Bigg Boss Syed Sohel New Movie With SV Krishna Reddy, Shooting Begins - Sakshi

Syed Sohel Upcoming Movie: ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో సోహైల్‌ సినిమా..

Apr 19 2022 8:46 AM | Updated on Apr 19 2022 11:39 AM

Bigg Boss Fame Syed Sohel New Movie Begins - Sakshi

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న ‘ఆర్గానిక్‌ మామ.. హైబ్రీడ్‌ అల్లుడు’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఇందులో ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ సోహైల్‌ హీరోగా, ‘మజిలీ’ ఫేమ్‌ అనన్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సీన్‌కి నిర్మాత కె. అచ్చి రెడ్డి కెమెరా స్విచాన్‌ చేయగా, డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘కొబ్బరి బోండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు’ వంటి హిట్‌ చిత్రాలను నాతో తీసిన కృష్ణారెడ్డితో మళ్లీ చాలా కాలం తర్వాత సినిమా చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు.



‘‘నేను, కృష్ణారెడ్డి చెన్నైలో ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. తన దర్శకత్వంలో సినిమా నిర్మించాలనే నా కోరిక ఈ సినిమా  ద్వారా తీరుతోంది’’ అన్నారు సి. కల్యాణ్‌. ‘‘అమెరికాలో ఒక ఇంగ్లిష్‌ సినిమా చేయడానికి నాకు మూడేళ్లు పట్టింది. అందుకే అక్కడ ఉండాలనిపించలేదు. తెలుగువారి ఆదరణ ఎప్పుడూ మనసుకి నిండుగా తృప్తిగా ఉంటుంది. అవే కావాలనుకుని ‘ఆర్గానిక్‌ మామ.. హైబ్రీడ్‌ అల్లుడు’ స్టార్ట్‌ చేశా’’ అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement