Anchor Anasuya Darja Movie Teaser Launch By Producer Suresh Babu - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: విలన్‌గా యాంకర్‌ అనసూయ.. 'దర్జా' టీజర్‌ రిలీజ్

Published Thu, Mar 31 2022 8:24 AM | Last Updated on Thu, Mar 31 2022 11:03 AM

Anasuya Darja Movie Teaser Launch By Producer Suresh Babu - Sakshi

Anasuya Darja Movie Teaser Launch By Producer Suresh Babu: బుల్లితెర యాంకర్​ అనసూయ భరద్వాజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్‌ యాంకర్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇటీవల ఐకానిక్​ స్టార్ అల్లు అర్జున్​ పాన్​ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్​'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకున్న అనసూయ. రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం 'దర్జా'. సునీల్‌, అనసూయ లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ చిత్రానికి సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వం వహించారు. 

చదవండి: యాంకర్‌ అనసూయకి వార్నింగ్‌ ఇచ్చిన చిరంజీవి!

ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు విడుదల చేశారు. ‘‘దర్జా’ టీజర్‌ బాగుంది. ఆడియన్స్‌ను ఈ సినిమా ఎంటర్‌టైన్‌ చేసేలా ఉంటుందనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. ‘ఈ బండి కనకమహాలక్ష్మిది. సరకు మీద చేయి పడితే చావు చూపిస్తది’, ‘ఎవరైనా ఈ కనకాన్ని టచ్‌ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది’ అనే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్‌ లాంచ్‌ వేడుకలో ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ అక్వా అసోసియేషన్‌ చైర్మన్‌ భూమాల శ్రీరామ్‌ మూర్తితో పాటు చిత్రయూనిట్‌ పాల్గొంది. ఈ సినిమాను కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో శివశంకర్‌ పైడిపాటి నిర్మించారు.

 

చదవండి: అనసూయ కొత్త చిత్రం: శ్రీనివాస్‌రెడ్డి, చమ్మక్‌ చంద్రల ట్రాక్‌ హైలెట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement