సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను కంటోన్మెంట్ అధికారులు శుక్రవారం(సెప్టెంబర్20) కూల్చివేశారు. రక్షణ శాఖ భూముల్లో నిర్మించినందునే వీటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కంటోన్మెంట్ పరిధిలోని సుచిత్ర మార్గంలో నాలా ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తూ కొందరు దుకాణాలు నిర్మించారు. ఈ నిర్మాణాల వల్ల ట్రాపిక్‌కు ఇబ్బందవుతోందని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో బుల్డోజర్లతో రంగంలోకి దిగిన అధికారులు దుకాణాలను నేలమట్టం చేశారు.
కాగా, హైదరాబాద్ నగరంలో నాలాలు, చెరువులను ఎంతటివారు ఆక్రమించినా వదిలేది లేదని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇదే బాటలో కంటోన్మెంట్ కూడా అక్రమ కొట్టడాలపై చర్యలు ప్రారంభించడం గమనార్హం
ఇదీ చదవండి.. ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకు: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment