కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేక్ ఇది. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 28న ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్, టీజర్‌ని విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శక, నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ టైటిల్ వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మలయాళం లో చూసిన ‘వికృతి’ సినిమా నచ్చి తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో తనే నిర్మాతగా మారి సీనియర్ నటులందరినీ తీసుకొని తీసిన ఈ సినిమాకు కొత్త దర్శకుడిని, మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేయడం గొప్ప విషయం’ అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ... ‘నేను, అలీ ఒకే టైమ్‌లో కేరీర్ స్టార్ట్ చేశాము. అలీ, నేను కలసి చూసిన మెదటి సినిమా ‘మనీ’. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గార్లు యమలీల సినిమా ద్వారా ఆలీని హీరోగా పరిచయం చేశారు. అప్పట్లో అది ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఆలా ఎదుగుతూ వచ్చిన ఆలీ ఈ రోజు మంచి సబ్జెక్టును సెలెక్ట్ చేసుకొని, చాలా మంది సీనియర్ నటులను సెలక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.
అలీ మాట్లాడుతూ.. మలయాళం లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నరేష్ గారు నేను పోటాపోటీగా నటించాం . 27 ఏళ్ల తరువాత మంజు భార్గవి గారితో కలిసి మళ్ళీ నటించడం ఆనందంగా ఉంది. ఒక మంచి వాతావరణంలో దాదాపు అందరూ సీనియర్ ఆర్టిస్ట్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ కిరణ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ నెల 28న ఆహా లో విడుదల అవుతున్న ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు.
‘ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ నెల 28న విడుదల అవుతున్న ఈ సినిమా అందరూ ఆదరించి ఆశీర్వాదించాలని కోరుతున్నాను’అని దర్శకుడు కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చిరెడ్డి, చిత్ర నిర్మాత కొణతాల మోహనన్ కుమార్ ,నటులు పృథ్వీ , శివబాలాజీ, భద్రం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment