రాజకీయాల్లోకి వస్తానని నా జాతకంలో రాసిపెట్టుంది: రేణూ దేశాయ్‌ | Renu Desai Interesting Comments on Her Political Entry | Sakshi

Renu Desai: నా జాతకంలో పొలిటికల్‌ ఎంట్రీ ఉంది.. నాకైతే అలా సేవ చేయాలని..

Apr 9 2025 5:24 PM | Updated on Apr 9 2025 6:05 PM

Renu Desai Interesting Comments on Her Political Entry

రెండు దశాబ్దాల పాటు వెండితెరకు దూరంగా ఉన్న నటి రేణూ దేశాయ్‌ (Renu Desai) టైగర్‌ నాగేశ్వరరావు సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇచ్చింది. తర్వాత మరే సినిమాలోనూ కనిపించనేలేదు. సామాజిక సమస్యలపై చురుకుగా స్పందించే రేణూ దేశాయ్‌.. రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

రాజకీయాల్లోకి వస్తానట!
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో రేణూ దేశాయ్‌ మాట్లాడుతూ.. నేను తొలిసారి ఈ విషయాన్ని బయటపెడ్తున్నా.. రాజకీయాల్లో అడుగుపెడతానని నా జాతకంలో రాసిపెట్టుంది. కానీ నేను మాత్రం పాలిటిక్స్‌ను ఎంచుకోను. నా పిల్లల కోసమైనా దానికి దూరంగా ఉంటాను. ఎందుకంటే ఒక తల్లిగా.. పిల్లలకు నేను అన్నివేళలా తోడుండాలి. మంచి తల్లిగా ఉండటమే నా ధర్మం. ఇందుకోసం నేను నా విధిరాతకు విరుద్ధంగా వెళ్లాలనుకుంటున్నాను.

ఇప్పట్లో అయితే 'నో'
అయితే నాకు సమాజ సేవపై ఆసక్తి ఉంది. ఇప్పటికే ఓ ఎన్జీవో కూడా నడుపుతున్నాను. రాజకీయాలతో సంబంధం లేకుండా సేవ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్లక తప్పదన్న పరిస్థితి వస్తే పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తాను కావచ్చు. రెండుమూడేళ్లలో మాత్రం అటువైపు వెళ్లను. పైగా నాకు అబద్ధాలు ఆడటం రాదు. కాబట్టి రాజకీయాల్లో కూడా సెట్టవనేమో అని రేణూ దేశాయ్‌ చెప్పుకొచ్చింది. సినిమాల గురించి మాట్లాడుతూ రెండు ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు తెలిపింది.

చదవండి: షారూఖ్‌ తర్వాత నేనే.. మీరు ఒప్పుకుని తీరాల్సిందే!: ఊర్వశి రౌతేలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement