చుడీదార్, లెహంగా, బ్లౌజ్, దుపట్టా... ఇంకాస్త కనువిందు చేయడానికి పూసలు, చమ్కీలు, అద్దాలు, జరీ మెరుపులు, కుందన్ తళుకులను నింపుకున్న బాల్స్ దర్జాగా కదులుతుంటాయి. రాణివాసపు కళ మాదే సుమా అంటూ మగువల మనసును గెలుచుకుంటాయి. వీటిని కూడా మన అభిరుచి మేరకు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
మార్కెట్లో రెడీమేడ్ బాల్స్, విడిగా వీటికి సంబంధించిన మెటీరియల్ దొరుకుతుంది. ముందుగా డ్రెస్ కలర్ క్లాత్‌ని తీసుకొని గట్టి ఉండలా చుట్టాలి. దాన్ని ఎంపిక చేసుకున్న రంగు క్లాత్‌తో కుట్టేయాలి. బేస్ బాల్ చక్కగా రెడీ అయితే మిగతా పని అంతా సులువు అవుతుంది. ఆ బాల్‌మీద జరీ, మెటివ్స్, ముత్యాలు, పూసలు, కుందన్స్‌తో నచ్చిన తరహాలో వర్క్ చేసుకోవాలి. కొన్ని బాల్స్‌ను ఊలుతోనూ తయారుచేసుకోవచ్చు. మార్కెట్‌లో లైట్ మెటల్ బాల్స్‌కూడా దొరుకుతున్నాయి. ఏ బాల్ అయినా ముందుగా బేస్ తయారుచేసుకోవాలి. ఆ తర్వాతే వాటిపైన మగ్గం వర్క్ చేసుకోవచ్చు.
ఇలా తయారు చేసిన బాల్స్ మెటీరియల్ వాడకాన్ని బట్టి రూ.300 నుంచి రూ.10,000 వరకు కూడా ఖరీదు చేస్తాయి. సాధారణంగా రూ.300 నుంచి రూ. 800 లతో మంచి కలర్ కాంబినేషన్‌లో వీటిని రూపొందించుకోవచ్చు.
పెళ్లికూతురు డ్రెస్‌లు, ఇతర ట్రెడిషనల్ డ్రెస్‌లకైతే హెవీగా, కామన్‌గా అయితే తక్కువ ఖరీదు బాల్స్‌ని ఉపయోగించాలి.
చుడీదార్‌కి వేసే బాల్స్ డ్రెస్ కలర్‌ను బట్టి, లెహంగా అయితే చున్నీ, బ్లౌజ్ రంగులను కూడా పరిశీలన లోకి తీసుకోవాలి.
డ్రెస్‌ను మడతపెట్టేటప్పుడు బాల్స్‌ను ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి, కదలకుండా రబ్బర్ బ్యాండ్ వేయాలి. లేదంటే బాల్స్ రాపిడి వల్ల పైన వాడిన పూసలు, లేసులు పోయే అవకాశం ఉంటుంది. అలాగే బాల్స్‌ని శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగించరాదు. డై వాష్‌కు ఇవ్వాలి.
- శశి, ఫ్యాషన్ డిజైనర్
ప్రతి కదలికకూ ఓ అందం
Published Wed, Nov 6 2013 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement