యూరప్‌లో యమ హంగామా | Yamaleela 2 to be shot in Europe | Sakshi
Sakshi News home page

యూరప్‌లో యమ హంగామా

Published Sat, Jul 26 2014 12:04 AM | Last Updated on Wed, Aug 29 2018 9:35 PM

యూరప్‌లో యమ హంగామా - Sakshi

యూరప్‌లో యమ హంగామా

ఇరవై ఏళ్ల క్రితం బాక్సాఫీసు వద్ద ‘యమలీల’ సినిమా చేసిన మేజిక్కు అంతా ఇంతా కాదు. మళ్లీ ఆ మేజిక్‌ని రిపీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘యమలీల-2’గా ఆయన రూపొందిస్తున్న ఈ చిత్రంలో యముడిగా డా. మోహన్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే.

చిత్రగుప్తునిగా పాత ‘యమలీల’లోని పాత్రనే బ్రహ్మానందం పోషిస్తుండగా, డా. కేవీ సతీశ్ హీరోగా నటిస్తూ, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దియానికోలస్ ఇందులో కథానాయిక. రెండు పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 28 నుంచి ఆగస్ట్ 8 వరకూ యూరప్‌లో ఈ పాటల్ని చిత్రీకరించనున్నట్లు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు.
 
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, గ్రాఫిక్స్‌కు ఎక్కువ అవకాశమున్న కథ కావడంతో టీమ్ మొత్తం శ్రమించి పని చేస్తున్నారని ఎస్వీకె అన్నారు. సతీశ్ అనుకున్నదానికంటే వంద రెట్లు బాగా చేస్తున్నాడని, ప్రేక్షకుల్ని వందశాతం ఆనందింపజేసే సినిమా అవుతుందని కృష్ణారెడ్డి నమ్మకం వెలిబుచ్చారు. ‘‘ఒక మంచి కుటుంబకథను నిర్మించాలని, కృష్ణారెడ్డిగారితో మొదలుపెట్టిన ఈ సినిమా అనుకున్నదానికంటే గొప్పగా వస్తోంది.

కృష్ణారెడ్డి ఎంతో కష్టపడి, ఇష్టంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. మా క్రిష్వి ఫిలింస్ సంస్థకు, పనిచేస్తున్న అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అని డా. కేవీ సతీశ్ అన్నారు. భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘యమలీల-2’ ఒకటి అని సహ నిర్మాత డి.అరుణ్‌కుమార్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement