ఆ పాట చాలా బాగుంది: అల్లు అరవింద్‌ | Darja Movie Second Song Released By Allu Aravind In Hyderabad | Sakshi
Sakshi News home page

Allu Aravind: ఆ పాట చాలా బాగుంది: అల్లు అరవింద్‌

Published Tue, Apr 12 2022 8:08 PM | Last Updated on Tue, Apr 12 2022 8:15 PM

Darja Movie Second Song Released By Allu Aravind In Hyderabad - Sakshi

Darja Movie Second Song Released By Allu Aravind In Hyderabad: సునీల్, అనసూయ ప్రధాన తారాగణంగా సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో పైడిపాటి శివశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘దర్జా’లోని రెండో పాటను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘పాట చాలా బాగుంది. పాటను చూస్తుంటే సినిమా విజువల్‌గా గ్రాండ్‌ ఉంటుందనిపిస్తోంది. ఈ చిత్రం సక్సెస్‌ సాధించాలి’’ అన్నారు. 



చదవండి: అనసూయను టచ్‌ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది

‘భీమవరం చిన్నదాన్ని రామలింగో..’ అని మొదలై ‘లింగో లింగో’ అంటూ సాగే స్పెషల్‌ సాంగ్‌ ఇది. వై. విష్ణు లిరిక్స్‌ అందించిన ఈ పాటను నేహా పాడారు. ఇటీవల విడుదలైన దర్జా ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ర్యాప్‌ రాక్‌ షకీల్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ చిత్రానికి కో అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి పని చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement