Action king Arjun Darja Movie Motion Poster Launched, Pic Viral - Sakshi
Sakshi News home page

Darja: అనసూయ సినిమాకు అర్జున్‌ సాయం

Published Sat, Mar 5 2022 3:13 PM | Last Updated on Sat, Mar 5 2022 4:40 PM

Darja Movie Motion poster Launched By Action king Arjun - Sakshi

సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’.కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై  శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని సునీల్‌ పాత్రకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దర్జా’ మోషన్‌ పోస్టర్‌  చాలా బాగుంది. ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుందనిపిస్తుంది. ఈ చిత్రం  మంచి విజయం సాధించి, చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’అని తెలిపారు.

‘ఇంతకుముందు విడుదలైన అనసూయగారి మోషన్ పోస్టర్‌లానే.. ఇప్పుడు విడుదలైన సునీల్ మోషన్ పోస్టర్ కూడా అందరినీ ఎగ్జైట్ చేస్తుంది’అన్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాప్‌ రాక్‌ షకీల్‌. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ ‘యాక్షన్ కింగ్ అర్జున్‌గారి చేతుల మీదుగా మోషన్ పోస్టర్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ మోషన్‌ పోస్టర్‌కి షకీల్‌ అద్భుతమైన ఆర్‌ఆర్‌ అందించాడు. మోషన్‌ పోస్టర్‌ లాగే సినిమాను కూడా అంతా ఎంజాయ్‌ చేస్తారు’అని అన్నారు. ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement