Darja Movie
-
ఓటీటీలో అనసూయ 'దర్జా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అనసూయ భరద్వాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అటు యాంకరింగ్‌తో పాటు ఇటు సినిమాల్లోనూ మంచి క్రేజ్ సంపాదించింది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘దర్జా’. సునీల్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. అసలు కథేంటంటే: బందరు కనకం అలియాస్ కనక మహాలక్ష్మీ(అనసూయ) ఓ సారా వ్యాపారి. బందరులోని కోరుకల్లు, వైవాహ గ్రామ ప్రజలకు ఆమె అంటే హడల్. ఆమె వ్యాపారానికి అడ్డొచ్చిన ఎంతో మంది పోలీసులను హతమార్చింది. తనకు ఎదురు తిరిగిన ఎమ్మెల్యేను సైతం మట్టుబెట్టేంత ధైర్యం ఆమెది. తమ్ముడు బళ్లారి(సమీర్), అనుచరుడు సర్కార్ సపోర్ట్‌తో ఆమె చేపల వ్యాపారంలోకి కూడా దిగింది. కట్ చేస్తే.. కోరుకల్లు గ్రామానికి చెందిన మూగబ్బాయి గణేష్(అరుణ్ వర్మ) తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) మోసం చేసిందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఓ కొత్త ఎస్సై వస్తాడు. అతనే శివ శంకర్ పైడిపాటి (సునీల్). వచ్చీ రావడంతోనే కనకం ప్రధాన అనుచరుడు సర్కార్‌ని అరెస్ట్ చేస్తాడు. అంతేకాదు గణేష్ ఆత్మహత్య కేసును కూడా బయటకు తీసి.. అది ఆత్మహత్య కాదని, కనకం మనుషులు చేసిన హత్య అని నిరూపిస్తాడు. అసలు గణేష్‌ని కనకం మనుషులు ఎందుకు చంపారు? పుష్పకి కనకంతో ఉన్న సంబంధం ఏంటి? ఎమ్మెల్యేనే చంపేంత ధైర్యం ఉన్న కనకంతో ఎస్సై శివ శంకర్ ఎందుకు వైర్యం పెట్టుకున్నాడు? కనకం చీకటి వ్యాపారాన్ని ఎదురించి, ఆమె చేతిలో బలైన ఎస్సై రవి(రవి పైడిపాటి) నేపథ్యం ఏంటి? చివరకు కనకం మరియు ఆమె సోదరుడు బళ్లారి ఆగడాలకు ఎస్సై శంకర్ ఎలా చెక్ పెట్టాడు అనేదే మిగతా కథ. -
‘దర్జా’లో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి : నిర్మాతలు
సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 22న థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కాస్త ఓపెనింగ్స్ తగ్గినప్పటికీ.. సినిమాకి వస్తున్న టాక్‌తో కలెక్షన్స్ పెరుగుతున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, రవి పైడిపాటి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాలోని పాటలు, ఫైట్స్, సెంటిమెంట్.. చాలా బాగున్నాయంటూ పలువురు సినీ ప్రముఖులు ఫోన్ చేసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఇది యాక్షన్ సినిమా అనుకుని వచ్చాము.. కానీ సినిమాలో అక్కాచెల్లెళ్ల అనుబంధం, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారని, ముఖ్యంగా సెంటిమెంట్ సీన్లు చాలా బాగున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమాని మరింతగా సక్సెస్ చేయాలని కోరుతున్నాం’అన్నారు. పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరించారు. -
అనసూయ ‘దర్జా’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘దర్జా’ నటీనటులు :సునీల్, అనసూయ నిర్మాణ సంస్థలు : ఆమని, పృథ్వీ, అక్సాఖాన్,షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్ తదితరులు నిర్మాత: శివశంకర్ పైడిపాటి దర్శకత్వం: సలీమ్ మాలిక్ సంగీతం : రాప్ రాక్ షకీల్ సినిమాటోగ్రఫీ: దర్శన్ ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ విడుదల తేది: జులై 22, 2022 అనసూయ భరద్వాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు యాంకరింగ్‌తో పాటు ఇటు సినిమాల్లోనూ రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘దర్జా’. సునీల్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లకి, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘దర్జా’పై ఆసక్తి పెరిగింది. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22)ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్జా మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే బందరు కనకం అలియాస్ కనక మహాలక్ష్మీ(అనసూయ) ఓ సారా వ్యాపారి. బందరులోని కోరుకల్లు, వైవాహ గ్రామ ప్రజలకు ఆమె అంటే హడల్. ఆమె వ్యాపారానికి అడ్డొచ్చిన ఎంతో మంది పోలీసులను హతమార్చింది. తనకు ఎదురు తిరిగిన ఎమ్మెల్యేను సైతం మట్టుబెట్టేంత ధైర్యం ఆమెది. తమ్ముడు బళ్లారి(సమీర్), అనుచరుడు సర్కార్ సపోర్ట్‌తో ఆమె చేపల వ్యాపారంలోకి కూడా దిగుతోంది. కట్ చేస్తే.. కోరుకల్లు గ్రామానికి చెందిన మూగబ్బాయి గణేష్(అరుణ్ వర్మ) తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) మోసం చేసిందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఓ కొత్త ఎస్సై వస్తాడు. అతనే శివ శంకర్ పైడిపాటి (సునీల్). వచ్చీ రావడంతోనే కనకం ప్రధాన అనుచరుడు సర్కార్‌ని అరెస్ట్ చేస్తాడు. అంతేకాదు గణేష్ ఆత్మహత్య కేసును కూడా బయటకు తీసి..అది ఆత్మహత్య కాదని, కనకం మనుషులు చేసిన హత్య అని నిరూపిస్తాడు. అసలు గణేష్‌ని కనకం మనుషులు ఎందుకు చంపారు? పుష్పకి కనకంతో ఉన్న సంబంధం ఏంటి? ఎమ్మెల్యేనే చంపేంత ధైర్యం ఉన్న కనకంతో ఎస్సై శివ శంకర్ ఎందుకు వైర్యం పెట్టుకున్నాడు? కనకం చీకటి వ్యాపారాన్ని ఎదురించి, ఆమె చేతిలో బలైన ఎస్సై రవి(రవి పైడిపాటి) నేపథ్యం ఏంటి? చివరకు కనకం మరియు ఆమె సోదరుడు బళ్లారి ఆగడాలకు ఎస్సై శంకర్ ఎలా చెక్ పెట్టాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. అన్నదమ్ములు, తల్లి కొడుకులు, అక్కా చెల్లెల సెంటిమెంట్‌తో పాటు కావాల్సిన యాక్షన్, కమర్షియల్ వ్యాల్యూస్ ఈ చిత్రంలో ఉన్నాయి. దర్శకుడు ఈ కథనంతా బందరుకు కొత్తగా వచ్చిన ఎస్సై, కానిస్టేబుల్ మధ్యన చర్చగా నడిపించిన తీరు బాగుంది. ఎస్సై రవి పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్‌తో కథ మొదలవుతుంది.ఇక బందరు కనకంగా అనసూయ ఎంట్రీతో కథ పరుగులు తీస్తుంది. అనసూయ ఉన్నంత సేపు ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది. అదే ఉత్కంఠను మిగిలిన పాత్రలకు కొనసాగించలేకపోయాడు. ఒకవైపు కనకం అరాచకాలను క్రూరంగా చూపిస్తూనే.. మరోవైపు గణేష్, పుష్పల ప్రేమ కథను చెప్పుకొచ్చిన తీరు బాగుంది. మధ్య మధ్యలో రంగ(షమ్ము), గీత(అక్సాఖాన్) కామెడీ సీన్స్ నవ్వులు పూయించినప్పటికీ..కథంత నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌లో సునీల్ ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో సునీల్, అనసూయల మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీసు స్టేషన్లో సునీల్‌కు అనసూయ వార్నింగ్, ప్రీక్లైమాక్స్‌లో సునీల్ చేసే ఫైట్ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. అయితే సినిమా చాలా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం, చాలా పాత్రల్లో కొత్త ముఖాలు కనిపించడం కాస్త మైనస్. కానీ కొత్త నటులు అయినప్పటికీ.. వారి నుంచి తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరెలా చేశారంటే.. రంగస్థలంలో రంగమ్మత్తగా, 'పుష్ప’లో దాక్షాయణిగా తనదైన నటనతో ఆకట్టుకున్న అనసూయ.. చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి పాత్ర పోషించి మెప్పించింది. బందరు కనకంగా అనసూయ అదరగొట్టేసింది. ఆమె డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ఇక పవర్ఫుల్ ఎస్సై శంకర్ పాత్రలో సునీల్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. మూగబ్బాయి గణేశ్‌గా అరుణ్ వర్మ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సర్కార్ పాత్రలో ఎన్. రామ్ బాగా క్రూరత్వం చూపించి మెప్పించారు. కనకం తమ్ముడు బళ్లారిగా సమీర్, డ్రైవర్ జట్కాగా వీరబాబు, ఎస్సై రవిగా రవి పైడిపాటితో పాటు ఆమని, షేకింగ్ శేషు, షకలక శంకర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే... ఈ సినిమాకు ప్రధాన బలం రాప్ రాక్ షకీల్ సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అక్సాఖాన్ స్పెషల్ సాంగ్ తెరపై అదిరిపోయింది. దర్శన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ఎమ్.ఆర్. వర్మ పనితీరు మెచ్చుకోవాల్సిందే. కథలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. ఎలాంటి అడ్డంకులు లేకుండా కథను పరుగులు పెట్టించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా, ఉన్నతంగా ఉన్నాయి. రొటీన్ స్టోరీనే అయినప్పటికీ.. కథనం ఆకట్టుకుంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా, అనసూయ, సునీల్‌ల కోసం అయితే ‘దర్జా’గా థియేటర్స్ వెళ్లి చూడొచ్చు. -
భయపెట్టడానికి ట్రై చేశా.. ఇదో అద్భుతమైన సినిమా: అనసూయ
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో అనసూయ మాట్లాడుతూ– ‘‘దర్జా’లో కనకం పాత్రలో భయపెట్టడానికి ప్రయత్నించాను. ఇది అద్భుతమైన సినిమా’’ అన్నారు. ‘‘ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇది.. స్క్రీన్‌ప్లే బేస్డ్ స్టోరీ’’ అన్నారు సలీమ్ మాలిక్. ‘‘దర్జా’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కామినేని శ్రీనివాస్. ‘‘మా అన్నయ్య శివశంకర్‌గారు సినిమా నిర్మించాలనుకున్నప్పుడు భయపడ్డాం. కానీ ఆయన క్రమశిక్షణ, పట్టుదల చూసి ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి. ఈ వేడుకలో నిర్మాత నవీన్ ఎర్నేని, కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ, సంగీత దర్శకుడు ర్యాప్ రాప్ షకీల్, హీరో సందీప్ మాధవ్, దర్శకులు వీర శంకర్, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..
ప్రతివారం బాక్సాఫీసు వద్ద కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే సమ్మర్లో పెద్ద సినిమాలు, పాన్ ఇండియా చిత్రాలు సందడి చేయగా.. ఇప్పుడు చిన్న సినిమాలు వరుసగా థియేటర్లోకి వస్తున్నాయి. ఇక బిగ్స్క్రీన్పై వచ్చిన పలు పెద్ద సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. అలా ఈ వారం థియేటర్లో, ఓటీటీలో సందడి చేసే చిత్రాలేంటో చూద్దాం రండి! ఈ వారం థియేటర్లో సందడి చేసే చిత్రాలివే: ‘థ్యాంక్యూ’ చేప్పేందుకు వస్తున్న నాగ చైతన్య అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనసూయా ‘దర్జా’ సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘షంషేరా’గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న రణ్‌బీర్ కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, వాణీ కపూర్ జంటగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షంషేరా’. యశ్ రాజ్ ఫిలింస్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ‘మహ’గా వస్తున్న హన్సిక హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రంలో హన్సిక నటించిన తొలి చిత్రం మహా. మదియళగన్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ, మాలిక్ స్ట్రీమింగ్ కార్పొరేషన్ అధినేత డత్తో అబ్దుల్ మాలిక్ నిర్మించిన ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. శింబు కీలక పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం జూలై 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ‘హై ఫైవ్’ అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'హై ఫైవ్'. మన్నార చోప్రా, సుధీర్, అమ్మ రాజశేఖర్, సమీర్ తదితరులు నటించిన ఈ చిత్రం జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. మీలో ఒకడు శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ''మీలో ఒకడు''. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నటులు కృష్ణ భగవాన్, సమీర్, అశోక్ కుమార్, బస్టాప్ కోటేశ్వరరావు, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జూలై 22న థియేటర్లోకి రాబోతోంది. జగన్నాటకం మనిషి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘జగన్నా టకం’. ఆరజ్ అల్తాడ దర్శకత్వంలో పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్ అర్ఫితా లోహి ప్రధానా పాత్రలు పోషించారు. ఈ మూవీ జులై 22 ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. వి. కిరణ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటంటే... ట్రిబుల్ ఫన్‌తో వస్తున్న ‘ఎఫ్ 3’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 22న ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, సోనిలివ్‌లో ఈ చిత్రం జూలై 22న నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ ప్రిడెటర్ హిందీ సిరీస్ - జూలై 20 ద గ్రే మ్యాన్(తెలుగు డబ్బింగ్) - జూలై 22 యూత్ ఆఫ్ మే (కొరియన్ సిరీస్) - జూలై 22 అమెజాన్ ప్రైం కమెండెడ్ ఫర్ యూ షార్ట్‌ఫిల్మ్ విడుదల - జూలై 20 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పరంపర 2 తెలుగు సిరీస్ జూలై 21న హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆహా తొలి తెలుగు ఓటీటీలో బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ జశ్వంత్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ తెలుగు సిరీస్ జూలై 22న విడుదల కానుంది. సోనీ లివ్ డాక్టర్ అరోరా(హిందీ సిరీస్) - జూలై 22 మీమ్ బాయ్స్ (తమిళ సిరీస్) - జూలై 22 ఎఫ్ 2 మూవీ - జూలై 22 -
అనసూయ ‘దర్జా’ డేట్ ఫిక్స్
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డేట్ అనౌన్స్మెంట్ లోగోను ‘గుడుంబా శంకర్’దర్శకుడు వీరశంకర్, సీనియర్ పాత్రికేయులు ప్రభు, వినాయకరావు విడుదల చేశారు. ‘కాల్పనిక కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈచిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం’అని చిత్రనిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి అన్నారు. -
వెంకటేశ్ చేతుల మీదుగా అనసూయ, సునీల్ ‘దర్జా’ మూవీ ట్రైలర్
Venkatesh Released Darja Movie Trailer: సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివ శంకర్ పైడిపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో వెంకటేశ్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ట్రైలర్ రిచ్‌గా, చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. చదవండి: మహేశ్‌బాబు, ప్రభాస్‌లతో సినిమా చేయను: ప్రముఖ నిర్మాత ‘తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో ‘దర్జా’ రిలీజ్ ట్రైలర్‌ను ప్రదర్శిస్తున్నాం. సినిమా రిలీజ్ డేట్‌పై త్వరలో స్పష్టత ఇస్తాం’ అన్నారు నిర్మాతలు. ‘దర్జా’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సలీం మాలిక్, మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్రాక్ షకీల్‌తో పాటు చిత్రయూనిట్ పాల్గొంది. -
Darja:వెళ్లిపోవే..వెళ్లిపోవే.. ప్రేమా..నీకు సెలవిక
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘వెళ్లిపోకే..’ పాటను ‘భీమ్లానాయక్’ చిత్ర దర్శకుడు సాగర్ కె.చంద్ర విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘వెళ్లిపోకే..’ పాట చాలా బాగుంది.. గ్రాండ్‌గా చిత్రీకరించారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలి. నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్’’ అన్నారు. ‘దర్జా’ కో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ–‘‘ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘వెళ్లిపోకే’ పాటని విడుదల చేసిన సాగర్ కె.చంద్రగారికి కృతజ్ఞతలు. మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేనిగారికి ధన్యవాదాలు. ఈ నెలాఖరులో ‘దర్జా’ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
ఆ పాట చాలా బాగుంది: అల్లు అరవింద్
Darja Movie Second Song Released By Allu Aravind In Hyderabad: సునీల్, అనసూయ ప్రధాన తారాగణంగా సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పైడిపాటి శివశంకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘దర్జా’లోని రెండో పాటను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘పాట చాలా బాగుంది. పాటను చూస్తుంటే సినిమా విజువల్‌గా గ్రాండ్ ఉంటుందనిపిస్తోంది. ఈ చిత్రం సక్సెస్ సాధించాలి’’ అన్నారు. చదవండి: అనసూయను టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది ‘భీమవరం చిన్నదాన్ని రామలింగో..’ అని మొదలై ‘లింగో లింగో’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ ఇది. వై. విష్ణు లిరిక్స్ అందించిన ఈ పాటను నేహా పాడారు. ఇటీవల విడుదలైన దర్జా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ర్యాప్ రాక్ షకీల్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రానికి కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి పని చేస్తున్నారు. -
అనసూయను టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది
Anasuya Darja Movie Teaser Launch By Producer Suresh Babu: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ యాంకర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకున్న అనసూయ. రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం 'దర్జా'. సునీల్, అనసూయ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. చదవండి: యాంకర్ అనసూయకి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి! ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు విడుదల చేశారు. ‘‘దర్జా’ టీజర్ బాగుంది. ఆడియన్స్‌ను ఈ సినిమా ఎంటర్టైన్ చేసేలా ఉంటుందనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. ‘ఈ బండి కనకమహాలక్ష్మిది. సరకు మీద చేయి పడితే చావు చూపిస్తది’, ‘ఎవరైనా ఈ కనకాన్ని టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ లాంచ్ వేడుకలో ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ అక్వా అసోసియేషన్ చైర్మన్ భూమాల శ్రీరామ్ మూర్తితో పాటు చిత్రయూనిట్ పాల్గొంది. ఈ సినిమాను కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు. చదవండి: అనసూయ కొత్త చిత్రం: శ్రీనివాస్‌రెడ్డి, చమ్మక్ చంద్రల ట్రాక్ హైలెట్! -
అనసూయ సినిమాకు అర్జున్ సాయం
సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దర్జా’.కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని సునీల్ పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్ని యాక్షన్ కింగ్ అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దర్జా’ మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుందనిపిస్తుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి, చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’అని తెలిపారు. ‘ఇంతకుముందు విడుదలైన అనసూయగారి మోషన్ పోస్టర్‌లానే.. ఇప్పుడు విడుదలైన సునీల్ మోషన్ పోస్టర్ కూడా అందరినీ ఎగ్జైట్ చేస్తుంది’అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ రాప్ రాక్ షకీల్. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ ‘యాక్షన్ కింగ్ అర్జున్‌గారి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ మోషన్ పోస్టర్‌కి షకీల్ అద్భుతమైన ఆర్ఆర్ అందించాడు. మోషన్ పోస్టర్ లాగే సినిమాను కూడా అంతా ఎంజాయ్ చేస్తారు’అని అన్నారు. ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.