Krishna Vamsi
-
అవునూ.. నాదే తప్పు, క్షమించండి: కృష్ణవంశీ
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం (Sri Anjaneyam) 2004 జూలై 24 విడుదలైంది. సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో హనుమంతుడిగా ప్రముఖ నటుడు అర్జున్, హనుమాన్ భక్తుడి పాత్రలో అంజిగా నితిన్ మెప్పించారు. అయితే, హీరోయిన్ ఛార్మి(Charmy Kaur) పాత్ర ఈ సినిమాలో బాగాలేదని, అందుకే ప్రేక్షకులు తిప్పికొట్టారని పలు వాదనలు భారీగానే వచ్చాయి. హీరోయిన్ పాత్ర లేకపోయింటే ఈ చిత్రం సూపర్ హిట్ అయి ఉండేదని అప్పట్లోనే చాలామంది కామెంట్లు చేశారు. ఈ సినిమాలో మాంత్రికుడిగా నటించిన పృథ్వీరాజ్ కూడా కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో అదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. (ఇదీ చదవండి: వీడియోలు తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆరాధ్య)శ్రీ ఆంజనేయం లాంటి భక్తి సినిమాలో ఛార్మిని అలా ఎందుకు చూపించారు అంటూ కృష్ణవంశీని ఒక నెటిజన్ ప్రశ్నించారు. అందుకు ఆయన కూడా రిప్లై ఇచ్చారు. 'తప్పేనండి.. క్షమించండి.. తీరని సమయాలు, తీరని చర్యలు, తీరని పనులు..' అని ఆ తప్పలను ఎప్పటికీ సరిచేయలేమని ఆయన అన్నారు. ఎక్స్ పేజీలో ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఛార్మి గ్లామర్ డోస్ శృతిమించిందని, ఆమె పాత్ర సినిమాను పూర్తిగా తప్పుదోవ పట్టించిందని కృష్ణవంశీపై ఆ సమయంలో బాగానే ట్రోల్ చేశారు. అప్పుడు కూడా తనదే తప్పు అని హుందాగా ఒప్పుకున్న కృష్ణవంశీ ఇప్పుడు మరోసారి క్షమించమని నెటిజన్లను కోరారు.1995లో తొలి సినిమా గులాబితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కృష్ణవంశీ.. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా, సింధూరం, చంద్రలేఖ, అంతఃపురం,మురారి,ఖడ్గం వంటి టాప్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఖడ్గం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సోషియో ఫాంటసీ కథతో శ్రీ ఆంజనేయం విడుదల కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా బాగున్నప్పటికీ ఛార్మి పాత్ర పెద్ద మైనస్‌గా మారింది. దీంతో ఆయనపై పలు విమర్శలు వచ్చాయి. సుమారు 20 ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. 2023లో చివరిగా రంగమార్తాండ చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. Thappenandi.... Apologies.. desperate times desperate measures desperate deeds 🙏🙏 https://t.co/61ZzByYkaz— Krishna Vamsi (@director_kv) February 3, 2025 -
యాక్షన్.. కట్.. ఓకే.. చెప్పెదెప్పుడు?
ఓ సినిమా విజయం అనేది డైరెక్టర్ల కెరీర్‌ని నిర్ణయిస్తుంది అంటారు. హిట్టు పడితే వరుస ఆఫర్లు వస్తాయి. అదే ఫ్లాపులొస్తే కెరీర్‌కి బ్రేకులు పడతాయి. నెక్ట్స్ చాన్స్ ఇచ్చే హీరో ఎవరు? అనే ప్రశ్న మొదలవుతుంది. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండానూ అవకాశాలు దక్కుతాయనుకోండి. కానీ కారణం ఏదైనా ప్రస్తుతం కొందరు దర్శకులు మాత్రం ఏ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయలేదు. వాట్ నెక్ట్స్? అనే ప్రశ్నకు జవాబు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.ఆ వివరాల్లోకి వెళదాం... కృష్ణవంశీ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. బంధాలు, బంధుత్వాలు, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారాయన. అంతేకాదు... సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, వాస్తవ ఘటనల నేపథ్యంలోనూ సినిమాలు రూపొందిస్తుంటారు కృష్ణవంశీ. తొలి సినిమా ‘గులాబీ’ నుంచి గత ఏడాది తెరకెక్కించిన ‘రంగ మార్తాండ’ వరకూ మధ్యలో ‘నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం, గోవిందుడు అందరివాడేలే’...’ ఇలా పలు హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు కృష్ణవంశీ. కాగా 2017లో వచ్చిన ‘నక్షత్రం’ తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్నారాయన. ఆ తర్వాత వచ్చిన ‘రంగమార్తాండ’ (2023) సినిమా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించి, కన్నీరు పెట్టించింది. ఆ చిత్రం తర్వాత కృష్ణవంశీ ప్రాజెక్టుపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా లేదు. సో... నెక్ట్స్ ఏంటి? అంటే వెయిట్ అండ్ సీ. ఒకప్పుడు కమర్షియల్ హిట్స్‌కి కేరాఫ్‌గా నిలిచిన పూరి జగన్నాథ్ ఇప్పుడు సక్సెస్ వేటలో ఉన్నారు. ‘బద్రి, ఇడియట్, పోకిరి, దేశ ముదురు, చిరుత, బుజ్జిగాడు, బిజినెస్‌మేన్, టెంపర్, పైసా వసూల్, ఇస్మార్ట్ శంకర్’ వంటి ఎన్నో హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్నారు పూరి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత ఆయన్ని హిట్ వరించలేదు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కించిన పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘లైగర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక΄ోయింది. దీంతో నెక్ట్స్ పూరి జగన్నాథ్ ్ర΄ాజెక్ట్ ఏంటి? ఏ హీరోతో ఆయన సినిమా చేయనున్నారు? వంటి ప్రశ్నలకి జవాబు లేదు. ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలకు ఆయన హిట్స్ ఇచ్చారు. ప్రస్తుతం వారంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పటికిప్పుడు పూరి జగన్నాథ్‌కి డేట్స్ ఇచ్చే వీలు లేదు. ఇలాంటి సమయంలో ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో ΄ాటు ప్రేక్షకుల్లో నెలకొంది. సరైన కథ, కాంబినేషన్ కుదిరితే మళ్లీ ఆయన బౌన్స్ బ్యాక్ అవడం కష్టమేమీ కాదు. మాస్ సినిమాలు తీయడంలో వీవీ వినాయక్ శైలి ప్రత్యేకం. హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలోనూ ఆయనకి ఆయనే సాటి. అలాగే కమర్షియల్ సినిమాలకు కొత్త విలువలు నేర్పిన దర్శకుడిగా వినాయక్‌కి పేరుంది. ‘ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, ఠాగూర్, బన్ని, లక్ష్మి, యోగి, కృష్ణ, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారాయన. అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ (2017) సినిమా హిట్ తర్వాత వినాయక్ తీసిన ‘ఇంటెలిజెంట్’ (2018) సినిమా నిరాశపరచింది. ఆ చిత్రం తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు వినాయక్. ప్రభాస్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో హిందీలో ‘ఛత్రపతి’ (2023) పేరుతోనే రీమేక్ చేశారు. ఆ తర్వాత ఆయన్నుంచి కొత్త ్ర΄ాజెక్ట్ ప్రకటన ఏదీ రాలేదు. ఆ మధ్య ‘దిల్’ రాజు నిర్మాతగా వీవీ వినాయక్ హీరోగా ఓ సినిమా రానుందంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్‌ని సైతం మార్చుకున్నారు వినాయక్. అయితే ఆ సినిమా పట్టాలెక్కలేదు. మరి ఇప్పుడు వినాయక్ ప్రయాణం డైరెక్టర్‌గానా? నటుడిగానా? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందిన ‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్ రెడ్డి. ‘కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారాయన. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’(2023) సినిమా భారీ అంచనాలతో విడుదలైనా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక΄ోయింది. ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయే మూవీపై ఇప్పటివరకూ ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. ఫలానా హీరోతో ఆయన నెక్ట్స్ మూవీ ఉంటుందనే టాక్ కూడా ఇప్పటివరకూ ఎక్కడా వినిపించలేదు. మరి... ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనే ప్రశ్నకు జవాబు రావాలంటే వేచి ఉండాలి. ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007) మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు వంశీ పైడిపల్లి. తెలుగులో ఇప్పటివరకూ ఆయన తీసింది ఐదు చిత్రాలే అయినా (మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) అన్నీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ (2019) సినిమా తర్వాత ఆయన మరో తెలుగు సినిమా చేయలేదు. విజయ్ హీరోగా తమిళంలో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా చేశారు. ఈ చిత్రం విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆయన తర్వాతి ్ర΄ాజెక్టుపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఆ మధ్య షాహిద్ కపూర్ హీరోగా వంశీ ఓ బాలీవుడ్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారనే వార్తలొచ్చాయి. తెలుగు సినిమాలని డబ్బింగ్ చేసి హిందీలో విడుదల చేసే గోల్డ్ మైన్ అనే సంస్థ ఈ ్ర΄ాజెక్టును నిర్మించనుందని, ఆగస్టులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనే వార్తలు వినిపించినా ఈ ్ర΄ాజెక్టు ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. మరి వంశీ పైడిపల్లి తర్వాతి చిత్రం టాలీవుడ్లోనా? బాలీవుడ్లోనా? లేకుంటే మరో భాషలో ఉంటుందా? అనేది చూడాలి. దర్శకుడు పరశురాం ‘గీతగోవిందం’ (2018) సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాదు... హీరో విజయ్ దేవరకొండని వంద కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లారు పరశురాం. ఆ సినిమా హిట్ అయినా నాలుగేళ్లు వేచి చూశారాయన. ఆ తర్వాత మహేశ్‌బాబు హీరోగా ‘సర్కారువారి ΄ాట’ (2022) సినిమా తీసి, హిట్ అందుకున్నారు. అనంతరం విజయ్ దేవరకొండ హీరోగా‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం తీశారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. ఈ సినిమా రిలీజై ఆర్నెళ్లు దాటినా పరశురాం తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. గతంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపించినా ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ‘ఫ్యామిలీ స్టార్’ నిర్మించిన నిర్మాత ‘దిల్’ రాజు బ్యానర్లోనే పరశురామ్ మరో సినిమా చాన్స్ ఉందని టాక్. మరి ఆయన నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనేది వేచి చూడాలి. ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఏడు సినిమాలు తీశారు దర్శకుడు మెహర్ రమేశ్. వాటిలో రెండు కన్నడ సినిమాలున్నాయి. ఆయన తీసిన ఐదు తెలుగు చిత్రాలు ‘కంత్రి, బిల్లా, శక్తి, షాడో, బోళా శంకర్’. వెంకటేశ్‌తో తీసిన ‘షాడో’ (2013) తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు మెహర్ రమేశ్. అయితే ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత చిరంజీవి రూపంలో అదృష్టం ఆయన్ని వరించింది. ‘బోళా శంకర్’ సినిమా చేసే మంచి అవకాశం ఇచ్చారు చిరంజీవి. 2023 ఆగస్టు 11న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా రిలీజై ఏడాదికి పైగా అయినప్పటికీ తన తర్వాతి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి.. మెహర్ రమేశ్ నెక్ట్స్ మూవీ ఏంటి? వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... 2021న విడుదలైన నితిన్ ‘చెక్’ మూవీ తర్వాత డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి తర్వాతి సినిమాపై ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే ‘అన్నీ మంచి శకునములే’ (2023) తర్వాత దర్శకురాలు నందినీ రెడ్డి నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనేదానిపై క్లారిటీ లేదు. అదే విధంగా ‘ఆర్ఎక్స్ 100’ మూవీ ఫేమ్ అజయ్ భూపతి ‘మంగళవారం’ (2023) సినిమా రిలీజై దాదాపు ఏడాది కావస్తున్నా ఆయన తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. కాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ సినిమా 2023లో విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్ గతంలో ప్రకటించినా ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు తెలియరాలేదు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ సినిమా విడుదలై ఏడాది దాటి΄ోయినా ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనేదానిపై ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా ‘ఘాజీ’ మూవీ ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పైనా ఎలాంటి అప్డేట్ లేదు. ఆయన తెరకెక్కించిన ‘ఐబీ 71’ (2023) అనే హిందీ చిత్రం రిలీజై ఏడాదిన్నర దాటినా తర్వాతి సినిమా టాలీవుడ్లో ఉంటుందా? బాలీవుడ్లో ఉంటుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.– డేరంగుల జగన్ -
22 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న దేశ భక్తి సినిమా
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన దేశ భక్తి సినిమా ఖడ్గం. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2002లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. అక్టోబర్ 18న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి షూటింగ్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ, “మాకు ఈ సినిమా తీయడం లో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో ఈ సినిమా కి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం.22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా కి సహకరించిన నటీనటులందరికీ థాంక్స్.” అని చెప్పారు.హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, “జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ ఫిల్మ్స్ అన్నిటిలో ఖడ్గం ఒక గొప్ప చిత్రం. అసలు ఖడ్గం సినిమా లో నిర్మాత మధు మురళి నన్ను వద్దు ఆన్నారు ముందు. కానీ వంశీ ధైర్యం చేసి ఆయన్ని ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమా మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.” అన్నారు. ‘షనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయం లో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమా లో అవకాశం ఇచ్చి నా వనవాసం కి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు’ అని షఫి అన్నారు. -
మురారి సీక్వెల్ కావాలంటున్న మహేష్ ఫ్యాన్స్..
-
మురారి రి రిలీజ్.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా! (ఫొటోలు)
-
'అసలేం గుర్తుకురాదు..' పాటలో సౌందర్యను అలా చూపించింది ఆయన కాదట!
అంత:పురం.. 1998లో వచ్చిన సినిమా. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సౌందర్య హీరోయిన్. ఇళయరాజా సంగీతం అందించిన 'అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా..' ఎవర్ గ్రీన్ సాంగ్. సింగర్ చిత్ర ఆలపించిన ఈ పాటలో సౌందర్య చీర రంగులు మారుతూ ఉంటుంది. రెడ్, పర్పుల్, పింక్, ఎల్లో, గ్రీన్.. ఇలా వెంటవెంటనే చీర అనేక రంగుల్లో కనిపిస్తుంది.'ఈ చీర రంగులు మార్చే కాన్సెప్ట్ భలే ఉంది. చాలా కొత్తగానూ ఉంది. అప్పట్లో ఈ ఐడియా ఎలా వచ్చింది సార్?' అని ఓ నెటిజన్.. కృష్ణవంశీని అడిగాడు. ఇందుకు దర్శకుడు స్పందిస్తూ.. అది తమ క్రియేటివిటీ కాదని చెప్పాడు. మూవీ రిలీజ్ తర్వాత జెమిని టీవీ ఎడిటర్ దాన్ని ఇలా మలిచాడని క్లారిటీ ఇచ్చాడు.ఈ సంగతి తెలుసుకున్న జనాలు సర్ప్రైజ్ అవుతున్నారు. ఇన్నాళ్లూ సినిమాలోనే ఎడిట్ చేశారనుకున్నాం.. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావేంటయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సౌందర్యను ఇంధ్రదనస్సులా అన్ని రంగు చీరల్లో చూపించాలన్న అతడి ఐడియాను మెచ్చుకోవాల్సిందేనంటున్నారు. ఈ క్రమంలో అసలేం గుర్తుకు రాదు సినిమా ఒరిజినల్ సాంగ్‌తో పాటు చీర రంగులు మార్చే వీడియో నెట్టింట వైరలవుతోంది. Adi not on film sir .. Gemini tv lo editor chesedu release తర్వాత .. ,🙏❤️ THQ https://t.co/gLLNeZNE6n— Krishna Vamsi (@director_kv) July 20, 2024 Pedda Mosame Idi 😂😂😂pic.twitter.com/I2060ZEvIg https://t.co/TBsi9z2DxJ— Movies4u Official (@Movies4u_Officl) July 20, 2024 చదవండి: ‘మురారి’ ఫ్లాప్ మూవీ.. కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్ -
‘మురారి’ ఫ్లాప్ మూవీ.. కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్
కృష్ణ వంశీ తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో ‘మురారి’ ఒకటి. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలై క్లాసిక్ హిట్‌గా నిలిచింది. మణిశర్మ అందించిన సంగీతం, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. కృష్ణవంశీ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రసంశలు కురిపించారు.మహేశ్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకున్నాడని ఘట్టమనేని అభిమానులు అభినందించారు. మహేశ్ కూడా తను బాగా ఇష్టపడే సినిమాల్లో మురారి ఒకటని ఎప్పుడూ చెబుతుంటాడు. ఆయన అభిమానులు కూడా తమ హీరో నుంచి మురారి లాంటి మరో క్లాసిక్ మూవీ రావాలని కోరుకుంటున్నారు. ఇక మహేశ్ బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మురారీ సాంగ్స్‌ని, ఆ సినిమా విశేషాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.కృష్ణవంశీ సైతం సోషల్ మీడియా వేదికగా మురారి చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ అభిమానులు అలరిస్తున్నాడు. అయితే ఈ రీరిలీజ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ ‘మురారి’ ప్లాప్ సినిమా అని రాసుకొచ్చాడు. దానికి కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ‘హలో అండీ నేను మురారి నిర్మాత ఎన్.రామలింగేశ్వరరావు గారి నుంచి రూ. 55 లక్షలకు ఐదేళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా హక్కులను కొన్నాను. ఫస్ట్ రన్లో రూ. 1.30 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఒకవేళ వసూళ్లే ప్రామాణికం అయితే.. అది ఫ్లాప్ చిత్రమా లేదా సూపర్ హిట్టా?’ మీరే నిర్ణయించుకోండి’ అని రిప్లై ఇచ్చాడు. -
సిగరేట్ పెట్టెపై ‘అర్థశతాబ్దపు..’ పాట రాశాడు : కృష్ణవంశీ
దివంగత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రితో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. శాస్త్రిని ఆయన గురువుగా చెప్పుకుంటారు. శాస్త్రి కూడా కృష్ణవంశిని దత్త పుత్రుడు అని సంభోధించేవాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి శాస్త్రి లిరిక్స్ అందించాడు. కొన్ని పాటలు అయితే ఇప్పటికీ మర్చిపోలేం. అందులో ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా’ అనే పాట ఒకటి. ఆ పాట అప్పుడే కాదు ఇప్పుడు విన్నా గూస్బంప్స్ వచ్చేస్తాయి. ఇంత గొప్ప పాటను రాయడానికి సీతారామ శాస్త్రి కేవలం గంట సమయం మాత్రమే తీసుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ తెలిపాడు. అంతేకాదు ఆ పాటని రోడ్డు మీద పడేసిన సిగరేట్ పెట్టమీద రాశాడట. ‘ఆర్జీవీ తెరకెక్కించిన ‘శివ’, ‘క్షణ క్షణం’, ‘అంతం’ సినిమాల ద్వారా శాస్త్రితో నాకు స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత నేను దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి శాస్త్రిగారితో లిరిక్స్ రాయించుకున్నాను. నా ప్రతి సినిమా కథను ముందుగా శాస్త్రికి చెప్పడం అలవాటు. అలాగే కాపీ వచ్చిన తర్వాత కూడా ఆయనకే చూపించేవాడిని. అలా సింధూరం సినిమా కాపీని ఆయనకు చూపించాను. అది చూసిన తర్వాత శాస్త్రి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ‘ఏంటి గురువుగారు’ అంటే ‘పేపర్ ఏదైనా ఉందా?’అని అడిగాడు. అప్పుడు నా దగ్గర పేపర్ లేదు. దీంతో రోడ్డు మీద సిగరెట్ పెట్టె పడి ఉంటే తీసి ఇచ్చాను. దాని మీద లిరిక్స్ రాసుకొని..వెంటనే ఇంటికెళ్లి గంటలో పాట రాసిచ్చాడు. అంతేకాదు ‘నువ్వు ఏం చేస్తావో తెలియదు.. సినిమాలో ఫలాన చోట ఈ పాట రావాలి’అని చెప్పారు. ఇదంతా సినిమా విడుదలకు రెండు రోజుల ముందు జరిగింది. ఏం చేయాలో అర్థం కాక..బాలు దగ్గరికి వెళ్లి చెప్పాను. చివరకు రికార్డు చేసి విడుదల చేశాం. రిలీజ్ తర్వాత సినిమాకు అదే కీలకం అయింది’ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. ‘నిన్నే పెళ్లాడతా సినిమాలో ‘కన్నుల్లో నీ రూపమే’ పాట సందర్భం వివరిస్తూ.. ‘హీరో హీరోయిన్ల ఇళ్లల్లో పెద్దవాళ్లు లేరు. వారిద్దరు కలవాలి.ఎంతైనా చెప్చొచ్చు.. కానీ ఏమి చెప్పకూడదు’అని చెబితే.. ‘నువ్వు నాశనం.. నేను నాశనం’ అని వ్యంగ్యంగా నన్ను తిడుతూ శాస్త్రిగారు ‘కన్నుల్లో నీ రూపమే’ పాట రాశారు’అని కృష్ణవంశీ చెప్పారు. -
సిరివెన్నెలకు నివాళిగా ‘నా ఉచ్చ్వాసం కవనం’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
మహేశ్‌బాబుతో సినిమా చేయడం కష్టం: కృష్ణవంశీ
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం మురారి. ఈ మూవీ 23 ఏళ్లవుతున్నా ఇప్పటికీ అందులోని పాటలు, కథ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాలు చేశాడు, నంది అవార్డులు అందుకున్నాడు. కానీ ఇంతవరకు మళ్లీ మహేశ్‌తో సినిమా చేయలేదు. దీంతో ఎక్స్ (ట్విటర్) వేదికగా అభిమానులు మహేశ్‌తో మరో కుటుంబ కథా చిత్రం చేయండి అని అడిగారు. రాఖీలాంటి సినిమా.. దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ.. మహేశ్ ఇంటర్నేషనల్ స్టార్ కాబోతున్నాడండీ.. కాబట్టి తనతో సినిమా చేయడం కష్టం అని రిప్లై ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో రాఖీ లాంటి సినిమా మళ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్న ప్రశ్నకు ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్టార్.. కానీ రాఖీలాంటి సినిమా మరొకటి ప్లాన్ చేస్తున్నాను. నిన్నే పెళ్లాడతా సీక్వెల్? ఈసారి ఒక అమ్మాయితో.. కాన్సెప్ట్, సమస్య అంతా వేరుగా ఉంటుంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఆ సినిమా తీస్తాను అని రిప్లై ఇచ్చాడు. నాగచైతన్యతో నిన్నే పెళ్లాడతా సీక్వెల్ తీస్తే చూడాలనుందన్న అభిమాని కోరికకు సీక్వెల్ తన వల్ల కాదని చెప్పాడు. నాకంత సీన్ లేదని చేతులు జోడించి రిప్లై ఇచ్చాడు. Mahesh is going to b an international star Andi .. so kastam ... THQ 🙏❤️ https://t.co/A5xbIWVTzn — Krishna Vamsi (@director_kv) February 26, 2024 Sequel I can't Andi .. antha scene ledu Naku 🙏❤️ https://t.co/Y3d4YWEh9n — Krishna Vamsi (@director_kv) February 26, 2024 ఎన్టీఆర్ ఇస్ a great artist Andi .. unique n inimatable ... THQ ❤️🙏 https://t.co/hcOMDG0vEN — Krishna Vamsi (@director_kv) February 26, 2024 ఎన్టీఆర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అండి... కానీ రాఖీ లాంటి సినిమా ఇంకొకటి ప్లాన్ చేస్తున్నా ... ఈ సారి ఒక అమ్మాయి తో ... Different concept different problem but more intensity more power ... Anneee కుదిరితే త్వరలో ... THQ 🙏💕 https://t.co/8SwbawOxjR — Krishna Vamsi (@director_kv) February 26, 2024 చదవండి: గిల్లితే గిల్లించుకోవాలి.. ఆ రౌడీ బ్యూటీ గుర్తుందా? ఇప్పుడెలా ఉందంటే? -
హనుమాన్ కంటే 'శ్రీ ఆంజనేయం' బెటర్.. కృష్ణ వంశీ రియాక్షన్ వైరల్
ఈ సంవత్సరం సంక్రాంతి హిట్‌గా 'హనుమాన్' చిత్రం నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతుంది. తాజాగా ఈ సినిమా 300 సెంటర్లలో 30రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా హనుమాన్ ఉండటం విశేషం. హనుమాన్ చిత్రం గురించి సోషల్ మీడియా ఒక చర్చ జరుగుతుంది. గతంలో కృష్ణ వంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం చిత్రం గురించి ఇప్పుడు మళ్లీ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.నితిన్, ఛార్మి నటించిన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. సినిమా కథ బాగున్నప్పటికీ కొన్ని పాయింట్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. కానీ ఇందులో కూడా గ్రాఫిక్స్ పనితీరును మెచ్చుకోవాల్సిందే. తాజాగా నెటిజన్లు కొందరు హను మాన్ కంటే శ్రీ ఆంజనేయం సినిమానే గొప్ప సినిమా అంటూ కృష్ణ వంశీ ఎక్స్ పేజీలో పలు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో అంటూ తిడుతూ ఒక పోస్ట్ పెట్టాడు. దానికి డైరెక్టర్ కృష్ణ వంశీ రియాక్ట్ అయ్యారు. ప్లీజ్ ప్రేక్షకులను మాత్రం తిట్టకండి వాళ్ల నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు.. శ్రీ ఆంజనేయం సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది. ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వాళ్లకు నచ్చలేదు. కానీ మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు అని కృష్ణ వంశీ రిప్లై ఇచ్చారు. ఇంతలో మరో నెటిజన్ శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మి క్యారెక్టర్ చాలా చిరాకు పుట్టించేలా ఉందని చెప్పాడు. ఈ కారణంతోనే సినిమా ప్లాప్ అయిందని తెలిపాడు. అందుకు కృష్ణ వంశీ మాత్రం గాడ్ బ్లెస్ యు అని రిప్లై ఇచ్చారు. వాస్తవంగా అప్పట్లో ఆ సినిమా ప్లాప్‌కు కారణం ఛార్మి పాత్రే అని ఎక్కువగా కామెంట్లు చేశారు. ఆమెలో మంచి నటి ఉన్నప్పటికీ కథలో ఛార్మి పాత్రను క్రియేట్ చేసిన విధానం బాగలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి చిత్రంలో మితిమీరిన ఎక్స్ ఫోజింగ్ సాంగ్ ఉండటం ఎవరికీ నచ్చలేదు. నితిన్ పాత్రను కూడా మరీ అమాయకంగా చూపించడం పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. Audience r never wrong .. they didn't like it means there was a mistake r problem of reachability .. so dnt blame audience sir .. may b I was wrong AT some portions .. THQ 🙏♥️ God bless https://t.co/RBumH9z4nm — Krishna Vamsi (@director_kv) February 11, 2024 GOD bless you 🙏 https://t.co/1AcCs3Q2vq — Krishna Vamsi (@director_kv) February 11, 2024 -
హృదయాన్ని హత్తుకునేలా ‘అలనాటి రామచంద్రుడు’ టీజర్
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు టీజర్ ని లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హాజరైన టీజర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ‘మా అమ్మ ఎప్పుడు చెప్పేది.. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కారణాలు అడ్డు వచ్చినా.. ఆ ప్రేమని చనిపోయింతవరకూ వదులుకోకూడదు’ అనే డైలాగ్ మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమకథని చాలా కొత్తగా, మనసుని హత్తుకునేలా చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేశాయి. ‘’ఆ రాముడు సీత కోసం ఒక్కసారే యుద్ధం చేశారు. కానీ నా సీత కోసం ప్రతిక్షణం నాతో నేనే యుద్ధం చేస్తున్నా’, ‘కాలిపోతున్న కాగితానికి ఎంత ప్రేమ చూపించినా తిరిగిరాదు’, ‘చందమామను చేరుకోవడం ఆ పావురానికి గమ్యం అయితే.. నిన్ను చేరుకోవడమే నా గమ్యం ధరణి’ అనే డైలాగ్స్ ప్రేమకథని డెప్త్ ని తెలియజేస్తున్నాయి. కృష్ణ వంశీ టీజర్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మోక్ష అందం, అభినయంతో అలరించింది. దర్శకుడు ఆకాష్ రెడ్డి హార్ట్ టచ్చింగ్ లవ్ స్టొరీని ప్రజెంట్ చేస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. శశాంక్ అందించిన నేపధ్య సంగీతం మరింత ఆకర్షణగా నిలిచింది. -
కృష్ణ వంశీ నాకు అన్ని నేర్పించారు..!
-
రమ్యకృష్ణ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా..?
-
రమ్యే ఆర్డర్ ఇస్తే నేను చేయాల్సిందే : దర్శకుడు కృష్ణ వంశీ
-
కొడుకును రమ్యకృష్ణనే చూసుకుంటుంది
-
ప్రేక్షకులు నా సినిమాలు చూస్తారా..?
-
నాకు ఆ సినిమా నచ్చలేదు.. ఎందుకంటే ?
-
కృష్ణ వంశీ తన మూవీ ఫెయిల్యూర్ గురించి..!
-
సీతారామశాస్త్రి గురించి దర్శకుడు కృష్ణవంశీ గొప్ప మాటలు
-
అప్పట్లో చాలా పొగరుండేది నాకు
-
బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో ... చేయగలరు మాస్టారు అని కృష్ణవంశీ అన్నారు.
-
చిన్నతనంలోనే నాన్న మరణం.. తొలి సినిమాకు రూపాయి తీసుకోలే!
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా శశి ప్రీతమ్ సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలోని సంగీతం ఎంతలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే! తొలి చిత్రంతోనే మ్యూజికల్ హిట్ కొట్టిన ఈయన తర్వాత పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'నేను పుట్టి పెరిగిందంతా కలకత్తాలోనే! తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాం. అమ్మానాన్న ఇద్దరూ టీచర్లే! మేము నలుగురం పిల్లలం. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. ఎన్నో కష్టాలు చూశాక ఈ స్థాయికి వచ్చాను. కాలేజీ పూర్తయిపోగానే స్టూడియో పెట్టుకుని కంపోజర్‌గా మారాను. జింగిల్స్ కంపోజ్ చేసేవాడిని. నా తొలి పారితోషికం రూ.50. గులాబీ సినిమా చేసే సమయానికే జింగిల్స్‌తో మంచి పేరు సంపాదించాను. అప్పుడు ఒక్క జింగిల్కు రూ.50 వేలు తీసుకున్నాను. 1993లో నా పెళ్లయింది. మాది ప్రేమ వివాహం. మాకు ఒక పాప ఉంది. నా తొలి సినిమా గులాబీ చేసేటప్పుడు రాత్రిళ్లు పాపను ఎత్తుకుని పని చేసుకునేవాడిని. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత భార్యతో విడిపోయాను. కూతురు నా దగ్గరే పెరిగింది. ప్రతి రోజు ఛాలెంజ్‌లను దాటుకుంటూనే ముందుకు సాగాను. తొలి సినిమా గులాబీకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 1999 నుంచి 2019 వరకు దాదాపు 25 సినిమాలు చేశాను. మధ్యలో కృష్ణవంశీతో గొడవ కూడా అయింది. సముద్రం సినిమాతో మళ్లీ కలిసిపోయాం. ఆ తర్వాత బాలీవుడ్ కూడా వెళ్లాను. తెలుగులో కొన్ని సినిమాల్లో అంతకు ముందు వచ్చిన పాటల్లోని సంగీతాన్ని కాస్త అటూఇటూ మార్చమనేవారు. అది నాకు నచ్చేది కాదు. అదే సంగీతం కావాలనుకుంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికే వెళ్లండి, నన్నెందుకు అడుగుతున్నారు అని చెప్పి కొన్ని ప్రాజెక్టుల్లో నుంచి నేను బయటకు వచ్చేవాడిని. అది కొందరికి నచ్చలేదేమో.. అవకాశాలు ఇవ్వలేదు. అందుకే సినిమాలకు కాస్త దూరమయ్యాను' అని చెప్పుకొచ్చాడు శశి ప్రీతమ్. చదవండి: కట్టె కాలేవరకు మెగాస్టార్ అభిమానినే: అల్లు అర్జున్ చిరంజీవి, విజయ్ విషయంలో ఎక్కువ వాధపడ్డాను: రష్మిక -
ఆ సినిమా తరువాత నా జీవితం అంత చీకటి అయిపోయింది..
-
ఆ సినిమా తరువాత నా జీవితం అంత చీకటి అయిపోయింది...
-
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీను ఇలా ఎప్పుడైనా చూశారా?
-
అమ్మనాన్నలతో అంతగా కనెక్షన్ లేదు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా కాలం తర్వాత తెరకెక్కించిన చిత్రం రంగమార్తాండ. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన తొలిరోజు నుంచే హిట్ తెచ్చుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కృష్ణవంశీ మార్క్ మరోసారి కనిపించిదంటూ సినీ ప్రముఖులు పొడగ్తలు వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో రంగమార్తాండ సక్సెస్ గురించి కృష్ణవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ''ఈ సినిమాకి వస్తున్న ఆదరణ గతంలో చూస్తుంటే ముచ్చటేస్తుంది. గతంలో నేను చేసిన సినిమాల కంటే రంగమార్తాండ ప్రత్యేకం. చిరంజీవి లాంటి దిగ్గజ నటుల నుంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. సోసల్ మీడియాలోనూ ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది. రిలీజ్‌కు ముందు అంతగా ప్రచారం చేయకున్నా మంచి కంటెంట్ చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని రంగమార్తాండతో మరోసారి రుజువు అయ్యింది. ఇది 'ఇది మన అమ్మానాన్నల కథ' అని క్యాప్షన్ ఇవ్వడంతో ఆడియెన్స్ మరింత కనెక్ట్ అయ్యారు. అయితే సినిమాకి, నా పర్సనల్ లైఫ్‌కి చాలా తేడా ఉంది. మా నాన్న చాలాకాలం క్రితమే చనిపోయారు. మా అమ్మ మాత్రం నాతోనే ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను మా పేరెంట్స్‌తో అంతగా కనెక్టెడ్‌గా లేను.ఫ్యామిలీ సినిమాలు తీస్తాను కానీ.. రియల్ లైఫ్‌లో బ్యాడ్ సన్ని. ఇంట్లోవాళ్ల విషయానికి వస్తే.. ఎవరితోనూ అంత క్లోజ్‌గా మాట్లాడను'' అంటూ కృష్ణవంశీ పేర్కొన్నారు. -
బ్రహ్మానందం 20 టేకులు చెప్పినా చేసేవారు: కృష్ణవంశీ
‘‘ప్రతి నటుడిలో విభిన్న కోణాలు ఉంటాయి. వాటిని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించడం నాకు ఇష్టం. విలన్‌గా చేస్తున్న చలపతిరావుగారిని ‘నిన్నే పెళ్లాడతా’లో మంచి తండ్రిగా చూపించాను. బ్రహ్మానందంగారిలోని మరో నటుణ్ణి ‘క్షణం క్షణం’లో చూశాను. అందుకే ‘రంగ మార్తాండ’లోని చక్రి పాత్రలో ఆయన్ని ఊహించుకునే ధైర్యం చేశా.. ఆయన పాత్ర అద్భుతంగా వచ్చింది’’ అన్నారు డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, ఆదర్శ్, అనసూయ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ– ‘‘మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’ ప్రకాశ్‌రాజ్‌కి బాగా నచ్చింది. నన్నా సినిమా చూసి, స్క్రీన్‌ప్లేలో సాయం చేయమన్నాడు. నాలాంటి రాక్షసుడితోనే కంటతడిపెట్టించిన చిత్రమిది. ఆ తర్వాత నాకు తోచిన మార్పులు ప్రకాశ్‌రాజ్‌కి చెబితే.. ‘ఈ సినిమాకి నువ్వే దర్శకత్వం వహిస్తే బాగుంటుంది’ అనడంతో ఓకే అన్నాను. మనుషులపై నాకు ఇంకా నమ్మకం పోలేదు. ఓ మంచి సినిమా తీస్తే ఆదరిస్తారనే నా నమ్మకాన్ని వారు ‘రంగమార్తాండ’ ద్వారా నిజం చేశారు. 1250కి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందంగారు ఒక్కో సీన్‌కి పదీ ఇరవై టేకులు చెప్పినా చేసేవారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంగారి నటన, ఇళయరాజాగారి సంగీతం సినిమాకి హైలైట్. శివాత్మిక, అనసూయ, రాహల్, ఆదర్స్ బెస్ట్ ఇచ్చారు. చిరంజీవిగారి వాయిస్ ఓవర్ ప్లస్సయింది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు బ్రహ్మానందం. -
రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి ప్రశంసలు
ఆడియెన్స్‌ని తనదైన కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకునే కమెడియన్ బ్రహ్మానందం. స్క్రీన్‌పై ఆయన ఒక్కసారి కనిపిస్తే చాలు, స్టార్ హీరోలకు ధీటుగా రెస్పాన్స్ వస్తుంటుంది. అయితే కెరీర్ లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ మూవీలో ఒక సీరియస్ రోల్లో కనిపించారు బ్రహ్మానందం. ఉగాది సందర్భంగా విడుదలైన రంగమార్తాండ మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్‌లో రన్ అవుతోంది. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం నటనకు ముగ్దులవుతున్నారు. ఇన్నాళ్లు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇలా ఏడిపించేశారు ఏంటి? అని అనుకుంటున్నారు. థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ఆడియెన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. బ్రహ్మానందం నటించిన పాత్రకు ఇంత మంచి పేరు రావడంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు. -
ఎందుకు ఈ సినిమా.. ఎవరు చూస్తారని అడిగా : రమ్యకృష్ణ
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఉగాది సందర్భంగా మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘సినిమా ప్రారంభానికి ముందు ‘అసలు ఇలాంటి చిత్రాలను ఇప్పుడు ఎవరు చూస్తారు?’ అని కృష్ణవంశీని అడిగాను. కానీ ఆయన మొండి కదా.. వినిపించుకోకుండా షూటింగ్‌ని ప్రారంభించారు. ఇందులో నేను పోషించిన పాత్ర కోసం మొదటగా చాలా మంది హీరోయిన్లను సంప్రదించారు. ఎవరూ ఎంపికకాకపోవడంతో..చివరకు నేను ఆ పాత్ర చేస్తానని ముందుకొచ్చా. కళ్లతోనే నటించాలని చెప్పారు. అలానే నటించాను. నా పాత్ర నిడివి అంత ఉంటుందని ఊహించలేదు. ఎమోషనల్ సినిమాలు నాకు అంతగా నచ్చవు. కానీ ఈ సినిమా షూటింగ్ చేస్తుండగానే.. భావోద్వేగానికి లోనయ్యాం. ప్రతి సీన్ హృదయాలను హత్తుకునేలా తిశాడు. వంశీ కెరీర్లో ఇదొక బెస్ట్ మూవీగా నిలుస్తుంది’ అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. -
'నీ బంగారు నిన్ను దొంగ అంటోంది'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను హౌల్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తే కుటుంబంలో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లు కనిపిస్తోంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషన్స్, డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రమ్యకృష్ణ-ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం-ప్రకాశ్ రాజ్ మధ్య సాగే ఎమోషన్స్ ఈ చిత్రంలో హైలెట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో బ్రహ్మనందం సీరియస్ లుక్ సినిమాకే హైలెట్‌గా మారనుంది. జీవితంలో నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి జీవిత అనుభవాలను సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షోను ప్రదర్శించగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. -
‘రంగమార్తాండ’ చిత్రం ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
'రేయ్.. నువ్వొక చెత్త నటుడివిరా'.. ఆసక్తిగా టీజర్
ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. రంగమార్తాండ టీజర్ ఫుల్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేను ఒక నటుడిని అనే చిరంజీవి వాయిస్‌తో టీజర్ మొదలైంది. 'రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా' అనే బ్రహ్మనందం డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. 'నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తాండ రాఘవరావుని' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పె డైలాగ్‌తో టీజర్ అదిరిపోయింది. ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం రంగమార్తాండుడి జీవన నాటకమని దర్శకుడు కృష్ణవంశీ పేర్కొన్నారు . ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించగా.. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కించారు. -
రమ్యకృష్ణను అలా చూసి ఏడ్చేశా.. రోజంతా నిద్రపట్టలేదు: కృష్ణ వంశీ
ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానంతం ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం రంగమార్తాండ. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య పాత్రలు పోషించగా ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిలిం నటసామ్రాట్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతుండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. ఈ క్రమంలో డైరెక్టర్ కృష్ణవంశీ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'రమ్యకృష్ణ పాత్ర పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశా. మా ఇంట్లో ఏ నిర్ణయమైనా నా భార్యే తీసుకుంటుంది. ఒకవేళ రమ్య లేనప్పుడు మేము నిర్ణయం తీసుకున్నా దానిలో మార్పులు చేర్పులు చేయమని సూచిస్తుంటుంది. కానీ, నేను పెద్దగా పట్టించుకోను.. అది వేరే విషయం. ఇకపోతే రమ్యకు శక్తివంతమైన కళ్లు ఉన్నాయి. అరుపులు, కేకలు కాకుండా కళ్లతోనే నటించాలనగానే ఆమె ఈ సినిమా ఒప్పుకుంది. తన మేకప్, హెయిర్ స్టైల్ తనే చేసుకుంది. తనెప్పుడూ ఒక విజన్‌తో ముందుకెళ్తుంది. ఈ సినిమాలో లాస్ట్ చాప్టర్లో తనను షూట్ చేయడానికి చచ్చిపోయాననుకో! దాదాపు 36 గంటలపాటు షూటింగ్ జరిగింది. తనను ఆ సీన్లో చిత్రీకరించడానికి సెంటిమెంట్ అడ్డొచ్చింది, కానీ తప్పదు కదా! షూట్ చేస్తుంటే కళ్ల వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ రాత్రి నేను సరిగా నిద్రపోలేకపోయాను. ఒకరకంగా చెప్పాలంటే గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశా' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు కృష్ణవంశీ. -
నా గుండె గుబులుగా ఉంది.. సింగర్ సునీత ఎమోషనల్
సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్లో స్టార్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సునీత ఆత్మ విశ్వాసంతో ముందకెళ్లారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో సునీత మాట్లాడుతూ... 'ఇప్పుడే రంగమార్తాండ సినిమా చూశా. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నా. ఈ సినిమాలో పాత్రలను కృష్ణవంశీ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా చూశాక గుండె బరువెక్కిపోయింది. అంతే కాకుండా గుబులు మొదలైంది. కానీ ఆ బరువు చాలా బాగుంది. మనసు గుబులుగా ఉంటే అందులోనే ఉండిపోవాలనిపిస్తోంది. ఇలాంటివి డైరెక్టర్ కృష్ణవంశీకే సాధ్యం. రంగమార్తాండ మూవీ చాలా బాగుంది. మీరందరూ కూడా కచ్చితంగా ఈ సినిమా చూడండి. మీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి'. అంటూ ఎమోషనల్ అయ్యారు. (ఇది చదవండి:కేజీఎఫ్ హీరోయిన్ను వేధించిన యశ్?.. క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి) కాగా..సునీతకు తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా రోజుల తర్వాత మంచి సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఆయన తెరకెక్కించిన 'రంగ మార్తాండ' ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో ఆయన భార్య రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. సినీ ప్రముఖుల కోసం ఈ చిత్రం స్పెషల్ షోను ప్రదర్శించారు. ఈ సినిమా వీక్షించిన సింగర్ సునీత ఎమోషనలయ్యారు. ఇలాంటి సినిమా చూస్తుంటే తన గుండెలో గుబులు మొదలైందని అన్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
Rangamarthanda : కృష్ణవంశీ ఫార్ములా బాక్సాపీస్ దగ్గర వర్కౌట్ అవుతుందా?
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ బ్రాండ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు కృష్ణ వంశీ. నక్షత్రం మూవీ తర్వాత ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి రీమేక్ గా కృష్ణ వంశీ రంగమార్తాండ తెరకెక్కించాడు. నటసామ్రాట్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఇక్కడ ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. కరోనా కి ముందు మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న రంగమార్తాండ మార్చి 22న విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో కృష్ణవంశీ ప్రేక్షకులను మెప్పించగలడా అనే సందేహాలు టీటౌన్లో వినిపిస్తున్నాయి. కృష్ణవంశీ సినిమాల్లో ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ సీన్స్ తోనే ప్రేక్షకులను స్టోరీకి కనెక్ట్ చేయాలని చూస్తాడు కృష్ణ వంశీ. అయితే ప్రజెంట్ ప్రేక్షకుల ట్రెండ్ మారింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాక్షన్ ఉన్న కథల పైన ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఇక ఫ్యామిలీ టైపు మూవీస్ పై అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి కృష్ణవంశీ ఈ మూవీతో ఏ మేరకు మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైగా రంగమార్తాండ విడుదలైన రోజే విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ రిలీజ్ కానుంది. ఆ తర్వాతి వారంలో నాని తొలి పాన్ ఇండియా మూవీ దసరా విడుదల కాబోతుంది. ధమ్కీ, దసరాల మధ్య రంగమార్తాండ రిలీజ్ చేయటం కొంచెం రిస్క్ గానే కనిపిస్తోంది. ఎందుకంటే రంగమార్తాండ సినిమా అనుకున్నంత హైప్ రాలేదు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ షాయరీ కూడా ఆలపించారు. అయినా ఈ మూవీకి ఎలాంటి బజ్ రాలేదు. ఇక కృష్ణ వంశీ రంగమర్తాండ మూవీకి హైప్ తెచ్చేందుకు రకాలు ప్రయత్నాలు చేసినా ... అవి ఎలాంటి బజ్ తీసుకురాలేదు. చివరిగా కృష్ణవంశీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఈ సినిమా ప్రీమియర్ షో వేసి ప్రమోట్ చేయటంతో...మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ చేసుందుకు స్టెప్ తీసుకుంది. ఇక రంగమార్తాండ ప్రీమియర్ చూసిన సెలబెట్రీస్ నుంచి పాజిటివ్ రివ్యూస్ రావటం ఈ సినిమాకి ప్లస్ గా మారింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా పై డైరెక్టర్ కృష్ణవంశీ భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే రంగమార్తాండ లాంటి సాఫ్ట్ కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి. -
స్టార్ డాటర్‌తో రాహుల్ సిప్లిగంజ్.. వీడియో సాంగ్ విడుదల
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హీరోగా నటిస్తున్న చిత్రం రంగమార్తాండ.కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్‌కు జోడీగా శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్గా నటించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన మూవీ టీం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘పొదల పొదల గట్ల నడుమ లగోరంగ లగోరే..పొడుస్తుంటే చందమామ లగోరంగ లగోరే’ అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. రాహుల్ సిప్లి గంజ్ ఈ పాటను ఆలపించాడు. -
సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ దర్శకుడు కృష్ణ వంశీ
-
ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఆమెను ఎవరైనా గుర్తుపట్టగలరా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు క్రేజ్ అంతా సులభంగా రాదు. ఒకవేళ వచ్చినా ఎక్కువ నిలబెట్టుకోవడం సవాల్‌తో కూడుకున్న పని. అలా చాలామంది కెరీర్‌ను మధ్యలోనే ఆపేసిన కథానాయికలు ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన టాలీవుడ్ స్టార్ నటీమణులు ఎందరో ఉన్నారు. తాజాగా అలా కనిపించకుండా పోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో తన గులాబీ చూపులతో బంధించిన కథానాయిక మహేశ్వరి మీకు గుర్తున్నారా?. ప్రస్తుతం ఆమెను చూస్తే గుర్తు పడతారా? ఇటీవల బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌తో ఆమె ఫోటో దిగింది. కానీ ఆ ఫోటోలో అందరూ జాన్వీ చూశారే తప్ప.. పక్కన ఉన్న హీరోయిన్ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మహేశ్వరి.. అంటే నేటి యువతకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ అదే గులాబీ సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది భామ. అమ్మాయి కాపురం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత వచ్చిన ‘గులాబీ’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఆ సినిమా అప్పట్లో భారీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. జేడీ చక్రవర్తి హీరోగా తెరకెక్కిన చిత్రంలో మహేశ్వరి జంటగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మజీ, బెనర్జీ, జీవ, చంద్రమోహన్, చలపతిరావు కీలకపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం ఇండస్ట్రీలో పలు రికార్డులను తిరగరాసింది. గులాబీ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో మహేశ్వరికి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. వడ్డే నవీన్‌తో పెళ్లి, జేడీ చక్రవర్తితో దెయ్యం, మృగం లాంటి సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
రమ్యకృష్ణతో విడాకులు? స్పందించిన కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రంగమర్తాండ'. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబందించిన విశేషాలతో పాటు మ్యారేజ్ లైఫ్‌పై వస్తోన్న రూమర్స్‌పైనా స్పందించారు. గత కొన్నాళ్లుగా కృష్ణవంశీ- నటి రమ్యకృష్ణ విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ ఈ వార్తలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'బాధ్యతలంటే భయంతో అసలు పెళ్లే వద్దునుకున్నా. కానీ చివరకు రమ్యకృష్ణతో వివాహం జరిగింది. ఇదంతా లైఫ్ డిజైన్ అని భావిస్తాను. పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. రమ్యకృష్ణ నన్ను నన్నులా ఉండనిచ్చింది. ఇక ఆమెతో విడాకులు అంటారా? ఇందులో నిజం లేదు. పబ్లిక్ ఫిగర్స్‌గా ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు వస్తుంటాయి. కానీ మేం పెద్దగా పట్టించుకోం. అందుకే ఖండించాలని కూడా అనుకోము. జస్ట్ నవ్వి ఊరుకుంటాం' అంతే అంటూ చెప్పుకొచ్చారు. -
చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ వల్లే ప్రాణాలతో బయటపడ్డా : కృష్ణవంశీ
మెగాస్టార్ చిరంజీవి అంటే చిత్రపరిశ్రమలో అందరికి ఇష్టమే. ఎంత ఎదిగిన ఒదిగిన ఉండే వ్యక్తిత్వం ఆయనది . అందుకే సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఆయనకు అభిమానిగా మారుతారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఒక్కరు. ఆయనకు మెగాస్టార్ అంటే ఎనలేని ప్రేమ. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను అన్నయ్య(చిరంజీవి)అంటే చాలా ఇష్టమని అంటున్నాడు కృష్ణవంశీ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి, ఆయన తనకు ఇచ్చిన బహుమతి గురించి చెప్పుకొచ్చాడు. ‘చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చాడు. తోటి నటీనటులను గౌరవంగా చూసుకుంటాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ అలానే ఉన్నాడు. అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం. పర్సనల్‌గాను ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. కష్టకాలంలో ‘గోవిందుడు అందరివాడేలే’సినిమాను ఇచ్చాడు. గతంలో మెగాస్టార్‌తో కలిసి ఓ యాడ్ చేశాను. డబ్బింగ్ సమయంలో ‘అన్నయ్యా.. మీకు బాగా నచ్చిన వ్యక్తికి మీ కారు గిఫ్ట్‌గా ఇస్తారా?’అని సరదాగా అడిగాను. కొన్ని రోజుల తర్వాత ఇంటికి పిలిచి కారు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. నేను వద్దని చెప్పాను. నాకు బహుమతులు తీసుకోవడం ఇష్టం ఉండదు.. ఒకవేళ ఇచ్చిన నా దగ్గర అవి ఎక్కువ కాలం ఉండవు’అని చెప్తే.. ‘అన్నయ్యా అని పిలుస్తున్నావు.. మరి ఈ అన్నయ్య గిఫ్ట్ ఇస్తే తీసుకోవా? అని అనడంతో మొహమాటంగానే తీసుకున్నాను. దానితో ఎన్నో సాహసాలు చేశా. ఓ సారి నందిగామ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. అది చాలా పెద్ద యాక్సిడెంట్..కానీ నా ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్న చిన్న గాయాలతో బయపడ్డాను. అన్నయ్య ఇచ్చిన కారు వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను’అని కృష్ణవంశి చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘రంగ మార్తాండ’అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరాఠీ సూపర్ హిట్ ‘నట సామ్రాట్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ‘అన్నం’చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. -
కృష్ణ వంశీ భారీ ప్లాన్.. రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్!
కరోనా తర్వాత జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. దీంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ కోసం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్ కోసం బాగానే ఖర్చు చేస్తున్నాయి. తెలుగులో కూడా పదుల సంఖ్యల్లో వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. వీటి కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్నారు. పేరున్న చాలా మంది దర్శకులు వెస్ సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కృష్ణ వంశీ కన్ను కూడా వెబ్ సిరీస్‌లపై పడింది. (చదవండి: హిట్టు కోసం అలా చేయడం నాకు చేతకాదు : కృష్ణవంశీ) త్వరలోనే ఆయన కూడా ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడట. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఓటీటీ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు.‘వచ్చే ఏడాదిలో ఓటీటీ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడే చెప్పను కానీ పెద్ద బ్లాస్ట్ అది. 200–300 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఓటీటీలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. స్టార్సే ఉండాలని రూల్ కూడా లేదు. సినిమాను స్వచ్ఛంగా తీయొచ్చు’అని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. మరి కృష్ణవంశీ చేయబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఓటీటీ రంగంలో ఎలాంటి రికార్టు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘రంగ మార్తాండ’అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరాఠీ సూపర్ హిట్ ‘నట సామ్రాట్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ‘అన్నం’చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. -
ఆ సినిమా కోసం చిరంజీవి 'షాయరీ'
Chiranjeevi Shayari In Krishna Vamsi Rangamarthanda: మెగాస్టార్ చిరంజీవి షాయరీ వినిపించనున్నారు. షాయరీ అంటే.. మాటా కాదు.. అలా అని పాటా కాదు. ఒక కవితాత్మకమైన ధోరణిలో చెప్పేది. ఇంతకీ చిరంజీవి షాయరీ ఎందుకు చెప్పారంటే 'రంగ మార్తాండ' చిత్రం కోసం. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక నటుడి జీవితం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆ నటుడు తన జీవితంలో ఎదుర్కొనే ఘటనలు, అతని భావోద్వేగాలు ఇవన్నీ చెప్పాలంటే.. 30 ఏళ్లకుపైగా నటనానుభవం ఉన్న చిరంజీవి అయితే బాగుంటుందని కృష్ణవంశీ భావించారట. ఆ నటుడి తాలుకూ భావోద్వేగాన్ని షాయరీ రూపంలో చెబితే ప్రేక్షకుల మనసులను తాకొచ్చని అనుకున్నారట. ఇప్పటివరకూ చిరంజీవి పలు చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ షాయరీ చెప్పలేదు. అందుకే కృష్ణవంశీ షాయరీ గురించి చెప్పగానే చిరంజీవి ఎగ్జయిట్ అయి, ఓకే అన్నారట. (చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ..) ఇటీవలే ఈ షాయరీని రికార్డ్ చేశారని, ఒక రోజులేనే చిరంజీవి చెప్పారని తెలిసింది. 'రంగ మార్తాండ'కు మెగాస్టార్ చెప్పిన ఈ షాయరీ కచ్చితంగా హైలెట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించనున్నారు. (చదవండి: పాడె మోసి మాట నిలబెట్టుకున్న నటుడు.. ఎమోషనల్‌గా పోస్ట్..) -
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కృతి సనన్ చెల్లెలు
మహేశ్ బాబు ‘వన్ నేనొక్కడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. తొలి సినిమాతో టాలీవుడ్ బై చెప్పి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొంది వరస ఆఫర్స్ బిజీగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె చెల్లి నుపుర్ సనన్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. రవీతేజ తదుపరి చిత్రం టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నుపుర్ హీరోయిన్గా ఎంపికైనట్లు తాజాగా మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. కాగా దర్శకుడు కృష్ణవంశీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజతో నుపుర్ జోడి కట్టనుంది. చదవండి: తెలుగు సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ అంటున్నారు: తాప్సీ ఇదిలా ఉంటే మాస్ మహారాజ రవితేజ వరస హిట్స్, ప్లాప్స్తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెడుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ఖీలాడి మూవీ రిలీజై బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. ఇదిలా ఉంటే త్వరలోనే రామారావు ఆన్ డ్యూట్ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు ధమాకా, రావణాసుర సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. ఇవి ఉండగానే రవితేజ పాన్ ఇండిచా చిత్రం టైగర్ నాగేశ్వరరావు పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ చేయనున్నట్టుగా ఇటీవల చిత్రం బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’పై కేఏ పాల్ అనుచిత వ్యాఖ్యలు, ఆర్జీవీ కౌంటర్ Woohoo! The lovely @NupurSanon is now starring in @RaviTeja_offl 's first Pan India film, #TigerNageswaraRao... Directed by #Vamsee and produced by #AbhishekAgarwal. The movie launches on 2 April 2022 in #Hyderabad. Superb news #nupursanon #raviteja #siddharthkannan #sidk pic.twitter.com/Z6gQe5nFmG — Siddharth Kannan (@sidkannan) March 31, 2022 -
ప్రకాశ్ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ కృష్ణవంశీ
Director Krishna Vamsi Interesting Comments On Prakash Raj: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రకాశ్ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనను రాక్షసుడు అని పిలిచి ఆశ్చర్యపరిచారు. కాగా కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా రంగమార్తాండ. 'నట సామ్రాట్' అనే మరాఠీ సినిమాకి ఇది రీమేక్. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఈ మూవీ రూపొందుతోంది. కాగా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం చివరి షెడ్యూల్ చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ తాజాగా తిరిగి సెట్స్‌పైకి వచ్చింది. చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసిన నితిన్.. దీంతో ప్రకాశ్ రాజ్‌కు సంబంధించిన ఎమోషనల్ క్లైమాక్స్ సీన్స్‌తో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు కృష్ణవంశీ ట్వీటర్లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చివరి దశకు చేరుకున్న రంగమార్తాండ. నేను అత్యంత అభిమానించే నటుడు.. నటరాక్షసుడు ప్రకాశ్ రాజ్‌తో భావోద్వేగభరితమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న.. స్టన్నింగ్’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, రాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: కరోనా ఎఫెక్ట్.. మరో భారీ బడ్జెట్ చిత్రం వాయిదా Started the final ANKAM of RANGAMARTHANDA..... Shooting a most emotional climax with my most fav actor NATARAKSHSA prakashraj ... Stunning 💕💕💕💕. pic.twitter.com/n9PRnR5sEH — Krishna Vamsi (@director_kv) January 6, 2022 -
చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలి: ప్రముఖ దర్శకుడు
'గులాబి', 'నిన్నే పెళ్లాడుతా', 'అంతఃపురం', 'ఖడ్గం', 'రాఖీ' వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు కృష్ణ వంశీ. జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న ఈ దర్శకుడు కొంతకాలంగా ఫాంలో లేరు. దీంతో రంగమార్తాండ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడీ డైరెక్టర్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'నాగార్జున నా ఫేవరెట్ హీరో.. మెగాస్టార్ చిరంజీవితో రెండు, మూడు సినిమాలనుకున్నాం, కానీ కుదరలేదు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి. రంగమార్తాండ సినిమా షూటింగ్ ఇంకా పది రోజులు మిగిలే ఉంది. ఈ సినిమాలో కొత్త బ్రహ్మానందాన్ని చూస్తారు. అలాగే రమ్యకృష్ణలో కొత్త కోణాన్ని చూస్తారు. రంగమార్తాండ సినిమా షూట్ కంప్లీట్ అవగానే అన్నం సినిమా ప్రీపొడక్షన్ మొదలవుతుంది. తర్వాత మరో ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. రంగమార్తాండ థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. మరి ఇది ఓటీటీలోకి వస్తుందా? థియేటర్లో రిలీజ్ అవుతుందా? అన్నది ఇప్పుడే చెప్పలేం' అని చెప్పుకొచ్చారు కృష్ణ వంశీ. -
Akkineni Nagarjuna: ‘నేను చూసిన నాగార్జుననే పేరు మార్చి శీనుగా చూపించా’
‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం విడుదలై నేటికి పాతికేళ్లు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఆ సినిమా విశేషాలను పంచుకున్నారిలా.. ► నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో నాగార్జునగారు ఎలా ఉంటారో నిజ జీవితంలోనూ అలాగే ఉంటారు. రియల్ లైఫ్‌లో నేను చూసిన నాగార్జుననే సినిమాలో శీనుగా పేరు మార్చి చూపించానంతే. ► చెన్నైలో మూడు నాలుగేళ్లుగా వివిధ డిపార్ట్మెంట్స్లో రకరకాల పనులు చేస్తున్న నన్ను.. శివ నాగేశ్వరరావు ‘శివ’ సినిమా కోసం రాముగారి వద్ద (రామ్ గోపాల్ వర్మ) అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్పించారు. ‘శివ’ సమయంలో నేను, తేజ, శివ నాగేశ్వరరావు అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పనిచేశాం. ఆ చిత్ర నిర్మాత నాగార్జునగారు అన్నపూర్ణ స్టూడియోలోనే మాకు గెస్ట్ హౌస్ ఇచ్చారు. తెలుగు ‘శివ’, హిందీ ‘శివ’ చిత్రాలకు దాదాపు రెండున్నరేళ్లు స్టూడియోలోనే ఉండి పనిచేశాం. అప్పుడు నా జీవితంలో దగ్గరగా చూసిన పెద్ద స్టార్ (అక్కినేని నాగేశ్వరరావు) కొడుకు, స్టార్ హీరో నాగార్జునగారు. ‘అంతం’ సినిమాకి బెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనిపించుకున్నాను. నా పనితీరును గమనించిన నాగార్జునగారు డైరెక్టర్ అవుతావా? ఏదైనా కథ రెడీ చేసుకో అన్నారు. ► ‘అంతం’ సినిమా చిత్రీకరణ ముగిసే సమయంలో విజయవాడ రౌడీయిజంపై నాగార్జునకి ఓ కథ చెప్పాను. ఇంట్రవెల్ వరకూ విని.. ‘ఈ కథ వద్దులే వంశీ.. రాము(ఆర్జీవీ) సినిమాలాగానే ఉంది ఇది. నీకు ఇండిపెండెంట్ కథ ఉన్నప్పుడు కచ్చితంగా చేద్దాం’ అన్నారు నాగార్జున. నా ‘గులాబీ’ సినిమా అయిపోయిన సమయంలో నాగార్జున ‘రాముడొచ్చాడు’ సినిమా చేస్తున్నారు. అప్పటికే నేను రెడీ చేసుకున్న ‘అన్యాయం’ అనే ఓ కథ వినిపిస్తే, ‘బాగుంది.. కానీ ఇంకొంచెం కొత్తగా చేద్దాం’ అన్నారు. ► ‘గులాబీ’ విడుదలయ్యాక నేను, ‘నిధి’ ప్రసాద్, కెమెరామ్యాన్ కలసి వైజాగ్‌లో లొకేషన్స్ చూడటానికి వెళ్లాం. ఒకతను వచ్చి.. ‘గులాబి’ సినిమాని అచ్చం మీ బాస్‌లాగా (ఆర్జీవీ) బాగా తీశావ్ అన్నాడు. ‘గులాబి’ చిత్రానికి నాకంటూ ప్రత్యేక గుర్తింపు రాలేదా? అని అప్పుడు నేను ఆలోచనలో పడ్డా. వయలెంట్ సినిమా తీస్తే బాస్‌లా తీశావంటారు.. ఇప్పటి వరకూ బాస్ టచ్ చేయని ఫ్యామిలీ జానర్లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయాన్ని బాస్‌కి చెబితే ఓకే అన్నారు. నేను ఏ సినిమా చేసినా కథ బాస్‌కి(ఆర్జీవీ) చెప్పేవాణ్ణి.. ఆయనకు నచ్చితే ఓకే అంటారు.. ఎక్కడైనా అభ్యంతరం అనిపిస్తే చెప్పేవారు. ► ఈ చిత్రంలో ‘నా మొగుడు రామ్‌ప్యారి’ అనే పాటని సుద్దాల అశోక్ తేజగారు బాగా రాశారు. ఆ ఒక్క పాట మినహా మిగిలిన అన్ని పాటల్ని గురువుగారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తనదైన శైలిలో అద్భుతంగా రాశారు. ► నాకెప్పుడూ ఒక కొత్త ఇమేజ్ క్రియేట్ చేయడం ఇష్టం. చలపతిరావుగారి ఫార్ములాయే జీవా, బ్రహ్మాజీలకు వాడాను. ఫ్యామిలీ అంటే రక్త సంబంధీకులే కాదు.. స్నేహితులు కూడా అనే కాన్సెప్ట్‌లో తీసుకున్నాను. చలపతి రావు, చంద్రమోహన్, గిరిబాబు, ఉత్తేజ్ పాత్రలు కూడా బాగా పండాయి. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత ‘సింధూరం’ కథ అనుకున్నా. రాఘవేంద్ర రావుగారు నాపై ఉన్న ఇష్టంతో మందలించారు. ‘ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఎవరూ మనల్ని పట్టించుకోరు. మంచి జానర్ నుంచి ఎందుకు బయటికొస్తున్నావ్.. అందరి హీరోలతోనూ కుటుంబ కథా చిత్రాలు చెయ్’ అన్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ హిట్ అయ్యాక చాలా మంది హీరోలు కూడా కుటుంబం నేపథ్యంలో మాతో కూడా సినిమాలు చేయమని అడిగారు. అయితే నాగార్జునగారు మినహా వేరే హీరోలపై నాకు కుటుంబ కథా చిత్రం చేయాలనే ఆలోచన రాలేదు. చదవండి: ఇప్పుడైతే ‘నిన్నే పెళ్లాడతా’లో ఆ సీన్స్ చేసేవాణ్ణి కాదు -
ఇప్పుడైతే ‘నిన్నే పెళ్లాడతా’లో ఆ సీన్స్ చేసేవాణ్ణి కాదు: నాగార్జున
కొన్ని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. శ్రీను, పండు పాత్రలు అలాంటివే. ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జున అక్కినేని –టబు చేసి పాత్రల పేర్లివి. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ ‘హోల్సమ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్’ విడుదలై సోమవారానికి (అక్టోబర్ 4)కి పాతికేళ్లు. ఈ సందర్భంగా ఆ సినిమా హీరో, హీరోయిన్లతో స్పెషల్ టాక్. నాకు రొమాంటిక్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ► ఇది చూస్తుంటే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకు అప్పుడే పాతికేళ్లు పూర్తయ్యాయా అనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. రాము (రామ్‌గోపాల్ వర్మ) ప్రొడక్షన్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబి’ సినిమాను రిలీజ్‌కు ముందే చూశాను.. ఆ సినిమా నచ్చి, నా అభిప్రాయాలను రామూతో షేర్ చేసుకున్నాను. ఈ దర్శకుడితో ఓ రొమాంటిక్ ఫిల్మ్ తీస్తే బాగుంటుందని రామూతో అన్నాను. కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్.. అతనితో నువ్వు వర్క్ చేస్తే బాగానే ఉంటుందన్నాడు. పైగా నా ‘శివ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన కృష్ణవంశీతో నాకూ పరిచయం ఉంది. అలా ‘నిన్నే పెళ్లాడతా’ మొదలైంది. కథ ముందే చెబితే పడే గొడవల్ని షూటింగ్‌కు ముందే పడదామని వంశీకి చెబితే ఓకే అన్నాడు. డైలాగ్స్, ప్లేస్‌మెంట్స్ ఇలా అన్నింటితో కథ చెప్పాడు. అయితే చివరి 10 నిమిషాలు మినహాయించి కథ చెప్పాడు. అద్భుతంగా అనిపించింది. ► కథ నచ్చడంతో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో ఈ సినిమాను నిర్మిస్తూ, నిర్మాతగా మారాను. అప్పటివరకు నాన్నగారు, అన్నయ్య సినిమాలు తీస్తూ ఉన్నారు. అయితే నాన్నగారు రిటైర్ అవ్వడం, పెద్దన్నయ్య సినిమాలు కాస్త తగ్గించడంతో నేను స్టార్ట్ చేశాను. ► అప్పట్లో శ్రీను, పండు (మహాలక్ష్మి) క్యారెక్టర్లు బాగా పాపులర్ అయ్యాయి. బైక్ రేస్, సముద్రంలో పాట... ఇలా కొత్తగా చూపించాం. ‘గ్రీకువీరుడు..’ పాట వండర్ఫుల్. నాకు మ్యాచో అండ్ రొమాంటిక్ ఇమేజ్ను తెచ్చిపెట్టిన పాట ఇది. సాధారణంగా రొమాంటిక్కు మ్యాచో ఇమేజ్ రాదు. రెండూ ఒకే టైమ్‌లో వర్కౌట్ కావు. కానీ కృష్ణవంశీకి అది సాధ్యం అయ్యింది. కృష్ణవంశీ తక్కువ రోజుల్లోనే షూట్‌ను కంప్లీట్ చేసి నాకు బాగా హెల్ప్ చేశారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టారు. ► సినిమాలోని బైక్ సీక్వెన్స్‌ను నేను డూప్ లేకుండా చేశాను. అంత వేగంతో ఎలా నడిపానో తెలియదు. ఇప్పుడైతే చేయను. ఇప్పుడు మా పిల్లలు అడిగినా కూడా చేయవద్దనే చెబుతాను. ఇది ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. పాటల్లో పెద్దగా డ్యాన్స్ లేకపోయినా ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. ► క్యారెక్టర్ల మధ్య వైవిధ్యం చూపించడాన్ని నా అదృష్టంగానే భావిస్తాను. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘అన్నమయ్య’ షూటింగ్‌ను స్టార్ట్ చేశా. క్లాస్, మాస్ కన్నా అది ఇంకా డిఫరెంట్. ఇక్కడ టబుతో ‘కన్నుల్లో నీ రూపమే..’ వంటి పాటలు చేసి, ‘అన్నమయ్య’ షూట్లో పాల్గొనడం అంటే.. కాస్త లక్కీయే. తెలుగు ప్రేక్షకులు నన్ను రెండు విధాలుగా చూసేందుకు అంగీకరించారు. అలాగే దర్శకులు నాపై ఉంచిన నమ్మకం కూడా. ‘‘నిన్నే పెళ్లాడతా..’ వంటి రొమాంటిక్ ఫిల్మ్ చేస్తున్నాను... మీరు ‘అన్నమయ్య’ సినిమా చేయమంటున్నారు. వచ్చి ఒకసారి పాటలు చూడండి’ అని రాఘవేంద్రరావుగారితో అన్నాను. ‘నాకు వదిలెయ్’ అన్నారు. ‘అన్నమయ్య’ సినిమాకు పనికి రాడు అని టాక్ కూడా వచ్చింది. కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరికినట్లయింది. ‘అన్నమయ్య’ వంటి పాత్రలు కూడా నేను చేయగలనని నిరూపించుకోగలిగాను. నా కెరీర్లో ఓ బెంచ్ మార్క్: టబు నా జీవితంలో ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఓ తీయని అనుభూతిని మిగిల్చింది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఇంత పెద్ద స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. కృష్ణవంశీ మంచి తపన ఉన్న దర్శకుడు. ఈ సినిమాకి వర్క్ చేసినప్పుడు కుటుంబసభ్యుల మధ్య పని చేసినట్లుగా, ఏదో పిక్నిక్కి వెళ్లినట్లుగా అనిపించింది. షూటింగ్ పూర్తయిన తర్వాత నా ఫ్యామిలీని వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. సినిమాతో పాటు పాటలు కూడా హిట్టే. తన తొలి సినిమాయే అయినా సందీప్ చౌతా మంచి సంగీతాన్ని అందించారు. ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన దర్శకుల్లో వంశీ (కృష్ణవంశీ) మంచి ప్రతిభాశాలి. ∙ఈ చిత్రంలో నాగార్జున చేసిన శ్రీను క్యారెక్టర్ ఫన్నీ, లవ్లీ అండ్ ఎంటర్టైనింగ్. నా క్యారెక్టర్ పేరు మహాలక్ష్మి. కానీ సినిమాలో పండు అని పిలుస్తుంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో నటించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. శ్రీను, పండుల మధ్య కెమిస్ట్రీని వంశీ చాలా సహజంగా తీశారు. ఇలాంటి సినిమాలను రీ క్రియేట్ చేయడం కష్టం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది ఓ బెంచ్ మార్క్ ఫిల్మ్... నా కెరీర్లో కూడా. చదవండి: ఓటీటీ నుంచి మంచి అవకాశాలు వచ్చాయి.. కానీ.. -
మహేష్ కెరియర్లోనే తొలి సిల్వర్ జూబ్లీ సినిమా
హీరో మహేష్‌బాబు కెరియర్లోనే తొలి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం 'మురారి'. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయ్యింది. దీంతో సోషల్ మీడియాలో #20YearsForMurari హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాతోనే నటి సోనాలి బింద్రే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథాంశం, కుటుంబ భావోద్వేగాలు, మణిశర్మ సంగీతం..ఇలా ఈ చిత్రంలోని ప్రతీ అంశం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దాని ఫలితమే బాక్స్‌ఫీస్ వద్ద వసూళ్ల సునామీ కురిపించింది. మురారి విడుదలై 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రస్టింగ్ విశేషాలు.. కృస్ణవంశీ ఈ సినిమాను ఎంతో వైవిధ్యంగా తెరకెక్కించాడు. నిజానికి మురారి కథ నిజజీవిత సంఘనల ఆధారంగా తీశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ పేరున్న జమీందార్ బ్రిటిష్ వారి కోసం తమ ఇలవేల్పు అయిన అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని దొంగిలిస్తాడు. దీంతో అమ్మవారి ఆగ్రహానికి గురై అతడు చనిపోతాడు. అంతేగాక తన వంశానికి ఒక శాపాన్ని పొందుతాడు. అప్పటి నుంచి ప్రతీ 48 ఏళ్ళకొకసారి వచ్చే ఆశ్వయిజ బహుళ అమావాస్య నాడు ఆ జమీందార్ ఇంటిలోని వారసుల్లో ఒకరు మరణిస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరో కూడా మరణిస్తారని భావించిన నేపథ్యంలో ఆయన చనిపోతాడా లేదా? ఆ శాపం నుంచి ఎలాంటి విముక్తి పొందుతారు అన్న అంశాలకు ఆధ్యాత్మికత జోడించి ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను రక్తికట్టించడంలో కృష్ణవంశీ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ముందే మహేష్ 3 సినిమాల్లో నటించినా మురారీ మాత్రం ఆయన కెరియర్లోనే తొలి సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిచింది. కేవలం 5కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు 23 కేంద్రాల్లో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. మహేశ్ బాబు కెరీర్ లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచిన మురారి సినిమా తన ఆల్ టైం ఫెవరెట్ సినిమా అని మహేష్ భార్య నమ్రత అన్నారు. మురారి ఎప్పటికీ మర్చిపోలేని చిత్రమన్నారు. ఇక మురారి సినిమా పరంగానే కాకుండా, మ్యూజికల్‌గానూ సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు ఎవర్గ్రీన్. ముఖ్యంగా 'అలనాటి రాముచంద్రుడి' ....అనే పాట ఇప్పటికీ ప్రతి తెలుగింటి పెళ్లి వేడుకల్లో మార్మోగుతూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
వైరల్ : పునర్నవితో రాహుల్ సందడి
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవి భూపాలంతో కలిసి సందడి చేశారు. బిగ్‌బాస్ సీజన్ 3లో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నవారిలో రాహుల్, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్, పునర్నవి లవ్‌లో ఉన్నారనే ప్రచారం జరగగా.. వారిద్దరు ఆ వార్తలను ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. తాజాగా సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇచ్చిన ఓ పార్టీలో రాహుల్, పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ‘రంగమార్తాండ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాహుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ప్రకాశ్‌రాజ్.. రంగమార్తాండ చిత్ర బృందానికి ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి కృష్ణవంశీ, రమ్యకృష్ణ, రాహుల్, పునర్నవి, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా రాహుల్.. ‘ఏమై పోయావే నీవెంటే నేనుంటే.. ’ పాటు పాడుతూ పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను, ఫొటోలను రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అని పేర్కొన్నాడు. ఈ వీడియోకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
వైరల్ : పునర్నవితో రాహుల్ డ్యాన్స్
-
డైరీ ఫుల్
శక్తిమంతమైన పాత్రలకు, సున్నితమైన పాత్రలకు సూట్ అయ్యే నటి రమ్యకృష్ణ. ఎంత హాట్‌గా కనిపించగలరో అంతే ట్రెడిషనల్‌గా కూడా కనిపించగలరు. ప్రస్తుతం క్యారెక్టర్ నటిగా రమ్యకృష్ణ డైరీ ఫుల్. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటిస్తున్న ‘రొమాంటిక్’లో నటిస్తోన్న రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ అనే సినిమాలో మెయిల్ లీడ్ చేయబోతున్నారు. చేతిలో ఈ రెండు సినిమాలు ఉండగానే తాజాగా వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో అతని తల్లిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుంది. -
కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నట సామ్రాట్’..!
ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఈ సీనియర్ డైరెక్టర్ హిట్ సినిమా ఇచ్చి చాలా ఏళ్లే అవుతుంది. నక్షత్రం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న కృష్ణ వంశీ త్వరలో ఓ రీమేక్ సినిమాతో రెడీ అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించిన మరాఠి సినిమా నట సామ్రాట్‌ను తెలుగులో రీమేక్ చేసేందుకు కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నానా పాత్రలో తన ఆస్థాన నటుడు ప్రకాస్ రాజ్ ను తీసుకోవాలని భావిస్తున్నాడట. మరి ఈ రీమేక్ సినిమాతో అయినా కృష్ణవంశీకి సక్సెస్ వస్తుందేమో చూడాలి. -
సింగర్‌గా మారిన మరో యంగ్ హీరో
బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన తనీష్ తరువాత హీరోగానూ కొన్ని సినిమాల్లో కనిపించాడు. అయితే కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు రాకపోవటంతో ఇటీవల నక్షత్రం సినిమాతో విలన్‌గా మారాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా తనీష్‌కు సక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం దేశ దిమ్మరి అనే సినిమాలో నటిస్తున్నాడు తనీష్. ఇప్పటికే హీరో నుంచి విలన్ గా మారిన తనీష్ ఈ సినిమాతో సింగర్ గా మారుతున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నగేష్ నారదాసి దర్శకుడు. నవీన క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
రానా హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్
వరుసగా ఆసక్తికర సినిమాలను చేస్తూ ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా. మరోక్రేజీ ప్రాజెక్ట్‌కు సైన్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 1945, హాథీ మేరీ సాథీ, రాజా మార్తండ వర్మ సినిమాలలో నటిస్తున్న రానా ఓ టాలీవుడ్ సీనియర్ దర్శకుడితో సినిమా చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రానా హీరోగా ఓ ఇంట్రస్టింగ్ సినిమాను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వరుస పరాజయాల తరువాత తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న కృష్ణవంశీ, కొత్త సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రానాతో పాటు తమిళ నటుడు మాధవన్ మరో కీలక పాత్రలో నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మరో హీరో పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
'నక్షత్రం' మూవీ రివ్యూ
టైటిల్ : నక్షత్రం జానర్ : యాక్షన్ మూవీ తారాగణం : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాష్ రాజ్ సంగీతం : మణిశర్మ, భీమ్స్, భరత్ మధుసూదన్, హరి గౌర దర్శకత్వం : కృష్ణవంశీ నిర్మాత : కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు క్రియేటివ్ డైరెక్టర్ గా స్టార్ ఇమేజ్ అందుకున్న కృష్ణవంశీ కొంతకాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు. డిఫరెంట్ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ ఇమేజ్ అందుకోలేకపోతున్నాడు హీరో సందీప్ కిషన్. మెగా హీరోగా మంచి ఫాంలో కనిపించిన సాయి ధరమ్ తేజ్ కూడా సినిమాల ఎంపికలో తప్పటడుగులతో వరుస ఫ్లాప్ లు చూశాడు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే నక్షత్రం. మరి నక్షత్రం వీరి కెరీర్ లను గాడిలో పెడుతుందా..? కథ : తాతల కాలం నుంచి పోలీసు కుటుంబం కావటంతో తాను కూడా పోలీస్ కావాలన్న ఆశయంతో కష్టపడుతుంటాడు రామారావు (సందీప్ కిషన్). పోలీసులను ఒక్కమాట అన్నా సహించలేని రామారావు.. అనుకోకుండా ఓ సారి పోలీస్ కమీషనర్ కొడుకు రాహుల్ (తనీష్)తో గొడవపడతాడు. పోలీసులను కొట్టాడన్న కోపంతో రాహుల్ తో పాటు అతని స్నేహితుల మీద చేయిచేసుకుంటాడు. దీంతో రామారావు మీద పగ పట్టిన రాహుల్, అతనికి పోలీసు ఉద్యోగం రాకుండా చేస్తాడు. ఇక తనకు పోలీస్ ఉద్యోగం రాదన్న బాధతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ న్యాయాన్ని కాపాడటానికే పోలీసే కానవసరం లేదు.. సమాజం పట్ట బాధ్యత ఉంటే చాలని.. ఉద్యోగం లేకపోయినా.. పోలీసు డ్యూటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. అలా డ్యూటీ చేస్తుండగా క్రిమినల్ ముఖ్తార్ కారులో బాంబులు తీసుకెళ్తూ రామారావుకు దొరుకుతాడు. రామారావును నిజం పోలీసు అనుకున్న ముఖ్తార్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారుతో సహా బాంబులు పేలిపోతాయి. ముఖ్తార్ ను కాపాడిన రామారావు వాణ్ని తన ఇంట్లో దాచిపెడతాడు. అయితే ఈ బ్లాస్ట్ వీడియో టీవీలో చూసిన పోలీసులు రామారావు యూనిఫాం మీద అలెగ్జాండర్ అని నేమ్ ప్లేట్ ఉండటంతో అతని కోసం వెతకటం మొదలు పెడతారు. అసలు అలెగ్జాండర్ ఎవరు..? బాంబ్ బ్లాస్ట్ చేసిన ముఖ్తార్ కి అలెగ్జాండర్ కి సంబంధం ఏంటి..? అలెగ్జాండర్ ఏమయ్యాడు.? ఈ గొడవల నుంచి రామారావు ఎలా బయట పడ్డాడు..? అనుకున్నట్టుగా రామారావుకి పోలీసు ఉద్యోగం వచ్చిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఎంతో మంది నటులకు ఈ నక్షత్రం కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ సినిమా. అందుకు తగ్గట్టుగా ప్రతీ ఒక్కరు ప్రాణం పెట్టి సినిమా కోసం పని చేశారు. ముఖ్యంగా హీరో సందీప్ కిషన్ మాస్ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ మంచి నటనతో మెప్పించాడు. నెగెటివ్ రోల్ లో యువ నటుడు తనీష్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. గెస్ట్ రోల్ లో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ టైం తక్కువే అయినా.. తనదైన స్టైలో మెప్పించే ప్రయత్నం చేశాడు. రెజీనా పాత్ర కేవలం గ్లామర్ షోకే పరిమితం కాగా.. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ తో పాటు యాక్షన్స్ సీన్స్ తోనూ అలరించింది. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, బ్రహ్మాజీ లు తమ పరిధిమేరకు పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : తన కెరీర్ కు ఎంతో కీలకమైన సినిమా విషయంలో దర్శకుడు కృష్ణవంశీ మరోసారి నిరాశపరిచాడు. తన గత చిత్రాల మాదిరిగా క్రైం, లవ్, దేశభక్తి లాంటి అంశాలను కలిపి చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఆకట్టుకోలేకపోయాడు. క్లారిటీ లేని క్యారెక్టరైజేన్స్, సీన్స్ తో ప్రేక్షకుడ్ని కథలో ఇన్వాల్వ్ చేయలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథను స్టార్ట్ చేయకుండా గ్లామర్ షోతో నడిపించేయటం బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ తరువాత అసలు కథలోకి ఎంటర్ అయినా.. కథనం మాత్రం నెమ్మదిగా సాగింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు ఆకట్టుకున్నా.. కృష్ణవంశీ గత చిత్రాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే నిరాశ తప్పదు. పాటలు పరవాలేదనిపించినా.. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ యాక్టర్స్ నటన మెయిన్ స్టోరి మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
నక్షత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ, తాజాగా నక్షత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ముందుగా ఈ సినిమాను ఈ నెల 21న రిలీజ్ చేయాలని భావించినా.. అదే రోజు మరో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫిదా రిలీజ్ అవుతుండటంతో ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో వారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 28న నక్షత్రం రిలీజ్ అంటూ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడుతున్న సాయి, సందీప్, కృష్ణ వంశీల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. -
‘నక్షత్రం’ వర్కింగ్ స్టిల్స్
-
సక్సెస్ అంటే నక్షత్రంలాంటి సినిమా తీయడమే!
దర్శకుడు కృష్ణవంశీ ‘‘ నా సినిమాలు ప్రేక్షకుల్లో చెడు ఆలోచనలను ప్రేరేపించకూడదు. ఒకవేళ అలాంటి సినిమాలు సక్సెస్ అయినా.. ఆ తరహా కాన్సెప్ట్ సినిమాలను నేను తీయను. నా సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి ఒకణ్ణి కొట్టాలనిగానీ, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనగానీ రాకూడదు. మంచి ఆలోచన కలగాలి’’ అని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. సందీప్ కిషన్, రెజీనా హీరో, హీరోయిన్లుగా సాయిధరమ్‌తేజ్, ప్రగ్యా జైస్వాల్, ప్రకాశ్‌రాజ్ ముఖ్యపాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నక్షత్రం’. శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్టబొమ్మ క్రియేషన్స్, విన్ విన్ విన్ క్రియేషన్స్ పై ఎస్.వేణుగోపాల్, కె.శ్రీనివాసులు, సజ్జు నిర్మించారు. ఆదివారం హీరో సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ నెల చివర్లో సినిమా విడుదల కానుంది. కృష్ణవంశీ మాట్లాడుతూ– ‘‘రిలీజియన్ వల్ల క్రియేట్ అయ్యే ఒక సమస్యపై ఓ సామాన్యుని పోరాటమే ‘నక్షత్రం’. సినిమా విడుదలలో జాప్యం జరగడానికి కారణం ప్రధాని మోదీ. నోట్ల రద్దు ప్రభావంతో మా సినిమాను అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా విడుదల చేస్తున్నాం. నేను నాలాగే సినిమాలు తీసి హిట్ సాధించాలనుకుంటాను. రిస్క్ లేకుండా సినిమాలు తీయడం అంటే ఏంటో నాకు తెలీదు. నాకు సినిమాలు ఇలాగే తీయడం తెలుసు. విజయాల కోసం, అవార్డుల కోసం సినిమాలు తీయను. అసలు ఆ ఆలోచనే నాకు ఉండదు. సక్సెస్‌కు విభిన్న రకాల నిర్వచనాలు ఉన్నాయి. నా దృష్టిలో సక్సెస్ అంటే డబ్బు కాదు. ‘నక్షత్రం’ లాంటి సినిమాను తీయగలగడం సక్సెస్ అనుకుంటున్నా’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారితో సినిమా తీయాలనేది ఓ పదేళ్ళ క్రితం నాటి కల’’ అనారు నిర్మాత వేణు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ– ‘‘నేను హీరో అవ్వడం ఒకటి. కృష్ణవంశీగారి సినిమాలో హీరో అవ్వడం ఒకటి’’ అన్నారు. ‘‘ఒక స్టూడెంట్‌లా ఈ చిత్రం సెట్స్‌కి వచ్చి ఒక టీచర్ దగ్గర ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకున్నాను’’ అని సాయిధరమ్ అన్నారు. రెజీనా, ప్రగ్యా జైస్వాల్, ఛాయాగ్రాహకుడు శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. -
కట్ చేస్తే... టచ్ చేసి చూడు
‘కంచె’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’... చేసింది మూడు చిత్రాలే అయినా అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నక్షత్రం’ చిత్రంలో నటిస్తోన్న ఈ బ్యూటీకి తాజాగా మాస్ మహారాజ రవితేజ సరసన నటించే బంపర్ ఆఫర్ వరించిందని ఫిల్మ్‌నగర్ టాక్. విక్రమ్ సిరికొండను దర్శకునిగా పరిచయం చేస్తూ నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మంచనున్న ‘టచ్ చేసి చూడు’. ఈ సినిమాలో ఒక హీరోయిన్గా రాశీఖన్నాను ఎంపిక చేయగా, రెండో కథానాయికగా ప్రగ్యాను తీసుకున్నారని తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్గా లావణ్యా త్రిపాఠి పేరు వినిపించినా.. కట్ చేస్తే.. ఫైనల్‌గా ఆ అవకాశం ప్రగ్యాకు దక్కిందని సమాచారం. -
తమిళ దర్శకుడితో 101వ చిత్రం.?
తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించిన బాలకృష్ణ ఘనవిజయం సాధించాడు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. అదే ఊపులో తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ. ప్రతిష్టాత్మక చిత్రం తరువాత చేయబోయే సినిమా కావటంతో అదే జోరును కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకే రెండు, మూడు సినిమాలను పరిశీలనలో పెట్టాడు. ముందుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేసాడు బాలకృష్ణ. అయితే ఈ సినిమాలో కీలక పాత్రకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సంప్రదిస్తున్నారు. ఆయన అంగీకరిస్తేనే రైతు సినిమా ఉంటుందని లేని పక్షంలో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేయాలని భావిస్తున్నాడు. అదే సమయంలో తమిళ స్టార్ డైరెక్టర్ కేయస్ రవికుమార్‌తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేసే రవికుమార్, తెలుగులోనూ ఒకటి, రెండు సినిమాలను డైరెక్ట్ చేశాడు. పక్కా కమర్షియల్ సినిమాలను అందించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న రవికుమార్ బాలయ్య బాడీలాంగ్వేజ్‌కు తగ్గ కథ రెడీ చేశాడట. రైతు సినిమా లేని పక్షంలో రవికుమార్ సినిమానే పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు బాలకృష్ణ. -
అమ్మడికి అవకాశాలే లేవట..!
ఎస్ఎమ్ఎస్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రెజీనా. కెరీర్ స్టార్టింగ్‌లో కమర్షియల్ సక్సెస్‌లు సాధించలేకపోయినా.. నటిగా మాత్రం మంచి మార్కులే సాధించింది. రవితేజ సరసన హీరోయిన్గా నటించిన పవర్ సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకున్న రెజీనా.. తరువాత ఆ ఫాంను కంటిన్యూ చేయలేకపోయింది. కెరీర్లో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద లాంటి హిట్ సినిమాలు ఉన్నా.. వరుస అవకాశాలు మాత్రం పలకరించటం లేదు. తమిళ్లో కాస్త పరవాలేదని పించినా.. టాలీవుడ్లో మాత్రం అమ్మడు ఆశించిన స్ధాయిలో రాణించటం లేదు. జ్యో అచ్యుతానంద తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది రెజీనా. ఈ సినిమా తరువాత తెలుగులో ఒక్క సినిమా కూడా అమ్మడి చేతిలో లేదు. తనతో పాటు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నాలు టాలీవుడ్లో జోరు చూపిస్తుంటే, రెజీనా మాత్రం కోలీవుడ్ ఆఫర్లతో సరిపెట్టుకుంటోంది. అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన పెద్దగా వర్క్ అవుట్ అయినట్టుగా లేదు. అయితే ఇలాంటి సమయంలో బాలీవుడ్ లో చేస్తున్న సినిమా రెజీనాకు కెరీర్ మీద ఆశలు కల్పిస్తోంది. -
శత్రువుకే ఎదురు నిలిచిన దేశం మనది!
శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన దేశభక్తి చిత్రం ‘ఖడ్గం’. శక్తి సాహిత్యం అందించగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘మేమే ఇండియన్స్..’ పాటతత్వం గురించి కథ-మాటల రచయిత ‘డైమండ్’ రత్నబాబు మాటల్లో.... పల్లవి: సత్యం పలికే హరిశ్చంద్రులం.. అవసరానికో అబద్ధం (2) నిత్యం నమాజు పూజలు చేస్తాం.. రోజూ తన్నుకు చస్తాం (2) నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం.. నమ్మడమేరా కష్టం అరె ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం.. నచ్చకుంటే మీ కర్మం అరె కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చిన.. చెరగని నవ్వుల ఇంద్రధనుస్సులం మేమే ఇండియన్స్.. మేమే ఇండియన్స్.. మేమే ఇండియన్స్.. అరె మేమే ఇండియన్స్ (2) మన భారతీయుల్లో ప్రతి ఒక్కరూ హరిశ్చంద్రుల్లా ఉండాలని ప్రయత్నిస్తారు. కానీ, అవసరాలు మనతో అబద్ధాలు ఆడిస్తాయి. సర్వమత సమ్మేళనం.. మన భారతీయత. కానీ, ఏవేవో చిన్న కారణాలతో నిత్యం గొడవ పడుతుంటాం. ‘నమ్మితె ప్రాణాలైనా ఇస్తాం..’ ఇది మన మనస్తత్వాలకు దగ్గరగా ఉంటుంది. వ్యాపారం పేరుతో వచ్చిన బ్రిటిషర్లను నమ్మడం వలనే బానిసలుగా చేసుకున్నారు. ఆ తర్వాత ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం సాధించుకున్నాం. కష్టం వస్తే పెగ్గులో కన్నీళ్లు మిక్స్ చేసుకుని మగాళ్లు, సీరియల్స్ చూస్తూ అందులో వాళ్లు ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నారని మహిళలు లైట్ తీసుకుంటారు. ఆకాశంలో ఇంద్రధనుస్సులా చిరునవ్వుతో తిరిగేస్తుంటాం. సగం తెలియకుండానే మన జీవితం అయిపోతుంది. తెలుసుకోవడానికి ఇంకో సగం జీవితం పూర్తయిపోతుంది. మొత్తం మీద హ్యాపీగా బతికేస్తున్నాం. అందుకే, ప్రపంచ దేశాలు మన భారతీయుల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. స్నేహం, నమ్మకం, ముక్కుసూటిగా మాట్లాడడం, కష్టం, సుఖం.. అన్నిటిలో మనలా బతకాలనుకుంటున్నారు. చరణం1: వంద నోటు జేబులో ఉంటె నవాబు నైజం పర్సు ఖాళీ అయ్యిందంటే ఫకీరు తత్వం కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం పడుచు పోరి ఎదురుగ వస్తే పళ్లికిలిస్తాం ప్రేమా కావాలంటాం.. పైసా కావాలంటాం ఏవో కలలే కంటాం.. తిక్క తిక్కగా ఉంటాం ఏడేళ్లైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డ్యాన్సులు చేస్తాం కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికి ఓటేస్తాం అందరు దొంగలే అసలు దొంగకు సీటు అప్పచెప్పేస్తాం రూలు ఉంది.. రాంగు ఉంది.. (2) తప్పుకు తిరిగే లౌక్యం ఉంది ॥ఇండియన్స్..॥ ప్రతి మధ్యతరగతి భారతీయుడికి ఈ చరణంలో భావం కనెక్ట్ అవుతుంది. ప్రతినెలా జీతం వచ్చిన మొదటి ఐదు రోజులు షాపింగ్, నచ్చిన ఫుడ్, షికార్లు, సినిమాలు.. రాజభోగమే. చివరి ఐదు రోజుల్లో అప్పులు. ఏవేవో ఆశలు, కలలు.. ప్రేమ, పైసలు రెండూ కావాలి. పరిస్థితులను బట్టి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటాం. కొన్ని సందర్భాల్లో కుల, రాజకీయ, ఆర్థిక ప్రభావంతో మంచి దొంగను ఎన్నుకుంటామనే విషయాన్ని ఇందులో చెప్పాలనుకున్నారు. ఈ చరణం తర్వాత ‘వందేమాతరం..’ అంటూ ఓ ఆలాపన ఉంటుంది. ఇప్పటికీ, ‘వందేమాతరం..’ పాడితే స్కూల్లో ఫస్ట్ బెల్, ‘జన గణ మణ..’ పాడితే లాస్ట్ బెల్ కొడతారని కొందరు విద్యార్థులు భ్రమలో ఉన్నారు. అలా కాకుండా వాటి గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించమని ఉపాధ్యాయులను కోరుతున్నాను. చరణం2: కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది ద్వేషాన్నే ప్రేమగా మార్చిన దేశం మనది ఈశ్వర్ అల్లా ఏసు ఒకడే కదరా బాసూ దేవుడికెందుకు జెండా.. కావాలా పార్టీ అండా మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు చిచ్చుపెట్టిన లుచ్చాగాళ్ళ పనిపట్టు భారతీయులం ఒకటేనంటు పిడికిలెత్తి వేయ్ ఒట్టు కుట్రలు చేసే శత్రు మూకల తోలు తీసి ఆరబెట్టు దమ్మె ఉంది.. ధైర్యం ఉంది.. (2) తలవంచని తెగపొగరే ఉంది ॥మేమే ఇండియన్స్..॥ దేశ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే చరణమిది. ఇండియా-పాక్ సరిహద్దుల్లో ఇటీవల 18 మంది జవాన్లు అమరవీరులయ్యారు. దేశ ప్రజల కోసం సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. మనమంతా ఎవరి పనులు వారు చేసుకోవడానికి కారణం మన ఆర్మీ. సరిహద్దుల్లో మనకోసం పోరాడుతున్న సైనికులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. మనం అందరం గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవడానికి కారణం వాళ్లు శత్రువుల గుండెల్లో నిద్రపోవడమే. చిన్నప్పుడు స్కూల్లో భవిష్యత్తులో మీరు ఏమవుతారని స్టూడెంట్స్‌ని టీచర్ అడిగితే... డాక్టర్, టీచర్, ఇంజినీర్.. కాకుండా నేను ఆర్మీకి వెళ్తాననేలా పిల్లల్లో దేశభక్తి పెంపొందించాలి. మతాల పేరుతో పార్టీల జెండాలను మోయకుండా మూడు రంగుల మువ్వన్నెల జెండా మోసేలా చేయాలి. నాకున్న ఎమోషన్‌కి ఆర్మీకి వెళ్లాలనుకున్నా. మా తల్లిదండ్రులు భయపడ్డారు. రచయిత కావాలనే నాన్నగారి కోరికను నేను నెరవేర్చాను. నాకు ఇద్దరు కుమారులు. వారిలో ఎవరో ఒకరు నా కోరిక నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. అప్పుడు తండ్రిగా కంటే భారతీయుడిగా గర్విస్తాను. ఇంటర్వ్యూ: సత్య పులగం -
ఇంకా ఉన్నాయి!
కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘నక్షత్రం’ ఫస్ట్ లుక్‌ను విజయదశమి సందర్భంగా హీరో రామ్‌చరణ్ విడుదల చేశారు. ఓ హ్యాండ్.. ఆ హ్యాండ్‌కి పోలీస్ బ్యాండ్.. లుక్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన కృష్ణవంశీ.. ఇలాంటి లుక్స్ ఇంకా ఉన్నాయంటున్నారు. ప్రతిరోజూ ఒక్కో లుక్ చొప్పున మరో తొమ్మిది రోజుల పాటు డిఫరెంట్ లుక్స్‌ను రామ్‌చరణ్ విడుదల చేయనున్నారు. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కె. శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
నక్షత్రం లోగో లాంచ్ చేసిన చెర్రీ
గతంలో ప్రకటించినట్టుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నక్షత్రం చిత్ర టైటిల్ లోగో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్, తన సెట్స్ నుంచి ఈ సినిమా లోగోను రిలీజ్ చేశారు. నక్షత్రం చిత్ర దర్శకుడు కృష్ణవంశీతో గతంలో రామ్ చరణ్ హీరోగా 'గోవిందుడు అందరివాడేలే' సినిమాను తెరకెక్కించాడు. ఆ స్నేహంతోనే చెర్రీ కృష్ణవంశీ సినిమా లుక్స్‌ను రిలీజ్ చేసేందుకు అంగీకరించాడు. సందీప్ కిషన్, రెజీనాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో సాయి ధరమ్ తేజ్, ప్రగ్యాజైస్వాల్‌లు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పది లుక్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన కృష్ణవంశీ అన్ని లుక్స్‌ను రామ్ చరణ్ చేతులు మీదుగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను శ్రీనివాసులు, సజ్జు, వేణుగోపాల్ లు నిర్మిస్తున్నారు. Here is the First Look of #Nakshatram Movie launched by the dashing Mega Power Star #RamCharan! #MoreComingUp #StayTuned@sundeepkishan pic.twitter.com/PQM5y3wxSK— Nakshatram (@Nakshatrammovie) 8 October 2016 -
అబద్ధం ఇవాళ్టి జీవన విధానం!
‘‘మహాత్మా గాంధీ అనగానే నాకు ఒకటి కాదు, ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. ‘సత్యశోధన’లో ఆయన జీవితంలో చేసిన ప్రయోగాలు, ఆ సంఘటనలు, ఆయన జీవితం ఇచ్చిన సందేశం... ఇలా ఎన్నెన్నో! సత్య శోధనలో, నిజాయతీగా బతకాలనే ప్రయత్నంలో ప్రతి రోజూ కనీసం పాతికసార్లయినా మన వ్యక్తిత్వం పరీక్షకు గురవుతూ ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, సినిమా - ఇలా ఏ రంగమైనా, ఏం చేస్తున్నా ఇది తప్పదు. నేనూ అందుకు మినహాయింపేమీ కాదు. అలాంటి సంద ర్భంలో మన ప్రవర్తన చూసి కొందరు ఎదురై, నాలుగు అక్షింతలు వేయడమూ ఉంటుంది. అందుకే, సత్యశోధనలో ఒక సంఘటన, సందర్భం అని కాదు. కొన్ని గంటలు మాట్లాడగల అంశాలున్నాయి. మహాత్ముడి జీవితం ఇవాళ్టికీ రిలవెంటా అంటే, కచ్చితంగా! కాకపోతే, అది మనుషులకే రిలవెంట్! నేనీ మాట అంటే చాలామందికి కోపం రావచ్చు కానీ... ఇవాళ మన దేశంలో, మన మధ్య ఇవాళ అసలు సిసలు మనుషులు ఎంతమంది ఉన్నారంటారు! ఎటు చూసినా నాకు జంతువులే ఎక్కువ కనబడుతున్నాయి. ఇవాళ మనలో నీతి, నిజాయతీ, చదువు, విజ్ఞానం, పని చేసే నైపుణ్యం, దేశభక్తి, క్రమశిక్షణ లాంటివి ఉన్నా, లేకపోయినా - మనందరికీ పుష్కలంగా ఉన్నవి మాత్రం మనోభావాలు! మనకున్న పెద్ద ఆస్తి అది! ఎవరు ఏమన్నా, ఏం చేసినా అవి ఎప్పటికప్పుడు దెబ్బ తినేస్తుంటాయి. అదేమిటంటూ మనం మాట్లాడితే, ఎంత ఎక్కువ మాట్లాడితే, అంత ఎక్కువ మంది శత్రువులు తయారవుతారు. అందుకే, మనందరికీ ఇవాళ అబద్ధమే ఒక వ్యక్తిత్వం అయిపోయింది. హిందూ ధర్మం లాగా అది ఒక జీవన విధానంగా మారిపోయింది. ఇలాంటి పెయిన్‌తోనే, నాలో ఉన్న ఈ భావాలన్నీ చెప్పడం కోసమే ‘మహాత్మ’ సినిమా తీశాను. ఆ సినిమా చూసి ఎంతమంది ఆలోచనలో పడ్డారో కానీ, నేను, నా నిర్మాత అయితే ఆర్థికంగా మాత్రం నష్టపడ్డాం! కాకపోతే, మళ్ళీ మహాత్ముడి భావాలు కనీసం కొందరికైనా తెలుస్తోంది కదా అన్నదే సంతృప్తి!’’ - కృష్ణవంశీ, ప్రముఖ సినీ దర్శకుడు -
మెగా హీరో బిజీ అవుతున్నాడు
తిక్క సినిమా రిజల్ట్‌తో నిరాశపరిచిన మెగా హీరో సాయిధరమ్ తేజ్, తిరిగి షూటింగ్‌లకు రెడీ అవుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒకే లుక్‌లో కనిపిస్తున్న సాయి, రాబోయే సినిమాల్లో కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇన్నాళ్లు మాస్ లుక్‌లో కనిపించిన ఈ యంగ్ హీరో నెక్ట్స్ సినిమాలో స్టైలిష్‌గా కనిపించేందుకు స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నాడు. ముందుగా ఈ నెల 19 నుంచి కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం షూటింగ్లో పాల్గొననున్నాడు సాయి. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ అతిథి పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. అదే సమయంలో ఈ నెల 25 నుంచి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాను మొదలెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్‌గా నటిస్తున్న సాయి స్టైలిష్ లుక్‌లో అలరించనున్నాడు. -
నక్షత్రానికి చరణ్ సాయం
రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే లాంటి డీసెంట్ హిట్ తెరకెక్కించిన కృష్ణవంశీ, తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా చరణ్ సాయం తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం సినిమాను తెరకెక్కిస్తున్నాడు కృష్ణవంశీ. తనను ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ చేసిన కృష్ణ వంశీ కోసం తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు చెర్రీ. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నక్షత్రం సినిమాకు సంబందించిన పది లుక్స్‌ను రామ్ చరణ్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నక్షత్రం చిత్ర అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో ప్రకటించారు. అయితే ఈ లుక్స్‌ను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ పోలీస్ ఆఫీసర్‌గా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. -
కృష్ణవంశీకి 'చిరు' కాల్
మెగాస్టార్ చిరంజీవి.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి సర్ప్రైజ్ కాల్ చేశారనే వార్త ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. కృష్ణవంశీ తాజా చిత్రం 'నక్షత్రం'లో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అతిధి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వివరాలు తెలుసుకునేందుకే చిరు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. చిత్ర కథ, తేజు పాత్ర గురించి అడిగారట మెగాస్టార్. కథ విన్న తర్వాత బావుందంటూ మెచ్చుకున్నారట. స్వయంగా చిరంజీవి కాల్ చేయడం, కథ తెలుసుకుని బావుందంటూ కితాబునివ్వడంతో కృష్ణవంశీ బోలెడంత ఆనందంలో మునిగిపోయారు. కాగా సోమవారం చిరంజీవి పుట్టినరోజు కావడంతో అభిమానులు భారీ ఎత్తున వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరు 150వ సినిమాకు 'ఖైదీ నెంబరు 150' అనే టైటిల్‌ను కన్ఫామ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. -
'నక్షత్రం'లో మరో స్టార్
కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ నక్షత్రం. యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దాదాపు 20 నిమిషాల పాటు కనిపించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు సాయి. తాజాగా ఈ నక్షత్రానికి మరో మెరుపు యాడ్ అయ్యింది. జాతీయ అవార్డ్ సాధించిన కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ప్రగ్యా జైస్వాల్ కూడా నక్షత్రం సినిమాలో నటిస్తోంది. సందీప్ కిషన్‌కు జోడిగా రెజీనా నటిస్తుండగా ప్రగ్యా కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుందట. అంతేకాదు ఈ సినిమాలో సందీప్‌తో పోరాడే ఓ భారీ యాక్షన్ సీన్లోనూ నటిస్తోంది ప్రగ్యా జైస్వాల్. ఈ సీన్స్ కోసం కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ లాంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. మరి ఇంత భారీగా రూపొందుతున్న నక్షత్రం అయినా కృష్ణవంశీకి గత వైభవాన్ని తీసుకువస్తుందేమో చూడాలి. -
'నక్షత్రం' విలన్ గా తనీష్?
యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న తాజా ప్రాజెక్టు 'నక్షత్రం'. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు రోజు రోజుకి ప్రేక్షకుల్లోఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా గెస్ట్ రోల్లో నటిస్తున్నారని ఇప్పటికే తెలిపిన కృష్ణవంశీ.. విలన్ పాత్ర చిత్రీకరణలో కూడా వైవిధ్యతను చూపించే ప్రయత్నంలో ఉన్నారు. కథానాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న యువ నటుడు తనీష్ ఈ చిత్రంలో విలన్‌గా కనిపించే అవకాశాలున్నాయట.అయితే అది ఫుల్ లెన్త్ పాత్రా లేక గెస్ట్ అప్పీరియన్స్గానా అనే విషయం కృష్ణవంశీనే తేల్చాల్సి ఉంది. కాజల్, రెజీనా, సాయి ధరమ్ తేజ్ లాంటి స్టార్లు నటిస్తుండటంతో 'నక్షత్రం' సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో కృష్ణవంశీ తిరిగి సక్సెస్ ట్రాక్ అందుకుంటారని భావిస్తున్నారు. -
మీ గ్రాఫ్ పడిందా?
నాట్ ఫర్ సేల్ అమ్మకం.. అమ్మకం.. అమ్మకం.. సినిమా అంటే... కథ అమ్మాలి. స్క్రీన్‌ప్లే అమ్మాలి... మాటలు అమ్మాలి. ఫీల్ అమ్మాలి... టేకింగ్ అమ్మాలి. అయ్యో.. మర్చేపోయాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టికెట్లు అమ్మాలి. ‘‘ఇన్ని అమ్మే క్రమంలో డెరైక్టర్ తన ఉనికిని అమ్ముకోవాలా?’’ అని అడుగుతున్నారు కృష్ణవంశీ. ‘గులాబి’ రిలీజై ఈ ఏడాదికి 20 ఏళ్లయింది. ఇప్పుడు చేస్తున్న ‘నక్షత్రం’తో కలిపి మీవి 20 సినిమాలే. లెక్క తక్కువ..? సినిమా నాకు ఉద్యోగం కాదు.. జీవితం కూడా కాదు. నేను సినిమా తీయాలంటే మంచి పాయింట్ దొరకాలి. దొరికేంతవరకూ వెయిట్ చేస్తా. ఆ సినిమాకి ఎంత టైమ్ పడితే అంత తీసుకుంటా. ఎక్కువ డబ్బు సంపాదించాలని, వంద సినిమాలు తీసేయాలనే టార్గెట్ లేదు. చేసే సినిమా నాకు ఆత్మసంతృప్తిని అయినా ఇవ్వాలి లేదా వందలో పది శాతం ప్రేక్షకుల్లో ఒక ఆలోచన, మంచి భావం రేకెత్తించే విధంగా ఉండాలి. ఆత్మసంతృప్తి సరే.. ఆర్థిక సంతృప్తి..? దానికి లిమిట్ ఏంటి? డబ్బు కోసమే అయితే మనసుకి నచ్చని సినిమాలు తీయాల్సొస్తుంది. నిర్మాత కోసం కొన్ని సూత్రాలు పాటించాల్సి వస్తుంది. వాటితో సినిమాలు తీయాలంటే నాకు మనస్కరించదు. తలొంచి సినిమా తీస్తే వ్యభిచారం చేసినట్లుగా ఫీలవుతా. మనిషిని సమూలంగా చంపేసే వృత్తి వ్యభిచారం అని నా ఫీలింగ్. డబ్బు కోసం చూసుకుంటే ‘సిందూరం’, ‘అంతఃపురం’, ‘ఖడ్గం’ లాంటి సినిమాలొస్తాయా? నేనెవర్నీ తక్కువ చేయడంలేదు. అందరికంటే నేనే గొప్ప అనడంలేదు. అందరూ ఒక రూట్లో వెళితే ఈ రూట్లో ఎవరు వెళతారు? సెపరేట్ రూట్లో వెళ్లడంవల్ల, నిక్కచ్చిగా ఉండటంవల్లే కొంతమంది నిర్మాతలు మీతో సినిమాలంటే భయపడతారేమో? నేనేం కొట్టి చంపేయను కదా. ఏదైనా స్ట్రైట్‌గా, ఓపెన్‌గా మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ కావాలి. దానివల్ల వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి గట్స్ లేదా నేను చేస్తున్నది కరెక్ట్ అని నమ్మగలిగే మూర్ఖత్వమైనా ఉండాలి. ‘నేనేం తప్పు చేయలేదు.. నేను తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అది దేవుడైనా సరే’ అని ‘మురారి’లో డైలాగ్ చెప్పించాను. దాన్ని నమ్మాను కాబట్టే ఆ డైలాగ్ రాశాను. అలాంటి నేచర్ ఉన్నప్పుడు నిర్మాతలు భయపడతారనో, విమర్శిస్తారనో నా ఒరిజినాల్టీని చంపేసుకుని, నక్క వినయాలు నటిస్తూ, మాయ చేస్తే అప్పుడు నాకోసం నేను బతికినట్లవ్వదు. ఇతరుల కోసం బతకలేను. మరి... మిమ్మల్ని మాయ చేసిన నిర్మాతలు ఉన్నారా? కొందరు మోసం చేశారు. వాళ్లకు డబ్బులొచ్చినా రాలేద ని నా దగ్గర్నుంచి తీసుకున్నారు. ఒకడు తన నాలుగైదేళ్ల కూతురు మీద ఒట్టేసి సినిమా చేయించుకున్నాడు. అయిపోయిన తర్వాత 4 కోట్లకు టెండర్ పెట్టాడు. అబద్ధమాడుతున్నాడు, మోసం చేస్తున్నాడని తెలుసు. కానీ, నా సెంటిమెంట్‌కి కమిట్ అయ్యాను. నేను రోడ్డు మీద పడలేదు. వాడు బాగుపడి అంబానీ అవ్వలేదు. నాలుగు కోట్ల కోసం కక్కుర్తి పడ్డాడు. సరిగ్గా ఉండుంటే ఇంకో మంచి సినిమా చేసేవాణ్ణి. జన్మలో ఇక వాడితో సినిమా చేయను. స్టార్ డెరైక్టర్లు దాదాపు స్టార్ హీరోలతోనే సినిమా తీస్తారు.. ఇప్పుడు మీరు సందీప్ కిషన్‌తో సినిమా చేస్తున్నారు.. మీ గ్రాఫ్ పడిందా? సందీప్‌ది పెరిగిందా? నాకు స్టార్ అయినా నాన్-స్టార్ అయినా ఒకటే. కథకు సూటయ్యేవాళ్లతోనే తీశాను. పేర్లెందుకు కాని కథకు సూట్ కాని వాళ్లతోనూ చేశాను. కానీ, అది చేస్తున్నప్పుడు ‘మనకిది కరెక్ట్ కాదు’ అనిపించింది. నేను రామ్‌చరణ్‌తో చేస్తే పెద్ద డెరైక్టర్ అన్నట్లా? సందీప్‌తో సినిమా చేస్తే చిన్న డెరైక్టర్ అన్నట్లా? నేను పడ్డానా? పెరిగానా? తగ్గానా? అని తెలియడంలేదు. నా వరకు నేను ప్రొఫెషనల్‌గా సక్సెస్ కావడం అంటే ‘చందమామ’, ‘నక్షత్రం’ లాంటి సినిమాలు తీయగలగడం. 60 కోట్లతోనూ సినిమా తీయగలను. 15 కోట్లతోనూ తీస్తాను. 85 లక్షల్లో ‘డేంజర్’ చేశాను. నాకు సినిమా ఇంపార్టెంట్. దానికి పెట్టే పెట్టుబడి, వచ్చే బజ్ నాకు ముఖ్యం కాదు. ఏది పడితే అది కాకుండా ఎలాంటి సినిమా తీస్తున్నామనే విషయంలో దర్శకుడికి సామాజిక బాధ్యత ఉండాలి కదా? కచ్చితంగా. నాకు ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, విజిల్స్ ముఖ్యం కాదు. ఆ తర్వాత ఆ ప్రేక్షకుడి మైండ్‌లో ఆ సినిమా ఎలా తిరుగుతుందన్నదే ముఖ్యం. నా హీరో రౌడీయో, పోరంబోకో, సిస్టమ్‌ని లెక్క చేయనివాడో, జేబుదొంగో, హంతకుడో ఉండడు. నా 20 సినిమాల్లో ఒక్క ‘రాఖీ’ సినిమాలోనే హీరో హత్య చేస్తాడు. దానికి రీజన్ ఉంటుంది. ఒకళ్లు మనల్ని ఫాలో అవుతున్నారని తెలిసినప్పుడు మంచి చెప్పాలి. అందుకే ఎంజీఆర్‌గారు, రజనీకాంత్, కమల్‌హాసన్ తమ సినిమాల్లో పది మంచి మాటలైనా చెప్పాలని ఇన్సిస్ట్ చేస్తారట. మనం ఎందుకు దాన్ని ఆచరించడంలేదు? నావి ఫెయిల్యూర్ సినిమాలున్నాయి. కానీ, డెరైక్టర్‌గా నా టాపిక్ ఫెయిల్ కాలేదు. ఎందుకంటే నేనెప్పుడూ బ్యాడ్ ఫిల్మ్ తీయలేదు. లెక్చరర్స్, ఫాదర్స్, మదర్స్ మీద సెటైర్లు వేస్తూ సినిమాలు తీయలేదు. నా బ్రదర్స్ కోసమో, సిస్టర్ కోసమో, నా కొడుకు కోసమో, బంధువుల కోసమో సినిమా తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలిగా. నాకు పదకొండేళ్ల కొడుకు ఉన్నాడు. వాణ్ణి వెళ్లి, లెక్చరర్ని చంపేయమని చెప్పలేను కదా. అందుకే చూపించను. బౌండ్ స్క్రిప్ట్‌తో కాకుండా లొకేషన్లో సీన్లు వండుతారట...? నాతో సినిమా చేసిన హీరోనో, ప్రొడ్యూసరో, టెక్నీషియనో నాతో నేరుగా ఈ మాట అంటే సమాధానం చెబుతా. వాళ్లెవరూ కాదు.. ఎవరో అన్నారనుకుందాం. వాడికి ఏం తెలుసని అంటాడు? బౌండ్ స్క్రిప్ట్‌తో ఎన్ని సినిమాలు తీస్తున్నారో తెలుసా? అసలు బౌండ్ స్క్రిప్ట్‌తో తీసిన సినిమాల్లో ఎన్ని ఆడాయో తెలుసా? బౌండ్ స్క్రిప్ట్ అంటే వాడికి తెలుసా? ఆ మాట్లాడేవాడి తాలూకు అర్హత ఏంటి? వాడెవడో తెలిస్తే వాడికి తగ్గట్టుగా సమాధానం చెబుతా. బౌండ్ స్క్రిప్ట్‌తో తీశారా? అక్కడికక్కడ వండి తీశారా? అనేది ప్రేక్షకుడికి అనవసరం. ప్రేక్షకుడికీ, ఫిల్మ్ మేకర్స్‌కి ఉండే అనుబంధం టికెట్. వాళ్లకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవడు పడితే వాళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి మీదైనా రాళ్లు వేయడం ఈజీ. వాళ్లకి వేరే పనిలేదు. ఏసుక్రీస్తుని, గాంధీ మహాత్ముడిని చంపేసిన ప్రపంచం ఇది. మహాశక్తిని ఆపడానికి ఒక్క పిచ్చోడు చాలు. అలాంటి కోట్లాదిమంది పిచ్చోళ్లు ఉన్న దేశం మనది. నన్ను మాట అనడం వల్ల సంతృప్తి దక్కుతోందంటే నో అబ్జక్షన్. మీతో పనిచేయడానికి మీ డెరైక్షన్ డిపార్ట్మెంట్, ఇతర టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్.. ఎవరు బాగా ఇబ్బంది పడతారు? నాకు తెలిసి నాతో పని చేస్తున్నప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగని చెప్తారు కూడా. నిజమా? అబద్దమా? నాకు తెలీదు. ఛీఫ్ టెక్నీషియన్ ఆఫ్ ది ఫిల్మ్ కాబట్టి.. నా కథ, ఊహలకు తగ్గట్టు పని చేయమని చెప్తాను. ఉదాహరణకు.. ‘మురారి’లో పెళ్లి పాట చివరిది. అప్పటికి ఓ 20 ఏళ్లుగా చివరి పాట మాంచి మాస్ బీట్ వస్తోంది. హీరో, నిర్మాత, యూనిట్ అందరూ అలాంటి సాంగ్ కావాలని పట్టుబట్టారు. పెళ్లి పాట ఏంటని విసుక్కున్నారు. దాంతో ‘వేరే దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్‌తో మీకు కావలసిన పాట తీసుకోండి. నా పేరు తీసేసి సినిమా రిలీజ్ చేసుకోండి. ఆ సాంగ్ మినహా ఫస్ట్ కాపీ ఇచ్చేస్తాను. ఇప్పట్నుంచి ఈ సినిమాకి ఎవరు డెరైక్షన్ చేసినా.. నాకు ఓకే. నో అబ్జక్షన్ లెటర్ కూడా ఇస్తాను’ అన్నా. ఇంతవరకూ చేసిన తర్వాత అలా ఎలా కుదురుతుందన్నారు. ‘అలాగైతే ఈ పాటే ఉంటుంది. మీరు డిసైడ్ చేసుకోండి’ అన్నాను. ఆ పాట మన పెళ్లిళ్ల స్ట్రక్చర్ మార్చేసింది. ఆ పాట పెట్టాలనే నా పట్టుదలను పొగ రుబోతుతనం అంటామా? నమ్మకం అంటామా? ఇతరుల మాట వినకుండా, మీరు నమ్మి తీసినవాటిలో ఫెయిలైనవి ఉండే ఉంటాయ్. అప్పుడు మీ ఫీలింగ్? ‘నువ్ చేస్తున్నది పూర్తిగా తప్పు’ అని నేను నిజంగా గౌరవించే వ్యక్తులు ‘శ్రీఆంజనేయం’ తీసేటప్పుడు చెప్పారు. కొందరు ఈ లోకంలో కూడా లేరు. ఆ రోజున్న నా మానసిక స్థితికి ఎక్కలేదు. నేనే కరెక్ట్ అనుకున్నాను. నిర్మాతను కూడా నేనే కావడంతో కష్టనష్టాలు భరిద్దామనుకున్నాను. ‘మీరు చెప్పినట్టు చేసుంటే బాగుండేదేమో’ అని విడుదల తర్వాత నా తప్పు ఒప్పుకున్నాను. నేను తప్పు ఒప్పుకోవడానికి భయపడను. మీ మనస్తత్వాన్ని మార్చుకోమని రమ్యగారు అనలేదా? యాజ్ ఎ వైఫ్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్.. ‘ఎందుకిలా? కరెక్ట్ కాదు’ అంటుంది. అప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ‘సరేలే.. ఏం చెప్పి నిన్ను మార్చగలం’ అని సెలైంట్ అయిపోతుంది. ‘అది చూసే కదా నువ్వు పడ్డావ్. ఇప్పుడు మారమని ఎందుకు అంటున్నావ్?’ అనడుగుతా (నవ్వుతూ). ఆవిడ ఏంజిల్ అండి. ‘శ్రీఆంజనేయం’కి రమ్యగారి డబ్బులు పెట్టారనే టాక్ ఉంది? ఇప్పటివరకూ తనది ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ‘ఐ డోంట్ కేర్’. తీసుకోలేదు కాబట్టే, మా జీవితం హాయిగా సాగుతోంది. ఆవిడ డబ్బులు టచ్ చేసిన మరుక్షణం నేను చనిపోయినట్లే. ఆ పరిస్థితి ఇప్పటివరకూ రాలేదు. ఎప్పటికీ రాదు కూడా. మీ లవ్‌స్టోరీ తెలుసుకోవాలని ఉంది.. మా ఇద్దరి మధ్య ఉన్న ఓ అపురూపమైన అందమైన విషయం అది. చెబితే మా స్పేస్ మిస్సవుతుంది. ముందు ఎవరు ప్రేమలో పడ్డారు? ఎవరు పడేశారు? అనేవి పంచుకునే విషయాలు కావు. కొన్ని అమ్మే విషయాలుంటాయి. కొన్ని అమ్మకూడని విషయాలుంటాయి. కొన్ని అమ్మరానివి ఉంటాయ్. దిసీజ్ నాట్ ఫర్ సేల్ (నవ్వుతూ). మీ సినిమాల్లో పెళ్లిళ్లు చాలా అందంగా చూపిస్తారు. కానీ, మీ పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకున్నారు. నా దృష్టిలో పెళ్లి అంటే అంతే. ‘మురారి’ సినిమాలోని పెళ్లిలో కూడా కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. నా ఫీలింగ్ అది. అందుకే, నా పెళ్లి కూడా అలా చేసుకున్నాను. నేను, రమ్య పెళ్లికి పిలవడం మొదలుపెడితే.. ఎన్ని ఇండస్ట్రీలను పిలవాలి. ‘నువ్వు, నేను పెళ్లి చేసుకున్న ఫీలింగ్ మనలో కలగాలంటే.. బయట వ్యక్తులు ఎవరూ వద్దు. నీకు బాగా దగ్గరైన, నాకు బాగా దగ్గరైన ఫ్రెండ్స్‌ని పిలుద్దాం’ అని రమ్యతో చెప్పాను. సీతారామ శాస్త్రి గారు, రాఘవేంద్రరావు గారు, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్.. ఇలా కొందరి, మా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. సింపుల్ మ్యారేజ్ అంటే రమ్యకృష్ణగారు ఒప్పుకున్నారా? మొదట ‘ఉహూ..’ అంది. తర్వాత లాజిక్ చెప్పాను. పెళ్లికి వచ్చినోళ్లలో 90 శాతం మంది ‘భలేవాణ్ణి పట్టిందిరా రమ్యకృష్ణ అని నిన్ను.. ఏం అమ్మాయిని పట్టాడని నన్ను’ జోకులేస్తారు. ఇంతకు మించి ఎవ్వరైనా ఏమైనా అనుకుంటారని నీకుందా? అన్నాను. ‘అందరూ ఇదే అనుకుంటారు’ అని చెప్పింది. ‘మరి గ్రాండ్‌గా ఎందుకు?’ అన్నాను. పిలిచిన తర్వాత అందరికీ మర్యాదలు సరిగ్గా జరుగుతున్నాయా? లేదా? అని టెన్షన్ కూడా ఉంటుంది. అలాగే డబ్బులు ఖర్చు. ‘పెళ్లికి ఎంత ఖర్చవుతుందో అంతా డొనేట్ చేద్దాం. కంఫర్ట్‌గా పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. నాలుగు గంటలు హోమాలు, పూజలు చేసుకుంటూ, కంగారు లేకుండా, చాలా ప్రశాంతంగా పెళ్లి చేసుకున్నాం. మీడియాలో మీరూ, రమ్యకృష్ణ విడాకులు తీసుకుంటున్నారని, గొడవపడ్డారనీ వార్తలు వస్తుంటాయి. మీ రియాక్షన్? సీరియస్‌గా తీసుకోం. ఏం న్యూస్ దొరికినట్టు లేదు మాపై పడ్డారనుకుంటా. రమ్యకు తెలుగు రాదు కాబట్టి, చదివి వినిపిస్తా. విని, ‘అవునా?’ అని కూల్‌గా అంటుంది. ఇద్దరూ బయట ఫంక్షన్స్‌లో పెద్దగా కనిపించరేం? ఫంక్షన్‌కి వెళ్లాలనుకుంటే ఇద్దరం కలిసే వెళతాం. అంతేగానీ, నువ్ సపరేట్గా వెళ్లు.. నేను సపరేట్గా వెళతా.. అని ఎప్పుడూ అనుకోం. నేనంత అవుట్డోర్ మనిషిని కాదు. కొంచెం షైగా ఉంటాను. భార్యభర్తల అనుబంధం అనేది పది మందికి చూపించే పబ్లిక్ డిస్ప్లే కాదు. మేమిద్దరం జనాలకు భయపడి బతికేవాళ్లం కాదు. ఇద్దరం కలసి కనిపించి చాలా రోజులైంది, జనాలు ఏమనుకుంటారో? అనే ప్రస్తావన మా మధ్య ఉండదు. ‘నాకు నువ్వు.. నీకు నేను’ అనుకున్నప్పుడు మూడో వ్యక్తి ఏమనుకుంటున్నాడు? అనేది అనవసరం. ఓ అబద్దాన్ని సృష్టించి వాడు హ్యాపీగా ఫీలవుతుంటే.. చావనీ అనుకుని వదిలేస్తా. పవన్‌కల్యాణ్... లాంటి కొందరు అగ్రహీరోలతో మీరు ఎందుకు సినిమాలు చేయలేకపోయారు? అలాంటి వారితో పని చేస్తేనే నాకు వ్యక్తిత్వం, అస్తిత్వం ఉన్నట్టా? పవన్‌కల్యాణ్ ఓ క్రౌడ్ పుల్లింగ్ హీరో. కొన్ని కోట్లమంది జనం అతనంటే విపరీతంగా రియాక్ట్ అవుతారు. అంటే.. సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఆశిస్తారు. ఆ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ నేను చేయాలి. హీరోతో పాటు అభిమానుల్ని శాటిస్ఫై చేయడం కోసం సినిమా తీయాలా? నాకనిపించిన పాయింట్ మీద సినిమా తీయాలా? నా పాయింట్‌కి సూట్ అయితే, వెళ్లి అడగడానికి రెడీ. ‘నక్షత్రం’ సినిమా విడుదల ఎప్పుడు? దసరాకి విడుదల చేయాలనుకుంటున్నాం. మీకు హిందూ భావజాలం ఎక్కువట? హిందూ మతం దేవుళ్లకు సంబంధించిన అంశం కాదు. ఓ జీవన విధానం. ఎలా బతకాలి? ఎలా బతికితే బాగుంటుంది? తక్కువ సమస్యలు ఉంటాయి? సంతోషంగా ఎలా బతకొచ్చు? అని చెప్పే ఓ జీవన విధానం. ఇస్లాం, క్రిస్టియానిటీ.. ఏ మతం అయినా ఇలా బతకండని చెబుతుంది. చిన్నప్పట్నుంచి హిందూ మతం తాలూకు పరిసరాల్లో పుట్టాను, పెరిగాను కాబట్టి హిందూ భావజాలం నాలో ఉంది. మనం చేయబోయే పనికి మన తాలూకు లేదా బయట నుంచి వచ్చే ఆటంకాలను తట్టుకోవాలంటే ఓ ఫోర్స్ కావాలి. విఘ్నేశ్వరుడికి దణ్ణం పెడితే.. విఘ్నాలు ఉండవనే ధైర్యం వస్తుంది. దీన్ని హిందూ మతం అంటే నో అబ్జక్షన్. అలాగే డబ్బులు కావాలంటే డబ్బులొచ్చే పని చేయాలి. దాంతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. దీన్ని హిందూ మతం అంటే నో అబ్జక్షన్. గాయత్రీ మంత్రంలో ఉండే బీజాక్షరాల్లో ప్రతి అక్షరానికి ఓ వైబ్రేషన్ ఉంది. బాడీలో ప్రకంపనలొస్తాయి. ఎనర్జీ ఫామ్ అవుతుంది. ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది. మంత్రం చదవకుండా నాకు ఎనర్జీ, ధైర్యం వచ్చిందని కొంతమంది అంటారు. అందువల్ల, మంత్రం తప్పని నువ్వెలా అంటావ్? నీకు డ్రైవింగ్ వచ్చు, నాకు రాదు. అందుకే డ్రైవర్ హెల్ప్ తీసుకుంటా. అదే దేవుడు అనుకుంటా. అరబు దేశాల్లో పుట్టి ఉంటే ముస్లిం, అమెరికాలోనో, యూరోప్‌లోనో పుట్టుంటే క్రిస్టియన్ అయ్యేవాణ్ణి. నీ పుట్టుకను బట్టి నీ మతం డిసైడ్ అవుతున్నప్పుడు, ఇది తప్పు, రైట్ అనడానికి నువ్వెవరు? నీ తల్లితండ్రులను కానీ, మతాన్ని కానీ నువ్వు డిసైడ్ చేయలేదు. హిందూ భావజాలాన్ని అంటరానితనంగానో, పాపం కిందో ఫీల్ అవ్వకూడదు. మనం పుట్టి పెరిగిన భావజాలం. ‘ఖడ్గం’లో ఇదే మాట్లాడడానికి ప్రయత్నించాను. ఇంకొకరిది తప్పు అనడం లేదు. ఇది తప్పు? ఇది రైటు? అని మనం ఎలా అంటాం? ఒక్కో చోట ఒక్కో అలవాటు. కొన్ని వేల సంవత్సరాలుగా సెటిల్ అయిపోయి ఉంది. దాన్ని మార్చాలంటే మళ్లీ మార్టిన్ లూథర్ కింగో, గాంధీగారో వచ్చి చెప్పాలి. మీ అబ్బాయి రిత్విక్ గురించి? బాగా షార్ప్, చార్మింగ్, అల్లరి. మా ఇద్దరి లక్షణాలు సమానంగా వచ్చేశాయి. 4 భాషలు మాట్లాడతాడు. హీరోని చేస్తారా? దర్శకుణ్ణి చేస్తారా? నేను, రమ్య సెల్ఫ్‌మేడ్. మీరు ఇది అవ్వాలని చెబితే.. అయినవాళ్లం కాదు. మా అబ్బాయి ఓ రోజు ఆస్ట్రోనాట్, ఓ రోజు స్పేస్ మెకానిక్, మరో రోజు కార్ డ్రైవర్, ఇంకో రోజు టెన్నిస్ ప్లేయర్ అంటాడు. ఇంతవరకూ హీరో అవుతానని, దర్శకుడు అవుతానని మాత్రం చెప్పలేదు. డెస్టినీ అనేది ఒకటుంటుంది. ‘వాట్ లైఫ్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్’ అనేది మనకు తెలియదు. - డి.జి. భవాని -
మంచా.. చెడా?
ఖాకీ చొక్కా వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని లాఠీ పట్టుకుని రెజీనా చాలా కొత్తగా కనిపిస్తున్నారు కదూ! ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో కనిపించిన రెజీనా వేరు.. ఇప్పుడు కనిపించనున్న రెజీనా వేరు. ఆమెలోని పవర్ఫుల్ యాంగిల్‌ని చూపించనున్నారు దర్శకుడు కృష్ణవంశీ. సందీప్ కిషన్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నక్షత్రం’. ఇందులో రెజీనా పోలీస్‌గా నటిస్తున్నారు. మంచి పోలీస్‌గా నటిస్తున్నారా? లేదా చెడ్డ పోలీస్‌గా నటిస్తున్నారా? అనేది చిత్రం చూసి తెలుసుకోవాలంటున్నారు హీరో సందీప్. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. కథానాయికలను చాలా అందంగా చూపిస్తారని కృష్ణవంశీకి పేరు. అందుకే, ప్రతి కథానాయిక ఒక్కసారైనా ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. పోలీస్‌గా రెజీనాను ఎలా చూపిస్తారో? అన్నట్టు.. ‘రొటీన్ లవ్‌స్టోరీ’, ‘రా రా కృష్ణయ్య’ చిత్రాల తర్వాత సందీప్, రెజీనా కలసి నటిస్తున్న మూడో చిత్రమిది. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించడం ఇద్దరికీ ఇది తొలిసారి. -
రైతుగా...
రైతు లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోగలమా? ఎవరెంత కష్టపడినా.. ఎన్నెన్ని గొప్ప పనులు చేసినా.. ప్రతి మనిషి ఆకలి తీర్చేది మాత్రం రైతే. మనిషి తినే ప్రతి మెతుకు పండించేది అతనే. మనిషి మనుగడకు ముఖ్య కారణమైన రైతుకు ఈ రోజు ఎదురవుతున్న సమస్యలేంటి? దేశానికి రైతు అవసరం ఎంతుంది? అనే విషయాల సమాహారంతో రూపొందనున్న చిత్రం ‘రైతు’. ఇదే తన 101వ చిత్రమని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న నూరవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత ‘రైతు’ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
షూటింగ్లో ప్రమాదం, హీరోకు గాయాలు
ఒక్క అమ్మాయి తప్ప సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్, గ్యాప్ తీసుకోకుండా వెంటనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. తొలిసారిగా కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్ తో కలిసి నక్షత్రం సినిమాలో నటిస్తున్నాడు సందీప్. బుధవారం ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి రోజునే యాక్షన్ సీన్స్ షూటింగ్ ప్రారంభించగా.. షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సందీప్ తలకు బలమైన గాయం తగలడంతో యూనిట్ సభ్యులు వెంటనే అతన్ని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన పై స్పందించిన హీరో సందీప్ కిషన్ 'ఇప్పుడు బాగానే ఉంది. కొన్ని కుట్లు పడ్డాయి. కృష్ణవంశీ గారి సెట్ లో యాక్షన్ సీన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కానీ సీన్ చాలా బాగా వచ్చినందకు ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు. Hi guys..much better now,got a few stitches..just an unfortunate accident on Krishna Vamsi sirs set..action sequence..glad it came out well — Sundeep Kishan (@sundeepkishan) 15 June 2016 -
బరువుతో రండి..
బరువుతో రండి అంటున్నారు నటి కాజల్‌అగర్వాల్. ఏమిటీ బరువు అనగానే పారితోషికం లాంటివేవో అనే నిర్ణయానికి వచ్చేయకండి. బరువుతో అంటే పాపం కాజల్ భావన బరువైన పాత్రలతో రండని. ఎందుకంటే అలాంటి పాత్రలామెను ఇంత వరకూ వరించలేదు.అయినా కాజల్ బాధ పడలేదు తనకు లభించిన అందాలారబోతలతో కూడిన ప్రేమ పాత్రలతో కాలాన్ని నెట్టుకుంటూ వచ్చారు. తెలుగులో ఘన విజయం సాధించిన మగధీర, తమిళంలో తుపాకీ, జిల్లా లాంటి చిత్రాల్లోనూ కాజల్ హీరోను ప్రేమించడం, పాటలు పాడుకోవడం లాంటి పాత్రలకే పరిమితమయ్యారు. అలా అందాలతోనే నటిగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చిన ఈ బ్యూటీని పెద్దగా విమర్శలు దరిచేరలేదు. అయితే ఇటీవల హిందీ చిత్రంలో నటించిన ఘాటు లిప్‌లాక్ సన్నివేశం మాత్రం పెద్ద కలకలానికే దారి తీసింది. అయినా ఆ చిత్రం కాజల్‌అగర్వాల్ కెరీర్‌కు ఏమాత్రం ప్లస్ అవలేదు. అదటుంచితే తాజాగా తన సహనటీమణుల నటనా ప్రభావం ఈ అమ్మడికి నిద్ర పట్టనీయడం లేదని సమాచారం. విషయం ఏమిటంటే అనుష్క, నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు కథల్లో లీడ్ పాత్రల్ని పోషిస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. తను మాత్రం ఇంకా ప్రేమా, దోమ లాంటి పాత్రల చుట్టూనే తిరుగుతున్నారు. దీంతో తనకు లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించాలనే ఆసక్తి కలుగుతోందట. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలను పోషించాలని ఆశపడుతున్నారట. ఇటీవల తనకు కథలు చెప్పడానికి వస్తున్న దర్శకులు వినిపించే కథలు పూర్తిగా ఆలకించి చివరికి అందులో హీరోయిన్ పాత్రలు తన స్థాయికి తగ్గట్టుగా లేవు. కొత్తగా వచ్చే హీరోయిన్లకు ఈ తరహా పాత్రలు బాగుంటాయి. అయినా ఇలాంటి పాత్రలు తాను చాలా చేసేశాను. మళ్లీ మళ్లీ అవే చేయాలంటే బోర్ కొడుతోంది అని అంటున్నారట. అంతే కాదు బరువైన పాత్రల్లో రండి అంటూ చిన్న ఉచిత సలహాను కూడా ఇచ్చేస్తున్నారట. దీంతో అనుష్క, త్రిష లాంటి హీరోయిన్లు కాజల్‌కు నప్పుతాయా? అంటూ వచ్చిన దర్శకులు గొనుక్కుంటూ తిరుగు ముఖం పడుతున్నారని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విక్రమ్‌కు జంటగా గరుడా, జీవా సరసన కవలైవేండామ్ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. -
అత్తారిల్లా... బాబోయ్!
అత్తారింట్లో అల్లుళ్లకి రాచమర్యాదలు జరగడం కామన్. కానీ, ఆ అత్తారింట్లో అలాంటివేవీ జరగవ్. ఆ ఇల్లంటే అల్లుడికి హడల్. అసలా ఇంట్లో ఏముంది? అనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో అంజన్ కె. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘అత్తారిల్లు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అంజన్ మాట్లాడుతూ- ‘‘రామ్‌గోపాల్‌వర్మ, కృష్ణవంశీ వంటి దర్శకుల వద్ద పనిచేశాను. ‘అరుంధతి’ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్‌లో పాలుపంచుకున్నాను. ఒక మంచి సినిమా తీయాలనే నా ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ‘అత్తారిల్లు’ చేశాను. కడుపుబ్బా నవ్వించే హారర్ చిత్రమిది. మణిశర్మగారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డెన్నిస్ నార్టన్ స్వరపరచిన రెండు పాటలు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. సాయి రవికుమార్, అతిథీ దాస్, అన్తేశియ చప్రసోవ, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శివశంకర వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యం.హెచ్. రెడ్డి, సమర్పణ: అక్షయ్- అశ్విన్, సహ నిర్మాతలు: కాకల్ల లక్ష్మీ మల్లయ్య, జ్యోతి కె.కల్యాణ్. -
మూడోసారి జోడి కడుతున్నారు
ఫిలిం ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్లు రిపీట్ అవ్వటం కామన్. అయితే ఈ ఫార్ములాను బ్రేక్ చేస్తూ ఇప్పటికే రెండు ఫ్లాప్‌లు ఇచ్చిన కాంబినేషన్‌ను మరోసారి తెర మీదకు తీసుకు రావడానికి రెడీ అవుతున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. బాలయ్య వందో సినిమాతో పాటు, రుద్రాక్ష సినిమా కూడా చేజారిపోవటంతో ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్‌తో నక్షత్రం అనే సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు కృష్ణవంశీ. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం కృష్ణవంశీ ఓ రిస్కీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నాడట. నక్షత్రం సినిమాలో సందీప్ కిషన్ సరసన రెజీనాను హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడు. గతంలో సందీప్ కిషన్, రెజీనాలు రెండు సినిమాల్లో కలిసి నటించగా ఆ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. తొలిసారి రొటీన్ లవ్ స్టోరి సినిమాలో కలిసి నటించిన ఈ జంట మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకున్నా సినిమా రిజల్ట్ మాత్రం నిరాశపరిచింది. ఆ తరువాత కొత్త దర్శకుడితో రారా కృష్ణయ్య సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ సినిమా కూడా రిలీజ్‌కు ముందు మంచి హైప్ క్రియేట్ చేసినా తరువాత మాత్రం ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. దీంతో ఇదే కాంబినేషన్లో సినిమా చేయటం కృష్ణవంశీకి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ క్రియేటివ్ డైరెక్టర్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి హిట్ కొడతాడేమో చూడాలి. -
కృష్ణవంశీ నక్షత్రం
చేసే సినిమాలన్నీ వెరైటీగా ఉండాలని కోరుకుంటారు దర్శకుడు కృష్ణవంశీ. వెరైటీ పాత్రలే చేయాలనుకుంటారు హీరో సందీప్ కిషన్. ఇప్పటివరకూ దాదాపు అలాంటి పాత్రలే చేసుకుంటూ వచ్చారాయన. ఇక.. కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డెరైక్టర్‌తో సినిమా అంటే.. ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, కొత్త లుక్‌లో సందీప్ కనిపిస్తారని ఊహించవచ్చు. ఆ ఒక్క చాన్స్ దక్కించేసుకున్నారు సందీప్ కిషన్. బుట్టబొమ్మ క్రియేషన్స్ కె.శ్రీనివాసులు, విన్ విన్ విన్ క్రియేషన్స్ ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. సినిమా టైటిల్ ‘నక్షత్రం’. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ- ‘‘పోలీస్ కావాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథే ఈ చిత్రం. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నాం’’ అని తెలిపారు. -
పోలీస్ థ్రిల్లర్...
ఫ్లాష్.. ఫ్లాష్.... సృజనాత్మక దర్శకుడిగా పేరొందిన కృష్ణవంశీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాలకృష్ణ 100వ చిత్రంగా ‘రైతు’ ప్రాజెక్ట్‌ను రూపొందించే అవకాశం కృష్ణవంశీకి వచ్చినట్లు ఆ మధ్య కృష్ణానగర్ గుప్పుమంది. అయితే, క్రిష్ దర్శకత్వంలో చారిత్రక కథ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అనుకోకుండా తెర మీదకు వచ్చింది. దాంతో, కృష్ణవంశీ సారథ్యంలోని ‘రైతు’ ప్రాజెక్ట్‌ను తన 101వ సినిమాగా బాలకృష్ణ చేయాలనుకుంటున్నట్లు ఆంతరంగిక వర్గాల కథనం. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ తక్షణమే ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దాని గురించి ‘సాక్షి’ ఆరా తీస్తే, ఆసక్తికరమైన సమాచారం తెలిసింది. ‘గోవిందుడు అందరి వాడేలే’ తరువాత కొంతకాలంగా రకరకాల స్క్రిప్ట్‌లు తయారుచేసుకుంటూ కృష్ణవంశీ బిజీగా గడిపారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమిస్తూ, వివిధ భాషల్లో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ భారీ చిత్రాన్ని తీయాలని మొదట్లో ఆయన అనుకున్నారు. అయితే, మరింత సమయం పట్టే ఆ కథను ప్రస్తుతానికి పక్కనపెట్టి, ఒక పోలీస్ యాక్షన్ స్టోరీని స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ఒక యువ పోలీసు అధికారి పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భారీ బడ్జెట్ వాణిజ్యపంథా చిత్రానికి యువ హీరో సందీప్ కిషన్‌ను హీరోగా ఎంచుకున్నారు. ఊహించని అనేక ట్విస్టులు, కావలసినంత నాటకీయత, బోలెడన్ని యాక్షన్ సన్నివేశాలు - ఈ కథలో ఉంటాయట. ‘‘పోలీస్ నేపథ్యంలో చాలా వాస్తవికంగా ఉండే కథ ఇది. చాలా రోజులుగా మదిలో మెదులుతున్న ఈ స్క్రిప్ట్ సందీప్ కిషన్‌తో అయితే బాగుంటుందని కృష్ణవంశీ భావించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో దర్శకుడు, హీరో చాలా ఉత్సాహంగా ఉన్నారు’’ అని ఆంతరంగిక వర్గాలు పేర్కొన్నాయి. కృష్ణవంశీ పరిచయం చేసిన ఒక హీరోయిన్ ఈ సినిమాలో కీలక పాత్ర ధరిస్తున్నారు. మరో హీరోయిన్ను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అలాగే, పరభాషకు చెందిన ఒక ప్రముఖ కథానాయకుడు గౌరవపాత్ర ధరించనున్నారు. మొత్తానికి, ఈ ప్రాజెక్ట్‌కు కావాల్సిన పోలీస్ అనుమతులు, వగైరాల కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే పనులు ప్రారంభించింది. ఈ నెల 27 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలే షూటింగ్ జరిగే ఈ చిత్రానికి శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణం వహించనున్నారు. ఈ హాలీవుడ్ తరహా థ్రిల్లర్‌ను శరవేగంతో పూర్తిచేసి, ఆగస్టు 15కి కానీ, దసరాకి కానీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరిన్ని వివరాల కోసం, క్రియేటివ్ దర్శకుడి కొత్త వెండితెర విశ్వరూపం కోసం మరి కొద్దిరోజులు వేచి చూడాల్సిందే!