'ప్రతి రోజు ఐదు లవ్‌ లెటర్స్‌'.. ప్రేమకథ పంచుకున్న స్టార్‌ నటుడి భార్య! | Superstar Mohanlal wife Suchitra opened up about how she fell in love | Sakshi
Sakshi News home page

Mohanlal wife Suchitra: 'పేరు రాయకుండా ప్రేమలేఖలు'.. ఆ నిక్‌నేమ్‌తో పిలిచేదాన్ని!

Published Tue, Nov 12 2024 7:27 PM | Last Updated on Tue, Nov 12 2024 8:13 PM

Superstar Mohanlal wife Suchitra opened up about how she fell in love

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్ గురించి తెలుగువారికి చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్‌తో టాలీవుడ్‌ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించారు. మాలీవుడ్‌ స్టార్‌ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగులోనూ అంతే ఫేమల్ అయ్యారు. ప్రస్తుతం మంచువిష్ణు కన్నప్ప, ఎంపురన్‌ చిత్రాల్లో నటిస్తున్నారు.

అయితే గతంలో మోహన్‌ లాల్‌ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన భార్య సుచిత్ర వీరిద్దరి ప్రేమాయణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తానే మోహన్‌ లాల్‌కు ప్రేమలేఖలు రాసేదాన్ని ‍అని తెలిపింది. అదేపనిగా లవ్ లెటర్స్ రాస్తూ విసిగించేదాన్ని అంటూ తమ ప్రేమకథను వివరించింది.

సుచిత్ర మాట్లాడుతూ..'నేను ఫస్ట్‌ టైమ్‌ త్రివేండ్రంలో అతన్ని కలిశా. అంతకు ముందు కేవలం సినిమాల్లో మాత్రమే చూసేదాన్ని. దగ్గర నుంచి చూడడం అదే మొదటిసారి. మా కుటుంబాలకు కామన్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారని బంధువుల పెళ్లిలో నాకు తెలిసింది. నేను కోజికోడ్‌లో ఉన్నప్పుడు సెలవుల్లో అతని సినిమాలను థియేటర్లలో చూసేదాన్ని. ఆయన మొదటి సినిమా మజిల్‌ విరింజ పుక్కల్‌ చూసినప్పుడు ఆయనపై ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ ఆయన టాలెంట్‌ను గుర్తించి ప్రేమించడం మొదలుపెట్టా' అని తెలిపింది.

'ఆ తర్వాత నా పేరు రాయకుండా ఆయనకు లేఖలు రాయడం ప్రారంభించా. ప్రతి రోజు ఐదు రాసి పంపించాను. ఆయన అడ్రస్‌ తెలుసుకుని మరీ లెటర్స్ రాశా. నా ప్రేమలేఖలతోనే ఓ రేంజ్‌లో వేధించా. మా ఇంట్లో ఉన్నప్పుడు అతన్ని సుందర కుట్టప్పన్ (అందమైన అబ్బాయి) అనే నిక్‌నేమ్‌తో పిలిచేదాన్ని. ఆ తర్వాత మా అమ్మ, నాన్నకు మోహన్‌లాల్ గురించి చెప్పా. వెంటనే నా ప్రేమను అంగీకరించి తెలిసినవాళ్లతో మాట్లాడి మా పెళ్లి చేశారు' తమ లవ్‌స్టోరీని గుర్తుచేసుకున్నారు. కాగా.. మోహన్ లాల్, సుచిత్ర వివాహం 1988లోనే జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement