
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డేట్ అనౌన్స్‌మెంట్ లోగోను ‘గుడుంబా శంకర్’దర్శకుడు వీరశంకర్, సీనియర్ పాత్రికేయులు ప్రభు, వినాయకరావు విడుదల చేశారు.
‘కాల్పనిక కథతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈచిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం’అని చిత్రనిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment