వినాయక్, కల్పన, సి. కల్యాణ్, ఎస్వీ కృష్ణారెడ్డి, సోహైల్, కె. అచ్చిరెడ్డి
‘‘ఎస్వీ కృష్ణారెడ్డిగారి సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒక క్రేజ్. ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను కూడా ఒకణ్ణి. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంతమంది కాంబినేషన్ అయినా సెట్‌లో కూల్‌గా ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకున్నాను. ఆయన గోల్డెన్ డేస్‌ని ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ రిపీట్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డైరెక్టర్ వీవీ వినాయక్.
రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో సోహైల్, మృణాళిని జంటగా నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించారు. ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అల్లసాని వారి అల్లిక..’ అనే పాటని సి. కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వినాయక్ విడుదల చేశారు.
ఈ పాటని శ్రీమణి రచించగా, శ్రీకృష్ణ, హరిణి ఆలపించారు. ఈ సందర్భంగా కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్‌గారి సహకారంతో ఆయన భార్య కోనేరు కల్పన నిర్మాతగా నా సమర్పణలో ఈ సినిమా నిర్మించే అవకాశం రావడం హ్యాపీ’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ అరిటాకులో వడ్డించిన అచ్చ తెలుగు భోజనం’’ అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ–‘‘నా గత చిత్రాల్లోని అన్ని అంశాలను.. అంతకు మించి ఈ చిత్రంలో పొందుపరిచి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment