మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు పెళ్లయిక పదేళ్లకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.
క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. చిరంజీవి అయితే తాతనయ్యానని మురిసిపోయారు.
తాజాగా ఉపాసన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
నా భర్తే నా థెరపిస్ట్. చాలామందిలాగే నేను కూడా డెలివరీ తర్వాత తీవ్ర ఒత్తిడి (పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్)కి లోనయ్యాను.
అప్పుడు చరణ్ నాకు అండగా ఉండేందుకు నాతోపాటు నా పుట్టింటికి వచ్చేశాడు.
ఈ అదృష్టం అందరికీ ఉండదు. మహిళలందరి విషయంలో ఇలా జరగదు.
భార్య తల్లిగా మారే సమయంలో భర్త సపోర్ట్ చాలా అవసరం.
క్లీంకార విషయంలో చరణ్ చూపించే శ్రద్ధ, ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుంది.
జీవితంలో నేను తల్లిగా ఎదుగుతున్న దశను మరింత సుసంపన్నం చేసినట్లు అనిపిస్తుంది.
తల్లిగా మారే క్రమంలో ఎన్నో సవాళ్లుంటాయి కానీ ఇదొక అద్భుతమైన ప్రయాణం.
మేము మా పాపను ఇంటి దగ్గరే వదిలేసి ఎక్కడికైనా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు క్లీంకార కంటే ఎక్కువ ఏడుస్తాం.
తననలా వదిలేయడం మాకెంతో బాధగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది.


