Haricharan
-
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అతడు: పద పదమన్నది నా అడుగే నీవైపు అటు ఇటు చూడకు అంటోందే నా చూపు నా మది కూడ ఎపుడో జారిందే అది ప్రేమో ఏమో తెలిసేలోపు నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా నిలువెల్లా నీతోనే ముడిపడిపోయా నే చెడిపోయా చెడిపోయా చెడిపోయా చెడిపోయా తరిమే నీ ఊహలతో మతి చెడిపోయా ॥పదమన్నది॥ చరణం : అ: నా గతము చెరిపి నిజము తెలిపి పోల్చనంతగా నన్నే అణువణువు మార్చెను నీ ప్రణయం ఈ కరుకు మనసు కరిగి కరిగి రేయి పగలు నా కలలను నీ తలపులతో ముంచినది సమయం నీ ప్రేమే... నీ ప్రేమే.... ఓ వరమల్లే గుండెల్లోన కొలువు తీరదా నా ప్రేమే... నా ప్రేమే... నను గెలిపించి నిను నాతో నడిపిస్తుందా అ: పద పదమన్నది నా అడుగే నీవైపు అటు ఇటు చూడకు అంటోందే నా చూపు నా మదికూడ ఎపుడో జారిందే అది ప్రేమో ఏమో తెలిసేలోపు ఆమె: నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా నీతోనే ఈ నిమిషం ముడిపడిపోయా నే చెడిపోయా చెడిపోయా చెడిపోయా చెడిపోయా ప్రేమించే నీ కొరకే మతి చెడిపోయా చిత్రం : DK బోస్ (2014) రచన : వనమాలి సంగీతం : అచ్చు గానం : హరిచరణ్, సుచిత్ర -
కిట్స్‌లో హంగామా
‘ఇటు రాయే.. ఇటు రాయే.. నీ మీదే మనసాయే’.. ‘బంగారు కోడిపెట్ట వచ్చేనండి.. యే పాప.. యే పాప.. యే పాపా’.. అంటూ సినీగాయకుడు హరిచరణ్ పాడిన పాటలు విద్యార్థులను హుషారెత్తించాయి. నగర శివారులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కల్చరల్ కార్నివాల్ సంస్కృతి-14 ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్‌లో హరిచరణ్ స్టెప్పులు వేస్తూ పాడిన పాటలకు విద్యార్థులు కోరస్ కలిపారు. కాగా, మరో సినీ నేపథ్య గాయని భార్గవి పిళ్లై ‘మైనేమ్ ఈజ్ షీలా.. షీలాకి జవానీ’.. ‘ఆకలేస్తే అన్నం పెడుతా... అలిసొస్తే ఆయిల్ పెడుతా’ అంటూ పాటలు పాడడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఇదిలా ఉండగా, కళాశాలకు చెందిన బీటెక్ ఫస్టియర్ విద్యార్థి చైతన్య తాను సొంతంగా రాసిన ‘అమ్మ.. నాన్న నీకు వందనం పాట ఆహూతులను ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు ఫ్యాషన్‌షో, ఫేస్ పెయిటింగ్, సోలో సాంగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌రెడ్డి, డాక్టర్ కె. శ్రీధర్, ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఎం.నర్సింహరావు పాల్గొన్నారు. - భీమారం -
పిల్లోడి ప్రేమకథ
హరిచరణ్, లీలా రాథోడ్, హిమజ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘పిల్లోడు’. ‘నభూతో నభవిష్యతి’ అనేది ఉపశీర్షిక. రామ్ జి.చెన్నయ్సూరి దర్శకుడు. ఆరవ్ మాసిరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం టాకీని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక అందమైన ప్రేమకథ. నవ్యమైన కథ, కథనాలతో కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమా ఉంటుంది. వైజాగ్, అరకు, కుడియ, కేరళ, హైదరాబాద్ పరిసరాల్లో జరిగిన షూటింగ్‌తో టాకీ పూర్తయింది. ఈ నెలలోనే పాటల చిత్రీకరణ జరుపుతాం’’ అని తెలిపారు. శరత్, తడివేలు, ధన్‌రాజ్, వీరస్వామి, అనూజ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్, పాటలు: గోవింద్ జగన్నాథ్, కెమెరా: హరిఫ్.