
‘‘శశి’ కథ చెబుతున్నప్పుడే శ్రీనివాస్‌గారిపై నాకు నమ్మకం వచ్చింది. ఈ సినిమా కోసం వర్క్‌షాప్స్ చేయలేదు. నటనలో శిక్షణ తీసుకోలేదు. ఎందుకంటే నటన అనేది నాకు నేచురల్‌గానే వచ్చేస్తుంది. నేను సహజ నటిని’’ అని హీరోయిన్ రాశీ సింగ్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల తెరకెక్కించిన చిత్రం ‘శశి’. ఆర్.పి. వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలకానుంది.
ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన రాశీసింగ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుండి నటి అవ్వాలని ఉండేది. 14 ఏళ్లప్పుడు ఓ కమర్షియల్ యాడ్ చేశాను. ఫ్యామిలీ సెటిల్ అవ్వాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా చేశాను. ఏడాది తర్వాత మానేసి, అవకాశాల కోసం ప్రయత్నం చేశాను. నేను నటించిన తొలి చిత్రం ‘జెమ్’, రెండో సినిమా ‘శశి’. అయితే నా రెండో సినిమా ‘శశి’నే ముందు విడుదలవుతోంది. ఈ సినిమాలో సునీత అనే హోమ్లీ క్యారెక్టర్ చేశాను. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తున్నాను’’ అన్నారు.
చదవండి: మహేశ్‌బాబు సరసన జాన్వీ కపూర్!
Comments
Please login to add a commentAdd a comment