కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా శశి ప్రీతమ్ సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలోని సంగీతం ఎంతలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే! తొలి చిత్రంతోనే మ్యూజికల్ హిట్ కొట్టిన ఈయన తర్వాత పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'నేను పుట్టి పెరిగిందంతా కలకత్తాలోనే! తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాం. అమ్మానాన్న ఇద్దరూ టీచర్లే! మేము నలుగురం పిల్లలం. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. ఎన్నో కష్టాలు చూశాక ఈ స్థాయికి వచ్చాను. కాలేజీ పూర్తయిపోగానే స్టూడియో పెట్టుకుని కంపోజర్‌గా మారాను. జింగిల్స్ కంపోజ్ చేసేవాడిని. నా తొలి పారితోషికం రూ.50. గులాబీ సినిమా చేసే సమయానికే జింగిల్స్‌తో మంచి పేరు సంపాదించాను. అప్పుడు ఒక్క జింగిల్‌కు రూ.50 వేలు తీసుకున్నాను.
1993లో నా పెళ్లయింది. మాది ప్రేమ వివాహం. మాకు ఒక పాప ఉంది. నా తొలి సినిమా గులాబీ చేసేటప్పుడు రాత్రిళ్లు పాపను ఎత్తుకుని పని చేసుకునేవాడిని. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత భార్యతో విడిపోయాను. కూతురు నా దగ్గరే పెరిగింది. ప్రతి రోజు ఛాలెంజ్‌లను దాటుకుంటూనే ముందుకు సాగాను. తొలి సినిమా గులాబీకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 1999 నుంచి 2019 వరకు దాదాపు 25 సినిమాలు చేశాను. మధ్యలో కృష్ణవంశీతో గొడవ కూడా అయింది. సముద్రం సినిమాతో మళ్లీ కలిసిపోయాం. ఆ తర్వాత బాలీవుడ్ కూడా వెళ్లాను.
తెలుగులో కొన్ని సినిమాల్లో అంతకు ముందు వచ్చిన పాటల్లోని సంగీతాన్ని కాస్త అటూఇటూ మార్చమనేవారు. అది నాకు నచ్చేది కాదు. అదే సంగీతం కావాలనుకుంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికే వెళ్లండి, నన్నెందుకు అడుగుతున్నారు అని చెప్పి కొన్ని ప్రాజెక్టుల్లో నుంచి నేను బయటకు వచ్చేవాడిని. అది కొందరికి నచ్చలేదేమో.. అవకాశాలు ఇవ్వలేదు. అందుకే సినిమాలకు కాస్త దూరమయ్యాను' అని చెప్పుకొచ్చాడు శశి ప్రీతమ్.
చదవండి: కట్టె కాలేవరకు మెగాస్టార్ అభిమానినే: అల్లు అర్జున్
చిరంజీవి, విజయ్ విషయంలో ఎక్కువ వాధపడ్డాను: రష్మిక
Comments
Please login to add a commentAdd a comment