
వాయుతనయ్, శశి, దేవి ప్రసాద్ ముఖ్య తారలుగా పొలిటికల్ నేపథ్యంలో రూపొందనున్న చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’. మోహన్ రావిపాటి దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరా బాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు ఎన్.శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, నటి జీవితారాజశేఖర్ క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి ‘తమ్ముడు’ సత్యం గౌరవ దర్శకత్వం వహించారు. మోహన్ రావిపాటి మాట్లాడుతూ–‘‘సమకాలీన అంశాలతో పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న చిత్రమిది.
మొత్తం 40 రోజుల్లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మా సినిమా ద్వారా చూపిస్తున్నాం. ఎవరినీ కించపరిచేలా సినిమా ఉండదు. పబ్లిక్ పాయింటాఫ్ వ్యూని కూడా సినిమాలో చర్చిస్తున్నాం. వరుసగా సామాజిక, కుటుంబ కథా చిత్రాలు చేయాలన్న సంకల్పంతో ఉన్నాం’’ అన్నారు ఆలూరి సాంబశివరావు. వాయు తనయ్, దేవి ప్రసాద్, శశి, సంగీత దర్శకుడు ఫణి కల్యాణ్, నటి సుచిత్ర పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కమలాకర్.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment