Yamleela 2
-
మేఘాల్లో మీటింగ్!
నరకంలో యముడు అంటే అందరికీ హడల్. అలాంటి యముడు చిత్రగుప్తునితో కలసి భూలోకానికి వస్తాడు. కానీ మనోళ్లకు ఎక్కడికి వెళ్లాలో తెలీదు. ఇంతలో చిత్రగుప్తుని పాపాల చిట్టా మిస్సింగ్. అది దొరికితే గాని పాపులను శిక్షించడానికి కుదరదు. చిత్రగుప్తుడు రకరకాల గెటప్స్‌లో దాని గురించి వెతుకుతూ ఉంటాడు. కానీ దొరకదు. ఇక డెరైక్ట్‌గా వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇస్తాడు. నగర పౌరుల శ్రేయస్సే భాగంగా పనిచేసే ఎస్ఐ రంజిత్ దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికెళ్లి, చిత్రగుప్తుడు ఏం ఫిర్యాదు చేశాడో చూడండి! చిత్రగుప్తుడు: అయ్యా! నా పుస్తకం పోయిందండీ! ఎస్ఐ: ఎక్కడ పడేసుకున్నావ్? చిత్రగుప్తుడు: ఆకాశంలో ఎస్ఐ: ఆ....(ఆశ్చర్యంగా) ఆకాశంలోనా...? అక్కడికి నువ్వెందుకు వెళ్లావ్? చిత్రగుప్తుడు: మేఘాల్లో మీటింగ్ ఉండి...! ఎస్ఐ: మేఘాల్లో... చిత్రగుప్తుడు: మీటింగ్.. మీటింగ్...? అప్పుడు కానిస్టేబుల్‌తో... అసలు మన గురించి వీడు ఏమనుకుంటున్నా డురా. కానిస్టేబులో ఓ వెకిలి నవ్వు నవ్వుతాడు. దీంతో ఎస్ఐ అసహనంతో ఎస్ఐ: నవ్వకు నవ్వకు... నగరపౌరులు చూస్తున్నారక్కడ...! ఈ సూట్‌కేస్ ఏంటి? చిత్రగుప్తుడు: సూట్‌కేస్ ఎస్ఐ: అదే అందులో ఏమున్నాయ్? అని అడుగుతున్నా. చిత్రగుప్తుడు: వజ్ర వైఢూర్యములు పొదగబడిన కంఠాభరణములు, రత్నమాణిక్యమ్ములు కూర్చబడిన కంకణములు, నవరత్నములు చేర్చబడిన కిరీటము ఇంకనూ..... ఎస్ఐ: ఊ......ఐ...సీ (ఆపమని చేయి చూపిస్తూ) చిత్రగుప్తుడు: ఓకే యూ...సీ... (ఎస్ఐ సూట్‌కేస్ తెరిచి చూసి అవాక్కవుతాడు. అన్నీ ఆకులే...!) ఎస్ఐ: ఇందులో ఏమున్నాయ్ నాన్నా....? వజ్ర వైఢూర్యములు పొదగబడిన కంఠాభరణములు, రత్నమాణిక్యమ్ములు కూర్చబడిన కంకణములు..... ఎస్ఐ: ఊ....!ఆపేయ్!! అప్పుడు పక్కన కానిస్టేబుల్‌తో... అసలు మన గురించి వీడు ఏమనుకుంటున్నాడురా... కానిస్టేబులో ఓ వెర్రి నవ్వు నవుతాడు. దీంతో ఎస్ఐ అసహనంతో టేబుల్‌ను చేతితో కొడుతూండగా... చిత్రగుప్తుడు: ఏంటి సార్! అన్ని ఆభరణములు చూసేసరికి కళ్లు తిరుగుతున్నాయా! ఎస్ఐ: తిరుగుతాయ్ తిరుగుతాయ్..! ముందు పుస్తకాల పాయింట్‌కు రా..! ఆఫ్ట్రాల్ పుస్తకం పోయిందని పోలీస్ స్టేషన్‌కొచ్చి రిపోర్టు ఇస్తున్నావంటే అది చాలా ఇంపార్టెంట్ బుక్ అయి ఉంటుంది. చిత్రగుప్తుడు: ఔను సార్! ఎస్ఐ: అందులో ఏముంది? చిత్రగుప్తుడు: ఎవరి ప్రాణం ఎప్పుడు తీయవలెనో రాసుంది. ఎస్ఐ: ఆ...!(ఆశ్చర్యంగా) వెంటనే పక్కనున్న కానిస్టేబుల్‌తో ఏంట్రా ఈడి బిహేవియరూ! నా పేరు చెబితే టైస్టులకే టై... హిట్ లిస్ట్ పుస్తకం పోయిందని నాకే కంప్లైంటు ఇస్తున్నాడు. అసలు ఏంటంటావ్ ఈడి బ్యాకింగూ...? ఎస్ఐ: ఆ... ఏంటి బాబూ! అందులో ఎప్పుడు చచ్చిపోతామో రాసుందా..? మరి నా చావు రాసి ఉందా? చిత్రగుప్తుడు: ఆ ఉంది కదా! (వెంటనే ఎస్ఐ స్పృహ తప్పి పడిపోతాడు) - ఈ సన్నివేశం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘యమలీల’ చిత్రంలోనిది. ఇందులో బ్రహ్మానందం వల్ల ముప్పుతిప్పలు పడే ఎస్ఐగా కోట శ్రీనివాసరావు నటన హైలై ట్. - శశాంక్.బి -
గల్లీలో చెల్లి పెళ్లి... జరగాలి మళ్లీ మళ్లీ...
హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: యమలీల (1994); డెరైక్ట్ చేసింది: ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా తీసింది: కె.అచ్చిరెడ్డి; మాటలు రాసింది: దివాకర్‌బాబు అనగనగా ఓ తోటరాముడు. పేరు చూసి వీడెవడో ‘పాతాళ భైరవి’లోలాగా వీరుడూ శూరుడూ అనుకోవద్దు. నీచనికృష్ట పాపిష్టి మానవుడు వీడు. బీరు తాగినంత సునాయాసంగా దోపిడీలు, బ్రేవ్‌మని తేన్చినంత ఈజీగా ఘోర హత్యలు, టీవీలో వార్తలు చూసినంత అవలీలగా మానభంగములు చేసెడివాడు. నరకలోకపు హెచ్ఆర్ మేనేజర్ చిత్రగుప్తుడికి సైతం వీడి చిట్టా మెయింటైన్ చేయలేక హెడేక్ మీద హెడేక్ వచ్చేసింది. ఈ తోట రాముడికి తిక్క... వెర్రి... పిచ్చి... ఉన్మాదం... మదం... పొగరు... బలుపు... ఇలా సకల అవలక్షణాలూ కలవు. తనో పెద్ద తోపు అని తోటరాముడికి ఫీలింగ్. వీడికో బ్యాట్ బ్యాచ్ కలదు. ఎవడైనా తోటరాముడు తెలియదన్నాడంటే వాడి తాట తీసిపారేస్తాడు. ఈ నగరమనే నరకానికి తానే ‘యముండ’ అని చెప్పుకుంటుంటాడు. ఎవణ్ణి ఎప్పుడు ఖతం చేయాలో తానే డిసైడ్ చేస్తుంటాడు. ఇంతోటివాడికి రగతం చూస్తే కళ్లు తిరుగుతాయి. తన బ్యాట్బ్యాచ్ ఎవడినైనా చంపుతుంటే, తాను వెనక్కి తిరిగి ఆ చావుకేకల్ని వింటూ తన్మయానికి గురవుతుంటాడు. ఇదే నగరంలో ఓ గరం పోరీ ఉంటుంది. పేరు లిల్లీ. ఆమెకో చైన్ బ్యాచ్. ఈ రెండు బ్యాచ్లకీ టెస్ట్మ్యాచ్ల్లాగా నిరంతరం గొడవలే. ఈ తోటరాముడికి ఎవడైనా అమాయకుడు కనబడ్డాడా... వాణ్ణి బకరా చేసి ఆడించేస్తాడు. తమాషా చూస్తాడు. ఇదో శాడిజం వాడికి. ఈ తోట రాముడికి కపిత్వంలో పాటు కవిత్వం కూడా ఇష్టం. ఆ రోజు ఏమి జరిగినదంటే... ఓ వారపత్రిక కార్యాలయమది. సంపాదకుడు మహా బిజీగా ఉన్నాడు. అక్కడికి తోటరాముడు ప్రవేశించేసరికి కార్యాలయం మొత్తం కల్లోలం. ఈ ఆఫీసుని కబ్జా చేయడానికే వచ్చాడని ఆ సంపాదకుడు భావించి తట్టాబుట్టా సర్దేసుకోవడానికి సిద్ధమైపోయాడు. కానీ, తోటరాముడు మాత్రం పెళ్లిచూపులకు వచ్చినవాడిలా సిగ్గుపడుతూ సంపాదకుని ముందు కూర్చున్నాడు. అతగాడు భయపడుతూ చూస్తున్నాడు. తోటరాముడు జేబులోంచి తీశాడు. కత్తి కాదు... కాగితం! ‘‘నేనీ మధ్య కవిత్వం రాయడం షురూ చేసినా...’’ అంటూ మెలికలు తిరిగిపోయాడు తోటరాముడు. సంపాదకుడికి సృ్పహ తప్పినంత పనయింది. తోటరాముడే నీళ్లు జల్లి లేపాడు. ఇక తప్పించుకోవడం అసాధ్యమని తేలిపోయి ‘‘చెప్పండి సార్’’ అని వినయంగా వేడుకున్నాడు సంపాదకుడు. తన అసిస్టెంట్ చిట్టి వైపు ఓ లుక్కిచ్చి సగర్వంగా చదవడం మొదలుపెట్టాడు తోటరాముడు.‘‘నాకొక బుల్లి చెల్లి...’’ అని ఒక లైను చదివాడో లేదో, చిట్టిబాబు ‘వహ్వా వహ్వా’ అంటూ భజన మొదలుపెట్టేశాడు. సంపాదకుడు కూడా పొగడాలి కదా. లేకపోతే గుండు రామకీర్తన పాడుతుందని తెలుసు. అందుకే తనూ పొగడ్డం మొదలెట్టాడు. ‘‘సిస్టర్ సెంటిమెంట్ అన్నమాట... కానివ్వండి కానివ్వండి’’ అన్నాడు. తోటరాముడు ఛాతీ రెట్టింపైంది. ‘‘నాకో బుల్లి చెల్లి నేడే గల్లీలో దానికి పెళ్లి ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ’’ అని కవిత చదవడం పూర్తి చేసి, తోటరాముడు చాలా ఉత్సుకతగా సంపాదకుడి వైపు చూశాడు. ఆ సంపాదకుడి పరిస్థితి చూడాలి. యాక్సిడెంటై అంబులెన్స్ ఎక్కితే, ఆ అంబులెన్స్‌కే యాక్సిడెంట్ అయినట్టుగా ఉంది. ‘‘చెల్లి పెళ్లి... ఒక్కసారి కాదు... జరగాలి మళ్లీ మళ్లీ... బావుంది... చాలా బావుంది. కొత్తగా ఉంది. అద్భుతంగా ఉంది’’ అని పొగడ్డానికి పదాలు రాక... కాదు కాదు దొరక్క... అలా పొగుడుతూనే ఉన్నాడు. హుస్సేన్ సాగరంలో నిమజ్జనం చేసే వినాయకుడిలాగా తోటరాముడు తెగ సంబరపడిపోయాడు. ‘‘అయితే ఈ కవితను ప్రింట్ చేయాలని డిసైడ్ చేసినా’’ అన్నాడు. తోటరాముడు డిసైడ్ చేశాడంటే వార్ వన్‌సైడ్ అయిపోయినట్టే. కవిత పబ్లిషైంది. తోటరాముడు ఖుష్షో ఖుష్షు. సరిగ్గా అదే సమయంలో అసిస్టెంటు పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘అన్నా అన్నా... నీకోసం పోస్టల్ వ్యాన్ వచ్చినాదే’’ అని చెప్పాడు. ‘‘అరె చుప్... నా కోసం వస్తేగిస్తే పోలీసు వ్యాను రావాలే. పోస్టల్ వ్యాను రావడమేంటి?’’ అని తోటరాముడు కసురుకున్నాడు. కానీ నిజంగానే పోస్టల్ వ్యాను వచ్చి, 5 బస్తాల ఉత్తరాలు అతని ముందు పడేసి పోయింది. తోటరాముడికి ఏం అర్థం గాలేదు.‘‘తొలి కవితతోనే ఎంత పాపులరైపోయారు సార్’’ అంటూ సంపాదకుడు ఉబ్బేశాడు. తోటరాముడు చాలా హుషారుగా ఓ ఉత్తరం తీసి చదవమన్నాడు. ‘‘తోటరాముడు గారికి... గత వారం వారపత్రికలో మీరు రాసిన ‘చెల్లి పెళ్లి’ కవిత చదివా. చెల్లికి మళ్లీ పెళ్లేంట్రా గాడిదా... నికృష్టుడా... దరిద్రుడా... అప్రాచ్యుడా... నీకు దినం పెట్టా...’’ ... ఇలా ఆ ఉత్తరమంతా తిట్ల సునామీ. తోటరాముడి మొహం మాడిపోయిన మసాలాదోశెలా అయిపోయింది. ఇంకో ఉత్తరం తీస్తే... అందులో అంతకన్నా ఎక్కువ తిట్లు.సంపాదకుడి వైపు కొరకొరా చూశాడు తోటరాముడు. ‘‘నా కవిత్వం బాగుందని అన్‌పాపులర్ చేస్తావురా. నన్ను కవిని చేయమంటే బద్నామ్ చేస్తావ్. నేను నిన్ను బద్నామ్ చేస్తా’’ అని సంపాదకుణ్ణి చెడుగుడు ఆడేశాడు. చూశారా... ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని తెలుసు మనకి. కానీ ఒక కవిత కూడా జీవితాన్ని ఎలా డిసైడ్ చేసేసిందో! ఫైనల్‌గా ఈ స్టోరీకి కన్‌క్లూజన్ ఏంటంటే - ఈ తోటరాముడు, సాక్షాత్తూ యమధర్మరాజునే డిసైడ్ చేసేయాలని చూశాడు.భూమ్మీదకు పొరపాటున జారిపడ్డ ‘భవిష్యవాణి’ పుస్తకం కోసం యమధర్మరాజు, చిత్రగుప్తుడు వెతుకుతుంటే, తోటరాముడు దాన్ని దొరకబుచ్చేసుకు న్నాడు. ఎంతో ఉత్సాహంగా, ఆత్రంగా ఆ ‘భవిష్యవాణి’ ఓపెన్ చేసి చూస్తే ‘నేటితో నీ చరిత్ర సమాస్తం’ అని రాసి ఉంది. అదేంటో యమధర్మరాజు గదతో గట్టిగా గదిమితే తప్ప తెలియలేదు. తోటరాముణ్ణి యమధర్మరాజు అట్లా డిసైడ్ చేసినాడు మరి! ఈ తోటరాముడి ప్రసారం ఇంతటితో సమాప్తం. - పులగం చిన్నారాయణ ‘యమలీల’ సినిమాలో యముడు ఎంత ఇంపార్టెంటో, తోట రాముడు కూడా అంతే ఇంపార్టెంటు. తన కామెడీ విలనీతో ఈ తోట రాముడు సినిమాను ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులూ తిప్పాడు. ఈ తోటరాముడు పాత్ర తనికెళ్ల భరణి కెరీర్‌ను చాలా గొప్పగా డిసైడ్ చేసేసిందంతే..! ‘‘ఆ రోజు... నేను ఇంటికి వెళ్లగానే ఓ వార్త. ఎస్వీ కృష్ణారెడ్డిగారు అర్జంట్‌గా కాల్ చేయమన్నారట. అప్పట్లో సెల్‌ఫోన్స్ లేవు. మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కానీ, ఎస్టీడీ సౌకర్యం లేదు. దాంతో ఎస్టీడీ బూత్‌కెళ్లి ఫోన్ చేశా. ‘యమలీల’లో మెయిన్ విలన్ వేషం ఇస్తున్నట్టు కృష్ణారెడ్డిగారు చెప్పగానే, ఆనందంతో ఉప్పొంగిపోయా. కానీ డేట్ల సమస్య. అవే డేట్లు ‘పల్నాటి పౌరుషం’ సినిమాకిచ్చా. రాజమండ్రిలో షూటింగ్. నిర్మాత ‘ఎడిటర్’ మోహన్‌గారిని బతిమిలాడా. కృష్ణంరాజులాంటి బోలెడుమంది ఆర్టిస్టులతో కాంబినేషన్. కుదరదన్నారు. అయ్యో... బ్రహ్మాండమైన అవకాశం మిస్సయ్యిందే అనుకుంటూ కృష్ణారెడ్డిగారికి ఫోన్ చేసి విషయం చెప్పా. ఆయన ‘‘ఏం పర్లేదు... మీరు వేరే డేట్లు ఇవ్వండి. అప్పుడే చేద్దాం’’ అని నాకు ఊపిరి పోశారు. అలా నాకు ‘తోటరాముడు’ పాత్ర దక్కింది. దాదాపు 20 రోజుల వేషం. ఆ రోజు లాస్ట్డే. నేను వెళ్లడానికి రెడీ అవుతుంటే... ‘‘మీ మీద పాట ఉంది’’ అని చెప్పారు. ఆశ్చర్యపోయా. క్లైమాక్స్‌లో నాతో సరదాగా ‘చినుకు చినుకు అందెలతో...’, ‘రగులుతోంది మొగలిపొద...’ పాటలకు స్టెప్పులేయించారు. ఈ సినిమా నా జీవితాన్ని ఎంతలా మలుపు తిప్పిందంటే - ఇక నేను రైటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించేశాను. ఒకే ఏడాది దాదాపు 37 సినిమాలు ఒప్పుకునేంత బిజీ అయిపోయా. నేనెక్కడికి వెళ్లినా ‘డిసైడ్ చేస్తా’ అంటూ అభిమానులు సరదాగా మాట్లాడేవారు. ‘చెల్లి పెళ్లి’ కవిత చెప్పమనేవారు. నేను తెలంగాణలో పుట్టి పెరిగా కాబట్టి, ఈ డైలాగులు నేను రాశానని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఒక్క అక్షరం కూడా నాదికాదు. నూటికి నూరు శాతం ఈ క్రెడిట్ రచయిత దివాకర్ బాబుదే.’’ - తనికెళ్ల భరణి -
సొంతింటిలా ఫీలయ్యా..
చిట్‌చాట్ దక్షిణాఫ్రికాలో పుట్టి పెరిగిన అందం.. దక్షిణభారతంలో నటిగా పరిచయమైంది. యమలీల 2లో హీరోయిన్గా మెప్పించిన దియా నికోలస్.. మోడలింగ్ ప్రాజెక్ట్ కోసం ముంబైలో అడుగుపెట్టింది. అక్కడ ఎస్వీ కృష్ణారెడ్డి కళ్లల్లో పడి వెండితెరపై తళుక్కుమంది. టాలీవుడ్ సినిమా చాన్స్‌తో మొదటిసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఫస్ట్ లుక్‌లోనే సిటీతో కనెక్ట్ అయిపోయానని చెబుతోన్న నికోలస్‌తో సిటీప్లస్ చిట్‌చాట్.. ..:: శిరీష చల్లపల్లి హాయ్..! నేను పుట్టిటంది, పెరిగింది సౌతాఫ్రికాలోనే. ఎల్ఎల్బీ పూర్తి చేశాను. అయితే చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్ రంగం మీద ఆసక్తి. అందుకే అప్పుడప్పుడూ మోడలింగ్ చేసేదాన్ని. ఒకసారి ఓ మోడలింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ముంబైకి వచ్చాను. అక్కడ ఫ్యాషన్ షోకు గెస్ట్‌గా వచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి నా ఫొటో చూసి కాల్ చేసి యమలీల 2 సినిమా గురించి చెప్పారు. ముందుగా నాకేమీ అర్థం కాలేదు. ఏదో క్రేజ్ కోసం మోడలింగ్ చేసుకుంటున్న నాకు హీరోయిన్గా ఆఫర్ చేయడాన్ని ముందుగా నమ్మలేకపోయాను. అదొక సర్ప్రైజింగ్ మూమెంట్. వెంటనే ఒప్పుకున్నాను. సంప్రదాయ పునాదులపై.. యమలీల 2 కోసం ఇక్కడికి వచ్చాను. మొదటి చూపులోనే భాగ్యనగరం నాకు నచ్చేసింది. ఇక్కడ స్టూడియోలు చూడటం ఎంతో సరదాగా అనిపిస్తోంది. చెప్పాలంటే ఈ సిటీ అందమైన హాలీవుడ్ సెట్‌లా ఉంది. ఇక హైదరాబాదీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ జనాలు ఎంత ప్లసెంట్‌గా మాట్లాడుతారో..! అభివృద్ధిలో దూసుకుపోతున్నా.. ట్రెడిషనల్ పునాదులు మాత్రం పదిలంగా ఉండటం గొప్ప విషయం. హైదరాబాద్ జర్నీని ఒక పిక్నిక్లా ఫీలవ్వడం లేదు. సొంతింటికి వచ్చిట్టుంది. ఇక్కడ అడుగడుగునా చారిత్రక సంపద కనిపిస్తుంటుంది. బిర్లామందిర్, నెక్లెస్ రోడ్, గోల్కొండ ఫోర్ట్, చార్మినార్ ఎన్నో హిస్టారికల్ స్పాట్స్ సందర్శించాను. ఆ పేరు చాలు.. నేను సినిమాలో నటిస్తానని ఎన్నడూ అనుకోలేదు. అనుకోకుండా అవకాశం వచ్చింది. నేను నటించడం ఇదే మొదటి సారి.. ఆఖరి సారి కూడా. మళ్లీ చదువు కంటిన్యూ చేస్తాను. ఈ ఫీల్డ్ నా ప్రొఫెషన్ కాదు. ఏదో క్రేజ్ వల్ల ఒక సినిమా చేశాను. బాగా యాక్ట్ చేశానన్న పేరొచ్చింది. ఆ పేరు చాలు నాకు. నన్ను బాగా రిసీవ్ చేసుకున్న సిటీకి థ్యాంక్స్ చెబుతున్నాను. నా జీవితంలో మొమరబుల్ మూమెంట్స్ ఎక్కడున్నాయంటే తడుముకోకుండా హైదరాబాద్‌లో అని చెప్పగలను. నాకు అంత దగ్గరైంది ఈ సిటీ. ఇల్లొకటే ప్రశాంతం.. సౌతాఫ్రికాలో ఇల్లొకటే ప్రశాంతంగా అనిపించేది. బయటకు రాగానే ఉరుకులు, పరుగులు వేరే దేశానికి వెళ్లినట్టు హడావుడిగా అనిపించేది. ఎవరి లోకం వాళ్లది. జనం దృష్టంతా డబ్బులు సంపాదించుకోవడంపైనే. ఒకరినొకరు పట్టించుకునే తీరికే కనిపించదు. అదే ఇండియాలో ఇప్పటికీ మానవీయ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మనిషి కోసం తపించే వారున్నారు. అందుకే ఈ దేశాన్ని కర్మభూమి అన్నారేమో. కాలంతో మార్పులు సహజం. అయితే ఇండియాలో నిజాయితీ ఇంకా బతికే ఉంది. -
కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాను : కేవీ సతీశ్
‘‘సినిమాల్లో నటించాలనే నా చిన్నప్పటి కల ‘యమలీల-2’తో నెరవేరింది. కుటుంబ ప్రేక్షకులకు దగ్గర కావాలనే ఆశయంతో చేసిన చిత్రమిది. పెద్దవాళ్లు మాత్రమే కాదు.. ఐదేళ్ల పిల్లలు కూడా నన్ను గుర్తుపడుతున్నందుకు ఆనందంగా ఉంది. నేను ఫ్యామిలీ హీరో అనిపించుకోవడానికి కారణం ఈ చిత్రబృందం. నా తదుపరి చిత్రాలు కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గవిగానే ఉంటాయి’’ అని డా. కేవీ సతీశ్ అన్నారు. ఆయన హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘యమలీల 2’ గత వారం విడుదలైన విషయం తెలిసిందే. కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో డీయస్ మ్యాక్స్ సమర్పణలో క్రిష్వీ ఫిలింస్ పతాకంపై ఆశా సతీశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విజయోత్సవ సభలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ -‘‘మోహన్‌బాబు, బ్రహ్మానందంలాంటి సీనియర్స్ కాంబినేషన్లో ఓ కొత్త నటుడు నటించడం చిన్న విషయం కాదు. సెంటిమెంట్, యాక్షన్ సన్నివేశాల్లో సతీశ్ బాగా నటించారు. మాస్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఫైట్స్ చేశారు. తదుపరి చిత్రం సతీశ్‌ని మరో మెట్టు ఎక్కేలా చేస్తుంది. అలాంటి సినిమా చేయబోతున్నాం’’ అన్నారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ -‘‘ప్రథమార్ధంలో కూల్‌గా, ద్వితీయార్ధంలో హీరోయిజమ్‌ని ఎలివేట్ చేసే పాత్రను సతీశ్ బాగా చేశారు. ఆయన మంచి వ్యక్తి కూడా. హుద్ హుద్ తుఫాను బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సతీశ్ పది లక్షల రూపాయలు విరాళమందించారు’’ అన్నారు. వసూళ్లు బాగున్నాయనీ, 500 థియేటర్లలో 50 రోజులాడటం ఖాయమని సహ నిర్మాత డీకే అరుణ్ కుమార్, విజయ్‌భాస్కర్ చెప్పారు. -
కృష్ణలీల
-
ఎస్వీ కృష్ణారెడ్డితో చిట్ చాట్
-
యమలీల - 2 మూవీ స్టిల్స్
-
ఆ క్రమశిక్షణ సతీశ్‌లో కనిపించింది : మోహన్‌బాబు
‘‘ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. కథ ఎలా ఉన్నా... దాన్ని తెరపై అందంగా ఆవిష్కరించేది దర్శకుడే. అలాంటి దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఆయన దర్శకునిగా మారి దాదాపు పాతికేళ్లు అయ్యింది. 40 ఏళ్లుగా నేను ఈ రంగంలో ఉన్నా... ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇప్పుడు కలిగింది’’ అని మోహన్‌బాబు అన్నారు. కె.సతీశ్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.ఆశా సతీశ్ నిర్మించిన చిత్రం ‘యమలీల-2’. మోహన్‌బాబు ఇందులో యమునిగా నటించిన విషయం తెలిసిందే. ఎస్వీ కృష్ణారెడ్డి స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. ‘‘ఇంత క్రమశిక్షణగా మేం నడుచుకుంటున్నామంటే కారణం ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరిగార్లు నేర్పిన క్రమశిక్షణే. ఈ చిత్ర కథానాయకుడు సతీశ్‌లో కూడా అదే క్రమశిక్షణ కనిపింది. ఇందులో నేను పోషించిన యముడి పాత్ర నాకు ప్రత్యేకం’’ అని మోహన్‌బాబు తెలిపారు. ఆడియోలాగే సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని హీరో కె.సతీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ‘‘సతీశ్ కోసమే ఈ స్క్రిప్ట్ తయారు చేశాను. అభినయంతో పాటు డాన్సులు, ఫైట్లు అద్భుతంగా చేశాడు. యముడిగా మోహన్‌బాబు, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం పాత్రలు ఈ చిత్రానికి హైలైట్’’ అని నమ్మకం వెలిబుచ్చారు. నటునిగా మోహన్‌బాబు 40వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందని కె.అచ్చిరెడ్డి అన్నారు. ‘యమలీల’ టైమ్‌కి తాను ఓ ప్రేక్షకుణ్ణి మాత్రమేననీ, ‘యమలీల-2’కి వచ్చే సరికి పంపిణీదారుని స్థాయిలో జ్ఞాపిక అందుకోవడం ఆనందంగా ఉందనీ ‘దిల్’ రాజు సంతోషం వెలిబుచ్చారు. ఈ వేడుకలో భాగంగా అప్పటి ‘యమలీల’ కథానాయకుడు అలీని ఈ ‘యమలీల-2’ యూనిట్ ఘనంగా సత్కరించింది. -
‘యమలీల-2’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
-
'యమలీల 2' మూవీ న్యూ స్టిల్స్
-
సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందీ చిత్రం!
పారిశ్రామికవేత్తగా ఎంత బిజీగా ఉన్నా... కేవలం సినిమాపై ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు డా.కె.వి.సతీశ్. ఎందరో ఔత్సాహికులను తెరకు పరిచయం చేసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి... సతీశ్‌ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను తలకెత్తుకొని ‘యమలీల-2’ని తెరకెక్కించారు. డి.ఎస్.మ్యాక్స్ సమర్పణలో క్రిష్వి ఫిలింస్ పతాకంపై ఆశా సతీశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సతీశ్ చెప్పిన కబుర్లుఆయనే నా గురువు: నాకు సినిమాలంటే ఇష్టం. చిన్నప్పట్నుంచీ సినిమాలు బాగా చూసేవాణ్ణి. ముఖ్యంగా ఇంట్లో టీవీల్లో వచ్చే సినిమాలను వదిలేవాణ్ణి కాదు. ఇప్పుడు కెమెరా ముందు తేలిగ్గా నటించగలిగానంటే కారణం ఆ అలవాటే. నేను నటనలో శిక్షణ ఎక్కడా తీసుకోలేదు. ఎస్వీ కృష్ణారెడ్డిగారి స్కూల్లోనే అభినయాన్నీ, సంభాషణలు పలికే తీరును, డాన్సులను, ఫైట్లను అభ్యసించాను. ఓ విధంగా నా నట గురువు కృష్ణారెడ్డిగారే. నా శ్రీమతి సహకారం మరచిపోలేను: అందరూ అనుకుంటున్నట్లు ఇది ‘యమలీల’కు సీక్వెల్ కాదు. ఇది కొత్త కథ. వినోదంతో పాటు సామాజిక అంశాలు కూడా ఇందులో ఉంటాయి. కృష్ణారెడ్డి ప్రతి విషయంలోనూ పకడ్బందీగా ఉంటారు. ఉదాహరణకు ఈ సినిమా గ్రాఫిక్స్. కథకు సంబంధించి ఎంత పరిధిలో గ్రాఫిక్స్ అవసరమవుతాయి, వాటి ఖర్చు ఎంత అవుతుంది.. వంటి అంశాలన్నీ ముందే చూసుకొని రంగంలోకి దిగాం. ఈ సినిమా విషయంలో నా శ్రీమతి ఆశా సతీశ్ అందించిన సహకారం జీవితంలో మరచిపోలేను. నాకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది కూడా తనే.సినిమాకు నిండుతనం తెచ్చారు: కృష్ణారెడ్డి మార్క్ సినిమా ఇది. ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. యముడిగా మోహన్‌బాబు, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం ఈ చిత్రానికి నిండుదనం తెచ్చారు. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. -
ఆ సినిమాలానే... ఇది కూడా!
‘యమలీల’ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి యమధర్మరాజు నేపథ్యంలోని కథాంశంతో తెరకెక్కించిన చిత్రం ‘యమలీల-2’. డా. కేవీ సతీశ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ఆశా సతీశ్ నిర్మాత. ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటిం చారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ-‘‘‘యమలీల’ లాగే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నటునిగా సతీశ్‌కి గొప్ప భవిష్యత్తు ఉంది. యమునిగా మోహన్‌బాబు, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం అద్భుతంగా నటించారు. పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా ద్వారా హీరోగా పరిచయమవడం ఆనందంగా ఉందనీ, మోహన్‌బాబు, బ్రహ్మానందం లాంటి సీనియర్స్‌తో నటించడం అదృష్టంగా భావిస్తున్నాననీ సతీశ్ అన్నారు. త్వరలోనే పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపుతామనీ, 500 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తామనీ సహ నిర్మాత డి.కె.అరుణ్‌కుమార్ తెలిపారు. దియా నికోలస్ నాయికగా నటించిన ఈ చిత్రానికి మాటలు: గంగోత్రి విశ్వనాథ్-భవానీ ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్. -
ఆ చిత్రాలకు ఎన్ని సిరీస్‌లైనా చేయొచ్చు!
‘‘ఓ సినిమాకు సిరీస్‌గా ఎన్ని చిత్రాలైనా తీసుకోవచ్చు. కానీ, కొనసాగింపు భాగాలైన సీక్వెల్స్ మాత్రం చేయలేం. ‘యమలీల’కు ‘యమలీల-2’ సీక్వెల్ కాదు. సిరీస్ మాత్రమే. భావోద్వేగాలతో పాటు చక్కని వినోదం, వినసొంపైన సంగీతం ఉన్న సినిమా ఇది’’ అని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారు. కె.వి.సతీశ్‌ని హీరోగా పరిచయం చేస్తూ క్రిష్వీ ఫిలింస్ పతాకంపై ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘యమలీల-2’ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. పాటలకు చక్కని స్పందన లభిస్తోందని ఎస్వీ కృష్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ... శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘చాలాకాలం తర్వాత నేను స్వరపరిచిన ఆల్బమ్ ఇది. ‘యమలీల’లో ‘సిరులొలికించే చిన్నినవ్వులే’ పాట ఎంత హిట్ అయ్యిందో, ‘యమలీల-2’లో ‘కృష్ణం భజే...’ పాట అంత హిట్టయ్యిందని అందరూ అంటున్నారు. ఆనందంగా ఉంది. అనంతశ్రీరామ్ అర్థవంతమైన సాహిత్యం అందించాడు. ఆల్బమ్‌లో ఆ పాట వింటుంటే స్వరపరిచిన నాకే కొత్తగా అనిపిస్తోంది. సంగీతంపై నాకున్న పట్టు ఈ విజయానికి కారణం. భవిష్యత్తులో బయటి చిత్రాలకు కూడా సంగీతం అందించాలని ఉంది’’ అని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో యమునిగా మోహన్‌బాబు రాజసం చూస్తే ఎన్టీఆర్ గుర్తొచ్చారనీ, ఎన్టీఆర్ తర్వాత ఆ పాత్రలో అంత అందంగా మోహన్‌బాబే ఉన్నారనీ, బ్రహ్మానందం పోషించిన చిత్రగుప్తుడి పాత్ర ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడుతుందని ఎస్వీకె చెప్పారు. హీరోగా నటిస్తున్న సతీశ్‌కి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందనీ, బేబీ హర్షిత పాత్ర కీలకమనీ ఆయన అన్నారు. గతంలో తాను తెరకెక్కించిన ‘రాజేం ద్రుడు-గజేంద్రుడు, మాయలోడు, వినోదం’కు ఎన్ని సిరీస్‌లైనా చేయొచ్చనీ, ఆ దిశగా ఆలోచిస్తున్నాననీ కృష్ణారెడ్డి అన్నారు. -
'యమలీల 2' ఆడియో ఆవిష్కరణ
-
మాటలూ పాటలూ విని ప్రేక్షకులు విజిల్స్ వేస్తారు!
‘‘సతీశ్ అనుకున్నదానికంటే బాగా అభినయించాడు. అతని నటన చూసి క్లైమాక్స్ మార్చేశాను. అంత గొప్పగా చేశాడు. ఇందులోని మాటలూ పాటలూ విని ప్రేక్షకులు విజిల్స్ వేస్తారు. యమునిగా మోహన్‌బాబుగారి రాజసంతో కూడిన నటన, బ్రహ్మానందం హాస్యం... ఇలా ఈ సినిమాలో అన్నీ హైలైట్సే’’ అని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారు. అలీని హీరోగా పరిచయం చేస్తూ 20 ఏళ్ల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘యమలీల’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా డా॥హీరోగా పరిచయం చేస్తూ ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యమలీల-2’. దియా నికోలస్ కథానాయిక. ఎస్వీ కృష్ణారెడ్డి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీకాంత్ పాటల సీడీని ఆవిష్కరించి, ఎస్వీ కృష్ణారెడ్డికి అందించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఈ పాటలు విని ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిపోయాను. ఈ రోజు కుటుంబ ప్రేక్షకులకు నేను దగ్గరయ్యానంటే కారణం ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిగార్లే. ఈ సినిమాతో ఎస్వీకేకి మంచి సక్సెస్ రావాలి. మళ్లీ ఆయన దర్శకత్వంలో నేను నటించాలి’’ అని ఆశాభావం వెలిబుచ్చారు. ‘యమలీల’ ఏడాది ఆడితే, ‘యమలీల-2’ రెండేళ్లు ఆడాలని కె.రాఘవేంద్రరావు ఆకాంక్షించారు. ‘‘శ్రేయోభిలాషుల సహకారం వల్లే ఈ సినిమాను త్వరగా పూర్తి చేయగలిగాను. అచ్చిరెడ్డిగారి ప్లానింగ్, కృష్ణారెడ్డిగారి ఎగ్జిక్యూషన్ వల్ల అనుకున్నదానికంటే నెలరోజుల ముందే సినిమాను విడుదల చేయగలుగుతున్నాం. ఇందులో కృష్ణారెడ్డిగారి ఎమోషన్స్ మరో స్థాయిలో చూస్తారు. పాటలన్నీ కథలో భాగంగానే ఉంటాయి’’ అని సతీశ్ చెప్పారు. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, సి.కల్యాణ్, శివలెంక కృష్ణప్రసాద్, సుధీర్‌బాబు, జె.కె.భారవి, శాసనసభ్యులు ప్రభాకరచౌదరి తదితరులు పాల్గొన్నారు. కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో డి.ఎస్.మ్యాక్స్ సమర్పణలో, క్రిష్వీ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. -
'యమలీల-2' ఆడియో లాంచ్ Part 3
-
'యమలీల-2' ఆడియో లాంచ్ Part 2
-
'యమలీల-2' ఆడియో లాంచ్ Part 1
-
నాది రహస్యవివాహం కాదు!
నీ జీను ఫ్యాంటూ చూసి బుల్లెమ్మో... ఈ పాటా గుర్తుంది...! ఆ బుల్లెమ్మా గుర్తుంది! ఎస్.. ఆమె ఇంద్రజ. చేసినవి తక్కువ సినిమాలే అయినా సెల్యులాయిడ్‌పై ఆమె సొగసు చూడతరమా! మోడ్రన్‌గా కనిపించే ఇంద్రజ పక్కా ట్రెడిషనల్... కంప్లీట్ ఫ్యామిలీ విమెన్! హీరోయిన్గా రాజభోగం చూసినా ఇంట్లో వంట తనే చేస్తుంది.. అవసరమైతే అంట్లు తోముతుంది.. బట్టలు కూడా ఉతుకుతుంది.. ఇంటి పనిలో... ఇంతికి దొరికే హాయే వేరంటుంది ఆమె. 14 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై తళుక్కుమనబోతోన్న ఇంద్రజ తెలుగమ్మాయే అన్న విషయం చాలామందికి తెలీదు. ఇంకా ఇలాంటి చాలా విషయాలు ఇంద్రజను అడిగి తెలుసుకుందాం... ఎన్నాళ్లయ్యిందండీ మిమ్మల్ని చూసి..? ఇంద్రజ: ఎన్నాళ్లు కాదండీ.. ఎన్నేళ్లూ అనండి. తెలుగు సినిమాలు చేసి పద్నాలుగేళ్లవుతోంది. మరి... ఈ గ్యాప్‌లో ఇతర భాషల్లో కూడా చేయలేదా? 1999లో తెలుగులో చివరి సినిమా చేశా. కానీ, 2004 వరకు మలయాళం, తమిళ చిత్రాలు చేశాను. 2005లో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేయడం ఇదే. ముఖ్యంగా నా మాతృభాష తెలుగు ద్వారా మళ్లీ సినిమాలు మొదలుపెట్టడం ఆనందంగా ఉంది. మరి... మళ్లీ సినిమాల్లోకి రావాలని ఎప్పుడనుకున్నారు... అనుకున్న తర్వాత అవకాశాల కోసం తెలుగు పరిశ్రమవారిని సంప్రదించారా? మళ్లీ సినిమాల్లోకి రావాలా? వద్దా అనే విషయం గురించి ఆలోచించలేదు. మూడేళ్ల క్రితం నేను, మావారూ, పాప ఏదో ఊరెళుతున్నాం. అప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో నటీనటుల డేట్లు చూసే చలపతి పరిచయమయ్యారు. ‘ఎందుకు సినిమాలు మానేశారు. పెళ్లికి ముందెలా ఉన్నారో, ఇప్పుడూ అలానే ఉన్నారు కదా.. మీరు తప్పకుండా సినిమాలు చేయాలి’ అన్నారాయన. ఆ తర్వాత తర్వాత నాక్కూడా మళ్లీ సినిమాలు చేస్తే బాగుంటుందనిపించింది. అలాంటి సమయంలోనే ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంలో అవకాశం రావడంతో అంగీకరించాను. ఈ సినిమాలో ఏ ప్రత్యేకత నచ్చి ఒప్పుకున్నారు? ఇందులో నేను అజయ్‌కి భార్యగా నటించా. మావి లీడ్ రోల్స్. నాగశౌర్యది మా కొడుకు పాత్ర. నా పాత్ర గురించి దర్శకుడు చెప్పినప్పుడు, నా వయసుకి అంత పెద్ద కొడుకు అంటే కరెక్ట్ కాదన్నాను. చేయనని కూడా చెప్పేశాను. కానీ, ఈ చిత్రదర్శకుడు త్రికోటి మాత్రం మీరే చేయాలని పట్టుబట్టారు. నా రీ-ఎంట్రీ ఘనత నిర్మాత సాయి కొర్రపాటికి, త్రికోటికే ఇవ్వాలి. అంతకు ముందు తల్లి పాత్రలు వచ్చినా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే, వాటికి కథలో అంత ప్రాధాన్యం లేదు. ఈ పాత్ర అలా కాదు. పైగా, ఈ పాత్ర కోసం నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలో టీనేజ్లోనే పెళ్లవుతుంది కాబట్టి, నాకో పెద్ద కొడుకు ఉంటాడు. ఆ కారణంగా ఇప్పుడు నా వయసెంతో తెరపై అలానే కనిపించవచ్చు. మరి.. ‘బుడుగు’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు కదా? ఇందులో నాది అతిథి పాత్ర. సైకాలజిస్ట్ గీతారెడ్డిగా కనిపిస్తాను. బాగున్న అతిథి పాత్రలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. మీరు తెలుగమ్మాయి కదా.. మరి వికీపీడియాలో మీ పేరు ‘రాజాత్తి’ అని ఉంది. అది తమిళ పేరు కదా..? మేం తెలుగువాళ్లమే కానీ, మా పూర్వీకులు ఎప్పుడో చెన్నయ్‌లో స్థిరపడిపోయారు. నేను పుట్టింది కూడా అక్కడే. ఇక్కడ అమ్ములు, బుజ్జీ.. అని ముద్దుగా పిలుస్తాం కదా.. అలా తమిళంలో ముద్దుగా నన్ను రాజాత్తి అని పిలుస్తారు. మరి.. ఇంద్రజ అనే పేరు ఎవరు పెట్టారు? ‘యమలీల’కన్నా ముందు నేను ‘జంతర్ మంతర్’ సినిమా అంగీకరించాను. అందులో నా పాత్ర పేరు ‘ఇంద్రజ’. ఆ చిత్రం ప్రారంభం నాడు ‘ఈ అమ్మాయి ఇంద్రజ అనే పాత్ర చేస్తోంది’ అని దర్శక, నిర్మాతలు అన్నారు. దాంతో శ్రీకాంత్ పక్కన ఇంద్రజ చేస్తోందని రాశారు పాత్రికేయులు. ఆ చిత్రదర్శకుడు భరత్.. ‘పేరు ఎలాగూ పబ్లిష్ అయ్యింది కదా.. ఆ పేరుతోనే కొనసాగితే బాగుంటుంది’ అన్నారు. దాంతో ఇంద్రజ పేరు ఫిక్స్ అయ్యింది. మీ పూర్వీకులది ఏ ఊరు? మీరు నవ్వుకున్నా సరే... నిజంగా నాకు తెలియదండి. ఎందుకంటే, మా ముత్తాతలకు ముందు తరంవాళ్లే తమిళనాడుకు షిఫ్ట్ అయిపోయారు. అందుకని మా పూర్వీకులది ఏ ఊరో తెలియదు. తంజావూరు సరుక్కయ్ అగ్రహారంలో మా ముత్తాతలు ఉండేవాళ్లు. త్యాగరాజస్వామిగారి వంశ పారంపర్యంలో మా ముత్తాతల కుటుంబాలకు మూలాలు ఉండేవట. ఓకే... ప్రస్తుతం మీ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పండి? బేసిక్‌గా మాది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పుడు మా ఇంటి పనులు మేమే చేసుకునేవాళ్లం. నేను సినిమాల్లోకొచ్చాక ఆర్థికంగా ఇంకా ఎదిగినా.. ఆ మధ్యతరగతి అలవాట్లు మాత్రం అలానే ఉన్నాయి. ఓ మామూలు గృహిణి ఎలా ఉంటుందో ఇన్నేళ్లూ నా జీవితం అలానే సాగింది. ఇంటిని చక్కబెట్టడం, పాపను చూసుకోవడం.. హాయిగా అనిపించింది. మీకు పెళ్లయ్యిందని, తల్లి కూడా అయ్యారనీ చాలామందికి తెలియదు... రహస్య వివాహం ఏమైనా చేసుకున్నారా? చెన్నయ్‌లో ఉన్నవాళ్లందరికీ నా పెళ్లి గురించి తెలుసు. ఇక్కడవాళ్లెవర్నీ పెద్దగా పిలవలేదు కాబట్టి, తెలియదు. అంతేకానీ రహస్య వివాహం ఏమీ చేసుకోలేదు. ఇంతకూ మీది ప్రేమ వివాహమా?.. అవును. మావారి పేరు అబ్సర్. ఆయన మోడలింగ్ చేసేవారు. మంచి రచయిత, నటుడు. సినిమాలు చేయలేదు కానీ.. టీవీ సీరియల్స్‌లో నటిస్తుంటారు. మీ ఇద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది. ఆయన చాలా మంచి వ్యక్తి. తొలిచూపు ప్రేమ అని చెప్పలేను కానీ.. మా మధ్య స్నేహం పెరిగి, అది ప్రేమగా మారింది. ముందు ఎవరు ప్రపోజ్ చేశారు? మేం ఇద్దరం ఒకరికి ఒకరు చెప్పుకోకపోయినా, ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం అని అర్థం చేసుకున్నాం. వన్ ఫైన్ డే ఇద్దరం కలిసి మాట్లాడుకుని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మీ మతాంతర వివాహానికి ఇంట్లోవాళ్లు అంగీకరించారా? అబ్జర్ వ్యక్తిత్వం మావాళ్లకి నచ్చింది. వాళ్లింట్లోవాళ్లకి నేను నచ్చాను. దాంతో మేం పెళ్లి చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం రాలేదు. తల్లయిన తర్వాత శరీరాకృతిలో మార్పు రావడం సహజం. కానీ, మీరు మునుపటిలానే ఉన్నారే? అది నా అదృష్టం. ఇలా ఉండటం కోసం నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. ఇంటి పనులు బాగా చేస్తాను. అదే నాకు మంచి వ్యాయామంలాంటిది. దానికి తోడు ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని వ్యాయామాలు కూడా చేస్తుంటాను. నేను పూర్తి శాకాహారిని. నేనిలా ఉండటానికి అది కూడా హెల్ప్ అయ్యింది. పెళ్లి తర్వాత మీకు ఆహార నియమాలు మార్చుకోవాల్సిన అవసరం రాలేదా? లేదు. ఒకవేళ మా ఆయనకు మాంసాహారం తినాలపిస్తే.. మా అత్తగారింటికి వెళతారు. లేకపోతే ఏదైనా హోటల్లో తింటారు. ఇప్పటివరకు ఇంట్లో నాన్‌వెజ్ వండింది లేదు. రెండు భిన్న సంస్కృతులకు చెందిన ఇద్దరు కలిసి ఒకే జీవితం గడపడం సులువేనా? మానసిక పరిణతి ఉంటే సులువే. ఓ వ్యక్తి మీద మరో వ్యక్తికి ఇష్టం ఏర్పడటానికి రకరకాల కారణాలుంటాయి. ఆ వ్యక్తి మనసు నచ్చి ఉండొచ్చు. ప్రవర్తనను ఇష్టపడొచ్చు. ఈ వ్యక్తితో మన జీవితం బాగుంటుందనిపించవచ్చు. అబ్జర్తో నా జీవితం బ్రహ్మాండంగా ఉంటుందనిపించింది. నా గురించి కూడా తనకదే ఫీలింగ్. ఒకరి భావాలను మరొకరు గౌరవించుకునేంత పరిణతి, అవగాహన మాకు ఉంది. పెళ్లి తర్వాత మీరు సినిమాలు చేయాలనే విషయంపై మీవారేమైనా ఆంక్షలు పెట్టారా? అలాంటిదేం లేదు. వాస్తవానికి ఆయన ప్రోత్సాహం వల్లనే సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ‘పెళ్లయినంత మాత్రాన ఇంట్లో కూర్చోవాలని లేదు. సినిమాలు చెయ్యి’ అని మావారు అనేవారు. కానీ, అవుట్డోర్ షూటింగ్స్ చేయాల్సి వస్తుందని నేనే ఇష్టపడలేదు. అయితే, సినిమాల్లో కొనసాగాలనుకున్న తర్వాత నేనూ, మావారూ ఒక డీల్ కుదుర్చుకున్నాం. ఆ నిబంధన ప్రకారం నేను షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు, మావారు ఎక్కువసేపు పాపకు టైమ్ కేటాయిస్తారు. నేను ఇంటికెళ్లిన తర్వాత తన పనితో బిజీగా ఉంటారు. ఇప్పుడు మీ పాప వయసెంత? ఆరేళ్లు. ప్రస్తుతం తను ఒకటో తరగతి చదువుతోంది. ఎప్పుడో ఇరవయ్యేళ్ల క్రితం మీరు చేసిన ‘నీ జీనూ ప్యాంటు చూసి బుల్లమ్మో...’ పాట గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. ఆ పాట చేసినప్పుడు మీకెలా అనిపించింది? అప్పుడు నేను సినిమాలకు కొత్త. డెరైక్టర్ చెప్పింది చేసేదాన్ని. అలాగే ‘జీనూ ప్యాంటు..’ పాట చేశాను. కొరియోగ్రాఫర్ చెప్పింది చేసేసేదాన్ని. అంతే. ఆ తర్వాత ఆ పాటకు వచ్చిన పాపులార్టీ చూసి, ‘ఓహో.. చాలా మంచి సాంగ్ చేశాం’ అనుకున్నా. అప్పట్లో మీతో పాటు చేసిన కథానాయికల్లో మంచి స్థానానికి చేరుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు సౌందర్య. కానీ, మీరు అనుకున్నంత స్థాయికి చేరుకోలేకపోవడానికి కారణం? నేను సినిమాల్లోకొచ్చినప్పుడు నా వయసు జస్ట్ 14. సో.. సినిమాల ఎంపిక విషయంలో పరిణతి ఉండేది కాదు. సౌందర్యగారు నాకన్నా సీనియర్. మా ఇద్దరికీ మధ్య దాదాపు ఆరేడేళ్ల వయసు వ్యత్యాసం ఉంది. పైగా ‘నేను నంబర్ వన్ కావాలి. అందరూ నా సినిమాలే చూడాలి’ అని కోరుకునే వ్యక్తిని కాదు. విధిని నమ్ముతాను. మనం ఏం చేయాలో దాని తాలూకు స్క్రిప్ట్‌ని ఆ దేవుడు ముందే రాసేస్తాడు. ఆ ప్రకారమే జరుగుతుందని భావించే మనసత్త్వం నాది. అందుకే నేను దేనికీ పెద్దగా బాధపడిపోవడం, ఆనందపడిపోవడం అనేది ఉండదు. మొదట్నుంచీ మీది ఇదే తరహా మనస్తత్వమా? అవును. ఆ దేవుడి దయ వల్ల నాకు చిన్నప్పుడే ఈ భావన ఏర్పడింది. అందుకే నేను దేన్నీ ప్లాన్ చేసుకోలేదు. ఎలా జరిగితే అలా.. అంతే. ఒకసారి మనం ‘జీవితం’ గురించి మాట్లాడుకుందాం. మనం ఎవరైనాసరే చిన్నప్పుడు బాగా చదువుకోవాలనుకుంటాం. పెద్దయిన తర్వాత మంచి ఉద్యోగం చేయాలనుకుంటాం. ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చే దశలో మన ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. ఎలాంటి రోగాల బారిన పడకుండా, ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా, మంచంలో పడే అవకాశం రాకుండా, ప్రశాంతంగా నిద్రలోనే ఆ దేవుణ్ణి చేరుకోవాలని కోరుకుంటాం. సో.. జీవితం మొత్తం ఎంత పాకులాడినా చివరి కోరిక మాత్రం ఎవరికైనా ఇదే అయ్యుంటుంది. అందుకే.. దేనికీ పెద్దగా పాకులాడకూదు. మీకు దైవభక్తి ఎక్కువా? అవును. నేను ఆ షిరిడీ సాయినాథుని భక్తురాల్ని. ఆ దేవుడంటే ఎంత భక్తి అంటే.. నా డెలివరీ టైమ్‌లో ఆ కష్టం తెలియకుండా ఆ దేవుడు సహాయం చేశాడనేంత. ఆ షిరిడీ సాయిబాబా స్వయంగా నన్ను ఆ పుట్టపర్తి బాబాకి అప్పగించారేమో అని నా నమ్మకం. బాబాలో నేను తండ్రిని చూసుకుంటాను. పూజలు బాగా చేస్తారా? లేదు. గుడికి కూడా వెళ్లను. ఆ దేవుడు మనం చేసే పూజల వల్ల సంతోషపడిపోతాడంటే నమ్మను. దేవుడు నిజంగా ఎప్పుడు సంతోషపడతాడో తెలుసా? తన విగ్రహం ముందు ఓ గ్లాసుడు పాలు పెట్టి, ఆ తర్వాత దాంతో పాయసం చేసుకుని తిన్నప్పుడు కాదు. అదే పాలుని తిండికి లేక అల్లాడుతున్న పిల్లలకు ఇచ్చినప్పుడు. ఇతరులకు సహాయం చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్లే. ఓకే.. మీ పాప గురించి మాట్లాడుకుందాం... భవిష్యత్తులో తను హీరోయిన్గా చేస్తానంటే ఒప్పుకుంటారా? ఓ తల్లిగా నాకు ఓకే కాదు. ఎందుకంటే, ఇది శాశ్వతమైన వృత్తి కాదు. ఒక పర్మినెంట్ ఇన్కమ్ ఉండదు. వస్తే.. వస్తుంది. లేకపోతే లేదు. అందుకని, బాగా చదువుకుని తన కాళ్ల మీద తను నిలబడగలిగే ఉద్యోగం సంపాదించుకోవాలని నాకుంది. అప్పుడు, ఒకవేళ పేషన్ కోసమే సినిమాలు చేస్తానంటే సమ్మతిస్తాను. అంతేకానీ, సినిమాలే కెరీర్ అంటే నేను ఒప్పుకోకపోవచ్చేమో. కానీ, మన చేతుల్లో ఏముంది? ఏది రాసి పెట్టి ఉంటే అది జరుగుతుంది. - సంభాషణ: డి. జి. భవాని హీరోలు 50, 60 ఏళ్ల వయసులో ఉన్నా ఎంచక్కా హీరోలుగానే చేస్తారు. కానీ, హీరోయిన్లను మాత్రం 30 ఏళ్లు దాటితే అమ్మ, అక్క, వదిన పాత్రలకు పరిమితం చేసేస్తారు. అది మీకెలా అనిపిస్తుంది? నేను దీన్ని చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తాను. మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే.. పెళ్లి కాని ఆడవాళ్లను ఏ మగాడైనా తన లవర్గానో, భార్యగానో.. ఎలాగైనా ఊహించుకోవచ్చు. కానీ, పెళ్లయిన ఆడవాళ్ల గురించి అలా ఊహించడానికి ఇష్టపడరు. ముఖ్యంగా తల్లయిన ఆడవాళ్ల గురించి నీచమైన ఊహలు చేయరు. అందుకే, పెళ్లయిన ఆడవాళ్లు డ్యూయెట్లు పాడితే అంగీకరించరు. అది అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా మౌల్డ్ కావడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు పరిస్థితులు ఫర్వాలేదు. ఒకప్పుడు పెళ్లయిన తారలకు ‘ఓల్డ్ మదర్’ కారెక్టర్లు ఇచ్చేవారు. ఇప్పుడు ‘యంగ్ మదర్’ అనే కేటగిరీ ఉంది. అందుకే హ్యాపీ. అలాగే, పోలీసాఫీసర్, లాయర్.. ఇలాంటి పాత్రలు చేయాలని ఉంది. అమ్మ, అక్క, వదిన పాత్రలూ చేస్తా. కానీ, ఆ కథకు ఆ పాత్ర ప్రాణం పోసేట్లు ఉండాలి. అప్పుడే చేస్తా. -
యూరప్‌లో యమ హంగామా
ఇరవై ఏళ్ల క్రితం బాక్సాఫీసు వద్ద ‘యమలీల’ సినిమా చేసిన మేజిక్కు అంతా ఇంతా కాదు. మళ్లీ ఆ మేజిక్‌ని రిపీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘యమలీల-2’గా ఆయన రూపొందిస్తున్న ఈ చిత్రంలో యముడిగా డా. మోహన్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రగుప్తునిగా పాత ‘యమలీల’లోని పాత్రనే బ్రహ్మానందం పోషిస్తుండగా, డా. కేవీ సతీశ్ హీరోగా నటిస్తూ, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దియానికోలస్ ఇందులో కథానాయిక. రెండు పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 28 నుంచి ఆగస్ట్ 8 వరకూ యూరప్‌లో ఈ పాటల్ని చిత్రీకరించనున్నట్లు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, గ్రాఫిక్స్‌కు ఎక్కువ అవకాశమున్న కథ కావడంతో టీమ్ మొత్తం శ్రమించి పని చేస్తున్నారని ఎస్వీకె అన్నారు. సతీశ్ అనుకున్నదానికంటే వంద రెట్లు బాగా చేస్తున్నాడని, ప్రేక్షకుల్ని వందశాతం ఆనందింపజేసే సినిమా అవుతుందని కృష్ణారెడ్డి నమ్మకం వెలిబుచ్చారు. ‘‘ఒక మంచి కుటుంబకథను నిర్మించాలని, కృష్ణారెడ్డిగారితో మొదలుపెట్టిన ఈ సినిమా అనుకున్నదానికంటే గొప్పగా వస్తోంది. కృష్ణారెడ్డి ఎంతో కష్టపడి, ఇష్టంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. మా క్రిష్వి ఫిలింస్ సంస్థకు, పనిచేస్తున్న అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అని డా. కేవీ సతీశ్ అన్నారు. భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘యమలీల-2’ ఒకటి అని సహ నిర్మాత డి.అరుణ్‌కుమార్ చెప్పారు. -
అయిదు వందల రూపాయల పాకెట్ మనీతో...
‘‘అయిదువందల రూపాయల పాకెట్‌మనీతో వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్లాను. కష్టాల్ని కూడా ఇష్టంగా స్వీకరించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాను. భవిష్యత్తులో సినీ రంగంలో కూడా రాణిస్తాను’’ అని డా. కేవీ సతీష్ చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘యమలీల 2’ చిత్రం ద్వారా ఆయన హీరోగా పరిచయమవుతున్నారు. నేడు సతీశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘ఎప్పటికైనా నా సొంత డబ్బుతో సినిమా తీసి, హీరో కావాలనేది నా లక్ష్యం. కుటుంబ కథాచిత్రాలు తీయడంతో మంచి నేర్పు ఉన్న కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుందనుకున్నా. ఆయన ఇప్పుడు కుదరదన్నా, కన్విన్స్ చేశాను. ఆయన మూడు, నాలుగు కథలు చెబితే, నాకు ‘యమలీల 2’ నచ్చింది. ఇందులో యమధర్మరాజుగా మోహన్‌బాబు, చిత్రగుప్తుడుగా బ్రహ్మానందం అయితేనే బాగుంటుందని కృష్ణారెడ్డి అన్నారు. లక్కీగా వీళ్లు కూడా ఒప్పుకోవడంతో ఈ చిత్రం ప్రారంభమైంది. అందరి సహకారంవల్ల బాగా నటించగలుగుతున్నా. ఎడిటర్ గౌతంరాజుగారైతే ‘పది సినిమాల అనుభవం ఉన్నవాడిలా చేశావ్’ అని ప్రశంసించారు. మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. ఇకనుంచి ప్రతి ఏడాదీ నేను హీరోగా మా సంస్థ నుంచి ఓ సినిమా వస్తుంది’’ అని చెప్పారు. కర్నాటకలో నేను స్థాపించిన కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల దాదాపు 60 మందికి కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామని, కేన్సర్ రోగులకు సహాయం చేస్తున్నామని, హెచ్ఐవి సోకిన పిల్లల కోసం అనాథ శరణాలయం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సతీష్ తెలిపారు. తన మాతృభాష తెలుగు కాబట్టి, తెలుగువారి కోసం కూడా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలన్నదే తన ఆశయం అని ఆయన పేర్కొన్నారు. -
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుక
-
ఆ విషయంలో కొన్ని తప్పులు చేశా!
‘జయం’ సినిమాలో నితిన్‌ని ‘వెళ్లవయ్యా వెళ్లూ...’ అంటూ ఆటపట్టించిన పరికిణీ పాప గుర్తుంది కదూ!? ఆ ఒక్క సినిమాతో తారాపథానికి దూసుకుపోయారు నటి సదా. శంకర్ దర్శకత్వంలో ‘అపరిచితుడు’ చేసి, హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత సడన్‌గా కెరీర్లో వెనకబడ్డారు. ఇటీవలే ‘యమలీల-2’లో గెస్ట్ సాంగ్ చేసిన సదా భవిష్యత్ ప్రణాళికలేంటి? కెరీర్ గురించి ఆమె విశ్లేషణేంటి? కొంత విరామం తర్వాత ‘యమలీల 2’లో ఐటమ్ సాంగ్ ద్వారా కనిపించనున్నారు.. ఈ పాట ఎలా ఉంటుంది? అది ఐటమ్ సాంగ్ కాదు. మామూలుగా ఏదైనా సినిమాలో ఒకే ఒక్క పాటకు డాన్స్ చేస్తే చాలు.. ఐటమ్ సాంగ్ అంటారు. ఈ సినిమాకి సంబంధించినంతవరకు ఈ పాటను అలా అనలేం. కథానుసారంగా వచ్చే పాట ఇది. నేను దేవకన్య గెటప్‌లో కనిపిస్తాను. నా కాస్ట్యూమ్స్, డాన్స్.. అన్నీ బాగుంటాయి. కొన్ని కొన్నిసార్లు.. ఒక పాట, ఒక సీన్ కూడా బ్రేక్ తీసుకు రావచ్చంటారు.. మీరేమంటారు? నేనో సినిమా ఒప్పుకున్న తర్వాత, నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలనా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఈ సినిమా మనకు మంచి బ్రేక్ అవుతుందా? లేదా లాంటివి ఆలోచించను. ‘జయం’తో కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత బాగానే సినిమాలు చేశారు. హఠాత్తుగా అవకాశాలు తగ్గడానికి కారణం? అది దర్శక, నిర్మాతలను అడగాలి. నా వరకు నేను చేసిన సినిమాలన్నిటికీ పూర్తి న్యాయం చేశాను. కాకపోతే, కొన్ని సినిమాలు ఆడకపోవడం దురదృష్టకరం. సినిమా పరిశ్రమలో నాకు ‘గాడ్‌ఫాదర్’ లేకపోవడంతో సినిమాల ఎంపిక విషయంలో కొన్ని తప్పులు చేశాను. అది మైనస్ అయ్యింది. ఇలా జరిగినందుకు పశ్చాత్తాపపడుతున్నారా? లేదు. ఎందుకంటే, ‘సదా డెరైక్టర్స్ ఆర్టిస్ట్’ అనిపించుకోగలిగాను. అది చాలు. తప్పులెవరైనా చేస్తారు. నా తప్పులు నాకు మైనస్ అయ్యాయే కానీ, ఎవరికీ కష్టం కలిగించలేదు. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటివరకు నా కెరీర్లో నేనెవర్నీ ‘ఒక్క అవకాశం ఇవ్వండి’ అని అడగలేదు. వచ్చిన సినిమాలు చేశాను. మీరు ఎవరితోనూ స్నేహంగా ఉండకపోవడం కూడా మైనస్ అయ్యిందనుకోవచ్చా? వృత్తిపరమైన లాభం కోసం స్నేహం నటించలేను. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా ఆత్మాభిమానం దెబ్బతినే పనులు చేయలేను. ఒకవేళ అవకాశాలు తగ్గడానికి ఇవే కారణం అయ్యుంటే, నేను బాధపడను. ఎందుకంటే, నా గౌరవాన్ని కాపాడుకోగలిగాననే తృప్తి మిగిలింది. దర్శకుడు శంకర్ సినిమాలో నటించిన కథానాయిక కెరీర్ అంతే సంగతులని చాలామంది అంటారు...? అలాంటి సెంటిమెంట్స్ నాకు లేవు. ‘జయం’తో తెలుగులో, ‘అపరిచితుడు’తో ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపు తెచ్చుకోగలిగాను. బిజీగా సినిమాలు చేసేసి ఇప్పుడు ఖాళీగా ఉండటం బోరనిపించట్లేదా? ఆ దేవుడు నాకు కావాల్సినదాని కన్నా ఎక్కువే ఇచ్చాడు. అయినా సరే సంతృప్తి పడకపోతే, ఆయన క్షమించడు. నేనెప్పుడూ బిజీగా ఉండాలని, నెలకోసారి వెండితెరపై కనిపించాలనే ఆకాంక్ష లేదు. ఈ మధ్య వస్తున్న ఓ టీవీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు కదా.. అసలు బుల్లితెరకు పచ్చజెండా ఊపడానికి కారణం ఏంటి? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ నేపథ్యంలో సాగే కార్యక్రమం కాబట్టి, దానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించే చాన్స్ రావడంతో ఎగ్జయిటయ్యా. వెంటనే ఒప్పుకున్నాను. బుల్లితెర ఎలాంటి అనుభూతినిస్తోంది? నేను చేస్తున్నది పిల్లలకి సంబంధించిన షో. పిల్లలందరూ డాన్స్‌లో కనబరుస్తున్న ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. షూటింగ్లో సమయం ఎలా గడిచిపోతోందో కూడా తెలియడంలేదు. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు? ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెళ్ళెప్పుడో ఆలోచించలేదు. జీవితంలో మనకెంతోమంది తారసపడతారు. వాళ్లల్లో మనకు నచ్చినవాళ్లుంటారు. కానీ, జీవిత భాగస్వామిని చేసుకోలేం. అందుకే, బెటర్ హాఫ్‌ని ఎంపిక చేసుకునే విషయంలో ఆచితూచి అడుగు లేస్తా. ఇతణ్ణి పెళ్లాడితే మన మిగతా జీవితం ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుందని అనిపిస్తే చాలు... కచ్చితంగా ఆ వ్యక్తిని పెళ్లాడతా. ప్రేమ వివాహాన్ని మా వాళ్లు ఎప్పుడూ వ్యతిరేకించరు. - డి.జి. భవాని -
కృష్ణారెడ్డి శైలిలో యమా వినోదం
యమ ధర్మరాజు అంటే మనకు భయం. కానీ, బాక్సాఫీస్‌కి మాత్రం చాలా ఇష్టం. ఎందుకంటే యమధర్మరాజు వెండితెర మీద కనపడితే కాసుల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా తెలుగు తెరపై యమలోకపు నేపథ్యం అనేది ఓ విజయవంతమైన ఫార్ములా. టాప్ టెన్ యమ చిత్రాల్లో ఒకటిగా నిలిచే చిత్రం ‘యమలీల’. ఇప్పటికీ ఆ సినిమాకు క్రేజ్ ఉంది. ఇప్పుడు దానికి రెండో వెర్షన్ సిద్ధమవుతోంది. ఇందులో యమధర్మరాజుగా మోహన్‌బాబు నటిస్తున్నారు. కె.వి. సతీష్, దియా నికోలస్ నాయకా నాయికలు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో డీయస్ మాక్స్-క్రిష్వీ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ‘యమలీల’ స్థాయికి తగ్గకుండా ఈ ‘యమలీల 2’ ఉంటుందని, ఈ చిత్రకథాంశం విభిన్నంగా ఉంటుందని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోందని, కృష్ణారెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉందని సతీష్ అన్నారు. తెలుగు తెరకు కె.వి. సతీష్ రూపంలో మరో మంచి హీరో దొరికారని అచ్చిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి శైలిలోనే ఇందులో యమా రేంజ్లో వినోదం ఉంటుందని ఆయన తెలిపారు. జూలైలో పాటలను, ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కెమేరా: శ్రీకాంత్ నారోజ్, మాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్ -
‘యమలీల’కు ఏ మాత్రం తగ్గదు : ఎస్వీ కృష్ణారెడ్డి
రియల్ ఎస్టేట్ నుంచి రీల్ ఎస్టేట్‌లోకి ఎంటర్ కావడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమానే ఎస్వీ కృష్ణారెడ్డితో చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అని కేవీ సతీశ్ చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో డీయస్ మాక్స్, క్రిష్వి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యమలీల -2 ’. మోహన్‌బాబు యమధర్మరాజు పాత్ర పోషిస్తున్నారు. కేవీ సతీశ్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ -‘‘వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఓ మంచి ఆలోచన ఉంటే సరిపోతుంది. కానీ, హీరోగా నిలబడాలంటే కష్టం. రోజువారి కూలీలా కష్టపడాలి. కానీ, కృష్ణారెడ్డి నాకా కష్టం తెలియనివ్వకుండా యాక్ట్ చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు జరిపిన షూటింగ్ నాకు మంచి అనుభూతినిచ్చింది. ఓ నాలుగు నెలల ట్రిప్‌లా ఈ షూటింగ్ అనిపించింది’’ అని చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ -‘‘యమలీల అద్భుతమైన సబ్జెక్ట్. దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ ‘యమలీల 2’ తీస్తున్నాం. సవాళ్లంటే నాకిష్టం. ప్రేక్షకులతో శభాష్ అనిపించుకునే సినిమాలు చేశాను. ఈ సినిమాకి కూడా ఆ మాట అంటారు. సవాల్ చేసి చెబుతున్నా. సతీశ్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ ఎంతో బాగా యాక్ట్ చేస్తున్నాడు. కచ్చితంగా మంచి హీరోగా నిలబడతాడు’’ అని చెప్పారు. ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన 40 చిత్రాల్లో టాప్ టెన్‌లో ఈ ‘యమలీల 2’ ఉంటుందని అచ్చిరెడ్డి పేర్కొన్నారు. -
హిమక్రీములరుచికి 20 ఏళ్లు
ఎస్వీ కృష్ణారెడ్డి ‘యమలీల’ విడుదలై అప్పుడే ఇరవై ఏళ్లు అయ్యింది. కథలో బలం, దర్శకుడిలో ప్రజ్ఞ, నిర్మాతకు గట్స్ ఉంటే... స్టార్లతో ప్రమేయం లేకుండా సంచలనాలను సృష్టించొచ్చు అని రెండు దశాబ్దాల క్రితమే నిరూపించిన వెండితెర వండర్ ‘యమలీల’. ‘దానే దానే పే లిఖాహై ఖానే వాలే కా నామ్’ అని హిందీలో ఓ నానుడి ఉంది. గింజ గింజపై తినేవాడి పేరు రాసుంటుందని ఆ నానుడి అర్థం. మనిషి తినే గింజల విషయంలోనే కాదు, నటులు పోషించే పాత్రల విషయంలో కూడా ఈ నానుడి వర్తిస్తుంది. ఎవరికి ఏ పాత్ర దక్కాలో భగవంతుడు ముందే నిర్దేశిస్తాడు. దానికి ‘యమలీల’ నిర్మాణం ముందు జరిగిన కొన్ని సంఘటనలే నిదర్శనాలు. దర్శకునిగా కృష్ణారెడ్డి తొలి సినిమా ‘మాయలోడు’. ఫాంటసీ సినిమా. ఏడాది ఆడింది. రెండో సినిమా ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’. ఇదీ పెద్ద హిట్. ఇక కృష్ణతో చేసిన ‘నంబర్‌వన్’ పేరుకు తగ్గట్టే టాప్‌హిట్. ఆ చిత్రం నిర్మాణంలోనే కృష్ణారెడ్డికి ‘యమలీల’ థాట్ వచ్చింది. రాజమహల్లో రాణీగా సేవలందుకోవాల్సిన తల్లి గుమస్తా ఇంట్లో తలదాచుకుంటే... తన తల్లికి పూర్వవైభవం తేవడానికి కొడుకు ఏం చేశాడు? ఇంతలో ఈ తల్లీ కొడుకులతో దైవం ఎలాంటి ఆట ఆడింది? అనేది కాన్సెప్ట్. విమానంలో కలిసి ప్రయాణిస్తుండగా, కృష్ణకు కృష్ణారెడ్డి సరదాగా ఈ కథ చెప్పారు. సూపర్‌స్టార్‌కి కథ నచ్చింది. ‘మీ అబ్బాయి మహేశ్కైతే బావుంటుంది’ అని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు కృష్ణారెడ్డి. ‘మహేశ్ చదువుకుంటున్నాడు. ఓ రెండేళ్లాగు’ అన్నారు కృష్ణ. ఈ కథకు వెంటనే వెండితెర రూపం ఇచ్చేయాలనే కసితో ఉన్నారు కృష్ణారెడ్డి. అందుకే వేరే నటుడికోసం అన్వేషణ మొదలైంది. ముందు రాజేంద్రప్రసాద్‌ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. అప్పటికే తన సినిమాలతో స్టార్ కమెడియన్ అనిపించుకున్న అలీ గుర్తొచ్చారాయనకు. ‘అలీని హీరోగా ఎందుకు చూపించకూడదు’... కృష్ణారెడ్డి మస్తిష్కంలో ఇదే అలోచన. అలీ ముందు అగ్రిమెంట్ ఉంచారు. ఏదో కేరక్టర్ గురించేమో అని చకచకా సంతకం చేసేశారాయన. ‘ఈ సినిమాకు హీరో నువ్వే’ అనేశారు. అలీ నమ్మలేదు. తర్వాత తెలిసింది కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి చెబుతుంది అబద్ధం కాదని, అక్షర సత్యమని. ఇక హీరోయిన్. ఇందులో కథానాయిక పాత్ర కూడా కీలకమైంది. అందుకే... టాప్ పొజిషన్లో ఉన్న సౌందర్యను అనుకున్నారు. కానీ, స్టార్లతో చేస్తున్న సౌందర్య... అలీ పక్కన నటించడానికి ధైర్యం చేయలేకపోయారు. తన గాడ్‌ఫాదర్ అయిన కృష్ణారెడ్డికే ‘నో’ చెప్పేశారు. దాంతో ఇంద్రజ రంగంలోకొచ్చింది. ఆమెకు ఇదే తొలి సినిమా. చకచకా సినిమా పూర్తి చేసి విడుదల చేశారు కృష్ణారెడ్డి. సంచలన విజయం. కొన్ని ఏరియాల్లో ఏడాది ఆడింది. అలీ, ఇంద్రజల ఫేట్ మారిపోయింది. ఇక ఈ సినిమాలో యమునిగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం, వీధి రౌడీ తోటరాముడిగా తనికెళ్ల భరణి తెరపై చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. పిల్లల్ని విపరీతంగా ఆకట్టుకుందీ సినిమా. ఎక్కడ విన్నా ‘యమలీల’ పాటలే. హిందీలో వెంకటేశ్ హీరోగా ‘తక్దీర్వాలా’గా విడుదలై అక్కడా ఘన విజయం సాధించింది. అదే కసితో ‘యమలీల-2’ చేస్తున్నా అప్పుడే ఇరవై ఏళ్లు అయ్యిందా అనిపిస్తోంది. ‘యమలీల’ విజయాన్ని తలచుకుంటేనే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఇలాంటి సినిమాను మళ్లీ ఎప్పుడు తీస్తారని చాలా మంది అడుగుతుంటారు. వారికి సమాధానమే నా ‘యమలీల-2’. క్విష్వీ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. కైకాల సత్యనారాయణగారి స్థానంలో మోహన్‌బాబు చేస్తున్నారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు తప్ప మిగిలిన అందరూ కొత్తవారే. కథ, కథనం కూడా కొత్తవే. కసి మాత్రం పాతదే. అదే కసితో ఈ చిత్రాన్ని చేస్తున్నాను. నా కెరీర్లో భారీ చిత్రమిది. - ఎస్వీ కృష్ణారెడ్డి మనీషా సంస్థ ప్రతిష్టను పెంచింది 1990 నుంచి 2000 వరకూ వచ్చిన టాప్ 10 చిత్రాల్లో ‘యమలీల’ ఒకటి. మా మనీషా సంస్థ ప్రతిష్టను మరింత పెంచిన సినిమా ఇది. దర్శకునిగా కృష్ణారెడ్డిని ఎదురులేని స్థానంలో కూర్చోబెట్టిందీ సినిమా. ఈ సినిమా తర్వాత ఎన్నో గొప్ప కుటుంబ కథలు తీశారు కృష్ణారెడ్డి. - కె.అచ్చిరెడ్డి -
'యమలీల 2' మూవీ స్టిల్స్
-
'యమలీల 2' పరిచయ వేదిక
-
ఈ యముడు పూర్తి భిన్నంగా ఉంటాడు!
‘‘నా కెరీర్లో యముడు పాత్ర చేయడం ఇదే ఆఖరు. అంతకు ముందు చేశాను కానీ... ఇక నా వల్ల కాదు. ఇన్నిసార్లు పౌరాణిక పాత్రలు చేయడం ఒక్క ఎన్టీఆర్కే దక్కింది’’ అని మోహన్‌బాబు అన్నారు. ‘యమలీల’ చిత్రానికి కొనసాగింపుగా ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కుతోన్న చిత్రం ‘యమలీల-2’. కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో.. డి.ఎస్.మ్యాక్స్ పిక్చర్స్ సమర్పణలో క్రిష్వీ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కేవీ సతీశ్ హీరోగా పరిచయం అవుతున్నారు. డియానికోలస్ కథానాయిక. ఈ సినిమా ప్రచార చిత్రాలను మంగళవారం హైదరాబాద్‌లో డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మరిన్ని విషయాలు చెబుతూ -‘‘నేను బాపు రమణలతో పనిచేశాను. వాళ్లకు కోపం రావడం నేనెప్పుడూ చూడలేదు. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కూడా అంతే. కృష్ణారెడ్డితో అప్పట్లోనే ఓ సినిమా చేద్దామనుకున్నా కుదర్లేదు. ఇప్పటికైనా ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా చేయడం ఆనందంగా ఉంది. నా గత యముని పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందీ పాత్ర’’ అన్నారు. ‘‘1994లో ‘యమలీల’ రిలీజైంది. 2014లో ‘యమలీల-2’ వస్తోంది. ఇరవై ఏళ్ల క్రితం ‘యమలీల’ ఎంత జాగ్రత్తగా తీశానో... ‘యమలీల-2’ కూడా అంతే జాగ్రత్తగా తీస్తున్నాను. ‘ఈగ’ తర్వాత అంతటి అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. కేవీ సతీశ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాను. బెంగళూరులో ఎనిమిదేళ్ల క్రితం ఓ చిన్న కంపెనీలో రెండు వేల జీతంతో జీవితాన్ని మొదలు పెట్టినతను... ఈ రోజు ఎనిమిది వేలమందికి జీతాలిచ్చే స్థాయికి ఎదిగాడు. కృష్ణారెడ్డి అంటే కామెడీ, సెంటిమెంట్. అందుకు తగ్గట్టు ఈ సినిమా ఉంటుంది. కచ్చితంగా హిట్ కొట్టి తీరుతా’’ నమ్మకం వ్యక్తం చేశారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు టి.సుబ్బిరామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, బండ్ల గణేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'యమలీల' సీక్వెల్ తో ఎస్వీ కృష్ణారెడ్డి రెడీ!
గత కొద్దికాలంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న సంచలన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రీఎంట్రీ ఇవ్వనున్నారు. 1994 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన యమలీల చిత్రానికి సీక్వెల్ గా రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభిచారు. గత రోజులుగా యమలీల సీక్వెల్ కోసం కథను సిద్ధం చేస్తున్నాను. త్వరలోనే చిత్రాన్ని ప్రారంభిస్తాను. ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక చేస్తాం అని అన్నారు. యమలీల చిత్ర విజయం వెనుక నటీనటుల ప్రతిభనే కీలకం అని అన్నారు. సత్యనారాయణ, ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి, బ్రహ్మానందం పాత్రలు కీలకమని ఆయన తెలిపారు. గతంలో సత్యానారాయణ పోషించిన యముడి పాత్రకు మోహన్ బాబు చేత చేయించాలని అనుకుంటున్నాం. ఆలీ పాత్ర కోసం పలు నటుల్ని పరిశీలనలోకి తీసుకున్నాం. అయితే పూర్తిగా ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయామన్నారు.