నటి నయనతారకు ధన అహంకారం పెరిగిందని, సంచలన గాయని నటి సుచిత్ర పేర్కొన్నారు. ఇంతకుముందు పేరుతో పలువురు ప్రముఖ అంతరంగిక విషయాలను బయటపెట్టి కలకలం సృష్టించిన ఈమె కొద్దిగా సైలెంట్‌గా ఉండి ఇప్పుడు మళ్లీ తన మార్కు విమర్శలు, ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. తాజాగా నటి నయనతారపై విరుచుకుపడ్డారు. నటి నయనతార ఇటీవల యూట్యూబ్ ఛానల్ భేటీలో పాల్గొన్నారు. దానిపై గాయని సుచిత్ర స్పందిస్తూ నటి నయనతార ఇటీవల నటుడు ధనుష్‌ను విమర్శిస్తూ విడుదల చేసిన ప్రకటనను తాను చూశానన్నారు. అందులో ధనుష్‌పై ఉన్న ఆరోపణలన్నీ నయనతార వెల్లడించారన్నారు. దీంతో తాను నయనతారను అభినందించానన్నారు.
అయితే ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న వివాదం ధనవంతులైన ఇద్దరి (నటుడు ధనుష్, నయనతార) మధ్య జరుగుతున్న పోరు అని పేర్కొన్నారు. మీ ఇద్దరి ఇళ్లల్లోనూ డబ్బు రూ.కోట్లలో మూలుగుతోందన్నారు. ఈ ఇద్దరికీ డబ్బు అహంకారం పెరిగిపోయిందన్నారు. కాగా నటి నయనతార చాలా గౌరవప్రదంగా మాట్లాడే వారిని అయితే ఇటీవల ఆమె ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటించిన చిత్రాల కంటే తన డాక్యుమెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు అధికంగా చూశారని పేర్కొనడం నయనతారలో ఎంత అహంకారం పెరిగిన దానికి నిదర్శనం అని పేర్కొన్నారు. బాలీవుడ్‌కు చెందిన అనుపమ చోఫ్రా గత రెండేళ్లుగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారని, ఆమె ప్రముఖులను మోయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
అలాగే ఆమె నటి నయనతారను పొగడ్తలు ముంచేశారన్నారు. అందుకు ఆమె భారీగా డబ్బు పొందినట్లు తెలిసిందన్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నటి నయనతార ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతలా తాను నటుడు ధనుష్ ను ఢీకొంటున్నట్లు చెప్పడంతో పాటు, జవాన్ చిత్రం తర్వాత హిందీలో మరో అవకాశం రాకపోవడంతో అక్కడ అవకాశాలు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోందని గాయని సుచిత్ర పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment