యాక్షన్.. కట్.. ఓకే.. చెప్పెదెప్పుడు? | Puri Jagannath, Krishna Vamsi, V V Vinayak; These Star Directors Didn't Start New Projects | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌ గారు.. ‘యాక్షన్.. కట్.. ఓకే.. ’ చెప్పెదెప్పుడు?

Published Fri, Oct 25 2024 12:00 PM | Last Updated on Fri, Oct 25 2024 2:32 PM

Puri Jagannath, Krishna Vamsi, V V Vinayak; These Star Directors Didn't Start New Projects

ఓ సినిమా విజయం అనేది డైరెక్టర్ల కెరీర్‌ని నిర్ణయిస్తుంది అంటారు. హిట్టు పడితే వరుస ఆఫర్లు వస్తాయి. అదే ఫ్లాపులొస్తే కెరీర్‌కి బ్రేకులు పడతాయి. నెక్ట్స్‌ చాన్స్‌ ఇచ్చే హీరో ఎవరు? అనే ప్రశ్న మొదలవుతుంది. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండానూ అవకాశాలు దక్కుతాయనుకోండి. కానీ కారణం ఏదైనా ప్రస్తుతం కొందరు దర్శకులు మాత్రం ఏ ప్రాజెక్ట్‌ ఫైనలైజ్‌ చేయలేదు. వాట్‌ నెక్ట్స్‌? అనే ప్రశ్నకు జవాబు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.
ఆ వివరాల్లోకి వెళదాం... 

కృష్ణవంశీ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. బంధాలు, బంధుత్వాలు, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారాయన. అంతేకాదు... సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, వాస్తవ ఘటనల నేపథ్యంలోనూ సినిమాలు రూపొందిస్తుంటారు కృష్ణవంశీ. తొలి సినిమా ‘గులాబీ’ నుంచి గత ఏడాది తెరకెక్కించిన ‘రంగ మార్తాండ’ వరకూ మధ్యలో ‘నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం, గోవిందుడు అందరివాడేలే’...’ ఇలా పలు హిట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు కృష్ణవంశీ. కాగా 2017లో వచ్చిన ‘నక్షత్రం’ తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్‌ తీసుకున్నారాయన. ఆ తర్వాత వచ్చిన ‘రంగమార్తాండ’ (2023) సినిమా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించి, కన్నీరు పెట్టించింది. ఆ చిత్రం తర్వాత కృష్ణవంశీ ప్రాజెక్టుపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా లేదు. సో... నెక్ట్స్‌ ఏంటి? అంటే వెయిట్‌ అండ్‌ సీ.  

ఒకప్పుడు కమర్షియల్‌ హిట్స్‌కి కేరాఫ్‌గా నిలిచిన పూరి జగన్నాథ్‌ ఇప్పుడు సక్సెస్‌ వేటలో ఉన్నారు. ‘బద్రి, ఇడియట్, పోకిరి, దేశ ముదురు, చిరుత, బుజ్జిగాడు, బిజినెస్‌మేన్, టెంపర్, పైసా వసూల్, ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి ఎన్నో హిట్‌ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్నారు పూరి. అయితే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా తర్వాత ఆయన్ని హిట్‌ వరించలేదు. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కించిన పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘లైగర్‌’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. హిట్‌ మూవీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌గా వచ్చిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక΄ోయింది. దీంతో నెక్ట్స్‌ పూరి జగన్నాథ్‌ ్ర΄ాజెక్ట్‌ ఏంటి? ఏ హీరోతో ఆయన సినిమా చేయనున్నారు? వంటి ప్రశ్నలకి జవాబు లేదు. 

ప్రభాస్, పవన్‌ కల్యాణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ వంటి హీరోలకు ఆయన హిట్స్‌ ఇచ్చారు. ప్రస్తుతం వారంతా పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పటికిప్పుడు పూరి జగన్నాథ్‌కి డేట్స్‌ ఇచ్చే వీలు లేదు. ఇలాంటి సమయంలో ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో ΄ాటు ప్రేక్షకుల్లో నెలకొంది. సరైన కథ, కాంబినేషన్‌ కుదిరితే మళ్లీ ఆయన బౌన్స్‌ బ్యాక్‌ అవడం కష్టమేమీ కాదు.  

మాస్‌ సినిమాలు తీయడంలో వీవీ వినాయక్‌ శైలి ప్రత్యేకం. హీరోలకు మాస్‌ ఎలివేషన్స్‌ ఇవ్వడంలోనూ ఆయనకి ఆయనే సాటి. అలాగే కమర్షియల్‌ సినిమాలకు కొత్త విలువలు నేర్పిన దర్శకుడిగా వినాయక్‌కి పేరుంది. ‘ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, ఠాగూర్, బన్ని, లక్ష్మి, యోగి, కృష్ణ, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్‌ 150’ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారాయన. అయితే  చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్‌ 150’ (2017) సినిమా హిట్‌ తర్వాత వినాయక్‌ తీసిన ‘ఇంటెలిజెంట్‌’ (2018) సినిమా నిరాశపరచింది. 

ఆ చిత్రం తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు వినాయక్‌. ప్రభాస్‌ హిట్‌ మూవీ ‘ఛత్రపతి’ సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో హిందీలో ‘ఛత్రపతి’ (2023) పేరుతోనే రీమేక్‌ చేశారు. ఆ తర్వాత ఆయన్నుంచి కొత్త ్ర΄ాజెక్ట్‌ ప్రకటన ఏదీ రాలేదు. ఆ మధ్య ‘దిల్‌’ రాజు నిర్మాతగా వీవీ వినాయక్‌ హీరోగా ఓ సినిమా రానుందంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్‌ని సైతం మార్చుకున్నారు వినాయక్‌. అయితే ఆ సినిమా పట్టాలెక్కలేదు. మరి ఇప్పుడు వినాయక్‌ ప్రయాణం డైరెక్టర్‌గానా? నటుడిగానా? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.  

కల్యాణ్‌రామ్‌ హీరోగా రూపొందిన ‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్‌ రెడ్డి. ‘కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారాయన. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్‌’(2023) సినిమా భారీ అంచనాలతో విడుదలైనా బాక్సాఫీస్‌ వద్ద అంచనాలను అందుకోలేక΄ోయింది. ఆ సినిమా తర్వాత సురేందర్‌ రెడ్డి తెరకెక్కించబోయే మూవీపై ఇప్పటివరకూ ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. ఫలానా హీరోతో ఆయన నెక్ట్స్‌ మూవీ ఉంటుందనే టాక్‌ కూడా ఇప్పటివరకూ ఎక్కడా వినిపించలేదు. మరి... ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనే ప్రశ్నకు జవాబు రావాలంటే వేచి ఉండాలి.  

ప్రభాస్‌ హీరోగా నటించిన ‘మున్నా’ (2007) మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు వంశీ పైడిపల్లి. తెలుగులో ఇప్పటివరకూ ఆయన తీసింది ఐదు చిత్రాలే అయినా (మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) అన్నీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ (2019) సినిమా తర్వాత ఆయన మరో తెలుగు సినిమా చేయలేదు. విజయ్‌ హీరోగా తమిళంలో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా చేశారు. ఈ చిత్రం విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆయన తర్వాతి ్ర΄ాజెక్టుపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఆ మధ్య షాహిద్‌ కపూర్‌ హీరోగా వంశీ ఓ బాలీవుడ్‌ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారనే వార్తలొచ్చాయి. తెలుగు సినిమాలని డబ్బింగ్‌ చేసి హిందీలో విడుదల చేసే గోల్డ్‌ మైన్‌ అనే సంస్థ ఈ ్ర΄ాజెక్టును నిర్మించనుందని, ఆగస్టులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనే వార్తలు వినిపించినా ఈ ్ర΄ాజెక్టు ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. మరి వంశీ పైడిపల్లి తర్వాతి చిత్రం టాలీవుడ్‌లోనా? బాలీవుడ్‌లోనా? లేకుంటే మరో భాషలో ఉంటుందా? అనేది చూడాలి.   

దర్శకుడు పరశురాం ‘గీతగోవిందం’ (2018) సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకోవడమే కాదు... హీరో విజయ్‌ దేవరకొండని వంద కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లారు పరశురాం. ఆ సినిమా హిట్‌ అయినా నాలుగేళ్లు వేచి చూశారాయన. ఆ తర్వాత మహేశ్‌బాబు హీరోగా ‘సర్కారువారి ΄ాట’ (2022) సినిమా తీసి, హిట్‌ అందుకున్నారు. అనంతరం విజయ్‌ దేవరకొండ హీరోగా

‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం తీశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 5న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. ఈ సినిమా రిలీజై ఆర్నెళ్లు దాటినా పరశురాం తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. గతంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపించినా ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే ‘ఫ్యామిలీ స్టార్‌’ నిర్మించిన నిర్మాత ‘దిల్‌’ రాజు బ్యానర్‌లోనే పరశురామ్‌ మరో సినిమా చాన్స్‌ ఉందని టాక్‌. మరి ఆయన నెక్ట్స్‌ ్ర΄ాజెక్ట్‌ ఏంటి? అనేది వేచి చూడాలి.  

ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఏడు సినిమాలు తీశారు దర్శకుడు మెహర్‌ రమేశ్‌. వాటిలో రెండు కన్నడ సినిమాలున్నాయి. ఆయన తీసిన ఐదు తెలుగు చిత్రాలు ‘కంత్రి, బిల్లా, శక్తి, షాడో, బోళా శంకర్‌’.  వెంకటేశ్‌తో తీసిన ‘షాడో’ (2013) తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు మెహర్‌ రమేశ్‌. అయితే ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత చిరంజీవి రూపంలో అదృష్టం ఆయన్ని వరించింది. ‘బోళా శంకర్‌’ సినిమా చేసే మంచి అవకాశం ఇచ్చారు చిరంజీవి. 2023 ఆగస్టు 11న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా రిలీజై ఏడాదికి పైగా అయినప్పటికీ తన తర్వాతి సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. మరి.. మెహర్‌ రమేశ్‌ నెక్ట్స్‌ మూవీ ఏంటి? వెయిట్‌ అండ్‌ సీ.  

ఇదిలా ఉంటే... 2021న విడుదలైన నితిన్‌ ‘చెక్‌’ మూవీ తర్వాత డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఏలేటి తర్వాతి సినిమాపై ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే ‘అన్నీ మంచి శకునములే’ (2023) తర్వాత దర్శకురాలు నందినీ రెడ్డి నెక్ట్స్‌ ్ర΄ాజెక్ట్‌ ఏంటి? అనేదానిపై క్లారిటీ లేదు. అదే విధంగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ మూవీ ఫేమ్‌ అజయ్‌ భూపతి ‘మంగళవారం’ (2023) సినిమా రిలీజై దాదాపు ఏడాది కావస్తున్నా ఆయన తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. కాగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ సినిమా 2023లో విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్‌ గతంలో ప్రకటించినా ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు తెలియరాలేదు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ సినిమా విడుదలై ఏడాది దాటి΄ోయినా ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనేదానిపై ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా ‘ఘాజీ’ మూవీ ఫేమ్‌ డైరెక్టర్‌ సంకల్ప్‌ రెడ్డి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పైనా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఆయన తెరకెక్కించిన ‘ఐబీ 71’ (2023) అనే హిందీ చిత్రం రిలీజై ఏడాదిన్నర దాటినా తర్వాతి సినిమా టాలీవుడ్‌లో ఉంటుందా? బాలీవుడ్‌లో ఉంటుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
– డేరంగుల జగన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement