Naga Chaitanya Shoots For Aamir Khan's Laal Singh Chaddha Film - Sakshi
Sakshi News home page

Laal Singh Chaddha: కార్గిల్‌ టు శ్రీనగర్‌

Published Wed, Aug 4 2021 12:11 AM | Last Updated on Wed, Aug 4 2021 9:12 AM

Naga Chaitanya Aamir Khan Laal Singh Chaddha Movie Update - Sakshi

లడఖ్‌ నుంచి శ్రీనగర్‌కు షిఫ్ట్‌ అవుతున్నారు లాల్‌సింగ్‌ అండ్‌ కో. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి అద్వైత్‌ చందన్‌ డైరెక్టర్‌. ఇటీవల లడఖ్‌లో యుద్ధ సన్నివేశాలను పూర్తి చేసిన ఈ చిత్రబృందం ప్రస్తుతం శ్రీనగర్‌లో కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది.

ఇందుకు సంబంధించిన సెట్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఈ వారంలో షూటింగ్‌ను ఆరంభిస్తారు. శ్రీనగర్, కశ్మీర్‌ లొకేషన్స్‌లో ముఖ్యంగా ఆమిర్, నాగచైతన్య కాంబినేషన్‌ సీన్స్‌ను చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది. ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుంది. ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్‌ చద్దా’ తెరకెక్కుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement