అనసూయ భరద్వాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అటు యాంకరింగ్‌తో పాటు ఇటు సినిమాల్లోనూ మంచి క్రేజ్ సంపాదించింది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘దర్జా’. సునీల్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రముఖ ఓటీటీ ఫ‍్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
అసలు కథేంటంటే: బందరు కనకం అలియాస్ కనక మహాలక్ష్మీ(అనసూయ) ఓ సారా వ్యాపారి. బందరులోని కోరుకల్లు, వైవాహ గ్రామ ప్రజలకు ఆమె అంటే హడల్. ఆమె వ్యాపారానికి అడ్డొచ్చిన ఎంతో మంది పోలీసులను హతమార్చింది. తనకు ఎదురు తిరిగిన ఎమ్మెల్యేను సైతం మట్టుబెట్టేంత ధైర్యం ఆమెది. తమ్ముడు బళ్లారి(సమీర్), అనుచరుడు సర్కార్ సపోర్ట్‌తో ఆమె చేపల వ్యాపారంలోకి కూడా దిగింది.
కట్ చేస్తే.. కోరుకల్లు గ్రామానికి చెందిన మూగబ్బాయి గణేష్(అరుణ్ వర్మ) తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) మోసం చేసిందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఓ కొత్త ఎస్సై వస్తాడు. అతనే శివ శంకర్ పైడిపాటి (సునీల్). వచ్చీ రావడంతోనే కనకం ప్రధాన అనుచరుడు సర్కార్‌ని అరెస్ట్ చేస్తాడు. అంతేకాదు గణేష్ ఆత్మహత్య కేసును కూడా బయటకు తీసి.. అది ఆత్మహత్య కాదని, కనకం మనుషులు చేసిన హత్య అని నిరూపిస్తాడు.
అసలు గణేష్‌ని కనకం మనుషులు ఎందుకు చంపారు? పుష్పకి కనకంతో ఉన్న సంబంధం ఏంటి? ఎమ్మెల్యేనే చంపేంత ధైర్యం ఉన్న కనకంతో ఎస్సై శివ శంకర్ ఎందుకు వైర్యం పెట్టుకున్నాడు? కనకం చీకటి వ్యాపారాన్ని ఎదురించి, ఆమె చేతిలో బలైన ఎస్సై రవి(రవి పైడిపాటి) నేపథ్యం ఏంటి? చివరకు కనకం మరియు ఆమె సోదరుడు బళ్లారి ఆగడాలకు ఎస్సై శంకర్ ఎలా చెక్ పెట్టాడు అనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment