Churidar
-
చీరలోనే రావాలి.. చుడీదార్‌కు నో ఎంట్రీ..!
తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నెలకొన్న వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు బుదవారం కొందరు మహిళా భక్తులు చుడీదార్లు ధరించిన ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అర్చకు, అధికారులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదులాట చోటుచేసుకుంది. జడ్జి తీర్పును నిరసిస్తూ కొందరు భక్తులు రోడ్డుపై బైఠాయించారు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలోకి ప్రవేశించే మహిళలు చీరలు మాత్రమే ధరించాలని ఏళ్లుగా రాసుకోని కట్టుబడి కొనసాగుతోంది. ఈ విధానాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త రియా రాజి కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం మంగళవారం తీర్పు చెప్పిన హైకోర్టు.. ‘చుడీదార్లు ధరించి కూడా ఆలయంలోకి వెళ్లొచ్చు’అని స్పష్టం చేసింది. కానీ ఆలయ సిబ్బంది, అర్చకులు, అధికారులు మాత్రం చుడీదార్లు వేసుకుని వచ్చిన మహిళలను లోనికి అనుమతించలేదు. దీనిపై పద్మనాభస్వామి ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎన్ సతీశ్ మాట్లాడుతూ తమకు జిల్లా జడ్జి ఆలయానికి రాసిన లేఖలో ‘విచక్షణను అనుసరించి’ నిర్ణయం తీసుకోవాలన్నారని, సంబంధిత ఆదేవాలు కూడా అస్పష్టంగా ఉన్నాయని, అందుకే చుడీదార్లలో వచ్చిన మహిళలను లోపలికి అనుమతించలేదని చెప్పారు. మరోవైపు చుడీదార్ మహిళల ప్రయత్నాన్ని నిరసిస్తూ కొందరు భక్తులు ఆందోళకు దిగారు. ఏక వ్యక్తులుగా జడ్జిలు తీసుకునే నిర్ణయాలు అసంబద్ధంగా ఉన్నాయంటూ రోడ్డుపై బైఠాయించారు. ఇదే అంశంపై కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ను మీడియా ప్రశ్నించగా..‘కాలానుగునంగా చాలా ఆలయాల నియమాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రస్తుతం పద్మనాభస్వామి ఆలయం వద్ద నెలకొన్న పరిస్థితిపై అధికారులతో మాట్లాడతానన’ని చెప్పారు. -
ప్రతి కదలికకూ ఓ అందం
చుడీదార్, లెహంగా, బ్లౌజ్, దుపట్టా... ఇంకాస్త కనువిందు చేయడానికి పూసలు, చమ్కీలు, అద్దాలు, జరీ మెరుపులు, కుందన్ తళుకులను నింపుకున్న బాల్స్ దర్జాగా కదులుతుంటాయి. రాణివాసపు కళ మాదే సుమా అంటూ మగువల మనసును గెలుచుకుంటాయి. వీటిని కూడా మన అభిరుచి మేరకు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో రెడీమేడ్ బాల్స్, విడిగా వీటికి సంబంధించిన మెటీరియల్ దొరుకుతుంది. ముందుగా డ్రెస్ కలర్ క్లాత్‌ని తీసుకొని గట్టి ఉండలా చుట్టాలి. దాన్ని ఎంపిక చేసుకున్న రంగు క్లాత్‌తో కుట్టేయాలి. బేస్ బాల్ చక్కగా రెడీ అయితే మిగతా పని అంతా సులువు అవుతుంది. ఆ బాల్మీద జరీ, మెటివ్స్, ముత్యాలు, పూసలు, కుందన్స్‌తో నచ్చిన తరహాలో వర్క్ చేసుకోవాలి. కొన్ని బాల్స్‌ను ఊలుతోనూ తయారుచేసుకోవచ్చు. మార్కెట్లో లైట్ మెటల్ బాల్స్కూడా దొరుకుతున్నాయి. ఏ బాల్ అయినా ముందుగా బేస్ తయారుచేసుకోవాలి. ఆ తర్వాతే వాటిపైన మగ్గం వర్క్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన బాల్స్ మెటీరియల్ వాడకాన్ని బట్టి రూ.300 నుంచి రూ.10,000 వరకు కూడా ఖరీదు చేస్తాయి. సాధారణంగా రూ.300 నుంచి రూ. 800 లతో మంచి కలర్ కాంబినేషన్లో వీటిని రూపొందించుకోవచ్చు. పెళ్లికూతురు డ్రెస్‌లు, ఇతర ట్రెడిషనల్ డ్రెస్లకైతే హెవీగా, కామన్‌గా అయితే తక్కువ ఖరీదు బాల్స్‌ని ఉపయోగించాలి. చుడీదార్‌కి వేసే బాల్స్ డ్రెస్ కలర్‌ను బట్టి, లెహంగా అయితే చున్నీ, బ్లౌజ్ రంగులను కూడా పరిశీలన లోకి తీసుకోవాలి. డ్రెస్‌ను మడతపెట్టేటప్పుడు బాల్స్‌ను ప్లాస్టిక్ కవర్లో పెట్టి, కదలకుండా రబ్బర్ బ్యాండ్ వేయాలి. లేదంటే బాల్స్ రాపిడి వల్ల పైన వాడిన పూసలు, లేసులు పోయే అవకాశం ఉంటుంది. అలాగే బాల్స్‌ని శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగించరాదు. డై వాష్‌కు ఇవ్వాలి. - శశి, ఫ్యాషన్ డిజైనర్