సుచి లీక్స్‌.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర | Singer Suchitra Sensational Comments On Trisha Over Celebrities Photos Released In Suchi Leaks | Sakshi
Sakshi News home page

Singer Suchitra On Trisha: నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చిందంటూ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు

Published Wed, May 15 2024 12:58 PM | Last Updated on Wed, May 15 2024 1:33 PM

 Singar Suchitra Comments On Trisha

సుచి లీక్స్‌ గొడవ మళ్లీ మొదలైంది. 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం సుచీ లీక్స్‌. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిప్‌గా మారింది.

సుచీ లీక్స్  తర్వాత సుచిత్ర జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకానొక సమయంలో సుచిత్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. తర్వాత భర్త కార్తీక్ కుమార్ ఆమెకు విడాకులు ఇచ్చి విడిపోయాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సుచిత్ర కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయింది. తదనంతరం, ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా పాల్గొంది.  

చాలారోజుల తర్వాత ఇప్పుడు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్ విషయాలను ఆమె పంచుకుంది.  ముఖ్యంగా ధనుష్-ఐశ్వర్య విడాకులు, సుచీ లీక్స్ ఇష్యూ తదితర విషయాలపై సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ముఖ్యంగా సుచీ లీక్స్ పేరుతో విడుదల చేసిన ఫోటోలన్నీ త్రిషనే ఇచ్చిందని ఆమె చెప్పడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. 'సుచీ లీక్స్‌ పేరుతో వచ్చిన అన్ని ఫోటోలు త్రిష ఇచ్చినవే. కానీ, ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాక ‘నేను హర్ట్ అయ్యాను’ అంటూ త్రిషనే జనాలకు ట్వీట్ చేసేది. త్రిష ఒక బిచ్‌.' అని సింగర్‌ సుచిత్ర సెన్సేషనల్‌ కామెంట్‌ చేసింది.

సుచీ లీక్స్‌లో భాగంగా  త్రిష, అమలాపాల్‌ వంటి హీరోయిన్లతో ధనుష్‌ ప్రైవేట్‌ ఫోటోలు లీకయ్యాయి. ఆ సమయం నుంచే ఐశ్వర్య, ధనుష్‌ మధ్య విభేదాలు వచ్చాయని, చివరకు చేసేదేమిలేక వారు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement