సౌత్‌ ఇండస్ట్రీలో బడా ఆఫర్‌.. ఒక్కరోజు కాంప్రమైజ్‌ అని కండీషన్‌! | Suchitra Pillai Recalls Facing Casting Couch In South Film Industry | Sakshi
Sakshi News home page

Suchitra Pillai: ఒక్కరోజు కాంప్రమైజ్‌ అయితే స్టార్‌ హీరో మూవీలో ఛాన్స్‌.. ఫస్ట్‌లో..

May 14 2024 11:36 AM | Updated on May 14 2024 12:42 PM

Suchitra Pillai Recalls Facing Casting Couch In South Film Industry

సౌత్‌లో సినిమాలు చేస్తారా? అని అడిగారు. సరేనన్నాను. అయితే ఒక మంచి సినిమా ఉంది. చాలా పెద్ద హీరో, ప్రముఖ

క్యాస్టింగ్‌ కౌచ్‌.. ఈ భయంతోనే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ అంటేనే భయపడతారు. కొందరు సెలబ్రిటీలు దీనికి లొంగిపోతే మరికొందరేమో వాటిని తిరస్కరిస్తూ ధైర్యంగా ముందడుగు వేశారు. తన కెరీర్‌లో కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయంటోంది నటి సుచిత్ర పిళ్లై. ఈ మలయాళ నటి ఫ్రెంచ్‌‌, హాలీవుడ్‌ సినిమాలు సైతం చేసింది. ఎక్కువగా బాలీవుడ్‌ మూవీస్‌లో మెరిసిన ఈమె సింగర్‌ కూడా! తాజాగా సుచిత్ర క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడింది.

ఏదో ఒక దశలో క్యాస్టింగ్‌ కౌచ్‌
'కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి.. కానీ దానికి బదులుగా మరింకేదో అడుగుతుంటారు. అదే క్యాస్టింగ్‌ కౌచ్‌. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఇలాంటివి ఫేస్‌ చేసే ఉంటారు. నన్ను చూస్తే గంభీరంగా కనిపిస్తానని అంటుంటారు.. కాబట్టి మరీ అంత ఘోరమైన అనుభవాలైతే ఎదురవలేదు. ఎవరైనా ఏదైనా అడగాలన్నా నా ముఖం చూసి నోరు మూసుకుని ఉంటారని జనాలు జోకులేస్తుంటారు.

సౌత్‌లో సినిమాలు చేస్తారా?
అయితే దక్షిణాది చిత్రపరిశ్రమ నుంచి నాకు ఓసారి ఫోన్‌కాల్‌ వచ్చింది. ఇదెప్పుడో ఏళ్లక్రితం జరిగిన ముచ్చట. సౌత్‌లో సినిమాలు చేస్తారా? అని అడిగారు. సరేనన్నాను. అయితే ఒక మంచి సినిమా ఉంది. చాలా పెద్ద హీరో, ప్రముఖ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో రాబోతోంది. మీరు అందులో హీరోకి సోదరిగా నటిస్తారా? అది చాలా ప్రాధాన్యత ఉన్న రోల్‌ అని చెప్పగా మంచిదే కదా అనుకున్నాను. 

కాంప్రమైజ్‌
అప్పుడతడు మా నిర్మాతకు ఇదే మొదటిసారి.. మీరు కాంప్రమైజ్‌ అవుతారా? అని అడిగాడు. నా రెమ్యునరేషన్‌ తగ్గించుకోమంటున్నాడేమోనని లేదు, సారీ అని చెప్పేశా.. కానీ అతడు మళ్లీ కాంప్రమైజ్‌ కావాలి అని నొక్కి చెప్పాడు. నాకు విషయం అర్థమై.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాతో మీరిలాగేనా మాట్లాడేది అని కోప్పడ్డాను. 

ఒక్కసారి వస్తే చాలంటూ..
అంటే డైరెక్టర్స్‌ చాలాకాలంగా ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు. నిర్మాత కొత్తవాడు కాబట్టి తను ఓసారి రమ్మని అడుగుతున్నాడు అని పేర్కొన్నాడు. నేను మీ ప్రాజెక్ట్‌కు కరెక్ట్‌ వ్యక్తిని కాదు, రాంగ్‌ నెంబర్‌ అని ఫోన్‌ పెట్టేశాను. అలాంటి దారిలో వెళ్లడం నాకే మాత్రం నచ్చదు' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.

చదవండి: డిప్రెషన్‌లో ఉపాసన.. రామ్‌చరణ్‌ (ఫోటోలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement