Suchitra
-
నయనతారకు అహంకారం.. అందుకే అలాంటి కామెంట్ చేసింది: సింగర్
నటి నయనతారకు ధన అహంకారం పెరిగిందని, సంచలన గాయని నటి సుచిత్ర పేర్కొన్నారు. ఇంతకుముందు పేరుతో పలువురు ప్రముఖ అంతరంగిక విషయాలను బయటపెట్టి కలకలం సృష్టించిన ఈమె కొద్దిగా సైలెంట్‌గా ఉండి ఇప్పుడు మళ్లీ తన మార్కు విమర్శలు, ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. తాజాగా నటి నయనతారపై విరుచుకుపడ్డారు. నటి నయనతార ఇటీవల యూట్యూబ్ ఛానల్ భేటీలో పాల్గొన్నారు. దానిపై గాయని సుచిత్ర స్పందిస్తూ నటి నయనతార ఇటీవల నటుడు ధనుష్‌ను విమర్శిస్తూ విడుదల చేసిన ప్రకటనను తాను చూశానన్నారు. అందులో ధనుష్‌పై ఉన్న ఆరోపణలన్నీ నయనతార వెల్లడించారన్నారు. దీంతో తాను నయనతారను అభినందించానన్నారు. అయితే ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న వివాదం ధనవంతులైన ఇద్దరి (నటుడు ధనుష్, నయనతార) మధ్య జరుగుతున్న పోరు అని పేర్కొన్నారు. మీ ఇద్దరి ఇళ్లల్లోనూ డబ్బు రూ.కోట్లలో మూలుగుతోందన్నారు. ఈ ఇద్దరికీ డబ్బు అహంకారం పెరిగిపోయిందన్నారు. కాగా నటి నయనతార చాలా గౌరవప్రదంగా మాట్లాడే వారిని అయితే ఇటీవల ఆమె ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటించిన చిత్రాల కంటే తన డాక్యుమెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు అధికంగా చూశారని పేర్కొనడం నయనతారలో ఎంత అహంకారం పెరిగిన దానికి నిదర్శనం అని పేర్కొన్నారు. బాలీవుడ్‌కు చెందిన అనుపమ చోఫ్రా గత రెండేళ్లుగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారని, ఆమె ప్రముఖులను మోయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అలాగే ఆమె నటి నయనతారను పొగడ్తలు ముంచేశారన్నారు. అందుకు ఆమె భారీగా డబ్బు పొందినట్లు తెలిసిందన్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నటి నయనతార ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతలా తాను నటుడు ధనుష్ ను ఢీకొంటున్నట్లు చెప్పడంతో పాటు, జవాన్ చిత్రం తర్వాత హిందీలో మరో అవకాశం రాకపోవడంతో అక్కడ అవకాశాలు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోందని గాయని సుచిత్ర పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
ధనుష్ ఆ హీరోయిన్లందరినీ వేధించాడు: సింగర్
నయనతారకు సంబంధించిన డాక్యుమెంటరీ విషయంలో కోలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతుంది. నయన్‌కు ధనుష్ నోటీసులు పంపిన తర్వాత ఈ అంశం నెట్టింట దుమారం రేగుతుంది. దీంతో తాజాగా ధనుష్‌పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. సుచీ లీక్స్‌తో ఆమె సౌత్ ఇండియాలో అందరికీ పరిచయమే. నయన్‌కు మద్ధతుగా ధనుష్‌పై ఆమె చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.యూట్యూబ్ వేదకగా సుచిత్ర మాట్లాడుతూ.. 'ధనుష్ వల్ల కష్టాలు ఎదుర్కొన్నది నయనతార మాత్రమే కాదు.. ఇప్పుడు నయనతారకు సపోర్ట్‌గా ఉన్న చాలా మంది నటీమణులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అతని వల్ల సుమారు 150 మంది నటీమణులు పలు ఇబ్బందులు పడ్డారు. నిజానికి ధనుష్‌తో కలిసి నటించిన మొదటి సినిమా నటీమణులకు కూడా ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయి. చివరకు తన తల్లి పాత్రలో నటించిన నటీమణులను కూడా ధనుష్ వేధించాడు. ధనుష్ ఇప్పటి వరకు సుమారు 50 సినిమాల్లో నటించాడు. అలా ఒక్కో సినిమాకు ముగ్గురు నటీమణుల చొప్పున 150 మంది నటీమణులను ఆయన ఇబ్బంది పెట్టాడు. ధనుష్ వల్ల ఇందులో కొందరికి లైంగిక వేధింపులను ఎదుర్కొంటే.. మరికొందరికి వృత్తిపరమైన వేధింపులకు గురికావడం జరిగింది. అయితే, కొంతమంది నటీమణులకు తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కూడా ధనుష్ ప్రవర్తించాడు. నచ్చకపోతే నయన్ మాదిరి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతాడు. ధనుష్ సైకో కాబట్టి అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తాడు.' అని ఆమె మాట్లాడింది.సుచిత్ర వ్యాఖ్యలపై ధనుష్ ఫ్యాన్స మండి పడుతున్నారు. ధనుష్‌పై ఉన్న ద్వేషం కారణంగానే ఆమె ఇలా మాట్లాడుతుందని వారు పేర్కొంటున్నారు. తమ హీరో నిశ్శబ్ధంగా ఉంటే తప్పు చేసినట్లు కాదని తెలుపుతున్నారు. నిజనిజాలేంటో త్వరలో అందరికీ తెలుస్తాయిని చెప్పుకొస్తున్నారు.ధనుష్ నిర్మాతగా ఉన్న 'నానుమ్ రౌడీ దానే' చిత్రానికి సంబంధించిన మూడు సెకండ్ల వీడియోను నయన్ తన డాక్యుమెంటరీ కోసం ఉపయోగించడంతో ఈ గొడవ మొదలైంది. తన అనుమతి లేకుండా సినిమాకు సంబంధించిన వీడియోను ఎలా ఉపయోగిస్తారని నయన్‌పై కాపీరైట్ చట్టం కింద రూ. 10 కోట్ల నష్టపరిహారం నోటీసులు పంపారు. -
'ప్రతి రోజు ఐదు లవ్ లెటర్స్'.. ప్రేమకథ పంచుకున్న స్టార్ నటుడి భార్య!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుగువారికి చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించారు. మాలీవుడ్ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగులోనూ అంతే ఫేమల్ అయ్యారు. ప్రస్తుతం మంచువిష్ణు కన్నప్ప, ఎంపురన్ చిత్రాల్లో నటిస్తున్నారు.అయితే గతంలో మోహన్ లాల్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన భార్య సుచిత్ర వీరిద్దరి ప్రేమాయణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తానే మోహన్ లాల్‌కు ప్రేమలేఖలు రాసేదాన్ని అని తెలిపింది. అదేపనిగా లవ్ లెటర్స్ రాస్తూ విసిగించేదాన్ని అంటూ తమ ప్రేమకథను వివరించింది.సుచిత్ర మాట్లాడుతూ..'నేను ఫస్ట్ టైమ్ త్రివేండ్రంలో అతన్ని కలిశా. అంతకు ముందు కేవలం సినిమాల్లో మాత్రమే చూసేదాన్ని. దగ్గర నుంచి చూడడం అదే మొదటిసారి. మా కుటుంబాలకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని బంధువుల పెళ్లిలో నాకు తెలిసింది. నేను కోజికోడ్‌లో ఉన్నప్పుడు సెలవుల్లో అతని సినిమాలను థియేటర్లలో చూసేదాన్ని. ఆయన మొదటి సినిమా మజిల్ విరింజ పుక్కల్ చూసినప్పుడు ఆయనపై ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ ఆయన టాలెంట్‌ను గుర్తించి ప్రేమించడం మొదలుపెట్టా' అని తెలిపింది.'ఆ తర్వాత నా పేరు రాయకుండా ఆయనకు లేఖలు రాయడం ప్రారంభించా. ప్రతి రోజు ఐదు రాసి పంపించాను. ఆయన అడ్రస్ తెలుసుకుని మరీ లెటర్స్ రాశా. నా ప్రేమలేఖలతోనే ఓ రేంజ్లో వేధించా. మా ఇంట్లో ఉన్నప్పుడు అతన్ని సుందర కుట్టప్పన్ (అందమైన అబ్బాయి) అనే నిక్‌నేమ్‌తో పిలిచేదాన్ని. ఆ తర్వాత మా అమ్మ, నాన్నకు మోహన్‌లాల్ గురించి చెప్పా. వెంటనే నా ప్రేమను అంగీకరించి తెలిసినవాళ్లతో మాట్లాడి మా పెళ్లి చేశారు' తమ లవ్‌స్టోరీని గుర్తుచేసుకున్నారు. కాగా.. మోహన్ లాల్, సుచిత్ర వివాహం 1988లోనే జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
HYD: సుచిత్రలో అక్రమ కట్టడాల కూల్చివేత
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను కంటోన్మెంట్ అధికారులు శుక్రవారం(సెప్టెంబర్20) కూల్చివేశారు. రక్షణ శాఖ భూముల్లో నిర్మించినందునే వీటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.కంటోన్మెంట్ పరిధిలోని సుచిత్ర మార్గంలో నాలా ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తూ కొందరు దుకాణాలు నిర్మించారు. ఈ నిర్మాణాల వల్ల ట్రాపిక్కు ఇబ్బందవుతోందని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో బుల్డోజర్లతో రంగంలోకి దిగిన అధికారులు దుకాణాలను నేలమట్టం చేశారు. కాగా, హైదరాబాద్ నగరంలో నాలాలు, చెరువులను ఎంతటివారు ఆక్రమించినా వదిలేది లేదని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇదే బాటలో కంటోన్మెంట్ కూడా అక్రమ కొట్టడాలపై చర్యలు ప్రారంభించడం గమనార్హంఇదీ చదవండి.. ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకు: కేటీఆర్ -
మల్లారెడ్డి VS అడ్లూరి: సుచిత్ర భూవివాదంలో ట్విస్ట్
హైదరాబాద్, సాక్షి: సుచిత్రం భూవివాదంలో ఉత్కంఠ కొనసాగుతోంది. తనకు, తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన భూమిని ఆక్రమించారని మల్లారెడ్డి వాదిస్తుండగా, మరోవైపు ఆ భూమి తమ 15 మందిదేనని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని విప్ అడ్లూరి లక్ష్మణ్ వాదిస్తున్నారు.సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి కోసం వివాదం కొనసాగుతోంది. తమ అనుచరులతో మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు ఆ స్థలంలో పాతిన ఫెన్సింగ్, బారికేడ్లను తొలగించే యత్నం చేశారు. ఇంకోవైపు అక్కడికి చేరుకున్న 15 మంది ఆ స్థలం తమదేనని వాదించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకుని సర్దిచెప్పబోయిన పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి పేట్ బషీర్బాద్ పీఎస్‌కు తరలించారు. పోలీసుల జోక్యంతో.. రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో సర్వే చేపట్టారు. తాజాగా వివాదాస్పద భూమిపై సర్వే పూర్తైంది. యితే పోలీసులకు సర్వే రిపోర్ట్ ఇస్తారని భావించగా.. బదులుగా కలెక్టర్‌కు రెవెన్యూ అధికారులు నివేదికను సమర్పించబోతున్నారని తెలుస్తోంది. దీంతో స్థల వివాదానికి ఎలాంటి ముగింపు దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. -
సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు జారీ
సుచీ లీక్స్‌తో సింగర్ సుచిత్ర కోలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మాజీ భర్త కార్తీక్ గే అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఆ విషయం తెలిసిన తర్వాతే ఆయనతో విడాకులు తీసుకున్నానని ఆమె బాంబ్ పేల్చింది. అంతటితో ఆగని సుచిత్ర ఈ వివాదంలోకి హీరో ధనుష్‌ను కూడా లాగింది. పూటుగా మద్యం సేవించి హీరో ధనుష్, కార్తీక్ ఒకే గదిలో ఉండేవారని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.తాజాగా సుచిత్రకు తన మాజీ భర్త కార్తీక్ లీగల్ నోటీసులు జారీ చేశాడు. తనపైనే కాకుండా హీరో ధనుష్‌పై కూడా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు సుచిత్ర చేసిందంటూ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాడు. ఇంటర్వ్యూ సమయంలో తన పట్ల పరువు నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని, ఆపై అలాంటి వ్యాఖ్యలు మరోసారి ఆమె చేయకుండా చూడాలని తన లీగల్ టీమ్ ద్వారా ప్రత్యేకంగా డిమాండ్ చేశాడు.సుచిత్రతో పాటు ఇంటర్వ్యూ హోస్ట్ చేస్తున్న రెండు యూట్యూబ్ ఛానెల్స్‌కు కూడా కార్తిక్ లీగల్ నోటీసులు పంపాడు. సదరు యూట్యూబ్ ఛానెల్‌లు విడుదలచేసిన వీడియోలు పూర్తిగా తమ పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే ఆ ఛానెల్‌లను రద్దు చేయాలని నోటీసులో పేర్కొన్నాడు. సుచిత్ర ఇప్పటికే త్రిష, కమల్ హాసన్, వనిత విజయ్ కుమార్ వంటి వారందరిపై ఆమె తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చింది. -
మల్లారెడ్డి భూ వివాదంలో మరో ట్విస్ట్..
సాక్షి, కుత్బుల్లాపూర్: సుచిత్ర సెంటర్లోని భూమి వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, బాధితుల మధ్య తీవ్ర విగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) భారీ బందోబస్తు మధ్య పోలీసులు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ సందర్భంగా వివాద స్థలం ఉన్న ప్రాంతానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలు వచ్చారు. తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో అధికారులు తమకు సహకరించడంలేదని మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్వే ముగిసిన తర్వాత మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సర్వే రిపోర్ట్ వచ్చేందుకు ఒక్కరోజు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ల్యాండ్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ స్పందించారు. ఆ భూమిలో తాను కూడా కొంత ల్యాండ్ కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2015 82/e సర్వే నెంబర్లో వేరే వ్యక్తి దగ్గరి నుంచి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిసిన తర్వాతే మేము భూమి కొనుగోలు చేశాము. 15 మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని.మల్లారెడ్డితో ఈ ల్యాండ్ వివాదంపై పలుమారు మాట్లాడాము. బేరి సుభాష్ రెడ్డితో పాటు మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదు. తనకు సర్వే అవసరంలేదని చెప్పారు. 82/e సర్వే నెంబర్లో ల్యాండ్‌పై ఇంజెక్షన్ అర్డర్ వేసినా దానికి కౌంటర్ వేయలేదు.మల్లారెడ్డి పలుమార్లు నాపేరు ప్రస్తావించినందుకే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పారు. కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారు. అధికారికంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి ఎన్నో ఆటలు ఆడాడు. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో మల్లా రెడ్డి ఆధీనంలో ఉన్న భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. శనివారం రోజున సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం, మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎందుకిలా చేస్తున్నారు.. ఎవరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేది లేదు!: సుచిత్ర
సింగర్ సుచిత్ర గతంలో సుచీలీక్స్ పేరిట హీరోల పర్సనల్ ఫోటోలను లీక్ చేసి సెన్సేషన్ అయింది. చాలాకాలం తర్వాత ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వగా మరోసారి పలువురు సెలబ్రిటీల బండారాన్ని బయటపెట్టింది. ధనుష్- ఐశ్వర్య ఇద్దరూ పెళ్లయినప్పటి నుంచే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారంది. షారుక్‌ఖాన్ గే అంది. వాటిపైనే ఆసక్తితన భర్త కార్తీక్ కూడా గే అని, ఈ విషయం ఎంతో ఆలస్యంగా తెలుసుకున్నట్లు చెప్పింది. కమల్ హాసన్ పార్టీలో డ్రగ్స్ వాడతారంది. సినీ విశ్లేషకుడు బైల్వాన్ రంగనాథన్పైనా విమర్శలు గుప్పించింది. అయితే తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తూ తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడింది సుచిత్ర. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో షేర్ చేసింది. యూట్యూబ్ ఛానల్స్ నా వ్యక్తిగత విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. అనిరుధ్‌తో..వారికి నచ్చింది రాసుకుంటూ, ఇష్టారీతిన థంబ్‌నైల్స్ పెడుతూ వ్యూస్ తెచ్చుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సుచిత్ర ధనుష్‌తో ఉంది.. అనిరుధ్‌తో కూడా గదిలోకి వెళ్లింది.. ఇలాంటి చెత్త థంబ్‌నైల్స్ పెడుతున్నారు. అందుకే ఇక మీదట యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. కేవలం టీవీ ఛానల్స్‌కు మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తాను అని సుచిత్ర చెప్పుకొచ్చింది.చదవండి: తాగొచ్చి భార్యను కొట్టేవాడు.. చందు మారతాడనుకుంటే.. -
కోలీవుడ్‌లో సుచిత్ర ప్రకంపనలు.. నెట్టింట వైరలవుతోన్న ఫోటో!
కోలీవుడ్‌లో సుచీ లీక్స్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రముఖ తారలపై సింగర్ సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారిగా కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ధనుశ్ జంటపై చేసిన ఆరోపణలు, త్రిషపై చేసిన కామెంట్స్ కోలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. అంతే కాకుండా స్టార్ హీరో కమల్‌హాసన్ ట్రాన్స్‌జెండర్ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు కమల్ బర్త్‌డే పార్టీల్లో అతిథులకు డ్రగ్స్ సరఫరా చేసేవారని సంచలన ఆరోపణలు చేసింది.అయితే సుచిత్ర చేసిన కామెంట్స్ తర్వాత కమల్ హాసన్‌కు సంబంధించిన ఓ పాత ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ డ్రగ్‌డీలర్ జాఫర్ సాదిక్‌తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో రూ. 2 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేశారనే ఆరోపణలపై జాఫర్‌ను 2024 మార్చిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అరెస్టు చేసింది. అంతేకాదు.. జాఫర్ డీఎంకే పార్టీ మాజీ కార్యకర్త. అతను ఇండియా-ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ డీలర్‌గా కొనసాగుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.అయితే సింగర్ సుచిత్ర చేసిన ఆరోపణలపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. కాగా.. గతంలో 2017లోనూ కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశంగా సుచీ లీక్స్ వైరల్ అయింది. సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో చాలామంది ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి సుచిత్ర తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి లాంటి వారి గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.Suchitra Alleges Cocaine Served On Silver Plates At @ikamalhaasan Birthday Party, Netizens Dig Out Kamal's Pic With DrugKingpin #JafferSadiq @NIA_India 👇 pic.twitter.com/cURQc6Ty1K— Deepalakshmi 🚩 (@RSS_Activist) May 15, 2024 -
'ప్రముఖ నటి ఇంట్లో అశ్లీల చిత్రాలను షూట్ చేసిన నటుడు'
కొంతకాలంగా కోలీవుడ్‌లో టాప్ సింగర్‌గా నిలిచిన సుచిత్ర.. సుచీ లీక్స్ వ్యవహారం తర్వాత ఎన్నో వివాదాల్లో ఇరుక్కుని, సింగర్ అనే విషయం మరిచిపోయింది. సుచీ లీక్స్ ఇష్యూ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న సుచిత్ర.. ఇప్పుడు రకరకాల వివాదాస్పద కామెంట్లు చేస్తూ కోలీవుడ్‌లో పెను తుఫాను సృష్టిస్తోంది. ప్రస్తుతం వరుసగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్‌గా మారారు.అందుకు తగ్గట్టుగానే తన మాజీ భర్త కార్తీక్ కుమార్ స్వలింగ సంపర్కుడని, ధనుష్‌తో తనకున్న రిలేషన్ షిప్ గురించి మాట్లాడిన సుచిత్ర.. కోలీవుడ్‌లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా ఉందని, కమల్ బర్త్ డే పార్టీల్లో వెండి తాంబూలాల్లో కొకైన్ వడ్డించారని ఇలా సెన్సేషనల్ కామెంట్లు చేస్తుంది. అంతే కాకుండా సుచీ లీక్స్ ఇష్యూలో వచ్చిన ఫోటోలను త్రిష తనకు ఇచ్చిందని సుచి చెప్పడం చాలా మందిని షాక్‌కు గురి చేసింది.తాజాగా వనిత విజయకుమార్ గురించి సుచిత్ర పలు వ్యాఖ్యలు చేసింది. అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వనితా విజయకుమార్ ఇంటిని తమిళ నటుడు బైల్వాన్ ఉపయోగించాడని సుచిత్ర తెలిపింది. ఒక బంగ్లాను వనితకు తన సిన్నిహితులు ఇస్తే.. దానిని నటుడు బైల్వాన్కు ఆమె ఇచ్చినట్లు సుచి తెలిపింది. అయితే ఆ బంగ్లాను అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వాడినందుకే సీల్ వేశారని సుచిత్ర పేర్కొంది. బైల్వాన్ అందరి గురించి కామెంట్లు చేస్తాడు కానీ, వనిత గురించి మాత్రం ఎక్కడా మాట్లడరు. దీనికి కారణం ఈ బంగ్లా కథే అంటూ సుచి చెప్పింది.బైల్వాన్ రంగనాథన్ అశ్లీల సినిమాలకు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని, తనకు ప్లేబ్యాక్ సింగర్ కాకముందే ఈ విషయాలన్నీ తెలుసని సుచిత్ర తెలిపింది. శరత్‌కుమార్, రాధా రవి వంటి వారు తమిళనాడులో ఇలాంటి అసభ్యకర చిత్రాలను తెరకెక్కించకుండా అడ్డుకున్నారని కూడా ఆమె గుర్తు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ సెలబ్రిటీలకు నిద్రలేకుండా సుచిత్ర చేస్తుంది. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో తెలియక భయంతో ఉన్నారని చెప్పవచ్చు. సుచిత్ర వెనుక ఎవరో ఉండే ఈ కథ నడుపుతున్నారని కూడా రూమర్స్ వస్తున్నాయి. -
సుచీ లీక్స్.. కమల్ హాసన్‌పై సంచలన ఆరోపణ చేసిన సుచిత్ర
కోలీవుడ్‌లో సుచీ లీక్స్ గొడవ మళ్లీ మొదలైంది. రోజుకొక సెలబ్రిటీ గురించి ఎదో వార్త వైరల్ అవుతూనే ఉంది. 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశంగా సుచీ లీక్స్ వైరల్ అయింది. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో చాలామంది ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్ టాపిప్‌గా మారిన విషయం తెలిసిందే.కొన్నేళ్ల తర్వాత సింగర్ సుచిత్ర మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ధనుష్, ఐశ్వర్య, త్రిష గురించి పలు విషయాలు తెలుపుతూ రచ్చ మొదలుపెట్టింది. తాజాగా కమల్ హాసన్‌పై సుచిత్ర సంచలన ఆరోపణ చేసింది. కమల్ హాసన్ ట్రాన్స్ జెండర్ అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో బాంబ్ పేల్చింది. తమిళ్ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా కమల్ కొనసాగిన విషయం తెలిసిందే. గత సీజన్లో విక్రమ్ సినిమాతో పాపులర్ అయిన మాయ కంటెస్టెంట్‌గా పాల్గొంది. కమల్‌తో పాటు మాయ కూడా ట్రాన్స్‌జెండర్స్ అయి ఉంటారంటూ సుచిత్ర తెలిపింది. ఆయనకు చుడీదార్, కుర్తా అంటే ఎక్కువ ఇష్టమని ఆమె తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 4లో సుచిత్ర కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. కమల్ విషయంలో రీసెర్చ్ చేసే ఈ విషయాలు చెబుతున్నానని సుచిత్ర పేర్కొంది. ఆ ఇంటర్వ్యూలో ఒక ట్రాన్స్ జెండర్‌తో కలిసి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమాలో క్లాసికల్ డాన్స్ చేస్తున్న సమయంలో ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ట్రాన్స్ జెండర్స్ మాదిరిగానే ఉంటాయని ఆమె గుర్తుచేసింది. అందులో కూడా కమల్ వైట్ డ్రెస్‌తో పాటు చుడీదార్ లాంటి దాన్ని ధరిస్తారని ఆమె తెలిపింది. కమల్ నిజజీవితంలో కూడా ఎక్కువగా అలాంటి దుస్తులే ధరిస్తారని ఆమె తెలిపింది. సుచిత్ర చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కమల్ వ్యక్తిగతంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్లు ఆయన ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వారు చెబుతున్నారు. మీడియా వారు కూడా ఆమెతో ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించకండి అంటూ వారు కోరుతున్నారు. “Kamal Hassan is a transgender!” 🤯Shocking revelation by singer #Suchitra Arava nibba galla battalu oodadeestundi 😂😂😂#SuchiLeakspic.twitter.com/eWN4RzYiij— Aaku Bhai (@samuraigambhira) May 15, 2024 -
సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
సుచి లీక్స్ గొడవ మళ్లీ మొదలైంది. 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం సుచీ లీక్స్. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిప్‌గా మారింది.సుచీ లీక్స్ తర్వాత సుచిత్ర జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకానొక సమయంలో సుచిత్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. తర్వాత భర్త కార్తీక్ కుమార్ ఆమెకు విడాకులు ఇచ్చి విడిపోయాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సుచిత్ర కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయింది. తదనంతరం, ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. చాలారోజుల తర్వాత ఇప్పుడు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్ విషయాలను ఆమె పంచుకుంది. ముఖ్యంగా ధనుష్-ఐశ్వర్య విడాకులు, సుచీ లీక్స్ ఇష్యూ తదితర విషయాలపై సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ముఖ్యంగా సుచీ లీక్స్ పేరుతో విడుదల చేసిన ఫోటోలన్నీ త్రిషనే ఇచ్చిందని ఆమె చెప్పడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. 'సుచీ లీక్స్ పేరుతో వచ్చిన అన్ని ఫోటోలు త్రిష ఇచ్చినవే. కానీ, ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాక ‘నేను హర్ట్ అయ్యాను’ అంటూ త్రిషనే జనాలకు ట్వీట్ చేసేది. త్రిష ఒక బిచ్.' అని సింగర్ సుచిత్ర సెన్సేషనల్ కామెంట్ చేసింది.సుచీ లీక్స్‌లో భాగంగా త్రిష, అమలాపాల్ వంటి హీరోయిన్లతో ధనుష్ ప్రైవేట్ ఫోటోలు లీకయ్యాయి. ఆ సమయం నుంచే ఐశ్వర్య, ధనుష్ మధ్య విభేదాలు వచ్చాయని, చివరకు చేసేదేమిలేక వారు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి. Trisha oruthi @trishtrashers bitch 🤣👀 https://t.co/9crRLcEUzE pic.twitter.com/kGaRJ8z16M— Nayanthara FC (@AjithTharan) May 14, 2024 -
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
-
నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్‌కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!
దిల్ చాహ్త హై సినిమాలో హీరో సైఫ్ అలీ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించి క్లిక్కయింది నటి సుచిత్ర పిళ్లై. హిందీలో పలు సినిమాలు చేసిన ఈమె మొదట హాలీవుడ్ చిత్రాల్లో మెరిసింది. ఈమె గతంలో పవన్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. తర్వాత లార్స్ జెల్డ్సెన్ను రెండో పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిళ్ల గురించి ప్రస్తావించింది.ప్రేమించిన మూడు రోజులకే'ఓ పెళ్లిలో పవన్ మాలిక్‌ను కలిశాను. అక్కడే ఇద్దరం ప్రేమించుకున్నాం.. మూడు రోజుల్లోనే ఇంటికి వచ్చి అందరికీ తన గురించి చెప్పి ఒప్పించాడు. అలా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. 20 ఏళ్ల వయసులోనే వైవాహిక బంధంలో అడుగుపెట్టాను. తనతో కలిసి లండన్‌లోనే ఉండేదాన్ని. ఎంత త్వరగా పెళ్లి చేసుకున్నామో అంతే త్వరగా విడిపోయాం. ఏడాది తిరిగేసరికి మా మధ్య గ్యాప్ వచ్చింది. పైకి మాత్రం బాగున్నట్లు కనిపించాం. పెళ్లయిన ఏడేళ్లకు విడాకులు తీసుకున్నాం.వేరేవాళ్ల ప్రియుడిని ఎత్తుకుపోతానా?నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చాక ఆండ్రూ కోయిన్ను ప్రేమించాను. అతడికి అప్పటికే మోడల్ అచ్ల సచ్దేవ్తో బ్రేకప్ జరిగింది. దానికి నన్ను బాధ్యురాలిని చేశారు. వారి బ్రేకప్‌కు, నాకు సంబంధమే లేదు. అలాగే 2005లో లార్స్ జెల్డ్సెన్తో నా రెండో పెళ్లి జరిగింది. అప్పుడు నాపై బాయ్‌ఫ్రెండ్ స్నాచర్ అని ట్యాగ్ వేశారు. ఎవరినీ విడగొట్టలేదులార్స్ నాకు పరిచయమయ్యే సమయానికే అతడు, హీరోయిన్ ప్రీతిజింటా ప్రేమించుకున్నారు, బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. నేను వారిద్దరి మధ్యలోకి వెళ్లలేదు. అప్పటికే వాళ్లు ఏదో కారణంతో విడిపోయారు. ఆ తర్వాతే నాకు అతడు పరిచయమయ్యాడు, ప్రేమించుకున్నాం. అంతేకానీ నేనెవరినీ విడగొట్టలేదు' అని చెప్పుకొచ్చింది.చదవండి: ఒక్కరోజు కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో మూవీలో ఛాన్స్.. ఫస్ట్‌లో.. -
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్.. గే అంటూ అతడి మాజీ భార్య, సింగర్ సుచిత్ర తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లయిన 11 ఏళ్లకు అతడి నిజ స్వరూపం తెలిసిందని, అప్పటిదాకా తను గే అని బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడలేదని పేర్కొంది. అమృత అతడిని పెళ్లి చేసుకుని తప్పు చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై నటుడు కార్తీక్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.నేనేమీ సిగ్గుపడను'నేను స్వలింగసంపర్కుడినా? ఒకవేళ అదే అయ్యుంటే మాత్రం బయటకు చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు. అది ఏదైనా సరే గర్వంగా చెప్పుకునేవాడిని. అంతేకానీ ముడుచుకుపోను. నా నగరంలో దర్జాగా ర్యాలీ చేసేవాడిని.. అన్నిరకాల వాళ్లు అందులో పాల్గొని వారు అండగా నిలబడేవాళ్లు. ఎవరూ దేనికీ తలదించుకోవాల్సిన అవసరం లేదు. గర్వంగా బతకండి' అంటూ ఓ వీడియో షేర్ చేశాడు.గొడవలు ఆగవా?ఇది చూసిన జనాలు అతడు ఎంతో శాంతంగా బదులివ్వడాన్ని మెచ్చుకుంటున్నారు. ఏళ్ల తరబడి మీరు కొట్టుకుంటూనే ఉన్నారు.. మీ గొడవలకు అంతనేదే లేదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మీరు మీ మాజీ భార్య గురించి ఎంతో మంచి మాటలు చెప్తే ఆమె మాత్రం ఇలా లేనిపోని మాటలనేసి అవమానిస్తుంటే చూడటానికి మాకే బాధగా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Karthik Kumar (@evamkarthik) చదవండి: సుచీలీక్స్ సంచలనం.. పెళ్లి తర్వాత ధనుష్- ఐశ్వర్య వేరేవాళ్లతో డేటింగ్.. ఆమె కంటే.. -
సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
సుచీలీక్స్‌తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి యావత్ సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి సెలబ్రిటీలపై విరుచుకుపడింది. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ గురించి మాట్లాడుతూ.. వాళ్లు పెళ్లయినప్పటినుంచి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. పెళ్లయిన విషయాన్నే మర్చిపోయి మిగతావాళ్లతో డేటింగ్ చేశారు. ఐశ్వర్య కంటే ధనుషే నయంభర్త మోసం చేశాడని ఆరోపించిన ఐశ్వర్య ఏమైనా పద్ధతిగా ఉందా? తను కూడా వేరేవాళ్లతో డేటింగ్ చేసి మోసం చేయలేదా? ఆమె కంటే ధనుషే నయం.. అయినా ఐశ్వర్య తన పిల్లలను ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారి కుమారులు యాత్ర, లింగ.. అమ్మమ్మ- తాతయ్యల వద్ద పెరిగితే బాగుంటుంది' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.కార్తీక్ గేభర్త కార్తీక్‌తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'కార్తీక్‌తో పెళ్లయిన 11 ఏళ్లకు అతడు గే అని తెలిసింది. అది బయటకు చెప్పే ధైర్యం అతడికి లేదు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాను. పూటుగా తాగిన తర్వాత ధనుష్, నా భర్త ఒకే గదిలో ఉండేవారు. రాత్రిపూట గదిలో నా భర్తతో ధనుష్‌కు ఏం పని?' అని ప్రశ్నించింది.అందుకే టార్గెట్‌కాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ మాజీ భర్త కార్తీక్.. సుచిత్ర మానసిక ఆరోగ్యం బాగోలేదని తెలిపాడు. అయితే తన మానసిక స్థితి బాగోలేదని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సుచిత్ర ఆరోపించింది. ఎప్పుడైతే డ్రగ్స్ వాడేందుకు ఒప్పుకోలేదో అప్పుడే తనను ధనుష్, కార్తీక్ టార్గెట్ చేశారని వెల్లడించింది.చదవండి: బాలీవుడ్లో రాణిస్తున్న బ్యూటీ.. ఫస్ట్ సినిమా తెలుగులోనే! -
సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
క్యాస్టింగ్ కౌచ్.. ఈ భయంతోనే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ అంటేనే భయపడతారు. కొందరు సెలబ్రిటీలు దీనికి లొంగిపోతే మరికొందరేమో వాటిని తిరస్కరిస్తూ ధైర్యంగా ముందడుగు వేశారు. తన కెరీర్లో కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయంటోంది నటి సుచిత్ర పిళ్లై. ఈ మలయాళ నటి ఫ్రెంచ్, హాలీవుడ్ సినిమాలు సైతం చేసింది. ఎక్కువగా బాలీవుడ్ మూవీస్‌లో మెరిసిన ఈమె సింగర్ కూడా! తాజాగా సుచిత్ర క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.ఏదో ఒక దశలో క్యాస్టింగ్ కౌచ్'కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి.. కానీ దానికి బదులుగా మరింకేదో అడుగుతుంటారు. అదే క్యాస్టింగ్ కౌచ్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు. నన్ను చూస్తే గంభీరంగా కనిపిస్తానని అంటుంటారు.. కాబట్టి మరీ అంత ఘోరమైన అనుభవాలైతే ఎదురవలేదు. ఎవరైనా ఏదైనా అడగాలన్నా నా ముఖం చూసి నోరు మూసుకుని ఉంటారని జనాలు జోకులేస్తుంటారు.సౌత్‌లో సినిమాలు చేస్తారా?అయితే దక్షిణాది చిత్రపరిశ్రమ నుంచి నాకు ఓసారి ఫోన్‌కాల్ వచ్చింది. ఇదెప్పుడో ఏళ్లక్రితం జరిగిన ముచ్చట. సౌత్‌లో సినిమాలు చేస్తారా? అని అడిగారు. సరేనన్నాను. అయితే ఒక మంచి సినిమా ఉంది. చాలా పెద్ద హీరో, ప్రముఖ డైరెక్టర్ కాంబినేషన్లో రాబోతోంది. మీరు అందులో హీరోకి సోదరిగా నటిస్తారా? అది చాలా ప్రాధాన్యత ఉన్న రోల్ అని చెప్పగా మంచిదే కదా అనుకున్నాను. కాంప్రమైజ్అప్పుడతడు మా నిర్మాతకు ఇదే మొదటిసారి.. మీరు కాంప్రమైజ్ అవుతారా? అని అడిగాడు. నా రెమ్యునరేషన్ తగ్గించుకోమంటున్నాడేమోనని లేదు, సారీ అని చెప్పేశా.. కానీ అతడు మళ్లీ కాంప్రమైజ్ కావాలి అని నొక్కి చెప్పాడు. నాకు విషయం అర్థమై.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాతో మీరిలాగేనా మాట్లాడేది అని కోప్పడ్డాను. ఒక్కసారి వస్తే చాలంటూ..అంటే డైరెక్టర్స్ చాలాకాలంగా ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు. నిర్మాత కొత్తవాడు కాబట్టి తను ఓసారి రమ్మని అడుగుతున్నాడు అని పేర్కొన్నాడు. నేను మీ ప్రాజెక్ట్‌కు కరెక్ట్ వ్యక్తిని కాదు, రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేశాను. అలాంటి దారిలో వెళ్లడం నాకే మాత్రం నచ్చదు' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.చదవండి: డిప్రెషన్లో ఉపాసన.. రామ్‌చరణ్ (ఫోటోలు) -
అందుకే భావోద్వేగానికి లోనయ్యాను: చంద్రబోస్
‘‘నేనిప్పటివరకు 3700 పాటలు రాశాను. ఈ రోజు నా మీద పాట రాసి, పాడారు. ఆ పాటను నాకు బహుమతిగా ఇచ్చిన ‘పర్ఫ్యూమ్’ టీమ్‌కి కృతజ్ఞతలు. నేను ఆస్కార్ అందుకున్న వీడియోను మళ్లీ ఇక్కడ చూడటంతో భావోద్వేగానికి లోనయ్యాను. ‘పర్ఫ్యూమ్’ పెద్ద విజయం సాధించాలి. నా భార్య సుచిత్ర ఈ చిత్రంలో ఒక పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు’’ అని రచయిత చంద్రబోస్ అన్నారు. చేనాగ్,ప్రాచీ థాకర్ జంటగా జేడీ స్వామి దర్శకత్వం వహించిన చిత్రం ‘పర్ఫ్యూమ్’. శ్రీమాన్ మూవీస్ సమర్పణలో జె. సుధాకర్, శివ .బి, రాజీవ్ కుమార్ .బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆస్కార్ అవార్డుగ్రహీత చంద్రబోస్‌ను యూనిట్ సత్కరించింది. ఈ వేడుకకి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్. విష్ణుమూర్తి, ఐఆర్ఎస్ అధికారి మురళీమోహన్, గ్రీన్ హార్స్ కంపెనీ అధినేత ప్రవీణ్ రెడ్డి, ఆచార్య భట్టు రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘‘కొత్త పాయింట్‌తో రూపొందిన చిత్రమిది’’ అన్నారు జేడీ స్వామి, చేనాగ్. -
ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ గేయరచయిత చంద్రబోస్, కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ దంపతుల ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సుచిత్ర తండ్రి, చంద్రబోస్ మామగారు చాంద్ బాషా (92) శుక్రవారం రాత్రి హైదరాబాద్ మణికొండలో మృతి చెందారు. చాంద్ బాషా దక్షిణాదిలో అనేక సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేశారు. చాంద్ బాషా కి ముగ్గురు అమ్మాయిలు ,ఒక కొడుకు ఉన్నారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న ,బంగారు సంకెళ్లు ,స్నేహమేరా జీవితం , మానవుడే దేవుడు కన్నడంలో అమర భారతి , చేడిన కిడి కన్నడ వంటి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు.ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగనున్నాయి. చాంద్ బాషా మృతితో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చంద్రబోస్ ఫ్యామిలీకి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. -
తనువు లేకున్నా.. తనుంది!
ప్రొద్దుటూరు క్రైం: తాను చనిపోయినా.. తన శరీరంలోని అవయవాలు పది మందికి ఉపయోగపడాలనే ఆమె గొప్ప ఆలోచన పలువురికి ప్రాణం పోసింది. అవయవ దానంతో యువతి ఆదర్శంగా నిలవడమే కాకుండా మరికొందరికి కొత్త జీవితాన్ని అందిస్తున్నది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దేవరశెట్టి సుచిత్ర (25) అనే యువతి బ్రెయిన్ డెడ్‌తో సోమవారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందింది. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్‌కు చెందిన దేవరశెట్టి నరసింహులు, అనురాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్ద కుమార్తె రూపశరణ్య, చిన్న కుమార్తె సుచిత్ర. సుచిత్ర స్థానికంగా బీ ఫార్మసీ పూర్తి చేసింది. కొన్ని నెలల క్రితం నుంచి బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, రూపశరణ్య బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. నరసింహులు విద్యుత్‌శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. సుచిత్రకు డిసెంబర్ 31న తీవ్ర తలనొప్పిగా ఉందని చెప్పడంతో స్నేహితులు, తోటి ఉద్యోగులు హుటాహుటిన ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి వైద్యుల సూచన మేరకు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించారు. బ్రైయిన్లో రక్తం గడ్డకట్టిందని స్కానింగ్‌లో నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు సుచిత్రను వెంటనే హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ జరిగినా కోలుకోలేక సుచిత్ర సోమవారం మృతి చెందింది. కాగా తమ కుమార్తె మరణానంతరం అవయవ దానం కోసం రిజిస్టర్ చేయించిందనే విషయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులకు తెలిపారు. దీంతో కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి యువతి శరీరంలోని నేత్రాలు, గుండె, మూత్రపిండాలు, వెన్నెముకను సేకరించి భద్రపరిచారు. మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూర్చులో అంత్యక్రియలు నిర్వహించారు. -
వెదురులో విరిసిన బతుకులు
సుచిత్ర సిన్హా విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఆమె ఉద్యోగ జీవితం ఆదివాసీల కుటుంబాల జీవనస్థాయిని మెరుగుపరచడం, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడంలోనే మునిగిపోయింది. ‘గడచిన యాభై ఏళ్లుగా ఏ ప్రభుత్వ అధికారి కానీ మంత్రి కానీ ఇక్కడ అడుగుపెట్టిన దాఖలా లేదు’ అంటున్నారు బురుడీహ్ గ్రామస్థులు. బురిడీహ్ గ్రామం జార్ఖండ్ రాష్ట్రంలో రాజధాని జమ్షెడ్పూర్ నగరానికి అరవై కిలోమీటర్ల దూరాన ఉంది. బురుడీహ్తోపాటు చుట్టుపక్కల పాతిక గ్రామాల్లో ఆదివాసీ జాతులు... అవి కూడా అంతరించిపోవడానికి దగ్గరగా జాతులు నివసిస్తున్నాయి. అందులో శబర కూడా ఒకటి. భూమి ఉంది కానీ! అడవి మధ్యలో ఊరు. ఊరి చుట్టూ భూమి ఉంది. కానీ సాగు చేసుకోవడానికి అది సొంత భూమి కాదు. తలదాచుకోవడానికి పక్కా ఇల్లు లేదు. అడవి మీద ఆధారపడి బతుకు సాగించే జీవితాలవి. కాలదోషం పట్టిన మన అటవీచట్టాలు అడవిబిడ్డల జీవితాల మీద కొరడా ఝళిపిస్తున్నాయి. ఇల్లు కట్టుకోవాలంటే వాళ్లకు ఏకైక ఆధారం అడవే. అటవీ చట్టాల ప్రకారం ఆకలి తీర్చుకోవడానికి పండ్లు, కాయలనే కాదు... ఓ పూరిల్లు వేసుకోవడానికి అడవిలో చెట్టు నుంచి కలప కూడా సేకరించరాదు. అటవీ ఉద్యోగుల కళ్లు కప్పి కొమ్మలను నరికి పూరి పాక వేసుకోవడమే వాళ్లకు మిగిలిన మార్గం. అలాగే ఇల్లు కట్టుకుంటారు. దాంతో అటవీసంపదను దొంగలించిన నేరానికి అందరి మీద కేసులు నమోదై ఉంటాయి. అలాంటి జీవితాలను సుచిత్ర సిన్హా సమూలంగా మార్చేసింది. దశాబ్దాలు గడిచాయి కానీ! సుచిత్రా సిన్హా 1988లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పూర్తి చేసింది. ఆమె ఇదే ప్రాంతానికి చెందిన మహిళ కావడంతో చిన్నప్పటి నుంచి ఆదివాసీల జీవితాలను దగ్గరగా చూసిన అనుభవం ఆమెది. తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతుంటాయనే అభిప్రాయంతో కూడిన ప్రాణభయంతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూసేవాళ్లు కాదు. ఆ నేపథ్యం నుంచి బయటకు వచ్చిన సుచిత్ర 1996లో జమ్షెడ్పూర్కి డిప్యూటీ కలెక్టర్‌గా వచ్చింది. ఆ రావడం ఆమె జీవన గమనాన్ని మార్చేసిందనే చెప్పాలి. ‘‘నేను చిన్నప్పుడు చూసిన పరిస్థితికి ఇక్కడికి అధికారిగా వచ్చిన నాటికి మధ్య రెండు దశాబ్దాలకు పైగా కాలం గడిచింది. కానీ ఏ మాత్రం మార్పు లేదు. పిల్లలు సరైన దుస్తులు లేకుండా, పోషకాహారం లోపంతో, పూరిళ్లలో బతుకీడుస్తున్నారు. ఆధునిక ప్రపంచంతో సంబంధం లేనట్లు వాళ్ల లోకంలో వాళ్లు జీవిస్తున్నారు. ప్రభుత్వంలో ట్రై బల్ స్కీమ్‌లున్నాయి, నిధులు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని వాళ్ల దగ్గరకు చేర్చే ప్రయత్నం ఎవరూ చేయకపోవడంతోనే వాళ్ల జీవితాలు అలాగే ఉండిపోయాయి. అందుకే వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించింది. కొత్తగా ఏం నేర్పిద్దామన్నా, వాళ్లు ఒంటపట్టించుకునేటట్లు కనిపించలేదు. వాళ్లకు వచ్చిన పనినే మరింత మెరుగ్గా చేయడం నేర్పించడం, వాళ్లు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ కల్పించడం మీద దృష్టి పెట్టాను. వెదురు వంద రకాలుగా ఆదివాసీలకు వెదురును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెదురు బుట్టలు అల్లడం అందరికీ వచ్చి ఉంటుంది. వాళ్లకు మామూలు బుట్టలతోపాటు ల్యాంప్షేడ్లు, పెన్ హోల్డర్లు, బాస్కెట్లు చేయడం నేర్పించాం. ఢిల్లీ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రతినిధులను ఆదివాసీల గ్రామాల్లో పర్యటించమని కోరాను. వాళ్లు వచ్చి శబరులు తయారు చేస్తున్న వెదురు వస్తువులను కళాత్మకంగా చేయడంలో శిక్షణనిచ్చారు. మొత్తం కుటుంబాలు మూడు వందలకు పైగానే. ఒక్కో బృందంలో పదిమంది చొప్పున అందరినీ గ్రూప్‌లు చేశాం. ఒక్కొక్కరికి ఒక్కో కళాకృతుల తయారీలో శిక్షణ ఇచ్చాం. మొదటి నెల ఒకరి భాష మరొకరు అర్థం చేసుకోవడంలోనే గడిచిపోయింది. కానీ నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత చాలా త్వరగా నేర్చుకున్నారు. ఇప్పుడు శబర ఆదివాసీల చేతుల్లో నూటనాలుగు రకాల హస్తకళాకృతులు తయారవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే... మోడరన్ హౌస్‌లో కొలువుదీరుతున్న అనేక కళాకృతులు ఆదివాసీల చేతుల్లో రూపుదిద్దుకున్నవే. వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఢిల్లీలోని హస్తకళల ప్రదర్శన విక్రయకేంద్రం ‘ప్రగతి మైదాన్ ఢిల్లీ హట్’లో స్టాల్ ఏర్పాటు చేయించగలిగాను. ప్రతి ఒక్కరూ నెలకు ఏడెనిమిది వేలు సంపాదించుకుంటున్నారు. ఆదివాసీల కోసం 2002లో స్థాపించిన అంబాలిక ఎన్జీవో సేవలను మరింత విస్తరించి అంతర్జాతీయ వేదికల మీద కూడా ప్రదర్శించాం. బ్రిక్స్ సమావేశాలకు అవసరమైన ఫైల్ ఫోల్డర్లను తయారు చేసింది ఈ ఆదివాసీలేనంటే నమ్ముతారా? అప్పటి వరకు ముందుండి వాళ్లను నడిపించాను. ఇప్పుడు అన్నీ వాళ్లే నిర్వహించుకోగలుగుతున్నారు. నేను వెనక ఉండి వాళ్లు నడుస్తున్న తీరును చూస్తూ సంతోషిస్తున్నాను. సర్వీస్‌లో ఉండగా నాటిన మొక్క ఇది. నేను నాటిన మొక్క శాఖోపశాఖలుగా విస్తరించింది. నేను 2019లో రిటైర్ అయ్యాను. అడవిలో చెట్ల నీడన హాయిగా సాగాల్సిన వారి జీవితాలను చట్టాలు భయం నీడలోకి నెట్టేశాయి. పోలీసుకు ఫారెస్ట్ ఉద్యోగికి తేడా తెలియని అమాయకత్వంలో ఖాకీ డ్రస్ కనిపిస్తే వణికిపోతుండేవాళ్లు. చట్టాల కోరల్లో భయం నీడలో బతుకీడుస్తున్న వాళ్లు ఇప్పుడు ధైర్యంగా జీవిస్తున్నారు. నాగరక ప్రపంచం అంటేనే భయపడే స్థితి నుంచి నాగరికులకు తమ ఉత్పత్తులను వివరించి చెప్పగలుగుతున్నారు. వారిలో ఇనుమడించిన ఆత్మవిశ్వాసాన్ని కళ్లారా చూస్తున్నారు. చాలా సంతృప్తిగా ఉంది’’ అన్నారు విశ్రాంత ఐఏఎస్ అధికారి సుచిత్ర సిన్హా. -
Suchitra Divvela: అరటి ఆకు లేకపోతేనేం.. అరెక్కా పళ్లెం ఉందిగా!
పెళ్లంటే... బంధువులు, స్నేహితులతో కలిసి పచ్చటి ఆరిటాకులో పిండివంటలన్నీ చక్కగా వడ్డించుకుని ఆకు పచ్చిదనాన్ని, పచ్చదనాన్నీ ఆస్వాదిస్తూ భోజనం చేయాలని ఎవరికి మాత్రం ఉండదు? అయితే ఇప్పుడన్నీ నిలబడి తినే బఫే భోజనాలే. అరటి ఆకు లేకపోతేనేం... అరెక్కా ప్లేట్ ఉంది. సుచిత్ర దివ్వెలది మచిలీపట్నం. చదువు, ఉద్యోగం అన్నీ హైదరాబాద్‌లోనే. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా జీతం బాగానే ఉంది. లైఫ్ అంటే నెల చివర బ్యాంకు బాలెన్స్‌లో మిగులు చూసుకుని సంతృప్తి చెందడం కాదనిపించేది. పిల్లలు వేసే అనేక ప్రశ్నల్లోంచి ఆమెకు అనేక సందేహాలు వస్తుండేవి. ఉద్యోగం, మోడరన్లైఫ్ పరుగులో పడి ఏదో కోల్పోతున్నామని కూడా అనిపిస్తుండేది. ఇప్పుడు మనం కాలుష్యరహితంగా జీవించిన గడచిన తరాన్ని చూస్తున్నాం. రేపటి రోజున పిల్లలకు ఎలాంటి జీవితాన్ని మిగులుస్తున్నాం... అని తనను తాను ప్రశ్నించుకునేది. నిజానికి ఇది తన ఒక్క ఇంటి సమస్య కాదు. కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే రాబోయే తరంలో ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులకు పిల్లల నుంచి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయి. ఇంత ఆలోచించిన తర్వాత సుచిత్ర తనవంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. కర్ణాటకలో ఉన్న తన స్నేహితుల ద్వారా అక్కడ విరివిగా లభించే పోకచెట్ల బెరడును ఇలా ఉపయోగించవచ్చని తెలుసుకుంది. ఇక ఆ ప్రయత్నాన్ని ఒక క్రమపద్ధతిలో పెట్టగలిగింది. వెయ్యిలో ఒకరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే ఇకపై ఏ వేడుకలోనూ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు వాడాల్సిన అవసరం ఉండదంటారామె. చెట్టును కొట్టకుండానే..! ‘‘పోక చెట్టు నుంచి సేకరించిన మెటీరియల్‌తో ప్లేట్ అనగానే చెట్టుకు హాని కలిగిస్తారని అపోహ పడడం సహజమే. కానీ పోకచెట్టు కూడా కొబ్బరి చెట్టులాగానే కాయల కోసం గెల వేస్తుంది. పూత దశలోనే గెలను కప్పి ఉంచిన పొర విచ్చుకుంటుంది. కాయలు ముదిరి, గెలను కోసే సమయానికి ఈ పొర కూడా ఎండిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలా సేకరించిన బెరడు లాంటి పొరను శుభ్రం చేసి, గుండ్రగా కానీ నలుచదరంగా కానీ కత్తిరించి మౌల్డ్‌లో పెట్టి వేడి చేస్తే ప్లేట్ రెడీ అవుతుంది. స్పూన్లు, కప్పులకు కూడా ఇదే పద్ధతి. ఈ చెట్లు కర్ణాటకలో దావణగెరె, చెన్నగిరి, షిమోగా, తుమ్కూరులో ఎక్కువ. ఇక కేరళ, అస్సాంలో కూడా ఉంటాయి. కానీ నాకు పరిచయమైన మిత్రులు కర్ణాటక వాళ్లు కావడంతో నేను అక్కడి నుంచి నా యాక్టివిటీని మొదలుపెట్టాను. మనిషి పుట్టినప్పటి నుంచి పోయే వరకు ప్రతి అవసరాన్నీ చెట్టు తీరుస్తుంది. మనం చెట్టుకు హాని కలిగించకుండా, ఇచ్చిన వాటిని ఉపయోగించుకుంటే చాలు. ఆదాయం తక్కువే! అరెక్కా ప్లేట్, కప్పుల యూనిట్లు భారీస్థాయిలో రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇందులో లాభాలు పరిమితంగా ఉంటాయి. నాలాగ ఉద్యోగం చేసుకుంటూ, ప్రవృత్తిగా వీటిని ప్రచారంలోకి తీసుకురావడమే తప్ప, పూర్తిస్థాయి వృత్తిగా చేపట్టాలంటే కొంచెం ముందువెనుకలు ఆలోచిస్తారు. అందుకే పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్న వాళ్లు, పర్యావరణ పరిరక్షణ కోసం పని చేయాలనుకునే వాళ్లు తమ వంతు బాధ్యతగా ఇలాంటి ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాను. ’’ అన్నారు సుచిత్ర. మనకు వేడుకలు చాలానే ఉంటాయి. శ్రావణ మాసం నోముల నుంచి, గణేశ చతుర్థి, దసరా వేడుకల్లో ప్రసాదాలు పంచుకుంటారు. దేవుడి వేడుకలకు విరాళాలిచ్చే వాళ్లు తమవంతు విరాళంగా ఇలాంటి కప్పులను ఇవ్వడం అలవాటు చేసుకుంటే ‘ప్లాస్టిక్‌ని వాడవద్దు’ అని గొంతెత్తి చాటే పనే ఉండదు. ప్లాస్టిక్ దానంతట అదే కనుమరుగవుతుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కస్టడీ డెత్: వీడియో డెలిట్ చేసిన సింగర్!
చెన్నై: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ ఘటనకు సంబంధించిన వీడియోను తొలగించాలని తమిళనాడు క్రైంబ్రాంచ్ సీఐడీ(సీబీ-సీఐడీ) ప్రముఖ గాయని సుచిత్రకు విజ్ఞప్తి చేసింది. పోలీసుల కస్టడీలో చిత్ర హింసలకు గురై వారిద్దరు చనిపోయారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవ సంఘటనలకు ఆమె వ్యాఖ్యలకు ఏమాత్రం పొంతన లేదని కొట్టిపారేసింది. ఊహాజనిత కథనాలు జోడించి ఈ ఘటనను సంచలనంగా మార్చేందుకు సుచిత్ర ప్రయత్నించారని పేర్కొంది. తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వెంటనే ఈ వీడియోను తీసివేయాలని ఆమెకు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తూత్తుకుడి జిల్లా పోలీసులు ట్విటర్లో చేశారు. సీబీ-సీఐడీ విజ్ఞప్తి మేరకు సుచిత్ర తన నిరాధార కథనాలతో కూడిన వీడియోను తొలగించినట్లు పేర్కొన్నారు.(రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు) కాగా తూత్తుకుడి జిల్లా శంకరన్‌కోవిల్ సమీపంలోని సాత్తాన్‌కులం పోలీసుల దాష్టీకానికి జయరాజ్, బెనిక్స్ అనే తండ్రీకొడుకులు మరణించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అరెస్టైన వీరు పోలీస్ కస్టడీలో దారుణంగా మృతి చెందడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణలో కూడా వారిని పోలీసులు తీవ్రంగా కొట్టినట్లు వెల్లడైంది. ఇక ఈ ఘటనపై సినీ, క్రీడా ఇతర రంగాల సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక దక్షిణాది గాయని అయిన సుచిత్ర ఘటన జరిగిన వెంటనే స్పందించి తన సోషల్ మీడియా అకౌంట్లో ఇందుకు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. అయితే అవన్నీ నిరాధార, కల్పిత కథనాలంటూ శుక్రవారం సీబీ-సీఐడీ ఆమెకు ఓ నోటీసు జారీ చేసింది. కస్టడీ డెత్ కేసు విచారణ జరుగుతున్నందున ప్రింట్, విజువల్, సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎలాంటి కథనాలు ప్రసారం చేయవద్దని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను నమ్మవద్దని ప్రజలను కోరింది. కాగా జయరాజ్, బెనిక్స్‌ల కస్టడీ డెత్ కేసును మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం సీబీ-సీఐడీకి అప్పగించగా.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. తండ్రీకొడుకుల మృతిపై విచారణ కొనసాగుతోంది. -
మనుషుల్ని పీక్కుతినే జాంబీలు. ఓటీటీకి థ్యాంక్స్!
డిజిటల్ ప్లాట్‌ఫాంల కారణంగా నవతరం ప్రేక్షకులకు చేరవయ్యే అవకాశం లభించిందని నటి సుచిత్రా పిళ్లై హర్షం వ్యక్తం చేశారు. దిల్ చాహ్తా హై గర్ల్‌గా సినీ అభిమానులకు సుపరిచితమైన సుచిత్ర.. ‘బేతాళ్’అనే వెబ్‌సిరీస్‌తో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో చాలా ఏళ్ల తర్వాత తనను అందరూ గుర్తుపడుతున్నారని.. ఇకపై తనను బేతాళ్ నటిగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నారన్నారు. ‘‘ఓటీటీ కారణంగా కొత్త ప్రేక్షకుల అభిమానం పొందగలుగుతున్నాం. బేతాళ్ చూసిన తర్వాత వారి స్పందన ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. 25 ఏళ్ల కెరీర్లో ఇలాంటి క్యారెక్టర్ మొదటిసారి. ఇందులో నన్ను చూసి నేనే ఆశ్చర్యపోయాను. దర్శకుడు పేట్రిక్ అంతా సవ్యంగా సాగేలా చూసుకున్నారు’’అని సుచిత్ర పిళ్లై పీటీఐతో తన అనుభవాలు పంచుకున్నారు. కాగా పలు టీవీ షోల్లో నటించిన ఆమె.. దిల్ చాహ్తా హై సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రేయసిగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. పేజ్ 3, ఫ్యాషన్ వంటి చిత్రాల్లోనూ సుచిత్ర కనిపించారు. (హ్యాపీ బర్త్‌డే పప్పా: జెనీలియా, రితేశ్ భావోద్వేగం) బేతాళ్: మనుషులను పీక్కుతినే జాంబీలు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రెడ్‌చిల్లీస్ ఎంటర్టేన్మెంట్ నిర్మాణ సారథ్యంలో పేట్రిక్ గ్రాహం, నిఖిల్ మహాజన్ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లింగ్ హార్రర్ ‘బేతాళ్’. ఆదివారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక బేతాళ్ కథ విషయానికొస్తే... 1857లో ఓ సొరంగంలో సజీవ సమాధి చేయబడిన బ్రిటీష్ కల్నల్.. భారత్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు.. గుహలో ఉన్న బేతాళుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కన్నకొడుకునే బలిచ్చి అతీంద్రీయ శక్తులు సంపాదిస్తాడు. తనతో పాటు బంధీలుగా ఉన్న ఇతర సైనికులను చంపి తిని.. వాళ్లను కూడా తనలాగే నరరూప రాక్షసులు(జాంబీలు)గా మారుస్తాడు. అయితే వాళ్లు ఆ గుహ నుంచి బయటపడాలంటే ఓ బాలికను బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓ కార్పొరేటర్ దురాశ, నీచబుద్ధి కారణంగా ఆదివాసీలకు కష్టాలు ఎదురుకావడంతో పాటుగా.. జాంబీలకు అక్కడి నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఈ లైన్‌తోనే తొలుత అత్యంత ఆసక్తికరంగా సాగిన సిరీస్... ఆ తర్వాత క్రమంగా సాదాసీదా సన్నివేశాలతో సాగడం కాస్త విసుగు తెప్సిస్తుంది.(టీవీ నటి ఆత్మహత్య) ఇక బేతాళ్‌లో సుచిత్రా పిళ్లై పాత్ర విషయానికొస్తే.. జాంబీల సొరంగం సమీపంలో ఉండే ఏజెన్సీలోని ఆదివాసీలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు రంగంలోకి దిగిన.. సీపీఐడీ బృందానికి నాయకత్వం వహించే చీఫ్ కమాండెంట్‌గా త్యాగీ క్యారెక్టర్లో సుచిత్ర మనకు కనిపిస్తారు. ఆమెకు నమ్మిన బంటుగా ఉండే డిప్యూటీ విక్రమ్ సిరోహి(వినీత్ కుమార్ సింగ్)ను అడ్డుపెట్టుకుని తన స్వార్థం కోసం కార్పొరేట్‌తో పన్నిన కుట్ర, ఈ క్రమంలో టన్నెల్ తెరిచేందుకు చేసే ప్రయత్నాల్లో తానే బలిపశువుగా మారడం వంటి సన్నివేశాల్లో ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. -
పెళ్లి పీటలు కలిపాయి!
వేళా విశేషం అంటారు. చంద్రబోస్, సుచిత్ర కలవడం అలాంటి విశేషమే! ఇద్దరూ చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంటే ఫ్లయిట్లో పక్క పక్క సీట్లొచ్చాయి.. ‘హలో’ చెప్పుకున్నారు.. తర్వాతేం జరిగిందో.. ఈ ఇంటర్వ్యూలో ఉంది. చూపులో, మనసులో, పెద్దలో కలిపితే.. వధూవరులు పెళ్లి పీటలపై కూర్చుంటారు. వీళ్లిద్దర్ని మాత్రం.. పెళ్లి పీటలు కలిపాయి! అవును.. పెళ్లి పీటలు వీళ్లకు ముడివేశాయి. చదవండి... ఒక చక్కటి పాటను వింటున్నట్లో.. హుషారైన ఒక డాన్సును చూస్తున్నట్లో ఉంటుంది. ►ఆటా పాటలది విడదీయలేని అనుబంధం.. మీరు పాటల రచయిత.. సుచిత్రగారు డ్యాన్స్ మాస్టర్.. మీ ఇద్దరి ప్రేమ ఎలా మొదలైంది? చంద్రబోస్: 1998లో ‘పెళ్లి పీటలు’ సినిమా రికార్డింగ్ కోసం చెన్నై వెళ్లాను. పని పూర్తయ్యాక హైదరాబాద్ వస్తున్నాను. ఆ పాటల్ని షూట్ చేయడానికి కొరియోగ్రాఫర్‌గా సుచిత్ర హైదరాబాద్ వస్తోంది. మేమిద్దరం ఒకే సినిమాకు పని చేస్తున్నాం కాబట్టి ఫ్లయిట్లో పక్కపక్క సీట్లు వచ్చాయి. ‘హలో’ అని ఆమెను పలకరించాను. అప్పటికే విడుదలైన ‘పరదేశీ’ సినిమాలో నేను రాసిన పాటల గురించి చెబుతూ, కొన్ని వాక్యాల గురించి ప్రస్తావించింది. కొరియోగ్రాఫర్లు విన్యాసాలకు మాత్రమే అనుకుంటున్న తరుణంలో మనసుకు సంబంధించిన సాహిత్యాన్ని కూడా గుర్తుపెట్టుకుని చెప్పడంతో తనంటే నాలో మంచి భావన కలిగింది. కవితాత్మకంగా చెప్పాలంటే... కవిత్వాన్నే అర్థం చేసుకున్నది కవిని కూడా అర్థం చేసుకుంటుందని అర్ధాంగిని చేసుకోవాలనుకున్నాను. ఫ్లయిట్ ప్రయాణం మరుసటి రోజు నా బర్త్‌డే. మాటల మధ్యలో ఆ విషయం చెప్పాను. మరుసటి రోజు నాకో పుష్పగుచ్చం, గ్రీటింగ్ కార్డ్ పంపింది. ►మీరు గ్రీటింగ్ కార్డ్ పంపేటప్పుడు చంద్రబోస్‌గారి మీద ఏదైనా ఫీలింగ్ ఉందా? సుచిత్ర: ఫీలింగ్ ఏం లేదు. నిజానికి మగవాళ్లంటే సరైన అభిప్రాయం ఉండేది కాదు. బాగా మాట్లాడుతూ సందర్భం చూసుకుని ‘ప్రేమ’ అంటూ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారనుకునేదాన్ని. అందుకే ఎంతవరకూ ఉండాలో అంతవరకూ ఉండేదాన్ని. బోస్‌గారి విషయంలో ఆయన వర్క్ నాకు చాలా నచ్చింది. ►ఫ్లయిట్ జర్నీ తర్వాత మళ్లీ ఎప్పుడు కలిశారు? బోస్: ‘పెళ్లి పీటలు’ పాటలు తీస్తుంటే ఆ షూటింగ్ లొకేషన్‌కి వెళ్లాను. మేమిద్దరం ఒకర్నొకరం జస్ట్ అలా చూసుకున్నాం. ఆ తర్వాత ఆ సినిమా ఆడియో ఫంక్షన్లోను, వేరే సినిమాల షూటింగ్స్‌లోనూ కలుసుకున్నాం. సుచిత్ర: ఎక్కువ ఫోన్లు చేసేవారు. అలాగే లొకేషన్లో పాట పాడుతున్నప్పుడు నన్నే చూసి పాడేవారు. ఆడియో ఫంక్షన్లో క్యాసెట్స్ ఇస్తారు కదా.. నాకు ఇచ్చిన క్యాసెట్‌ను లాగేసుకొని తన క్యాసెట్ నా చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆ క్యాసెట్లో ఆయన ఫొటో ఉంది. అందుకే నా చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆయన్ని నా చేతిలో పెట్టినట్టుగా ఫీలయ్యారు. నాకు అప్పటికి ఓ కన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో ‘మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ అమ్మానాన్నలను ఒప్పించండి. మా ఇంట్లోవాళ్లతో మాట్లాడండి’ అన్నాను. ►అంటే అప్పటికి బోస్గారంటే మంచి అభిప్రాయం ఏర్పడిందా? సుచిత్ర: మనల్ని ఒకరు ఇష్టపడుతున్నారంటే మనకు సహజంగానే వాళ్లంటే ఒకలాంటి మర్యాద ఏర్పడుతుంది కదా. బోస్: అప్పటికే నా కెరీర్ ప్రారంభమై మూడేళ్లయింది. 95లో కెరీర్ స్టార్ట్ చేశాను. నెలకి 15–20 పాటలు రాసేవాణ్ణి. ప్రేమ అని సమయం వృథా చేయడం నాకిష్టం లేదు. పెళ్లి చేసుకుని కెరీర్ మీద దృష్టి పెట్టాలనుకున్నాను. అప్పటికి నాకు రెండుమూడు సంబంధాలు చూశారు. సినిమా పాటలు రాస్తానని చెబితే వాళ్లకు అర్థం కాలేదు. హీరోలే పాటలు రాసుకుని పాడతారని వాళ్ల అభిప్రాయం. ఎన్టీఆర్, చిరంజీవి వాళ్లు రాసుకుంటారు కదా. మీరు రాయడమేంటి? అన్నారు. అబద్ధం చెబుతున్నామనుకున్నారు. మన పని, మన కష్టం, మన ఆనందం.. వాళ్లకు అర్థం కావు. ఈ పరిశ్రమ గురించి తెలిసినవాళ్లకు మాత్రమే అర్థం అవుతుంది. అందుకని బయట పెళ్లి ప్రయత్నాలు చేయొద్దని ఇంట్లో చెప్పాను. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి నా సమీపం వరకూ వచ్చింది, వదులుకోకూడదనుకున్నాను. సుచీ గురించి ఇంట్లో చెప్పాను. సినిమా ఫీల్డ్, డ్యాన్స్ మాస్టర్ అని వాళ్లు భయపడ్డారు. నేను ఇష్టపడుతున్నానని ఇంట్లో ఒప్పించాను. ►వాళ్ల ఇంట్లో ఏమన్నారు? సుచిత్ర: ముందు మా అక్క ఒప్పుకుంది. తర్వాత వద్దంది. బోస్: సుచిత్ర ఇంట్లో వాళ్ల అక్కే అన్నీ చూసుకునేవారు. ఆమె పెళ్లి చేసుకోలేదు. మేం నిశ్చింతగా పని చేసుకుంటున్నాం అంటే తన వల్లే. అయితే ముందు పెళ్లికి ఒప్పుకుని, ఆ తర్వాత నాకంటే వయసులో సుచీ పెద్ద కాబట్టి వద్దన్నారు. ‘ఆరో ప్రాణం’ సినిమా కథ సుచిత్రదే. ఆ సినిమాలో వినీత్ కంటే సౌందర్య పెద్దది. మా విషయంలో ఆ కథ నిజమైంది. సుచిత్ర: సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలోనే విజయం ఉందని నమ్ముతా. అందుకే తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇంటి నుంచి వచ్చేశాను. తిరుపతిలో పెళ్లి చేసుకుందామనుకున్నాం. కరెక్ట్ కాదనిపించింది. మా ఇంట్లో వాళ్లు ఎలాగూ లేరు. మీ వాళ్ల సమక్షంలో పెళ్లి చేసుకుందాం అన్నాను ఆయనతో. బోస్: వరంగల్ మా సిస్టర్ వాళ్ల ఇంటికి వెళ్లాం.. ఆ తర్వాత మేమంతా కలసి భద్రాచలం వెళ్లాం. అక్కడ పెళ్లి చేసుకున్నాం. సుచిత్ర: ఆయన ఇంట్లోవాళ్లను పరిచయం చేసుకున్నాక నా జీవితం అంతా వీళ్లే అని నిర్ణయించుకున్నాను. ►ఆ తర్వాత మీ ఇంట్లోవాళ్లు అంగీకరించారా? సుచిత్ర: పెళ్లయిన నెలకి మా వాడు కడుపులో పడ్డాడు. పుట్టబోయే బిడ్డను మంచిగా స్వాగతిద్దాం అని కలుపుకున్నారు. ►రచయితగా మీరు స్ఫూర్తి నింపే పాటలు ఎన్నో రాశారు. మీ వ్యక్తిగత జీవితం కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఈ దిశగా మిమ్మల్ని మీరు మార్చుకున్న విషయాలేమైనా? బోస్: కళాకారులు ఆదర్శప్రాయంగా ఉండాలని నమ్ముతాను. వ్యక్తిగతంగా మనం ఆచరించనిది మనం ఎవ్వరికీ చెప్పకూడదు. కళాకారులకు చెడు వ్యసనాలు ఉండకూడదు. అయితే నాకు కొన్ని వ్యసనాలు ఉండేవి. సినిమాల్లో బిజీగా ఉండే కొత్తలో పాన్ పరాగ్ తినేవాణ్ణి. మానేయమని మా ఆవిడ పోరు పెట్టేది. ఓసారి సీరియస్‌గా ‘పాన్ పరాగ్ మానేయండి. పాటలు రాయకపోయినా ఫర్వాలేదు, సాయిబాబా గుడి దగ్గర అడుక్కు తిందాం. మీరు కూడా అక్కర్లేదు. నేను అడుక్కుని మీకు పెడతా’ అంది. మానేశా. ఆ తర్వాత సిగరెట్ అలవాటయింది. ఫ్లాస్క్‌లో టీ పెట్టుకుని సిగరెట్లు కాల్చుకుంటూ రాసేవాణ్ణి. ‘నువ్వు ఈ మత్తులో పడిపోయి రాస్తూ ప్రజల్ని మేలుకొలపడం ఏంట్రా’ అనిపించింది. రచయిత గురువు స్థానంలో ఉంటాడు. ఆ ఆలోచన వచ్చీ రాగానే సిగరెట్ మానేశా. ఆ సినిమాకు రాశాను, ఈ హీరోకు రాశాను, ఆ అవార్డు వచ్చింది.. ఇది కాదు.. వ్యక్తిగతంగా మన చెడు అలవాట్లను అధిగమించడమే గొప్ప విజయాలు. మంచి దారిలో ప్రయాణిస్తూ మంచి చెప్పాలి. మనం ముసుగు వేసుకుని ఇతరులను మేలుకొల్పడం ఏంటి? ►డ్యాన్స్ డైరెక్టర్‌గా సుచిత్రగారు రఫ్‌గా ఉన్నట్లు కనిపిస్తారు. విడిగా ఆమె ఎలాంటివారు? బోస్: టీమ్‌లో చాలామంది డ్యాన్సర్లు ఉంటారు. ఇలా చెయ్ అని చెబుతూ అన్నీ సరి చూసుకుంటూ, బుజ్జగిస్తూ, గద్దిస్తూ ఉండాలి. తనలో నాయకత్వపు లక్షణాలున్నాయి కానీ అవన్నీ కళాకారిణి వరకే. గృహిణిగా తనంత సాత్వికంగా ఉండేవాళ్లను చూడలేం. మా అమ్మానాన్నలను నాకన్నా బాగా చూసుకునేంత మంచి మనసు తనది. మా అమ్మ చనిపోయి 9 నెలలవుతోంది. అమ్మ చనిపోయిందనే నిజాన్ని నేను తీసుకున్నాను. కానీ తను తీసుకోలేకపోతోంది. ►మీది ‘ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్’. పైగా మీకన్నా సుచిత్రగారు కాస్త పెద్ద. మీ వైవాహిక జీవితంలో వీటి తాలూకు ప్రభావం ఎంతవరకూ ఉంటుంది? బోస్: తను ఫార్వార్డ్ క్యాస్ట్. నేను బీసీ. ఒకే రకమైన ఆహారపు అలవాట్లు, ఒకే విధమైన ఆచార సంప్రదాయాలు ఉంటే ఏ సమస్యా రాదు. అయితే భిన్నమైన ఆచారాలు, ఆహారపు అలవాట్లు ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు, గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను నాజ్‌వెజ్ తింటాను. సుచిత్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. తను తినదు. నాకు చేసి పెట్టమని నేను అడగలేదు. అయితే నేను చేయకపోతే మా ఆయన ఎలా తింటారని యూట్యూబ్ చూసి వండటం నేర్చుకుంది. మా పిల్లలు కూడా బాగా తింటారు. ఇలా ఆహారపు అలవాట్ల విషయంలో మాకు అవగాహన కుదిరింది. తను పూజలు చేస్తుంది. నాకూ భక్తిభావం ఎక్కువే. సుచిత్ర: ఆయనకు ఏం ఇష్టమో అది చేసి పెట్టడం నా బాధ్యత. నేను అదే పనిగా పూజలు చేయను. పుట్టింటివారిని, మెట్టినింటివారిని బాగా చూసుకుంటే చాలు.. వేరే ఏ పూజలూ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. ►అత్తమామలను చూసుకునే విషయంలో సుచిత్రగారి గురించి? బోస్: 1999 మార్చి 7న భద్రాచలంలో మా పెళ్లి జరిగింది. మా అమ్మానాన్నను మాతో పాటు హైదరాబాద్ తీసుకువచ్చాం. అమ్మ ఈ మధ్య చనిపోయింది. నాన్న ఉన్నారు. అప్పుడప్పుడు మా ఊరికి నాన్న వెళ్లి వస్తుంటారు. అక్కడ మాకు ఇల్లు ఉంది. ఇంకో విశేషం ఏంటంటే.. మా నాన్నగారు, సుచీ నాన్నగారు మాతోనే ఉంటున్నారు. వాళ్లిద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తారు. మా అమ్మానాన్న... తన అమ్మానాన్న అనే తేడా మాకు లేదు. మా ‘ఇద్దరివాళ్లు’ ‘మావాళ్లే’ అనే ఫీలింగ్‌తో ఉంటాం. సుచిత్ర: కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పేపర్స్‌లో యాడ్స్ ఇవ్వడం, భారీగా తద్దిన భోజనాలు పెట్టడం, దర్పం కోసం గిఫ్ట్‌లు పంచడం చేస్తుంటారు. చనిపోయాక ఇవన్నీ చేస్తే వాళ్లకు తెలుస్తుందా ఏంటి? బతికి ఉండగానే తల్లిదండ్రులకు సేవ చేయాలి. బోస్: చనిపోయాక ఖర్చు చేసే డబ్బులతో వాళ్లు బతికి ఉన్నప్పుడే బాగా చూసుకోవచ్చు కదా. నీతులు చెప్పే చాలామందిని చూశాను నేను. కానీ తల్లిదండ్రులను మాత్రం చూడరు. అమ్మానాన్నలను నిస్వార్థంగా చూసుకోవడంలో ఉన్న సంతృప్తి వేరే ఎందులోనూ దొరకదు. ►మరి.. వయసు వ్యత్యాసం గురించి.. పెళ్లి విషయంలో అబ్బాయికన్నా అమ్మాయి చిన్నగా ఉండాలనే నియమం ఎందుకంటే అబ్బాయికన్నా అమ్మాయికి మానసిక పరిణతి ఎక్కువ ఉంటుందని.. బోస్: అబ్బాయిని పురుషుడ్ని చేసేది సమాజం. అమ్మాయిని స్త్రీగా చేసేది ప్రకృతి. నేచురల్‌గానే తనకు పెద్దరికం వచ్చేస్తుంది. ఆలోచనల్లో, సమయస్ఫూర్తి పరంగానూ అమ్మాయిలు ఒక మెట్టు ఎక్కువే ఉంటారు. మామూలుగా అబ్బాయి పెద్ద, అమ్మాయి చిన్న అయితే అమ్మాయి ఎక్కువగా అలక పూనుతుంది. అప్పుడు అమ్మాయిని అబ్బాయి బుజ్జగిస్తాడు. కానీ ఇక్కడ నేనే అలుగుతుంటాను. మా ఆవిడ బుజ్జగిస్తుంది. సో.. మాకు ఆ సమస్య లేదు (నవ్వుతూ). సుచిత్ర: మనం ఏదైనా క్షమించగలగాలి. భర్త తప్పులు చేస్తున్నప్పుడు భార్య అతన్ని అమ్మలా ప్రేమించాలి. అమ్మలా ప్రేమిస్తున్నప్పుడు మన కోపంలోనూ ప్రేమే కనపడుతుంది కాబట్టి భర్త ఆ కోపాన్ని పెద్దది చేయడు. ►మీ భార్యని మనసులో పెట్టుకుని రాసిన పాట? బోస్: ‘సీతయ్య’ సినిమాకి రాసిన ‘సమయానికి తగు సేవలు సేయనీ..’ పాట తనని దృష్టిలో పెట్టుకుని రాశాను. ఈ పాట రాసే సమయానికి తను ఇద్దరు పిల్లల్ని కన్నది. కానీ నాకు ఆమెకు సేవ చేసే అవకాశం లభించలేదు. ఆమెను వాళ్ల అక్కయ్యవాళ్లు తీసుకుని వెళ్లారు. ఒకవేళ నేను మా ఆవిడకు సేవ చేస్తే ఎలా చేసి ఉండేవాడిని అనే తలంపుతో ఈ పాట రాశాను. సుచిత్ర: ఆయన సినిమాటిక్‌గా బిహేవ్ చేయరు. కానీ ఆయన గొప్పతనం గురించి చెబుతాను. మా నాన్నగారు నాతోనే ఉన్నారు. ఆయన ఖర్చులన్నీ నేనే పెడుతున్నాను. పెళ్లయ్యాక ఇలా పుట్టింటివాళ్లను చూసే అదృష్టం అందరికీ రాదు. ►ఓకే.. మీ ఇద్దరి పిల్లల గురించి? బోస్: మా అబ్బాయి నంద వనమాలి బీటెక్ మెకట్రానిక్స్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తనకు కార్లు, వాటి డిజైన్ల మీద ఇంట్రస్ట్. గిటార్ ప్లే చేస్తాడు. అమ్మాయి అమృత వర్షిణి స్పోర్ట్స్ పర్సన్. త్రోబాల్‌లో రెండు సార్లు నేషనల్స్ ఆడింది. ఇప్పుడు కూడా ఆడుతోంది. ►ఫైనల్లీ.. మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగాలంటే...? బోస్: అందరిలోనూ మానవ సహజమైన చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ముఖ్యంగా నేనేమన్నా చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని నిండు మనసుతో క్షమిస్తుంది నా భార్య. మా కాపురం ఇంత హాయిగా సాగటానికి ఆమె క్షమాగుణమే ప్రధాన కారణం. సిగిరెట్లు, పాన్‌పరాగ్‌లు తిని నోరంతా పాడు చేసుకుని, వొళ్లంతా పాడైపోయి వారానికో, పదిరోజులకో మందు తాగినా కూడా క్షమించేది. లేడీ ఫ్యాన్స్ అంటూ కొంతమంది ఫోన్ చేస్తారు. అలాంటి సమయంలో కూడా ఏ అపోహలకు తావు లేకుండా క్షమించేస్తుంది. ఆ గుణమే భర్తలో మార్పును తీసుకొస్తుంది. భార్య రెండు సార్లు క్షమించిన తర్వాత భర్తకు ఎంత సిగ్గుగా ఉంటుంది. అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లో చెడుతనం ఎక్కువ శాతం ఉంటుంది. ఎక్కడన్నా అమ్మాయిలో చెడుతనం ఉంటే అప్పుడు అబ్బాయి క్షమించాలి. ఆ సమతూకం వల్లే కాపురాలు చక్కగా ఉంటాయి. సుచిత్ర: మగవాళ్లు ఎన్ని తప్పులు చేసినా భార్య ఆ తప్పుల్ని క్షమిస్తే ఎరేజర్ (రబ్బర్)లాగా అవుతుంది. కానీ భార్య మాత్రం తప్పు చేయకూడదు. చేయకపోవడం మంచి సంసారానికి పునాది. ఎప్పుడైతే మనం పెళ్లి చేసుకున్నామో అప్పుడు అతనితో పాటు ఉన్న అన్ని బంధాలూ మనవే అనుకోవాలి. బేసిక్‌గా మేం ఇద్దరం ఎవరిలోనూ నెగటివిటీ చూడం. బోస్: మా కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ముల్లో నేను చిన్నవాణ్ని. నాకు ఓ అక్క. మా అందరి పిల్లలూ కలిపి ఓ పన్నెండు మంది ఉంటారు. పెద్దలు, పిల్లలు మొత్తం ఇరవైమందిమి. మీ ఫ్యామిలీలో ఎవరు బెస్ట్ అని ఒకరికి తెలీకుండా ఇంకొకరిని అడిగితే అందరూ సుచిత్ర పేరే చెప్తారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా నమ్మకంగా ఈ వ్యక్తికి చెప్పొచ్చు అనే పేరు తెచ్చుకుంది సుచీ. సుచిత్ర: మళ్లీ అదే చెబుతున్నా.. జీవిత భాగస్వామిని అమ్మలా ప్రేమించాలి. క్షమాగుణం ఉండాలి. ఒకరి బలహీనతలను మరొకరు అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా ఉండాలి. ►ఒకప్పుడు రచయితగా మీరు బిజీ.. కొరియోగ్రాఫర్‌గా ఆవిడ బిజీ. ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నట్లున్నారు? బోస్: వాస్తవం ఏంటంటే 20 ఏళ్లు విరామం విశ్రాంతి లేకుండా పని చేసింది. పనిలోనే పండగ అన్నట్టు పని చేసింది. నేనూ 25 ఏళ్లుగా పని చేస్తున్నాను. మనిషికి పరిగెత్తడం ఒక కళ అయితే పరుగు ఆపడం ఒక గొప్ప కళ. జీవితాంతం పని చేయలేడు. చేయకూడదు. మన శరీరమో, ప్రకృతో వాతావరణం వల్లో పనిలో మనం మందకొడిగా అయ్యే అవకాశం ఉంది. ఇద్దరం పరిగెత్తితే ఇల్లు, పిల్లలు ఏమైపోవాలి అని నెమ్మదించాం. పెద్దవాళ్లను చూసుకునే సమయం ఉండాలి. సుచిత్ర: పెద్దవాళ్లు మనకు చేసింది తిరిగిచ్చేయాలి. పిల్లల భవిష్యత్ కోసం మనం కొంచెం ఖాళీగా ఉండాలి. బోస్: విరామాన్ని కూడా ఆస్వాదించాలి. ►మీ ప్రేమ తాలూకు తీపి జ్ఞాపకాలు పంచుకుంటారా? సుచిత్ర: చెప్పడం కాదు.. చూపిస్తా (నవ్వుతూ). మా ఫస్ట్ ఫ్లయిట్ జర్నీ టికెట్లు, మేం పెళ్లి చేసుకోవడానికి చెన్నై నుంచి తిరుపతి వెళ్లి అటునుంచి వరంగల్ వెళ్లిన జర్నీ టికెట్స్, మేం ఇద్దరం కలిసి ఫస్ట్ వెళ్లిన గుడికి సంబంధించి టికెట్లు.. నా దగ్గర భద్రంగా ఉన్నాయి. పెళ్లయ్యాక ఒకేరోజు కంటిన్యూస్‌గా రెండు సినిమాలు చూశాం. ఆ సినిమా టికెట్లు, నాకు మొదటిసారిగా ఆయన 450 రూపాయలు పెట్టి కొనిపెట్టిన చీర బిల్లు అన్నీ ఉన్నాయి. బోస్: అవును. నాకు పంపిన మొదటి గ్రీటింగ్ కార్డ్ కూడా చాలా జాగ్రత్తగా దాచింది. 1999 మార్చి7న మా పెళ్లి జరిగింది. 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్ల మా ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ, మమ్మల్ని నమ్ముకున్నవాళ్లకు తోడుగా ఉంటూ ఆనందంగా ఉన్నాం. కావాలనే పని తగ్గించుకున్నాం. తీరిక సమయాలను ఆస్వాదిస్తున్నాం. ►‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాకి దర్శకత్వం వహించారు. మళ్లీ డైరెక్షన్ ఎప్పుడు? సుచిత్ర: మంచి కథ ఉంది. అయితే మంచి నిర్మాత దొరికితే మళ్లీ డైరెక్షన్ చేస్తా. – డి.జి. భవాని