారు. -
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుక
-
కృష్ణారెడ్డి శైలిలో యమా వినోదం
యమ ధర్మరాజు అంటే మనకు భయం. కానీ, బాక్సాఫీస్‌కి మాత్రం చాలా ఇష్టం. ఎందుకంటే యమధర్మరాజు వెండితెర మీద కనపడితే కాసుల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా తెలుగు తెరపై యమలోకపు నేపథ్యం అనేది ఓ విజయవంతమైన ఫార్ములా. టాప్ టెన్ యమ చిత్రాల్లో ఒకటిగా నిలిచే చిత్రం ‘యమలీల’. ఇప్పటికీ ఆ సినిమాకు క్రేజ్ ఉంది. ఇప్పుడు దానికి రెండో వెర్షన్ సిద్ధమవుతోంది. ఇందులో యమధర్మరాజుగా మోహన్‌బాబు నటిస్తున్నారు. కె.వి. సతీష్, దియా నికోలస్ నాయకా నాయికలు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో డీయస్ మాక్స్-క్రిష్వీ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ‘యమలీల’ స్థాయికి తగ్గకుండా ఈ ‘యమలీల 2’ ఉంటుందని, ఈ చిత్రకథాంశం విభిన్నంగా ఉంటుందని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోందని, కృష్ణారెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉందని సతీష్ అన్నారు. తెలుగు తెరకు కె.వి. సతీష్ రూపంలో మరో మంచి హీరో దొరికారని అచ్చిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి శైలిలోనే ఇందులో యమా రేంజ్లో వినోదం ఉంటుందని ఆయన తెలిపారు. జూలైలో పాటలను, ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కెమేరా: శ్రీకాంత్ నారోజ్, మాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్ -
పూరి రాసిన ప్రేమకథ!
‘‘నా సినిమాలు డార్క్‌గా, హారర్, మాఫియా నేపథ్యంలో ఉంటాయి. ప్రేమకథలు తీయడం నాక్కొంచెం కష్టమే. రొమాంటిక్ ప్రేమకథలు తీయాలంటే నాకన్నా పూరీ బెస్ట్’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. సాయిరామ్‌శంకర్ హీరోగా గోపీగణేశ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోమియో’. ‘పూరి రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడం ఓ విశేషమైతే... రవితేజ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించడం మరో విశేషం. టచ్‌స్టోన్ దొరైస్వామి నిర్మాత. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని రామ్‌గోపాల్‌వర్మ ఆవిష్కరించి ఎస్వీ కష్ణారెడ్డికి అందించారు. వర్మ ఇంకా మాట్లాడుతూ- ‘‘ ‘రోమియో జూలియట్’ నా ఫేవరెట్ సినిమా. ‘రోమియో’ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టడం బావుంది. పాటల్లో, ప్రచార చిత్రాల్లో సాయిరామ్ ఎనర్జీ ఏంటో తెలుస్తోంది’’ అన్నారు. షూటింగ్ పనిమీద అబ్రాడ్ వెళ్లినప్పుడు రోమియో, జూలియట్ పుట్టిన ప్రాంతానికి వెళ్లానని, అక్కడే ఈ కథ రాశానని, ఆ కథకు నా తమ్ముడు కథానాయకుడవ్వడం ఆనందంగా ఉందని పూరి జగన్నాథ్ చెప్పారు. కథ ఇచ్చిన అన్నయ్యకు, ప్రత్యేక పాత్ర పోషించిన రవితేజకు కృతజ్ఞతలని సాయిరామ్‌శంకర్ చెప్పారు. సినిమా విజయంపై నిర్మాత నమ్మకం వెలిబుచ్చారు. -
‘యమలీల’కు ఏ మాత్రం తగ్గదు : ఎస్వీ కృష్ణారెడ్డి
రియల్ ఎస్టేట్ నుంచి రీల్ ఎస్టేట్‌లోకి ఎంటర్ కావడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమానే ఎస్వీ కృష్ణారెడ్డితో చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అని కేవీ సతీశ్ చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో డీయస్ మాక్స్, క్రిష్వి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యమలీల -2 ’. మోహన్‌బాబు యమధర్మరాజు పాత్ర పోషిస్తున్నారు. కేవీ సతీశ్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ -‘‘వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఓ మంచి ఆలోచన ఉంటే సరిపోతుంది. కానీ, హీరోగా నిలబడాలంటే కష్టం. రోజువారి కూలీలా కష్టపడాలి. కానీ, కృష్ణారెడ్డి నాకా కష్టం తెలియనివ్వకుండా యాక్ట్ చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు జరిపిన షూటింగ్ నాకు మంచి అనుభూతినిచ్చింది. ఓ నాలుగు నెలల ట్రిప్‌లా ఈ షూటింగ్ అనిపించింది’’ అని చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ -‘‘యమలీల అద్భుతమైన సబ్జెక్ట్. దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ ‘యమలీల 2’ తీస్తున్నాం. సవాళ్లంటే నాకిష్టం. ప్రేక్షకులతో శభాష్ అనిపించుకునే సినిమాలు చేశాను. ఈ సినిమాకి కూడా ఆ మాట అంటారు. సవాల్ చేసి చెబుతున్నా. సతీశ్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ ఎంతో బాగా యాక్ట్ చేస్తున్నాడు. కచ్చితంగా మంచి హీరోగా నిలబడతాడు’’ అని చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన 40 చిత్రాల్లో టాప్ టెన్‌లో ఈ ‘యమలీల 2’ ఉంటుందని అచ్చిరెడ్డి పేర్కొన్నారు. -
హిమక్రీములరుచికి 20 ఏళ్లు
ఎస్వీ కృష్ణారెడ్డి ‘యమలీల’ విడుదలై అప్పుడే ఇరవై ఏళ్లు అయ్యింది. కథలో బలం, దర్శకుడిలో ప్రజ్ఞ, నిర్మాతకు గట్స్ ఉంటే... స్టార్లతో ప్రమేయం లేకుండా సంచలనాలను సృష్టించొచ్చు అని రెండు దశాబ్దాల క్రితమే నిరూపించిన వెండితెర వండర్ ‘యమలీల’. ‘దానే దానే పే లిఖాహై ఖానే వాలే కా నామ్’ అని హిందీలో ఓ నానుడి ఉంది. గింజ గింజపై తినేవాడి పేరు రాసుంటుందని ఆ నానుడి అర్థం. మనిషి తినే గింజల విషయంలోనే కాదు, నటులు పోషించే పాత్రల విషయంలో కూడా ఈ నానుడి వర్తిస్తుంది. ఎవరికి ఏ పాత్ర దక్కాలో భగవంతుడు ముందే నిర్దేశిస్తాడు. దానికి ‘యమలీల’ నిర్మాణం ముందు జరిగిన కొన్ని సంఘటనలే నిదర్శనాలు. దర్శకునిగా కృష్ణారెడ్డి తొలి సినిమా ‘మాయలోడు’. ఫాంటసీ సినిమా. ఏడాది ఆడింది. రెండో సినిమా ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’. ఇదీ పెద్ద హిట్. ఇక కృష్ణతో చేసిన ‘నంబర్‌వన్’ పేరుకు తగ్గట్టే టాప్‌హిట్. ఆ చిత్రం నిర్మాణంలోనే కృష్ణారెడ్డికి ‘యమలీల’ థాట్ వచ్చింది. రాజమహల్లో రాణీగా సేవలందుకోవాల్సిన తల్లి గుమస్తా ఇంట్లో తలదాచుకుంటే... తన తల్లికి పూర్వవైభవం తేవడానికి కొడుకు ఏం చేశాడు? ఇంతలో ఈ తల్లీ కొడుకులతో దైవం ఎలాంటి ఆట ఆడింది? అనేది కాన్సెప్ట్. విమానంలో కలిసి ప్రయాణిస్తుండగా, కృష్ణకు కృష్ణారెడ్డి సరదాగా ఈ కథ చెప్పారు. సూపర్‌స్టార్‌కి కథ నచ్చింది. ‘మీ అబ్బాయి మహేశ్కైతే బావుంటుంది’ అని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు కృష్ణారెడ్డి. ‘మహేశ్ చదువుకుంటున్నాడు. ఓ రెండేళ్లాగు’ అన్నారు కృష్ణ. ఈ కథకు వెంటనే వెండితెర రూపం ఇచ్చేయాలనే కసితో ఉన్నారు కృష్ణారెడ్డి. అందుకే వేరే నటుడికోసం అన్వేషణ మొదలైంది. ముందు రాజేంద్రప్రసాద్‌ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. అప్పటికే తన సినిమాలతో స్టార్ కమెడియన్ అనిపించుకున్న అలీ గుర్తొచ్చారాయనకు. ‘అలీని హీరోగా ఎందుకు చూపించకూడదు’... కృష్ణారెడ్డి మస్తిష్కంలో ఇదే అలోచన. అలీ ముందు అగ్రిమెంట్ ఉంచారు. ఏదో కేరక్టర్ గురించేమో అని చకచకా సంతకం చేసేశారాయన. ‘ఈ సినిమాకు హీరో నువ్వే’ అనేశారు. అలీ నమ్మలేదు. తర్వాత తెలిసింది కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి చెబుతుంది అబద్ధం కాదని, అక్షర సత్యమని. ఇక హీరోయిన్. ఇందులో కథానాయిక పాత్ర కూడా కీలకమైంది. అందుకే... టాప్ పొజిషన్లో ఉన్న సౌందర్యను అనుకున్నారు. కానీ, స్టార్లతో చేస్తున్న సౌందర్య... అలీ పక్కన నటించడానికి ధైర్యం చేయలేకపోయారు. తన గాడ్‌ఫాదర్ అయిన కృష్ణారెడ్డికే ‘నో’ చెప్పేశారు. దాంతో ఇంద్రజ రంగంలోకొచ్చింది. ఆమెకు ఇదే తొలి సినిమా. చకచకా సినిమా పూర్తి చేసి విడుదల చేశారు కృష్ణారెడ్డి. సంచలన విజయం. కొన్ని ఏరియాల్లో ఏడాది ఆడింది. అలీ, ఇంద్రజల ఫేట్ మారిపోయింది. ఇక ఈ సినిమాలో యమునిగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం, వీధి రౌడీ తోటరాముడిగా తనికెళ్ల భరణి తెరపై చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. పిల్లల్ని విపరీతంగా ఆకట్టుకుందీ సినిమా. ఎక్కడ విన్నా ‘యమలీల’ పాటలే. హిందీలో వెంకటేశ్ హీరోగా ‘తక్దీర్వాలా’గా విడుదలై అక్కడా ఘన విజయం సాధించింది. అదే కసితో ‘యమలీల-2’ చేస్తున్నా అప్పుడే ఇరవై ఏళ్లు అయ్యిందా అనిపిస్తోంది. ‘యమలీల’ విజయాన్ని తలచుకుంటేనే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఇలాంటి సినిమాను మళ్లీ ఎప్పుడు తీస్తారని చాలా మంది అడుగుతుంటారు. వారికి సమాధానమే నా ‘యమలీల-2’. క్విష్వీ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. కైకాల సత్యనారాయణగారి స్థానంలో మోహన్‌బాబు చేస్తున్నారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు తప్ప మిగిలిన అందరూ కొత్తవారే. కథ, కథనం కూడా కొత్తవే. కసి మాత్రం పాతదే. అదే కసితో ఈ చిత్రాన్ని చేస్తున్నాను. నా కెరీర్లో భారీ చిత్రమిది. - ఎస్వీ కృష్ణారెడ్డి మనీషా సంస్థ ప్రతిష్టను పెంచింది 1990 నుంచి 2000 వరకూ వచ్చిన టాప్ 10 చిత్రాల్లో ‘యమలీల’ ఒకటి. మా మనీషా సంస్థ ప్రతిష్టను మరింత పెంచిన సినిమా ఇది. దర్శకునిగా కృష్ణారెడ్డిని ఎదురులేని స్థానంలో కూర్చోబెట్టిందీ సినిమా. ఈ సినిమా తర్వాత ఎన్నో గొప్ప కుటుంబ కథలు తీశారు కృష్ణారెడ్డి. - కె.అచ్చిరెడ్డి -
ఈ యముడు పూర్తి భిన్నంగా ఉంటాడు!
‘‘నా కెరీర్లో యముడు పాత్ర చేయడం ఇదే ఆఖరు. అంతకు ముందు చేశాను కానీ... ఇక నా వల్ల కాదు. ఇన్నిసార్లు పౌరాణిక పాత్రలు చేయడం ఒక్క ఎన్టీఆర్కే దక్కింది’’ అని మోహన్‌బాబు అన్నారు. ‘యమలీల’ చిత్రానికి కొనసాగింపుగా ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కుతోన్న చిత్రం ‘యమలీల-2’. కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో.. డి.ఎస్.మ్యాక్స్ పిక్చర్స్ సమర్పణలో క్రిష్వీ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కేవీ సతీశ్ హీరోగా పరిచయం అవుతున్నారు. డియానికోలస్ కథానాయిక. ఈ సినిమా ప్రచార చిత్రాలను మంగళవారం హైదరాబాద్‌లో డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మరిన్ని విషయాలు చెబుతూ -‘‘నేను బాపు రమణలతో పనిచేశాను. వాళ్లకు కోపం రావడం నేనెప్పుడూ చూడలేదు. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కూడా అంతే. కృష్ణారెడ్డితో అప్పట్లోనే ఓ సినిమా చేద్దామనుకున్నా కుదర్లేదు. ఇప్పటికైనా ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా చేయడం ఆనందంగా ఉంది. నా గత యముని పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందీ పాత్ర’’ అన్నారు. ‘‘1994లో ‘యమలీల’ రిలీజైంది. 2014లో ‘యమలీల-2’ వస్తోంది. ఇరవై ఏళ్ల క్రితం ‘యమలీల’ ఎంత జాగ్రత్తగా తీశానో... ‘యమలీల-2’ కూడా అంతే జాగ్రత్తగా తీస్తున్నాను. ‘ఈగ’ తర్వాత అంతటి అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. కేవీ సతీశ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాను. బెంగళూరులో ఎనిమిదేళ్ల క్రితం ఓ చిన్న కంపెనీలో రెండు వేల జీతంతో జీవితాన్ని మొదలు పెట్టినతను... ఈ రోజు ఎనిమిది వేలమందికి జీతాలిచ్చే స్థాయికి ఎదిగాడు. కృష్ణారెడ్డి అంటే కామెడీ, సెంటిమెంట్. అందుకు తగ్గట్టు ఈ సినిమా ఉంటుంది. కచ్చితంగా హిట్ కొట్టి తీరుతా’’ నమ్మకం వ్యక్తం చేశారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు టి.సుబ్బిరామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, బండ్ల గణేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'యమలీల' సీక్వెల్ తో ఎస్వీ కృష్ణారెడ్డి రెడీ!
గత కొద్దికాలంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న సంచలన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రీఎంట్రీ ఇవ్వనున్నారు. 1994 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన యమలీల చిత్రానికి సీక్వెల్ గా రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభిచారు. గత రోజులుగా యమలీల సీక్వెల్ కోసం కథను సిద్ధం చేస్తున్నాను. త్వరలోనే చిత్రాన్ని ప్రారంభిస్తాను. ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక చేస్తాం అని అన్నారు. యమలీల చిత్ర విజయం వెనుక నటీనటుల ప్రతిభనే కీలకం అని అన్నారు. సత్యనారాయణ, ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి, బ్రహ్మానందం పాత్రలు కీలకమని ఆయన తెలిపారు. గతంలో సత్యానారాయణ పోషించిన యముడి పాత్రకు మోహన్ బాబు చేత చేయించాలని అనుకుంటున్నాం. ఆలీ పాత్ర కోసం పలు నటుల్ని పరిశీలనలోకి తీసుకున్నాం. అయితే పూర్తిగా ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయామన్నారు.