ధనుష్‌ ఆ హీరోయిన్లందరినీ వేధించాడు: సింగర్‌ | Singer Suchitra Sensational Allegations On Actor Dhanush Amid Nayanthara Controversial Statement | Sakshi
Sakshi News home page

ధనుష్‌ ఆ హీరోయిన్లందరినీ వేధించాడు: సింగర్‌

Published Sun, Nov 17 2024 4:38 PM | Last Updated on Sun, Nov 17 2024 5:04 PM

Singer Suchitra Sensational Comments On Dhanush

నయనతారకు సంబంధించిన  డాక్యుమెంటరీ విషయంలో కోలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతుంది. నయన్‌కు  ధనుష్‌ నోటీసులు పంపిన తర్వాత ఈ అంశం నెట్టింట దుమారం రేగుతుంది. దీంతో తాజాగా ధనుష్‌పై సింగర్‌ సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. సుచీ లీక్స్‌తో ఆమె సౌత్‌ ఇండియాలో అందరికీ పరిచయమే. నయన్‌కు మద్ధతుగా ధనుష్‌పై ఆమె చేసిన కామెంట్స్‌ కోలీవుడ్‌లో వైరల్‌ అవుతున్నాయి.

యూట్యూబ్‌ వేదకగా సుచిత్ర మాట్లాడుతూ.. 'ధనుష్‌ వల్ల కష్టాలు ఎదుర్కొన్నది నయనతార మాత్రమే కాదు.. ఇప్పుడు నయనతారకు సపోర్ట్‌గా ఉన్న చాలా మంది నటీమణులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అతని వల్ల సుమారు 150 మంది నటీమణులు పలు ఇబ్బందులు పడ్డారు. నిజానికి ధనుష్‌తో కలిసి నటించిన మొదటి సినిమా నటీమణులకు కూడా ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయి. చివరకు తన తల్లి పాత్రలో నటించిన నటీమణులను కూడా ధనుష్‌ వేధించాడు. ధనుష్ ఇప్పటి వరకు సుమారు 50 సినిమాల్లో నటించాడు. అలా ఒక్కో సినిమాకు ముగ్గురు నటీమణుల చొప్పున 150 మంది నటీమణులను ఆయన ఇబ్బంది పెట్టాడు. 

ధనుష్‌ వల్ల ఇందులో కొందరికి లైంగిక వేధింపులను ఎదుర్కొంటే..  మరికొందరికి వృత్తిపరమైన వేధింపులకు గురికావడం జరిగింది. అయితే, కొంతమంది నటీమణులకు తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కూడా ధనుష్‌ ప్రవర్తించాడు. నచ్చకపోతే నయన్‌ మాదిరి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతాడు. ధనుష్ సైకో కాబట్టి అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తాడు.' అని ఆమె మాట్లాడింది.

సుచిత్ర వ్యాఖ్యలపై ధనుష్‌ ఫ్యాన్స​ మండి పడుతున్నారు. ధనుష్‌పై ఉన్న ద్వేషం కారణంగానే ఆమె ఇలా మాట్లాడుతుందని వారు పేర్కొంటున్నారు. తమ హీరో నిశ్శబ్ధంగా ఉంటే తప్పు చేసినట్లు కాదని తెలుపుతున్నారు. నిజనిజాలేంటో త్వరలో అందరికీ తెలుస్తాయిని చెప్పుకొస్తున్నారు.

ధనుష్‌ నిర్మాతగా ఉన్న 'నానుమ్‌ రౌడీ దానే' చిత్రానికి సంబంధించిన మూడు సెకండ్ల వీడియోను నయన్‌ తన డాక్యుమెంటరీ కోసం  ఉపయోగించడంతో ఈ గొడవ మొదలైంది. తన అనుమతి లేకుండా సినిమాకు సంబంధించిన వీడియోను ఎలా ఉపయోగిస్తారని నయన్‌పై కాపీరైట్‌ చట్టం కింద రూ. 10 కోట్ల నష్టపరిహారం నోటీసులు పంపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement