
దేవీప్రసాద్
దేవీప్రసాద్, వాయు తనయ్, శశి, సుచిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్ రావిపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’. వైష్ణవి ఫిలింస్, ఆలూరి క్రియేషన్స్ పతాకాలపై అట్లూరి నారాయణరావు, ఆలూరి సాంబశివరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ– ‘‘సమకాలీన రాజకీయ అంశాలను మా చిత్రంలో చర్చించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు ఆలోచింపజేసే సన్నివేశాలు, సంభాషణలు ఉంటాయి. దేవీప్రసాద్, వాయుతనయ్, శశి, సుచిత్ర మంచి నటన ప్రదర్శించారు. సంగీతానికి కూడా మంచి ప్రాధాన్యత ఉంది’’ అన్నారు. ‘‘నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతూ ఈ చిత్రాన్ని నిర్మించాం. పాటలకు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు ఆలూరి సాంబశివరావు. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్, కెమెరా: కమలాకర్.
Comments
Please login to add a commentAdd a comment