కళ్లకు స్ట్రెయిన్ ఎక్కువైపోయింది!
యాప్స్, వెబ్స్, విండోస్, కమాండ్స్...
ఇదే ప్రపంచం!
ఓ పచ్చటి ఆకును చూశామా?
ఓ పచ్చిక బయలుకు వెళ్లామా?
పల్లెలు, పూరిళ్లు, కల్లాపి వాకిళ్లు...
పిట్టలు, కంకులు, కడవలు, కావిళ్లు...
తోరణాలు, పారాణి పాదాలు...
గంధాల చుబుకాలు, అనుబంధాల అందాలు...
ఎన్ని మిస్సవుతున్నాం?
గూగుల్‌లో పరిమళం తెలుస్తుందా?
పసుపు అంటని గడపకు
పండగ కళ వస్తుందా?
లాప్‌ట్యాప్‌ని షట్‌డౌన్ చేసిఈ సంక్రాంతికి పల్లెతల్లి ఒడిలో వాలండి.
వీలుకాకుంటే... పరికిణీ ఓణీలో మీరున్న చోటుకే పచ్చదనం తెండి.
1- క్రీమ్ ఆర్గంజా లెహంగా, ఎర్రటి షిఫాన్ ఓణీ ధరిస్తే పచ్చని ప్రకృతి మధ్య దేవకన్యలా మెరిసిపోవచ్చు. లెహంగాకి కట్ వర్క్ చేసిన బార్డర్, ఓణీపై ఆప్లిక్ వర్క్, హైనెక్ బెనారస్ బ్లౌజ్... మరిన్ని ఆకర్షణీయమైన హంగులను అద్దాయి.
2- వెల్వెట్ లెహంగాకి పసుపు రంగు నెటెడ్ ఓణీ ఓ అదనపు ఆకర్షణ. కుందన్ వర్క్ చేసిన బ్లూ రా సిల్క్ బార్డర్, క్రీమ్ కలర్ షిమ్మర్ లైనింగ్‌ని జత చేస్తే పండగకళ మరింత వెలిగిపోతుంది.
3- సీ గ్రీన్ బెనారసీ జార్జెట్ లెహంగాకు రాసిల్క్ జరీ బార్డర్ జతగా చేర్చితే వేడుక గ్రాండ్‌గా మారిపోతుంది. జార్జెట్ ఓణీకి వెల్వెట్ కాంబినేషన్ బార్డర్‌వర్క్ చూపులను కట్టిపడేస్తుంది.
4- పసుపు రంగు లెహంగా, ఎరుపు రంగు ఓణీ, కుందన్‌వర్క్ చేసిన బెనారస్ బ్లౌజ్ ధరించడంతో పండగశోభను రెట్టింపు చేస్తుంది. కోటా ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగాకు మల్టీకలర్ బెనారస్ బార్డర్‌ను, క్రేప్ చున్నీకి జర్దోసి బార్డర్‌ను జత చేశారు.
శశి, ఫ్యాషన్ డిజైనర్
ముగ్ధ ఆర్ట్ స్టూడియో
www.mugdha410@gmail.com
పరికిణీల భరిణెలు
Published Thu, Jan 9 2014 12:41 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement
Advertisement