లిఫ్ట్‌లో ఏం జరిగింది?‘‘డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం ‘థ్యాంక్యూ బ్రదర్’. ఈ సినిమా క్లైమాక్స్‌ను అస్సలు మిస్ చేసుకోకండి’ అని ట్వీట్ చేశారు హీరో నాగచైతన్య. అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థ్యాంక్యూ బ్రదర్’. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. ‘ఆహా’ సమర్పణలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు నాగచైతన్య.
‘‘ఓ యువకుడు, గర్భవతిగా ఉన్న మహిళ అనుకోకుండా లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు.. అప్పుడు వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఆ సమయంలో వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘థ్యాంక్యూ బ్రదర్’. ఎగ్జయిటింగ్ క్లైమాక్స్‌తో రూపొందిన ఈ సినిమా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, సంగీతం: గుణ బాలసుబ్రమణియన్
#ThankYouBrother really interesting trailer with a totally new concept ! Got me hooked .. The film will be out April 30th congratulating @Raparthy for ur directorial debut & best wishes to the team @anusuyakhasba @viraj_ashwin @MaguntaSarath @JustOrdinaryEnt @ahavideoIN pic.twitter.com/7n9ulOhj7r
— chaitanya akkineni (@chay_akkineni) April 17, 2021
Comments
Please login to add a commentAdd a comment