
'యమలీల' సీక్వెల్ తో ఎస్వీ కృష్ణారెడ్డి రెడీ!
గత కొద్దికాలంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న సంచలన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రీఎంట్రీ ఇవ్వనున్నారు. 1994 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన యమలీల చిత్రానికి సీక్వెల్ గా రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభిచారు. గత రోజులుగా యమలీల సీక్వెల్ కోసం కథను సిద్ధం చేస్తున్నాను. త్వరలోనే చిత్రాన్ని ప్రారంభిస్తాను. ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక చేస్తాం అని అన్నారు.
యమలీల చిత్ర విజయం వెనుక నటీనటుల ప్రతిభనే కీలకం అని అన్నారు. సత్యనారాయణ, ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి, బ్రహ్మానందం పాత్రలు కీలకమని ఆయన తెలిపారు. గతంలో సత్యానారాయణ పోషించిన యముడి పాత్రకు మోహన్ బాబు చేత చేయించాలని అనుకుంటున్నాం. ఆలీ పాత్ర కోసం పలు నటుల్ని పరిశీలనలోకి తీసుకున్నాం. అయితే పూర్తిగా ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయామన్నారు.