
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్‌ఎస్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘వెళ్లిపోకే..’ పాటను ‘భీమ్లానాయక్’ చిత్ర దర్శకుడు సాగర్ కె.చంద్ర విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘వెళ్లిపోకే..’ పాట చాలా బాగుంది.. గ్రాండ్‌గా చిత్రీకరించారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలి. నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్’’ అన్నారు.
‘దర్జా’ కో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ–‘‘ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ‘వెళ్లిపోకే’ పాటని విడుదల చేసిన సాగర్ కె.చంద్రగారికి కృతజ్ఞతలు. మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేనిగారికి ధన్యవాదాలు. ఈ నెలాఖరులో ‘దర్జా’ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment