Shashi
-
పాక్ వెళ్లేందుకు సుముఖంగా లేని సుమిత్, శశి.. కారణం?
న్యూఢిల్లీ: భారత సింగిల్స్ టెన్నిస్ స్టార్లు సుమిత్ నగాల్, శశికుమార్ ముకుంద్ పాకిస్తాన్లో డేవిస్ కప్ ఆడేందుకు నిరాకరించారు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లేఆఫ్ ‘టై’లో భాగంగా భారత్ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో తలపడాల్సివుంది. అయితే భారత్ తరఫున ఉత్తమ సింగిల్స్ ప్లేయర్లు అయిన సుమిత్ నగాల్ (141 ర్యాంకు), శశికుమార్ (477 ర్యాంకు) చిరకాల ప్రత్యర్థితో ఆడేందుకు విముఖత వ్యక్తం చేశారు. అయితే వారిద్దరు వైదొలగేందుకు కారణాలు వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నగాల్ తనకు అంతగా అలవాటు లేని గ్రాస్ కోర్టులో ఆడేందుకు సిద్ధంగా లేనని అన్నాడు. అదే కారణమా? ఇక హార్డ్ కోర్టుల్లో రాణించే సుమిత్ ఈ కారణంతో పాక్ వెళ్లేందుకు ఆసక్తి చూపించకపోగా, శశికుమార్ ముకుంద్ మాత్రం ప్రత్యేకించి ఏ కారణం చెప్పకుండానే తప్పుకొన్నట్లు తెలిసింది. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) దేశం తరఫున ఆడేందుకు నిరాకరించిన ఆటగాళ్లపై అసంతృప్తి వెలిబుచ్చింది. ఇలా చేయడం తప్పు ‘ఇది చాలా తప్పు. దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సినపుడు ఇలాంటి కారణాలు చూపడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం’ అని ఐటా ఉన్నతాధికారి తెలిపారు. సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 21 ఏళ్ల శ్రీవల్లి 6–1, 6–4తో భారత్‌కే చెందిన వైష్ణవి అడ్కర్‌పై సునాయాస విజయం సాధించింది. సెమీస్‌లో రష్మిక థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్ లాన్లానా తారరుదితో తలపడుతుంది. క్వార్టర్స్‌లో ఆమె 6–1, 6–2తో ఏడో సీడ్ డిలెటా చెరుబిని (ఇటలీ)ని ఓడించింది. ఈ టోరీ్నలో హైదరాబాదీ యువతారతో పాటు మరో ఇద్దరు భారత క్రీడాకారిణులు జీల్ దేశాయ్, రుతూజ భోసలే సెమీస్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో జీల్ దేశాయ్ 3–6, 6–7 (8/2), 6–4తో అంటోనియా షమిడ్త్ (జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గింది. రుతూజ 7–6 (8/4), 1–6, 6–1తో కజకిస్తాన్‌కు చెందిన ఐదో సీడ్ జిబెక్ కులంబయెవాను కంగుతినిపించింది. -
చిన్నతనంలోనే నాన్న మరణం.. తొలి సినిమాకు రూపాయి తీసుకోలే!
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా శశి ప్రీతమ్ సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలోని సంగీతం ఎంతలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే! తొలి చిత్రంతోనే మ్యూజికల్ హిట్ కొట్టిన ఈయన తర్వాత పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'నేను పుట్టి పెరిగిందంతా కలకత్తాలోనే! తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాం. అమ్మానాన్న ఇద్దరూ టీచర్లే! మేము నలుగురం పిల్లలం. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. ఎన్నో కష్టాలు చూశాక ఈ స్థాయికి వచ్చాను. కాలేజీ పూర్తయిపోగానే స్టూడియో పెట్టుకుని కంపోజర్‌గా మారాను. జింగిల్స్ కంపోజ్ చేసేవాడిని. నా తొలి పారితోషికం రూ.50. గులాబీ సినిమా చేసే సమయానికే జింగిల్స్‌తో మంచి పేరు సంపాదించాను. అప్పుడు ఒక్క జింగిల్కు రూ.50 వేలు తీసుకున్నాను. 1993లో నా పెళ్లయింది. మాది ప్రేమ వివాహం. మాకు ఒక పాప ఉంది. నా తొలి సినిమా గులాబీ చేసేటప్పుడు రాత్రిళ్లు పాపను ఎత్తుకుని పని చేసుకునేవాడిని. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత భార్యతో విడిపోయాను. కూతురు నా దగ్గరే పెరిగింది. ప్రతి రోజు ఛాలెంజ్‌లను దాటుకుంటూనే ముందుకు సాగాను. తొలి సినిమా గులాబీకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 1999 నుంచి 2019 వరకు దాదాపు 25 సినిమాలు చేశాను. మధ్యలో కృష్ణవంశీతో గొడవ కూడా అయింది. సముద్రం సినిమాతో మళ్లీ కలిసిపోయాం. ఆ తర్వాత బాలీవుడ్ కూడా వెళ్లాను. తెలుగులో కొన్ని సినిమాల్లో అంతకు ముందు వచ్చిన పాటల్లోని సంగీతాన్ని కాస్త అటూఇటూ మార్చమనేవారు. అది నాకు నచ్చేది కాదు. అదే సంగీతం కావాలనుకుంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికే వెళ్లండి, నన్నెందుకు అడుగుతున్నారు అని చెప్పి కొన్ని ప్రాజెక్టుల్లో నుంచి నేను బయటకు వచ్చేవాడిని. అది కొందరికి నచ్చలేదేమో.. అవకాశాలు ఇవ్వలేదు. అందుకే సినిమాలకు కాస్త దూరమయ్యాను' అని చెప్పుకొచ్చాడు శశి ప్రీతమ్. చదవండి: కట్టె కాలేవరకు మెగాస్టార్ అభిమానినే: అల్లు అర్జున్ చిరంజీవి, విజయ్ విషయంలో ఎక్కువ వాధపడ్డాను: రష్మిక -
సెంటిమెంట్.. యాక్షన్
శ్రీ కల్యాణ్, శశి జంటగా గేదెల రవిచంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మెగా పవర్’. అడబాల నాగబాబు, సాయినిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. హీరో కిరణ్ అబ్బవరం కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు రఘుబాబు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి పృథ్వీరాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది’’ అని అన్నారు. -
Siddharth: ‘ఒరేయ్ బామ్మర్ది’ మూవీ రివ్యూ
టైటిల్ : ఒరేయ్ బామ్మర్ది నటీనటులు : సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ , కశ్మీరా పరదేశి, లిజోమోల్ జోస్ తదితరులు నిర్మాణ సంస్థ : అభిషేక్ ఫిలిమ్స్ నిర్మాతలు : రమేష్ పి పిళ్లై తెలుగు రిలీజ్ : శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ - ఏ.ఎన్ బాలాజీ దర్శకత్వం: శశి సంగీతం : సిద్ధూ కుమార్ సినిమాటోగ్రఫీ : ప్రసన్న కుమార్ ఎడిటింగ్: సాన్ లోకేష్ విడుదల తేది : ఆగస్ట్ 13,2021 ‘బొమ్మరిల్లు’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్థ్. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలతో అలరించి, తెలుగు తెరకు గ్యాప్ ఇచ్చాడు. తనదైన నటనతో యూత్ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఆయన.. ఈ గ్యాప్‌లో కొన్ని తమిళ సినిమాలు నటించి, వరుస పరాజయాలను మూటగట్టుకున్నాడు. తాజాగా 'ఒరేయ్ బామ్మర్ది' అంటూ ఓ డిఫరెంట్ తెలుగు సినిమాతో రంగంలోకి దిగాడు. తమిళ సినిమా ‘శివప్పు మంజల్ పచ్చై’సినిమాకు రీమేక్ ఇది. ‘బిచ్చగాడు’ఫేమ్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కీలక పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్,ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. వాస్తవానికి ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం థియేటర్లలోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఆగస్ట్ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా సిద్దార్థ్‌ను హిట్ ట్రాక్ ఎక్కించిందా? ‘ఒరేయ్ బామ్మర్ది’ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ రాజ శేఖర్ అలియాస్ రాజ్(సిద్దార్థ్) ఓ సిన్సియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొని మరీ ట్రాఫిక్ పోలీసు అవుతాడు. అతను రాజేశ్వరి అలియాస్ రాజీ (లిజోమోల్ జోస్)ని ఇష్టపడతాడు. ఆమె కూడా అతనితో పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ ఈ పెళ్లి రాజీ తమ్ముడు, బైక్ రేసులంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన మదన్(జీవీ ప్రకాశ్ జీవీ)కి ఇష్టం ఉండదు. గతంలో రాజ్‌కి, మదన్‌కి మధ్య జరిగిన ఓ గొడవనే దీనికి కారణం. అయితే రాజ్ మాత్రం రాజీని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఏలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరి రాజీని రాజ్ పెళ్లి చేసుకున్నాడా? లేదా? ఇంతకి మదన్‌కి రాజ్పైన ఎందుకు కోపం? వారి మధ్య జరిగిన ఆ గొడవ ఏంటి? తను అంటేనే కోపంగా చూసే మదన్‌తో రాజ్ ఏవిధంగా ‘బావ’అని పిలిపించుకున్నాడు? అనేదే మిగతా కథ నటీ నటులు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాత్రలో సిద్దార్ధ్ ఒదిగిపోయాడు. మంచి భర్తగా, బావమరిదిని దారికి తీసుకొచ్చే బావగా చక్కగా నటించాడు. బైక్ రేసులంటూ తిరిగే యువకుడు మదన్ పాత్రలో జీవీ ప్రకాశ్ పరకాయ ప్రవేశం చేశాడు. తనదైన ఎమోషనల్ యాక్టింగ్‌తో దరగొట్టేశాడు. హీరోయిన్లు కశ్మీరా పరదేశి, లిజోమోల్ జోస్‌తో పాటు మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ భావోద్వేగ కథలతో సినిమాలు చేస్తూ దక్షిణాదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దర్శకుడు శశి. ఆయన తెరకెక్కించిన శీను, రోజాపూలు, బిచ్చగాడు లాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఎమోషనల్ ఫీల్ పంచాయి. బిచ్చగాడులో తల్లి, కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తే.. ఒరేయ్ బామ్మర్దిలో బావ, బామ్మర్ది మధ్య ఉండే అనుబంధాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఢిపరెంట్ స్టోరీ లైన్ తీసుకున్నప్పటీ.. సినిమాలో బలమైన సీన్స్ రాసుకోలేకపోయాడు. సినిమా ప్రారంభంలోనే అన్ని పాత్రలను పరిచయం చేసి, కథ ఎలా ఉండబోతుందో ముందే చెప్పేశాడు. ఫస్టాఫ్‌లో అక్కా,తమ్ముడి మధ్యల వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నప్పటీకీ.. ఒక్క సంఘటనతో తల్లిలా ప్రేమించే అక్కతో విడిపోవడానికి సిద్దపడే తమ్ముడి పాత్రలో సీరియస్ నెస్ లేదనిపిస్తుంది. విలన్ పాత్ర కూడా అతికించినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. కథలో ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా చివరి వరకు ఒకే ఎమోషన్‌తో నడిపించడం సినిమాకు కాస్త ప్రతికూల అంశమే. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిద్ధూ కుమార్ నేపథ్య సంగీతం. పాటలు మామలుగా ఉన్నప్పటీకీ.. నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ సాన్ లోకేష్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఫ్లస్ పాయింట్స్ సిద్దార్థ్, జీవీ ప్రకాశ్ నటన సంగీతం లవ్ ట్రాక్ మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ వర్కౌట్ కానీ ఎమోషనల్ డ్రామా సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ స్క్రీన్‌ప్లే సింపుల్ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అలా ‘ఒరేయ్ బామ్మర్ది’ కథ మొదలైంది: శశి
‘నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మా సినిమాకు పనిచేసే ఒక రచయితను నీకు పెళ్లి అయ్యిందా అని అడిగితే ఆయన ఈ మధ్యే నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్య చిన్న తమ్ముడు మంచి ఫ్రెండ్ అయ్యాడు. నా తమ్ముడి కంటే ఈ బావమరిది తోనే నేను ఎక్కువ చనువుగా ఉంటాను, అతను ఎవరు చెప్పింది విన్నా వినకున్నా, నా మాట మాత్రం తప్పకుండా వింటాడు, కొడుకు, తమ్ముడు, ఫ్రెండ్ అన్నీ వాడే నాకు అని చెప్పాడు. ఆ రిలేషన్ నాకు గొప్పగా అనిపించింది. అప్పుడే ఒరేయ్ బామ్మర్ది సినిమా కథకు నా మనసులో ఆలోచన మొదలైంది’అన్నాడు దర్శకుడు శశి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం‘ఒరేయ్ బామ్మర్థి’.సిద్దార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ హీరోలుగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 13న థియేటర్ లలో విడుదల కాబోతోంది. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శశి మీడియాతో మాట్లాడుతూ.. సివప్పు మంజల్ పచ్చై అనే పేరుతో తమిళ్ లో ఈ మూవీని రూపొందించాం. తెలుగులో రీమేక్ చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాంతో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. బిచ్చగాడు డబ్ వెర్షన్ తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలుసు. ఒరేయ్ బామ్మర్ది కథ సిద్ధార్థ్ కు చెప్పాక తనను బావమరిది క్యారెక్టర్ చేయమని అడిగాను. కానీ సిద్ధార్థ్ కు బావ క్యారెక్టర్ నచ్చి అది సెలెక్ట్ చేసుకున్నాడు. బావమరిది క్యారెక్టర్ లో జీవీ ప్రకాష్ కుమార్ ని తప్ప మరొకరు సెట్ కారు అనిపించింది. సిద్ధార్థ్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. జీవీ కూడా సూపర్బ్ గా యాక్ట్ చేశాడు. ఇందులో యాక్షన్ సీన్స్ బాగా కుదిరాయి. ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను’అని అన్నాడు. -
చిన్నప్పటి నుండి నటి అవ్వాలని ఉండేది: హీరోయిన్
‘‘శశి’ కథ చెబుతున్నప్పుడే శ్రీనివాస్గారిపై నాకు నమ్మకం వచ్చింది. ఈ సినిమా కోసం వర్క్‌షాప్స్ చేయలేదు. నటనలో శిక్షణ తీసుకోలేదు. ఎందుకంటే నటన అనేది నాకు నేచురల్‌గానే వచ్చేస్తుంది. నేను సహజ నటిని’’ అని హీరోయిన్ రాశీ సింగ్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల తెరకెక్కించిన చిత్రం ‘శశి’. ఆర్.పి. వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలకానుంది. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన రాశీసింగ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుండి నటి అవ్వాలని ఉండేది. 14 ఏళ్లప్పుడు ఓ కమర్షియల్ యాడ్ చేశాను. ఫ్యామిలీ సెటిల్ అవ్వాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా చేశాను. ఏడాది తర్వాత మానేసి, అవకాశాల కోసం ప్రయత్నం చేశాను. నేను నటించిన తొలి చిత్రం ‘జెమ్’, రెండో సినిమా ‘శశి’. అయితే నా రెండో సినిమా ‘శశి’నే ముందు విడుదలవుతోంది. ఈ సినిమాలో సునీత అనే హోమ్లీ క్యారెక్టర్ చేశాను. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నాను’’ అన్నారు. చదవండి: మహేశ్‌బాబు సరసన జాన్వీ కపూర్! -
'శశి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
గ్లామర్ పాత్రలు రావడం లేదు: ‘శశి’ హీరోయిన్
‘‘శశి’ చిత్రనిర్మాతలు మొదట నాకు ఫోన్ చేసి కథ వినమన్నారు. ఆ తర్వాత దర్శకుడు శ్రీనివాస్ వచ్చి మూడు గంటలు ‘శశి’ కథ చెప్పారు. కథ వినగానే చాలా థ్రిల్ అయ్యి నటించేందుకు ఒప్పుకున్నాను’’ అని హీరోయిన్ సురభి అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా సురభి విలేకరులతో మాట్లాడుతూ -‘‘శశి’ రెగ్యులర్ ప్రేమకథా చిత్రం కాదు. అన్ని రకాల అంశాలున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తల్లితండ్రులు, కూతురు మధ్య ఉన్న ప్రేమను ఈ చిత్రంలో బాగా చూపించారు. నిజ జీవితంలోనూ నా తల్లితండ్రులకు నేనొక్కదాన్నే కావడంతో శశి పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. కూతురు పట్ల ఓ తండ్రి ఎంత రక్షణగా, బాధ్యతగా ఉంటాడన్నది ఆకట్టుకుంటుంది. నా తండ్రి పాత్రలో రాజీవ్ కనకాలబాగా నటించారు. ఈ సినిమాలో ఆది పాత్ర రగ్డ్గా ఉంటుంది. తన పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. నేను కూడా రెండు వేరియేషన్స్‌లో నటించడం కొత్తగా అనిపించింది. గ్లామర్ రోల్స్ చేయడానికి అభ్యంతరం లేదు. ‘ఓటర్’ సినిమాలో నాది గ్లామర్ పాత్రే. ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది. ‘శశి’ సినిమా విడుదల తర్వాత నాకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయనుకుంటున్నాను. తమిళంలో చేస్తుండడం వల్ల తెలుగులో ఎక్కువగా చేయలేకపోయా. తెలుగులో కొన్ని కథలు వింటున్నా. తమిళంలో 3 సినిమాలు చేస్తున్నాను. కన్నడ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఎంట్రీ ఇస్తున్నా. గోల్డెన్ స్టార్ గణేష్‌తో నటిస్తున్నాను’’ అన్నారు. -
ఒక లోకం... రెండు కోట్లు
‘‘పోలీస్ స్టోరీ’ సినిమా 25 సంవత్సరాల వేడుకకి వెళ్లినప్పుడు బెంగళూరులో ‘శశి’ చిత్రంలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాటని కన్నడలో తర్జుమా చేసి, వింటున్నారు. తమిళనాడులో కూడా ఈ పాటకు స్పందన చాలా బాగుంది. ఆది కెరీర్లో బెస్ట్ సాంగ్ ఇది. ఈ పాటలాగే ‘శశి’ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, సురభి హీరోయిన్గా శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి.వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించారు. అరుణ్ సంగీతం అందించారు. చంద్రబోస్ రాసిన ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాట రెండు కోట్లకు పైగా వ్యూస్ దాటింది. ఈ సందర్భంగా ‘ఒకే ఒక లోకం..’ పాట సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘పాటను ఇంతలా ఆదరించినవారికి థ్యాంక్స్. మా నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 19న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ నాయుడు నందికట్ల. ‘‘2021లో ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాట అందరి మనసుల్ని గెలిచి రంజింపజేస్తో్తంది’’ అన్నారు పాటల రచయిత చంద్రబోస్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అరుణ్, కెమెరామేన్ అమర్నాథ్ బొమ్మిరెడ్డి, మాటల రచయిత రవి, స్క్రీన్ ప్లే రైటర్ మణి, ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి, నిర్మాత ఆర్.పి. వర్మ, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆది లుక్ బాగుంది
‘‘నేను, సాయికుమార్ కలిసి సినిమాలు చేస్తున్నప్పుడు ఆది పుట్టాడు. ‘శశి’ టీజర్ చూస్తుంటే రగ్డ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. ఇప్పటివరకూ ఆది లవర్ బాయ్‌లా కనిపించాడు. ఈ టీజర్లో తన ట్రాన్స్‌ఫర్మేషన్‌ని అభినందిస్తున్నా’’ అన్నారు చిరంజీవి. ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘శశి’. బుధవారం ఆది సాయికుమార్ బర్త్‌డే సందర్భంగా ‘శశి’ టీజర్‌ని చిరంజీవి విడుదల చేశారు. ‘‘శశి’ ఎమోషనల్ లవ్ స్టోరీ’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘ఆది తొలి సినిమా ‘ప్రేమ కావాలి’కి అన్నయ్య చిరంజీవి విషెస్ లభించాయి. ఇప్పుడు ‘శశి’ టీజర్‌ను ఆయన లాంచ్ చేసి, బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు సాయికుమార్. -
శశి కథేంటి?
డిసెంబర్ 23 ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తాజా చిత్రం ‘శశి’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు చిత్రబృందం. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆది హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లు. ఆర్.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. గుబురు గడ్డంతో కోపంతో అరుస్తున్న పోజులో ఉన్న ఫొటోను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. ‘‘లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఆది డిఫరెంట్‌గా కనిపిస్తారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: అరుణ్ చిలువేరు, కెమెరా: అమర్నాథ్ బొమ్మిరెడ్డి. -
ఫుల్ జోష్
హీరోగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు నాగచైతన్య. ఇటీవలే ‘మజిలీ’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ ప్రేమకథను ఈ మధ్యనే పట్టాలెక్కించారు నాగచైతన్య. ఇప్పుడు ‘దిల్ రాజు’ బ్యానర్లో నూతన దర్శకుడు శశి సినిమాలో యాక్ట్ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమాకు ‘అదే నువ్వు అదే నేను’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది కాకుండా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’లో తండ్రి నాగార్జునతో కలసి నటించనున్నారు నాగచైతన్య. -
ముఖ్యమంత్రి వస్తున్నారు
దేవీప్రసాద్, వాయు తనయ్, శశి, సుచిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్ రావిపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’. వైష్ణవి ఫిలింస్, ఆలూరి క్రియేషన్స్ పతాకాలపై అట్లూరి నారాయణరావు, ఆలూరి సాంబశివరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ– ‘‘సమకాలీన రాజకీయ అంశాలను మా చిత్రంలో చర్చించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు ఆలోచింపజేసే సన్నివేశాలు, సంభాషణలు ఉంటాయి. దేవీప్రసాద్, వాయుతనయ్, శశి, సుచిత్ర మంచి నటన ప్రదర్శించారు. సంగీతానికి కూడా మంచి ప్రాధాన్యత ఉంది’’ అన్నారు. ‘‘నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతూ ఈ చిత్రాన్ని నిర్మించాం. పాటలకు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు ఆలూరి సాంబశివరావు. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్, కెమెరా: కమలాకర్. -
నలుగురి కథ
‘‘4 ఇడియట్స్’ సినిమాలో అందరూ కొత్తవాళ్లు నటించారు. ఇప్పటి పరిస్థితుల్లో చిన్న సినిమాల విడుదల చాలా కష్టం. వారానికి 6 సినిమాలు విడుదలవుతున్నా ప్రేక్షకులు థియేటర్‌కి రావటం లేదు. అది చాలా బాధగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి, రుచి ప్రధాన పాత్రల్లో నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై సతీష్ కుమార్ శ్రీరంగం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘4 ఇడియట్స్’. జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను సి. కల్యాణ్ విడుదల చేశారు. సతీష్ కుమార్ శ్రీరంగం మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నేను ఇప్పటివరకు చేసిన 14 చిన్న సినిమాలు మంచి విజయం సాధించాయి. ‘4 ఇడియట్స్’ కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. గతంలో ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య ఉంటే దాసరి నారాయణరావుగారు ఉండేవారు. ఇప్పుడు సి.కల్యాణ్‌గారు ఉన్నారు. సెప్టెంబర్‌లో మా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నిర్మాతలు తుమ్ములపల్లి రామ సత్యనారాయణ, సాయి వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య, కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్. -
ముఖ్యమంత్రి ఎవరు?
వాయుతనయ్, శశి, దేవి ప్రసాద్ ముఖ్య తారలుగా పొలిటికల్ నేపథ్యంలో రూపొందనున్న చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’. మోహన్ రావిపాటి దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరా బాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు ఎన్.శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, నటి జీవితారాజశేఖర్ క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి ‘తమ్ముడు’ సత్యం గౌరవ దర్శకత్వం వహించారు. మోహన్ రావిపాటి మాట్లాడుతూ–‘‘సమకాలీన అంశాలతో పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న చిత్రమిది. మొత్తం 40 రోజుల్లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మా సినిమా ద్వారా చూపిస్తున్నాం. ఎవరినీ కించపరిచేలా సినిమా ఉండదు. పబ్లిక్ పాయింటాఫ్ వ్యూని కూడా సినిమాలో చర్చిస్తున్నాం. వరుసగా సామాజిక, కుటుంబ కథా చిత్రాలు చేయాలన్న సంకల్పంతో ఉన్నాం’’ అన్నారు ఆలూరి సాంబశివరావు. వాయు తనయ్, దేవి ప్రసాద్, శశి, సంగీత దర్శకుడు ఫణి కల్యాణ్, నటి సుచిత్ర పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కమలాకర్. -
పిచ్చైక్కారన్ దర్శకుడి మల్టీస్టారర్ చిత్రం
తమిళసినిమా: పిచ్చక్కారన్ చిత్రంతో సంగీతదర్శకుడు విజయ్‌ఆంటోనిని స్టార్ హీరోని చేసిన దర్శకుడు శశి. అంతకు ముందు సొల్లామలే. పూ, డిష్యుం వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన చాలా గ్యాప్ తరువాత పిచ్చైక్కారన్ చిత్రం చేశారు. ఆ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ అనువాదమై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా శశి మరో చిత్రానికి రెడీ అయ్యారు. ఇటీవలే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్న శశి ఇప్పుడు ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. విజయ్‌తో మెర్శల్ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, జీవీ.ప్రకాశ్‌కుమార్ కలిసి నటించనున్నారు. వారికి జంటగా నటించే అందాల భామల ఎంపిక జరుగుతోందట. ఈ చిత్రానికి ఇరట్టై కొంబు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది ఇద్దరు హీరోల కథే అయినా హాస్యానికి పెద్ద పీట వేసే చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర వర్గాలు త్వరలోనే అధికారకపూర్వకంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
బిచ్చగాడు డైరెక్టర్‌తో వెంకీ
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన తమిళ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు. విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు నాట కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ సినిమా డైరెక్టర్ శశితో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. శశి కూడా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనతో ఓ సీనియర్ హీరోతో సినిమా చేసుందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాబు బంగారం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్ హీరో వెంకటేష్.. ఆ సినిమా తరువాత నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అదే సమయంలో బిచ్చగాడు దర్శకుడు శశితో కూడా సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాడు వెంకీ. ఇప్పటికే వెంకీకి కథ వినిపించిన శశి, పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. డబ్బింగ్ సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించిన శశి, స్ట్రయిట్ సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. -
మళ్లీ...
ప్రశంస పొందిన కథ ‘శశి’ ‘రియాజ్’... ‘శశి... అమ్మీ’.... ‘ఏమైంది అమ్మీకి? ఏంటలా ఉన్నావు?’ ‘అమ్మీ ఐసియులో ఉంది పది రోజుల నుండి. నిన్ను చూడాలనుందని పేపర్ మీద నీ పేరు రాసింది’ గొంతు ఏడుస్తున్నట్టుగా ఉంది. ‘నే వస్తున్నా. ధైర్యంగా ఉండు. అమ్మీకి ఏమీ కాదు’ కాల్ కట్ చేశాను. కాని వెళ్లాలా వద్దా అని- ఒక నిమిషం ఆలోచించాను. వెళ్లకుండా ఉంటే? కాని రియాజ్ అమ్మీ గుర్తుకొచ్చింది. తెల్లగా పాలరంగులో ఉండే మనిషి. ‘పరీ’... అని పిలిచేది. ‘పరీ అంటే ఏంటి అమ్మీ?’ అని అడిగాను ఒకసారి. ‘దేవకన్య బేటీ’... అంది. ‘అంత అందంగా ఉంటావ్ నువ్వు’ అని కూడా అంది. దేవకన్యలు పెళ్లిళ్లకు కాపురాలకు పనికిరారు. నేను కూడా పనికి రానని ఆమె అనుకున్న రోజులను ఎలా మర్చిపోవడం? ఇప్పుడు వెళితే అవన్నీ గుర్తుకే వస్తాయి. కాని చావు బతుకుల్లో ఉన్న మనిషి. ఎందుకు బాధ పెట్టడం? అరగంటలో పని ముగించుకొని బయట కార్ స్టార్ట్ చేశాను. కాకినాడ నుండి ఏలూరుకు నాలుగు గంటల ప్రయాణం. వద్దన్నా ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. పదేళ్లవుతోంది రియాజ్‌తో మాట్లాడి. ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఒకే ఊళ్లో కలిసి తిరిగాం. ఎప్పుడు చూసినా నూగు గడ్డంతో అందంగా ఉండేవాడు. చూసి నవ్వేవాడు. బదులు నవ్వకుండా ఉండటం సాధ్యం కాలేదు. నలుగురైదుగురం గ్రూప్‌గా ఉండేవాళ్లం. ఆ గ్రూప్‌లో మళ్లీ మేమిద్దరం ప్రత్యేకం. అందరి ఇళ్లకు వెళ్లేవాళ్లం. అందరికీ అందరం తెలుసు. మా ప్రేమ తెలియకుండా ఉంటుందా? ‘మన పెళ్లి జరుగుతుందనిపించడం లేదు’ ఒకరోజు బెంగగా అన్నాడు. ‘ఏం?’ ‘అమ్మీ ఒప్పుకోవడం లేదు’ ‘ఏం?’ ‘అన్నయ్య కూడా’ ‘ఏం?’ ‘నువ్వు నమాజ్ చదవలేవు. మా పద్ధతులూ ఏమీ తెలియవు అంటున్నారు’ ‘మా ఇంట్లో కూడా అంతే. మన పూజలు పద్ధతులు నీకు తెలియవు వద్దు అన్నారు. నేను వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా. నువ్వూ చెయ్’ కాని చేయలేకపోయాడు. రియాజ్ చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. అన్నయ్య మాట ఎన్నడూ కాదనలేనట్టుగా పెరిగాడు. అమ్మీకి కూడా ఎప్పుడూ ఎదురు చెప్పిన పిల్లాడు కాదు. రియాజ్‌కి తన మనవరాలికి ఇచ్చి చేయాలని పెద్దావిడ కోరిక. అలా అని కూతురికి ఎప్పుడో మాటిచ్చింది. ఇప్పుడు కాదంటే తమ మీదే ఆశ పెట్టుకున్న మనవరాలి జీవితం ఏమౌతుందోనని ఆమె భయం. ఆ రోజు సాయంత్రం రియాజ్ ఆమెతో మార్కెట్‌కు వెళుతూ నేను ఎదురుపడితే చూపిస్తూ అడిగాడు- ‘శశి లేకుండా నేను బతకలేను అమ్మీ’... ‘దాన్నే చేసుకుంటానంటే మాత్రం నేను చచ్చిపోతారా’ నేను చేతులు పట్టుకున్నాను. ‘ఒప్పుకోండి అమ్మీ, సంతోషంగా ఉంటాము. విడిపోయి ఎలా బతకాలో ఊహకి కూడా రావడంలేదు’ ‘బేటీ... నువ్వు మంచిపిల్లవు. మంచిపిల్లలానే ఉండు. నాకు నువ్వు చెడ్డ కావడం నీకు నేను చెడ్డ కావడం నాకు ఇష్టం లేదు’ కొడుకును తీసుకుని వెళ్లిపోయింది. నా అంత ధైర్యవంతుడు కాదు రియాజ్. సున్నితమైన మనసు. ఈ గొడవలతో మానసికంగా కుంగిపోతున్నాడు. నేనే ఏదో ఒక దారి వెతుకుతానని ఆశపడుతున్నాడు. కాని పెద్దావిడ మొండికేసింది. ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది ఊహించని సంఘటన. లొంగక తప్పలేదు. అక్క కూతురు నాజియాతో రియాజ్ పెళ్లి ఖాయమైంది. అంచుల్లో అత్తరు రాసి ఎల్లో కలర్లో ఉన్న కార్డ్ మీద గ్రీన్ లెటర్స్‌తో వచ్చిన వెడ్డింగ్ కార్డ్‌ను చూసి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత మళ్ళీ మేం కలవలేదు. మాట్లాడుకోలేదు. ఊరు మారినా ఫోన్ నెంబర్ మారినా చిన్న మెసేజ్ పెట్టుకుంటాం. అంతే. పదేళ్ళ నుండి అతని నంబర్, చిరునామా చూస్తూనే ఉన్నాను. ఎప్పుడూ కలుసుకోలేదు. ఈ రోజు ఫోన్ కాల్‌తో అది తప్పేలా లేదు. ఉద్వేగంగా ఉందని అర్థమవుతూ ఉంది. ఎంత ప్రయత్నించినా కారు వేగం ఇంతకు మించి తగ్గించలేకపోతున్నాను. మధ్య మధ్యలో అమ్మీ ఇక బతకదేమో అనే ఆలోచన వచ్చినప్పుడు కొంచెం ఆందోళనగా అనిపిస్తోంది. ఎందుకంటే రియాజ్‌కి అమ్మీ అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే నన్ను కూడా కాదనుకునేంత ప్రాణం. ‘రియాజ్.... ధైర్యంగా ఉండు... ప్ల్లీజ్ ధైర్యంగా ఉండు... నే వచ్చేస్తున్నా’ నాలో నేను మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నాను. స్నేహితులు చెప్పారు- రియాజ్ వాళ్ల అన్నయ్యతో కూడా మాట్లాడటం మానేశాడట. నాతో పెళ్లికి సపోర్ట్ చేయలేదని కోపం అట. పిచ్చోడు. రక్తసంబంధాలు వద్దనుకుంటారా ఎవరైనా. ఎప్పుడొచ్చిందో ఏలూరు వచ్చేసింది. అప్పటికి సాయంత్రం ఐదయ్యింది. రియాజ్ హాస్పిటల్ అడ్రస్ మెసేజ్ పెట్టాడు. దాని ప్రకారం చేరుకుని కార్ పార్క్ చేసి హాస్పిటల్ వైపు చూస్తూ కూచున్నాను. రియాజ్‌కి కాల్ చేయాలి. ఇంతలో వాళ్ల అన్నయ్య సర్ఫరాజ్ గేటు దగ్గర కనిపించేడు. నన్ను చూసి లోపలికి వెళ్లి ఐదు నిమిషాల తరువాత నేరుగా నా కారు వైపు వచ్చాడు. కారు దిగి నిలబడ్డాను. ‘రా.. శశి’... అనుసరించమంటూ ముందుకు దారి తీశాడు. మౌనంగా వెంబడించాను. ర్యాంప్ మీద నడుచుకుంటూ మూడో అంతస్తులోని ఐసియు వద్దకు చేరాం. సర్ఫరాజ్ ఐసియులోకి వెళ్లి అక్కడున్న సిబ్బందితో మాట్లాడి బయటకొచ్చాడు. ‘లోనికి వెళ్లి అమ్మీని కలువు శశీ’ చల్లగా ఉంది ఐసియు లోపలికి అడుగు పెట్టాను. సిబ్బంది బ్లూ గౌన్ తొడిగి స్లిప్పర్స్ చూపించి వాటిని వేసుకొని వెళ్లమన్నారు. ఒక బెడ్ మీద రకరకాల ట్యూబులు, వైర్ల మధ్య అమ్మీ కనిపించింది. మంచానికి అతుక్కుపోయినట్టు కనిపిస్తోంది. చేయి మీద నరాలు బయటకొచ్చేశాయి. శ్వాస భారంగా ఆడుతోంది. సగం మూసిన కళ్ళు, సగం తెరిచిన నోరు... చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నా ధైర్యంగా రెక్కల కష్టం మీద పిల్లలని పెంచి పెద్ద చేసిన అమ్మీ ఈమేనా? అమ్మీ... అరచేతిని నిమిరాను. కళ్ళు తెరిచింది. దగ్గరగా జరిగి నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగాను... ‘ఎలా ఉన్నావు అమ్మీ’... కళ్ళలో కన్నీళ్లు ఉబికి బయటకు వచ్చాయి. వారిస్తూ వేళ్ళతో మెత్తగా తుడిచాను. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. పెదాలు కదులుతున్నాయి కానీ మాట బయటకు రావటం లేదు. ‘ఏమీ కాదు అమ్మీ... అందరూ బావుంటారు. రియాజ్, సర్ఫరాజ్ అందరూ బాగానే ఉంటారు’ శక్తి కూడగట్టుకుంటూ అడిగింది - ‘మరి నువ్వూ’ ‘నేను కూడా బాగున్నా అమ్మీ. ఉద్యోగముంది. బతుకుతున్నా’ సంతోషంగా ... అనే మాట అనలేక పోయాను. కళ్ల నుంచి వేడి కన్నీటి బొట్లు ధారగా జారాయి. తప్పు చేసిన దానిలా తలవొంచుకుంటూ అంది- ‘మాఫ్ కరో బేటా... క్షమిస్తావా నన్ను? పువ్వు సంతోషంగా లేదు... తీగ సంతోషంగా లేదు... క్షమిస్తావా నన్ను...’ ఈ ఒక్క మాట చెప్పడానికే పిలిపించిందా? అందుకోసమే బతికి ఉందా? ‘అలా అనకండి అమ్మీ.. ప్లీజ్ అలా అనకండి. మీరు ప్రశాంతంగా ఉండండి ప్లీజ్’ ఏదో గొణుక్కున్నట్టుగా ఉండిపోయింది. ఇంతలో స్టాఫ్ వచ్చారు. ‘మేడమ్... ఆవిడని ఇక రెస్ట్ తీసుకోనివ్వండి’ ఆమె వైపు చూడకుండా చివుక్కున తిరిగి ఐసియు నుండి బయటపడి అక్కడ ఉన్న బల్ల మీద కూలబడ్డాను. భోరున ఏడుపు వచ్చింది. పక్కనే నిలబడ్డ సర్ఫరాజ్ మాటలు లేనట్టుగా ఉండిపోయాడు. కాసేపటికి అన్నాడు- ‘రియాజ్ నీ కార్ దగ్గర ఉన్నాడు’ కార్ దగ్గరకు వచ్చాను. రియాజ్ కనిపించ లేదు. కార్ స్టార్ట్ చేసి అలాగే కూర్చున్నాను. రెండో నిమిషంలోనే వచ్చి నా పక్క సీట్లో కూర్చున్నాడు. ఒక్క క్షణం చూశాను. మనిషి పూర్తిగా మారిపోయాడు. ఆ మెరుపు, ఆ నవ్వు... మాయమైపోయాయి. పదేళ్ళు చాలా పెద్ద కాలం కదా. కారు స్టార్ట్ చేసి ముందుకు నడిపించాను. రియాజ్ ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు. కారు పోనిస్తున్నాను. ఎక్కడికని తను అడగలేదు. నేను చెప్పలేదు. పావుగంట తర్వాత కారు ఊరి పొలిమేర్లలో ఉన్న గుడి దగ్గర ఆపాను. విశాలమైన గ్రౌండ్ ప్రశాంతమైన సాయంత్రం... ఒకప్పుడు వారానికి ఒకసారైనా ఇక్కడికి వచ్చేవాళ్ళం ఇద్దరం. అక్కడే రావిచెట్టు ఉంటుంది. అదే మా స్పాట్. ఎప్పటిలాగే నేను కాళ్లు ముడుచుకుని కూచున్నాను. ఎప్పటిలాగే కాళ్లు కిందకు జార్చి రియాజ్ కూచున్నాడు. తన అరచేతుల్ని మూస్తూ, తెరుస్తూ వాటి వైపే చూస్తున్నాడు. ఆ వేళ ఆ సాయంత్రం పదేళ్ల ఎడబాటుకు సాక్షీభూతం. ‘రియాజ్... మాట్లాడు’ తల అడ్డంగా ఊపి కింద పెదవిని గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అలాగే ఉండిపోయాడు. తెరిచిన తన అరచేతిలో చెయ్యి వేశాను. చప్పున ఇంకో చెయ్యి దాని మీద వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఏడుస్తున్నాడు. చూస్తున్నాను. ‘ఇక నా వల్ల కాదు శశి... నాతో నేను పోరాడుతూ, జీవితంలో పోరాడుతూ పూర్తిగా ఓడిపోయాను. ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? ఈ బాధ పదేళ్లయినా తగ్గదే. దీన్ని జీవితమంటారా?’ నేను ఏమీ మాట్లాడలేదు. ఏమి చెప్పి ఓదార్చాలి? రియాజ్ సంతోషంగా లేడు, తను కూడా లేదు. బతుకుతున్నారు. జీవించటం లేదు. అంతకు మించి మార్గం ఏమైనా ఉంది. నాకు తెలుసు నేను అధైర్యపడితే రియాజ్ అస్సలు చూడలేడని. ‘అలా మాట్లాడకు రియాజ్. ధైర్యంగా ఉండు. ఇటు చూడు. నేనెంత ధైర్యంగా ఉన్నానో చూడు’ రియాజ్ ముఖాన్ని నా వైపు తిప్పుకున్నాను. నన్ను రెప్ప ఆర్పకుండా చూస్తున్నాడు. ఒకప్పటి మెరుపు ఒక్క క్షణం మళ్లీ తన కళ్లలో వెలిగింది. ‘అందంగా ఉన్నావు శశీ... చాలా అందంగా ఉన్నావు. ఎప్పటిలానే’... చిన్నగా నవ్వాను. ‘అవునూ నువ్వేంటి ఇంత పొట్ట పెంచావు?’ పొట్ట మీద చిన్నగా కొడుతూ అడిగాను. ఇద్దరం ఒక్కసారిగా నవ్వేశాం. ‘పిల్లలు ఎలా ఉన్నారు రియాజ్? ఏమి చేస్తున్నారు?’ పిల్లలు అనగానే రియాజ్ పెదాల మీద చిరునవ్వు. ఇలా ఆనందంగా ఉంటే ఎంత అందంగా ఉంటాడు... అనిపించింది. ఊహూ... పక్కన కూర్చుంటే సరిగా కనబడటం లేదు. లేచి నిల్చున్నాను రియాజ్ చెప్పులలో కాళ్లు పెట్టి నెమ్మదిగా అక్కడే తన ముందు అటూ ఇటూ నడుస్తున్నాను. రియాజ్ నా కాళ్లవైపే చూస్తున్నాడు. కుడి అరికాలు వంపులో ఉన్న పుట్టుమచ్చ, దాన్ని ఎన్నిసార్లు ముద్దాడాడో నాకే గుర్తులేదు. అప్పట్లో ఉన్న పట్టీలు, మువ్వలు ఇప్పుడు లేవు. నాకు ఎప్పుడూ ఇష్టముండేది కాదు మువ్వలంటే. రియాజ్ కోసం వేసుకునేదాన్ని. ‘చెప్పు రియాజ్’ ‘పిల్లలు బాగున్నారు. రోషినీ అయిదవ తరగతికి వచ్చింది. చాలా పెద్దదైపోయిందన్న భావన తనకి. లేనిపోని గాంభీర్యం నటిస్తుంది. నీలాగా బట్టల పిచ్చి. షాప్‌కి తీసుకెళితే వంద తీయించి ఒకటి సెలక్ట్ చేస్తుంది.’ కూతురి గురించి ఆనందంగా మాట్లాడు తుంటే రియాజ్ వైపు రెప్పార్పకుండా చూశాను. ‘మరి ఆసిఫ్?’ ‘వాడా, వాడు నాకంటే పెద్ద వెధవ అవుతాడు శశి. వాడి మీద టీచర్ల నుండి రోజు కంప్లైంట్స్. వాడు నాకొద్దు. నువ్వు తీసుకెళ్లి పెంచుకో వాడిని’ నవ్వుతూ అన్నాడు. నవ్వడానికి ప్రయత్నించాను. నా కళ్లలో బాధ, గొంతులో వణుకు గమనించాడు. పదేళ్లలో ఏం మారిందని? తన ముందు నెమ్మదిగా అడుగులు కదిలిస్తున్న అదే అమ్మాయిని. రెండు చేతులూ పట్టుకున్నాడు. ‘పెళ్లి చేసుకోవా ఇక?’ మౌనంగా ఉన్నాను. ‘నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లే నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటానుగా’ ‘నేను బాగానే ఉన్నాను. నమ్ము ప్లీజ్.’ ‘నమ్మను’ ‘శశి. ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ఇప్పటికైనా మన కోసం మనం జీవించవచ్చేమో...’ రెండు చేతులు గట్టిగా పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు. నెమ్మదిగా విడిపించుకుని పక్కనే కూచున్నాను. ‘ఆ ఆలోచన కూడా రానివ్వకు రియాజ్. ఎన్నో జీవితాలు ముడిపడి ఉన్నాయి. పిల్లలు నాజియా వాళ్లేం తప్పు చేశారు? వాళ్లు పూర్తిగా నీ బాధ్యత. జాగ్రత్తగా చూసుకో వాళ్లని.’ ‘మరి నువ్వు? నువ్వు నా బాధ్యత కాదా? నువ్వు ఒంటరిగా అలా ఉండిపోయావన్న బాధ నన్ను ప్రతిక్షణం చంపేస్తుంది తెలుసా?’ ‘అది మనిద్దరి నిర్ణయం. నేను నిజంగా బాగానే ఉన్నాను’ ‘నువ్వు చాలా మొండిదానివి, నా మాట వినవు’. లేచి నిలబడ్డాను. ‘పద.. అన్నయ్య నీ కోసం ఎదురుచూస్తుంటాడు. సరిగ్గా మాట్లాడుకుంటున్నారా మీరిద్దరూ?’ ‘పదేళ్ల తర్వాత ఇప్పుడే మాట్లాడటం అన్నయ్యతో’ అన్నాడు దూరంగా చూస్తూ. ‘అలా ఉండకు రియాజ్. సర్ఫరాజ్ తప్ప నీకెవరున్నారు? కోపాలు వదిలెయ్.’ ‘ఆ రోజు తను నావైపు ఉంటే అమ్మీ ఒప్పుకునేదే’ ‘వదిలేయి ప్లీజ్. అనవసరంగా నీ మనసుని ఇంకా కష్టపెట్టుకోకు. అందరితో కలిసి ఉండు. నీ జీవితం అన్ని విధాలుగా బాగుండాలి. నువ్వు బాధ్యతగా ఉండాలి. అలా ఉంటానని మాటిస్తావా రియాజ్’ తను చెయ్యి చాచింది. ‘ఇవ్వను. అస్సలు ఇవ్వను’ రెండు చేతులూ కట్టుకుంటూ అడ్డంగా తలాడించాడు రియాజ్. తనెప్పుడూ అంతే చిన్న పిల్లాడిలా మారాం చేస్తాడు. కానీ తన మాట ఎప్పుడూ కాదనడు. ‘పద వెళదాము’. చెయ్యి పట్టుకుని పైకి లేపాను. ఇష్టం లేకుండానే లేచాడు. కార్ స్టార్ట్ అయింది. మళ్లీ బిగుసుకుపోయాడు. కారు హాస్పిటల్ వద్దకు చేరింది. ‘శశి...’ ‘దిగి వెళ్లి పో రియాజ్.’ దిగాడు. నా విండో వైపు వచ్చాడు. చేయి తాకాలని అనుకున్నాడు. కాని అవకాశం ఇవ్వక స్టీరింగ్ మీదే నా చేయి బిగించి ఉంచాను. వెళ్లిపోతున్నాడు. అందమైన రియాజ్. మంచి మనసున్న రియాజ్. నన్ను ప్రేమిస్తూనే ఉన్న రియాజ్. ఒక్క క్షణం గట్టిగా పిలవాలనిపించింది. వెనక్కు పిలవాలనిపించింది. కాని- ఆగాను. అతి కష్టం మీద నన్ను నేను కూడగట్టుకున్నాను. దేవుడా... ఏంటిది? ఈ ముగిసిన కథలోకి మళ్లీ రావడం... మళ్లీ ఈ జ్ఞాపకాలను తిరగదోడుకోవడం... తెగిన దారాన్ని అతుకులు పెట్టాలనుకోవడం... దూరంగా ఉండటంలోని కష్టం కంటే ఈ కష్టం ఎక్కువగా ఉంది. మెల్లగా కారు స్టార్ట్ చేసి కాసేపటిలోనే హైవే మీదకు చేరుకున్నాను. కారు కూడా కుదుపులు సర్దుకుని ముందుకు పరిగెట్టడానికి సిద్ధమవుతూ ఉంది. రేర్ వ్యూ మిర్రర్లో దూరమవుతున్న ఊరు కనిపిస్తూ ఉంది. బహుశా రెండు మూడు రోజులలో అమ్మీ చనిపోయిన ఫోన్ రావచ్చు. రియాజ్ మళ్లీ కాల్ చేయవచ్చు. కాని ఇక తను రాకపోవచ్చు. ఎప్పటికీ రాకపోవచ్చు. బాధను మిగిల్చే అనుభవంలోకి మళ్లీ మళ్లీ ఎందుకు రావడం? మలుపు దాటితే కొత్తగా వేసిన రోడ్డు కనిపిస్తూ ఉంది. అటుగా ఎక్సిలరేటర్ తొక్కాను. - సంజీవని కుసుమ్ -
13 కోట్లు కొల్లగొట్టిన 'బిచ్చగాడు'
డబ్బింగ్ సినిమాల హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ సృష్టించాడు బిచ్చగాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఓ సాదాసీదా సినిమాగా టాలీవుడ్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన బిచ్చగాడు. భారీ వసూళ్లతో సంచలనం సృష్టించాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లు కూడా మెప్పించలేకపోయిన సీజన్లో ఈ కోలీవుడ్ ఎంటర్ టైనర్ హిట్ టాక్‌తో మంచి కలెక్షన్లు సాధించింది. తమిళ హీరో విజయ్ ఆంటోని లీడ్ రోల్లో శశి దర్శకత్వంలో తెరకెక్కిన బిచ్చగాడు తెలుగు నాట కూడా ఘనవిజయం సాధించింది. పిచ్చెకారన్ అనే పేరుతో కోలీవుడ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను 30 లక్షలకు సీనియర్ ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు సొంతం చేసుకున్నారు. డబ్బింగ్‌తో పాటు ప్రమోషన్ లాంటి ఇతర కార్యక్రమాలన్నింటికీ కలిపి దాదాపు 50 లక్షల వరకు ఖర్చయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. సమ్మర్ సీజన్లో రిలీజ్ అయిన బిచ్చగాడు తెలుగునాట కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఏకంగా 13 కోట్ల వసూళ్లను సాధించింది. అంటే దాదాపుగా పెట్టుబడికి 25 రెట్లు సాధించిన బిచ్చగాడు డబ్బింగ్ సినిమాల చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. -
వీడనున్న సునంద మర్డర్ మిస్టరీ
-
సెట్ టాప్ బాక్స్ అక్కరలేదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఎయిర్టెల్ మరో ముందడుగు వేసింది. అంతర్గతంగా స్మార్ట్ కార్డ్ కలిగిన ఇంటెగ్రేటెడ్ డిజిటల్ టీవీలను (ఐడీటీవీ) శామ్సంగ్తో కలిసి భారత్‌లో తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ టీవీల కు సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుం డానే డిజిటల్ ప్రసారాలను వీక్షించొచ్చు. ఐడీటీవీల ప్రత్యేకత ఏమంటే సిగ్నల్ నష్టాలను తగ్గిస్తాయి. ఒకే రిమోట్‌తో టీవీ ఆపరేట్ చేయొచ్చు. యాంటెన్నా నుంచి టీవీ వరకు తక్కువ వైర్లుంటాయి. విద్యుత్ 10% ఆదా అవుతుంది. ఇక పిక్చర్, శబ్దం నాణ్యతా బాగుంటుంది. శామ్సంగ్ స్మార్ట్ యాప్స్‌తోపాటు ఇన్ బిల్ట్ వైఫై కూడా ఉంది.శామ్సంగ్ హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ డెరైక్ట్ టీవీల ధర రూ.44,900 నుండి ప్రారంభం. శామ్సంగ్ ప్లాజా, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఔట్‌లెట్లలోనూ ఇవి లభిస్తాయి. పరిచయ ఆఫర్లో రూ.2,851 విలువగల ఎయిర్టెల్ మెగా హెచ్డీ డీటీహెచ్ ప్యాక్ 4 నెలలు ఉచితం. వీక్షణలో కొత్త అధ్యాయం..: టీవీ వీక్షణలో ఐడీటీవీలు నూతన ఒరవడి సృష్టిస్తాయని భారతి ఎయిర్టెల్ డీటీహెచ్, మీడియా సీఈవో శశి అరోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. టెక్నాలజీ, సౌకర్యం వీటి ప్రత్యేకతన్నారు. వీటి అభివృద్ధికి భారీగా వ్యయం చేశామన్నారు.యూఎస్, ఈయూ వంటి దేశాల్లో ఈ టెక్నాలజీ ప్రాచుర్యంలో ఉందన్నారు. ఐడీటీవీ కస్టమర్ల కోసం ప్రత్యేక బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. కాగా, హెచ్డీఎంఐ కేబుల్‌తో ఇతర కంపెనీల సెట్ టాప్ బాక్స్‌ను సైతం ఈ టీవీలకు అనుసంధానించుకోవచ్చు. -
ముగ్ధ...మనోహరమైన కల!
చాలా మంది యువతీ యువకులే కాదు వారి తల్లిదండ్రులూ తమ పిల్లల విషయంలో కంటున్న కల సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం. పెద్ద పెద్ద కంపెనీలలో లక్షల సంపాదన!! అయితే అవన్నీ అందిపుచ్చుకున్న పాతికేళ్ల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ శశి మాత్రం చేస్తున్న ఉద్యోగం వద్దనుకున్నారు. తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణించడానికి కృషి చేస్తున్నారు. ‘కంప్యూటర్ ముందు ఓ యంత్రంలా చేసే పనికన్నా దుస్తులపై మనసుపెట్టి చేసే డిజైన్లు నాకు ఎంతో సంతృప్తినిస్తాయి’అంటారు శశి. నేడు సినీస్టార్స్ చేత ర్యాంప్‌పై ఆమె డిజైన్స్‌తో హొయలొలికిస్తున్న శశి ఉంటున్నది హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో. ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’ పేరుతో ఆమె ఓ బొటిక్‌ను నడుపుతున్నారు. రెండు వేల రూపాయలతో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు వంద మందికి పైగా ఉపాధిని ఇవ్వగల స్థాయికి చేర్చింది. అతివలు ముచ్చటపడే దుస్తుల డిజైనర్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయగాథే ఇది. స్వశక్తే పెట్టుబడి రెండేళ్ల క్రితం వరకు ఇంజినీర్‌గా శశి నెల జీతం 50 వేలు. ఇప్పుడూ అదే ఉద్యోగంలో ఉంటే లక్ష రూపాయలు దాటేదే! ‘కానీ, నాకు రాత్రీ పగలూ ఒకటే ఆలోచన... అద్భుతమైన దుస్తులను తయారు చేయాలి. పది మందికి నేనే ఉపాధి ఇవ్వాలి. ఆ కలను గత రెండేళ్లుగా నిజం చేసుకుంటున్నాను’ అన్నారు ‘ముగ్ధ’ పేరుతో సంప్రదాయ దుస్తులను డిజైన్ చేసే శశి. ‘సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే పెళ్లికి మంచి సంబంధాలు వస్తాయి కాని, ఫలానా వారి అమ్మాయి బట్టలు కుడుతుంది అంటే ఎవరూ ముందుకు రారు. ఈ పని మానుకో!’ అని శశి అమ్మ అంజలీదేవి, నాన్న సత్యనారాయణ హెచ్చరించారు. ఆమె ఇష్టాన్ని కాదన్నారు. ‘కుటుంబంలో ఎవరికీ లేని ఈ పిచ్చి నీకెందుకు పట్టుకుంది’ అని బాధపడ్డారు. వారిని ఒప్పించలేక తన స్వశక్తిని నమ్ముకుని ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వచ్చేశారు శశి. అలా ఉప్పల్‌లో అమ్మానాన్నల చెంత ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే ఆమె, బంజారాహిల్స్‌లోని ఓ స్లమ్ ఏరియాలో రూ.2,000 పెట్టి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే రేయింబవళ్లూ తన మదిలో మెదిలో ఆలోచనలతో డిజైన్స్ మొదలుపెట్టారు. ‘ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణించడానికి నేనేమీ ప్రత్యేకమైన కోర్సులు చేయలేదు. ఎవరి దగ్గరా శిక్షణ పొందలేదు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే నైట్ డ్యూటీకి వెళుతూ పగలు డిజైన్స్ పరిశీలించడానికి నగరమంతా తిరిగేదాన్ని. రకరకాల వారపత్రికలు తిరగేసేదాన్ని. విడి విడిగా క్లాత్‌లు తీసుకొచ్చి కాంబినేషన్స్ చూసుకునేదాన్ని. ఆ ప్రయత్నానికి ఓ చిన్నగదిలో ఊపిరిపోయడం మొదలుపెట్టాను. వదిలి పెట్టకుండా తొమ్మిది నెలలు రకరకాల ప్రయోగాలు చేసి, ఆరు ప్రత్యేకమైన లంగా ఓణీలను డిజైన్ చేశాను. తర్వాత సొంతంగా ఒక ఎంబ్రాయిడరీ మిషన్, మగ్గం వర్క్ పరికరాలను కొన్నాను’ అని శశి చెబుతుంటే కృషి చేస్తే మేరు పర్వతాన్నైనా సింహాసనంగా చేసుకోవచ్చు అనిపించకమానదు. ప్రశంసలతో ఉత్సాహం ‘నేను డిజైన్ చేసిన లంగా ఓణీలను చూసినవారు అమితంగా మెచ్చుకున్నారు. వారి ఇంట్లో వేడుకలకు ఆర్డర్లు ఇవ్వడం మొద లుపెట్టారు. ఒకరిని చూసి మరొకరు.. డిజైనింగ్ బాగుందని, కలర్ కాంబినేషన్స్ సూపర్ అని మెచ్చుకోళ్లు.. వాటికి తగ్గట్టే ఆర్డర్లూ పెరిగాయి. ప్రశంసల జాబితా పెరుగుతున్న కొద్దీ నాలో ఉత్సాహమూ రెట్టింపు అయ్యింది. దానికి తోడు ఆదాయమూ పెరిగింది. ఇంకా డిజైనింగ్‌లో కొత్త కొత్త అంశాలు జోడించడం, నాణ్యతను పెంచడం.. వంటి జాగ్రత్తలు తీసుకున్నాను’ అంటూ వ్యాపార రహస్యాలను తెలిపారు శశి. ఉపాధి వైపుగా అడుగులు ఉద్యోగం మానేయాలనే ఆలోచనను శశి తన స్నేహితుల ముందుంచినప్పుడు వారు ‘నీకేమైనా పిచ్చా’ అన్నారు. బంధువులూ అదే మాట. అమ్మనాన్నలూ అదే మాట. ‘ఆ పిచ్చి ఉండబట్టే ఈ రోజు వంద మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోగలిగాను. మరో రెండుమూడు నెలల్లో విజయవాడ, విశాఖపట్నం, అమెరికాలోనూ ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’ ను లాంచ్ చేయబోతున్నాను. పురుషుల డిజైన్స్‌నూ పరిచయం చేయబోతున్నాను. పాతికమంది నిరుపేద అమ్మాయిలకు ఉచితంగా డిజైనింగ్‌లో మెలకువలు నేర్పగలుగుతున్నాను. ఇంకా పేదపిల్లల చదువు కోసం కొంత ఆదాయాన్ని విరాళంగా ఇవ్వగలుగుతున్నాను. సినీ స్టార్ల చేత ర్యాంప్‌షోలు చేయించగలుగుతున్నాను’అంటూ తన కల గురించి, ఆ కలను సాకారం చేసుకున్న విధం గురించి, ఫ్యాషన్ డిజైనింగ్ ఉపాధి కల్పనల గురించి తెలిపారు ఈ నవతరం డిజైనర్. మొదట ‘నీ కల సరైంది’ కాదు అని తిట్టిన అమ్మనాన్నలే నేడు కూతురు స్వశక్తితో ఎదిగినందుకు సంతోషిస్తున్నారు. ‘మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్, అందంగా దుస్తులను రూపొందిస్తుంది. ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తోంది’ అని గొప్పగా చెబుతున్నారు. స్నేహితులు అభినందిస్తున్నారు. ఆమె డిజైన్ చేసిన దుస్తులు తమకూ కావాలని పోటీపడుతున్నారు. సృజనకు స్వశక్తి పెట్టుబడిగా మారి, పట్టుదలతో కృషి చేస్తే ప్రశంసలు వాటి వెంటే వస్తాయి. అవే అందరిలోనూ ఉన్నతంగా నిలబెడతాయి. అందుకు శశి ఓ చక్కని ఉదాహరణ. - నిర్మలారెడ్డి, ఫొటోలు: శివ మల్లాల ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎలైట్ ఫ్యాషన్ షోలో హీరోయిన్ తాప్సీ కోసం ప్రత్యేకంగా లంగా ఓణీని డిజైన్ చేశాను. తన చర్మకాంతిని ఇంకా కాంతిమంతం చేసేలా, మహారాణి కళ వచ్చేలా గోల్డ్ జరీ మెటీరియల్ ఎంచుకున్నాను. దేశంలోని ప్రసిద్ధ డిజైనర్స్ ఈ షోకి హాజరయ్యి, నా డిజైన్స్‌ని ప్రశంసించారు. - శశి, ఫ్యాషన్ డిజైనర్ -
మంచి ప్రేమకథ ‘సాహెబా సుబ్రహ్మణ్యం’
ప్రేమకథ ఆధారంగా నిర్మించిన చిత్రం ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ అని, దీనిని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అన్నారు. హాయ్ లాండ్లో సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళుతూ నగరంలోని డీఎన్నార్ బ్రదర్స్‌లో ఆదివారం సాయంత్రం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా ఎంఎస్ నారాయణ మాట్లాడుతూ తన కుమార్తె శశి ఎంతో కష్టపడి ఈ సినిమాకు దర్శకత్వం వహించిందన్నారు. రేయింబవళ్లు కష్టపడి సినిమా సాంకేతిక వర్గాలను ఎంపిక చేసుకుందని, హీరోయిన్ ప్రియల్ గోర్‌ను ముంబయి నుంచి తెచ్చామని చెప్పారు. ఈ సినిమా మలయూళ మాతృక అని ఆయన వివరించారు. ఈ సినిమాలో విజయవాడకు చెందిన దిలీప్ హీరోగా నటించారన్నారు. ఈ సినిమాలో హింస ఏమీ ఉండదని, మొత్తం ప్రేమకథ ఆధారంగానే నడుస్తుందని చెప్పారు. హీరో దిలీప్ మాట్లాడుతూ ముస్లిం అమ్మాయి, హిందు అబ్బాయి మధ్య పుట్టినప్రేమతో తీసిన సినిమా అన్నారు. నాలుగు పాటలు ఎంతో చక్కగా వచ్చాయని, ఆగస్టు రెండోవారంలో చిత్రం విడుదల చేస్తామని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని కళాశాలలకు వెళ్లి విద్యార్థులను కలుస్తామన్నారు. ఈ సమావేశంలో హీరోయిన్ ప్రియల్ గోర్, దర్శకురాలు శశి, ఫొటోగ్రఫీ డెరైక్టర్ సాయి, సంభాషణల రచయిత కిట్టు, నటులు మీనాకుమారి, తాగుబోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు. - విజయవాడ -
పరికిణీల భరిణెలు
కళ్లకు స్ట్రెయిన్ ఎక్కువైపోయింది! యాప్స్, వెబ్స్, విండోస్, కమాండ్స్... ఇదే ప్రపంచం! ఓ పచ్చటి ఆకును చూశామా? ఓ పచ్చిక బయలుకు వెళ్లామా? పల్లెలు, పూరిళ్లు, కల్లాపి వాకిళ్లు... పిట్టలు, కంకులు, కడవలు, కావిళ్లు... తోరణాలు, పారాణి పాదాలు... గంధాల చుబుకాలు, అనుబంధాల అందాలు... ఎన్ని మిస్సవుతున్నాం? గూగుల్‌లో పరిమళం తెలుస్తుందా? పసుపు అంటని గడపకు పండగ కళ వస్తుందా? లాప్‌ట్యాప్‌ని షట్‌డౌన్ చేసిఈ సంక్రాంతికి పల్లెతల్లి ఒడిలో వాలండి. వీలుకాకుంటే... పరికిణీ ఓణీలో మీరున్న చోటుకే పచ్చదనం తెండి. 1- క్రీమ్ ఆర్గంజా లెహంగా, ఎర్రటి షిఫాన్ ఓణీ ధరిస్తే పచ్చని ప్రకృతి మధ్య దేవకన్యలా మెరిసిపోవచ్చు. లెహంగాకి కట్ వర్క్ చేసిన బార్డర్, ఓణీపై ఆప్లిక్ వర్క్, హైనెక్ బెనారస్ బ్లౌజ్... మరిన్ని ఆకర్షణీయమైన హంగులను అద్దాయి. 2- వెల్వెట్ లెహంగాకి పసుపు రంగు నెటెడ్ ఓణీ ఓ అదనపు ఆకర్షణ. కుందన్ వర్క్ చేసిన బ్లూ రా సిల్క్ బార్డర్, క్రీమ్ కలర్ షిమ్మర్ లైనింగ్‌ని జత చేస్తే పండగకళ మరింత వెలిగిపోతుంది. 3- సీ గ్రీన్ బెనారసీ జార్జెట్ లెహంగాకు రాసిల్క్ జరీ బార్డర్ జతగా చేర్చితే వేడుక గ్రాండ్‌గా మారిపోతుంది. జార్జెట్ ఓణీకి వెల్వెట్ కాంబినేషన్ బార్డర్వర్క్ చూపులను కట్టిపడేస్తుంది. 4- పసుపు రంగు లెహంగా, ఎరుపు రంగు ఓణీ, కుందన్వర్క్ చేసిన బెనారస్ బ్లౌజ్ ధరించడంతో పండగశోభను రెట్టింపు చేస్తుంది. కోటా ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగాకు మల్టీకలర్ బెనారస్ బార్డర్‌ను, క్రేప్ చున్నీకి జర్దోసి బార్డర్‌ను జత చేశారు. శశి, ఫ్యాషన్ డిజైనర్ ముగ్ధ ఆర్ట్ స్టూడియో www.mugdha410@gmail.com -
అమ్మమ్మ ఇంటికి వెళుతూ.. అనంత లోకాలకు
నర్సింహులపేట, న్యూస్‌లైన్ : అమ్మమ్మ ఇంటికి వెళదామనగానే ఆ ఇద్దరు చిన్నారులు నిమిషాల్లో రెడీ అయిపోయూరు.. తండ్రి ద్విచక్రవాహనం స్టార్ట్ చేయగానే ముందు ఎక్కి కూర్చున్నారు. ఆ ప్రయూణమే ఆ పసిపిల్లలకు ఆఖరి ప్రయూణమైంది. ముందు వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో అక్కాచెల్లెలు అక్కడికక్కడే మృతిచెందగా, వారి తల్లిదండ్రులు, తమ్ముడు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని కుమ్మరికుంట్ల శివారులో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం... కుమ్మరికుంట్లకు చెందిన చిరగా ని శ్రీనివాస్, ప్రవళిక దంపతులకు కుమార్తెలు సింధూ(లాస్య)(6), శశి(శ్రీవల్లి)(5), కుమారుడు కిట్టు(18 నెలలు) ఉన్నా రు. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం అత్తగారింటి వద్ద నిర్వహించే కోర్ల పౌర్ణమి(పండగ)కి హాజరయ్యేందుకు అతడు తన భార్య, పిల్లలను తీసుకుని ఇదే మండలంలోని వేములపల్లి శివారు దొనకొండకు బయల్దేరాడు. అమ్మమ్మ ఇంటికి వెళదామనగానే సింధూ, శశి సంతోషంతో కొత్త బట్టలు వేసుకుని రెడీ అయిపోయి ద్విచక్ర వాహనం ముందు ట్యాంక్‌పై కూర్చున్నారు. వెనుక కుమారుడిని పట్టుకుని భార్య కూర్చోగా శ్రీనివాస్ బైక్ నడుపుతున్నాడు. గ్రామం నుంచి అర కిలోమీటర్ దూరం వెళ్లగానే ఎదురుగా ఓ వాహనం వేగంగా రావడంతో దానిని తప్పించబోయి శ్రీనివాస్ ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. గడ్డి లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ కిందికి బైక్ దూసుకెళ్లడంతో ముందు భాగంలో కూర్చున్న కుమార్తెలు సింధూ, శశి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో శ్రీనివాస్, తల్లి ప్రవళికకు తీవ్ర గాయూలయ్యూయి. 18 నెలల చిన్నా రి బాలుడు కిట్టు క్షేమంగా బయటపడ్డాడు. ముగ్గురిని తొర్రూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కన్నీటిసంద్రమైన కుమ్మరికుంట్ల సంఘటన స్థలానికి ప్రజలు వందలాదిగా చేరుకున్నారు. చిన్నారుల మృతితో కుమ్మరికుంట్ల, దొనకొండలో విషాద ఛాయలు అలుముకున్నా యి. గ్రామస్తులు కన్నీటి పర్యం తమయ్యూరు. సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ సంఘటన స్థలాన్ని మానుకోట డీఎస్పీ శోభన్‌కుమార్, సీఐ సార్ల రాజు, ఎస్సై వెంకటప్రసాద్ పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించి మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వై.వీ.ప్రసాద్ వెల్లడించారు. -
ప్రతి కదలికకూ ఓ అందం
చుడీదార్, లెహంగా, బ్లౌజ్, దుపట్టా... ఇంకాస్త కనువిందు చేయడానికి పూసలు, చమ్కీలు, అద్దాలు, జరీ మెరుపులు, కుందన్ తళుకులను నింపుకున్న బాల్స్ దర్జాగా కదులుతుంటాయి. రాణివాసపు కళ మాదే సుమా అంటూ మగువల మనసును గెలుచుకుంటాయి. వీటిని కూడా మన అభిరుచి మేరకు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో రెడీమేడ్ బాల్స్, విడిగా వీటికి సంబంధించిన మెటీరియల్ దొరుకుతుంది. ముందుగా డ్రెస్ కలర్ క్లాత్‌ని తీసుకొని గట్టి ఉండలా చుట్టాలి. దాన్ని ఎంపిక చేసుకున్న రంగు క్లాత్‌తో కుట్టేయాలి. బేస్ బాల్ చక్కగా రెడీ అయితే మిగతా పని అంతా సులువు అవుతుంది. ఆ బాల్మీద జరీ, మెటివ్స్, ముత్యాలు, పూసలు, కుందన్స్‌తో నచ్చిన తరహాలో వర్క్ చేసుకోవాలి. కొన్ని బాల్స్‌ను ఊలుతోనూ తయారుచేసుకోవచ్చు. మార్కెట్లో లైట్ మెటల్ బాల్స్కూడా దొరుకుతున్నాయి. ఏ బాల్ అయినా ముందుగా బేస్ తయారుచేసుకోవాలి. ఆ తర్వాతే వాటిపైన మగ్గం వర్క్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన బాల్స్ మెటీరియల్ వాడకాన్ని బట్టి రూ.300 నుంచి రూ.10,000 వరకు కూడా ఖరీదు చేస్తాయి. సాధారణంగా రూ.300 నుంచి రూ. 800 లతో మంచి కలర్ కాంబినేషన్లో వీటిని రూపొందించుకోవచ్చు. పెళ్లికూతురు డ్రెస్‌లు, ఇతర ట్రెడిషనల్ డ్రెస్లకైతే హెవీగా, కామన్‌గా అయితే తక్కువ ఖరీదు బాల్స్‌ని ఉపయోగించాలి. చుడీదార్‌కి వేసే బాల్స్ డ్రెస్ కలర్‌ను బట్టి, లెహంగా అయితే చున్నీ, బ్లౌజ్ రంగులను కూడా పరిశీలన లోకి తీసుకోవాలి. డ్రెస్‌ను మడతపెట్టేటప్పుడు బాల్స్‌ను ప్లాస్టిక్ కవర్లో పెట్టి, కదలకుండా రబ్బర్ బ్యాండ్ వేయాలి. లేదంటే బాల్స్ రాపిడి వల్ల పైన వాడిన పూసలు, లేసులు పోయే అవకాశం ఉంటుంది. అలాగే బాల్స్‌ని శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగించరాదు. డై వాష్‌కు ఇవ్వాలి. - శశి, ఫ్యాషన్ డిజైనర్