ఫుల్‌ జోష్‌ | Naga Chaitanya and Rashmika Mandanna to star in Adhe Nuvvu Adhe Nenu | Sakshi
Sakshi News home page

ఫుల్‌ జోష్‌

Published Fri, Sep 13 2019 3:14 AM | Last Updated on Fri, Sep 13 2019 3:14 AM

Naga Chaitanya and Rashmika Mandanna to star in Adhe Nuvvu Adhe Nenu - Sakshi

హీరోగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు నాగచైతన్య. ఇటీవలే ‘మజిలీ’ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్‌ కూడా చివరి దశలో ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ ప్రేమకథను ఈ మధ్యనే పట్టాలెక్కించారు నాగచైతన్య. ఇప్పుడు ‘దిల్‌ రాజు’ బ్యానర్‌లో నూతన దర్శకుడు శశి సినిమాలో యాక్ట్‌ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమాకు ‘అదే నువ్వు అదే నేను’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇందులో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఫిక్స్‌ కాలేదు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఇది కాకుండా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్‌ ‘బంగార్రాజు’లో తండ్రి నాగార్జునతో కలసి నటించనున్నారు నాగచైతన్య.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement