
తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త దర్శకులు వస్తూనే ఉంటారు. అలా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సుకుమార్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అవునా అని ఆశ్చర్యపోకండి. ఇంతకీ ఏంటా సినిమా?
స్వతహాగా సుకుమార్ లెక్కల మాస్టర్. కానీ సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత వివి వినాయక్ దగ్గర 'దిల్' సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఈ మూవీ నిర్మించిన దిల్ రాజు.. సుకుమార్ ని 'ఆర్య'తో డైరెక్టర్ గా పరిచమయ్యాడు.
(ఇదీ చదవండి: కథ కనిపెట్టు.. ఈ బైక్ గిఫ్ట్ పట్టు: హీరో కిరణ్ అబ్బవరం)
పైన ఫొటో విషయానికొస్తే.. దర్శకుడు వివి వినాయక్, నిర్మాత దిల్ రాజు కాకుండా మిగతా వారిలో సుకుమార్ గురించి మనకు తెలుసు. వాళ్లు కాకుండా దర్శకులు వాసువర్మ (జోష్ సినిమా), డాలీ (గోపాల గోపాల సినిమా), రచయిత వేమారెడ్డి ఉన్నారు.
చాన్నాళ్ల తర్వాత 'దిల్' టీమ్ అంతా ఇలా డైరెక్టర్ వివి వినాయక్ ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. అదికాస్త వైరల్ అవుతోంది. ఇదే టైంలో వినాయక్ ఇలా అయిపోయారేంటి అని మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)
Comments
Please login to add a commentAdd a comment