ఈ పాటకు ట్యూన్ తెలుసా? | today song DK BOOS | Sakshi
Sakshi News home page

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

Published Sun, Mar 16 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

పల్లవి :

 అతడు: పద పదమన్నది నా అడుగే నీవైపు
 అటు ఇటు చూడకు అంటోందే నా చూపు
 నా మది కూడ ఎపుడో జారిందే
 అది ప్రేమో ఏమో తెలిసేలోపు
 నే పడిపోయా పడిపోయా
   పడిపోయా పడిపోయా
 నిలువెల్లా నీతోనే ముడిపడిపోయా
 నే చెడిపోయా చెడిపోయా
   చెడిపోయా చెడిపోయా
 తరిమే నీ ఊహలతో మతి చెడిపోయా
 ॥పదమన్నది॥

 చరణం :
 అ: నా గతము చెరిపి నిజము తెలిపి
   పోల్చనంతగా
 నన్నే అణువణువు మార్చెను నీ ప్రణయం
 ఈ కరుకు మనసు కరిగి కరిగి
 రేయి పగలు నా కలలను
   నీ తలపులతో ముంచినది సమయం
 నీ ప్రేమే... నీ ప్రేమే....
 ఓ వరమల్లే గుండెల్లోన కొలువు తీరదా
 నా ప్రేమే... నా ప్రేమే...
 నను గెలిపించి నిను నాతో నడిపిస్తుందా
 అ: పద పదమన్నది నా అడుగే నీవైపు
 అటు ఇటు చూడకు అంటోందే నా చూపు
 నా మదికూడ ఎపుడో జారిందే
 అది ప్రేమో ఏమో తెలిసేలోపు
 ఆమె: నే పడిపోయా పడిపోయా
   పడిపోయా పడిపోయా
 నీతోనే ఈ నిమిషం ముడిపడిపోయా
 నే చెడిపోయా చెడిపోయా
   చెడిపోయా చెడిపోయా
 ప్రేమించే నీ కొరకే మతి చెడిపోయా

 చిత్రం : DK బోస్ (2014)
 రచన : వనమాలి
 సంగీతం : అచ్చు
 గానం : హరిచరణ్, సుచిత్ర

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement