suchi leaks
-
మాజీ భర్తపై గే కామెంట్స్.. క్షమాపణలు కోరిన ప్రముఖ సింగర్!
ప్రముఖ తమిళ సింగర్ సుచిత్ర ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంంది. గతంలో చాలామంది స్టార్ సెలబ్రిటీలపై సుచీలీక్స్ పేరుతో సంచలన ఆరోపణలు చేసింది. సినీతారలతో పాటు తన మాజీ భర్త నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్‌పై సైతం అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూలో తన మాజీ భర్త కార్తీక్ కుమార్‌తో పాటు హీరో ధనుష్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సైతం గే అంటూ సంచలన కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై మాజీ భర్త కార్తీక్ కుమార్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. అయితే తాజాగా సింగర్ సుచిత్ర తన మాజీ భర్తకు క్షమాపణలు చెప్పింది. దీనిపై ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసింది. అతన్ని గే అని పిలిచినందుకు బాధపడుతున్నా.. ఆయన కెరీర్‌ను నాశనం చేసే ఉద్దేశం నాకు లేదు.. అందుకే క్షమాపణలు కోరుతున్నా అని తెలిపింది. అయితే కార్తీక్ ఫిర్యాదు వల్లే పోలీసుల తనకు తరచుగా కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. అందుకే తన వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించింది. కార్తీక్ మంచి వ్యక్తి అని.. దీంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లు వీడియోలో వివరించింది. అయితే మళ్లీ ఆ వీడియోను కొద్దిసేపటికే డిలీట్ చేసింది. అంతేకాకుండా తన క్షమాపణలను ఈ మెయిల్ ద్వారా కార్తీక్‌కు పంపుతానని చెప్పింది. ఇకపై అతని కెరీర్‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని తెలిపింది. ఇకపై అన్ని వదిలేసి మానసికంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సింగర్ సుచిత్రం వెల్లడించింది. కాగా.. గతంలో పలువురు కోలీవుడ్ అగ్రతారలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు జారీ
సుచీ లీక్స్‌తో సింగర్ సుచిత్ర కోలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మాజీ భర్త కార్తీక్ గే అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఆ విషయం తెలిసిన తర్వాతే ఆయనతో విడాకులు తీసుకున్నానని ఆమె బాంబ్ పేల్చింది. అంతటితో ఆగని సుచిత్ర ఈ వివాదంలోకి హీరో ధనుష్‌ను కూడా లాగింది. పూటుగా మద్యం సేవించి హీరో ధనుష్, కార్తీక్ ఒకే గదిలో ఉండేవారని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.తాజాగా సుచిత్రకు తన మాజీ భర్త కార్తీక్ లీగల్ నోటీసులు జారీ చేశాడు. తనపైనే కాకుండా హీరో ధనుష్‌పై కూడా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు సుచిత్ర చేసిందంటూ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాడు. ఇంటర్వ్యూ సమయంలో తన పట్ల పరువు నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని, ఆపై అలాంటి వ్యాఖ్యలు మరోసారి ఆమె చేయకుండా చూడాలని తన లీగల్ టీమ్ ద్వారా ప్రత్యేకంగా డిమాండ్ చేశాడు.సుచిత్రతో పాటు ఇంటర్వ్యూ హోస్ట్ చేస్తున్న రెండు యూట్యూబ్ ఛానెల్స్‌కు కూడా కార్తిక్ లీగల్ నోటీసులు పంపాడు. సదరు యూట్యూబ్ ఛానెల్‌లు విడుదలచేసిన వీడియోలు పూర్తిగా తమ పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే ఆ ఛానెల్‌లను రద్దు చేయాలని నోటీసులో పేర్కొన్నాడు. సుచిత్ర ఇప్పటికే త్రిష, కమల్ హాసన్, వనిత విజయ్ కుమార్ వంటి వారందరిపై ఆమె తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చింది. -
'ప్రముఖ నటి ఇంట్లో అశ్లీల చిత్రాలను షూట్ చేసిన నటుడు'
కొంతకాలంగా కోలీవుడ్‌లో టాప్ సింగర్‌గా నిలిచిన సుచిత్ర.. సుచీ లీక్స్ వ్యవహారం తర్వాత ఎన్నో వివాదాల్లో ఇరుక్కుని, సింగర్ అనే విషయం మరిచిపోయింది. సుచీ లీక్స్ ఇష్యూ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న సుచిత్ర.. ఇప్పుడు రకరకాల వివాదాస్పద కామెంట్లు చేస్తూ కోలీవుడ్‌లో పెను తుఫాను సృష్టిస్తోంది. ప్రస్తుతం వరుసగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్‌గా మారారు.అందుకు తగ్గట్టుగానే తన మాజీ భర్త కార్తీక్ కుమార్ స్వలింగ సంపర్కుడని, ధనుష్‌తో తనకున్న రిలేషన్ షిప్ గురించి మాట్లాడిన సుచిత్ర.. కోలీవుడ్‌లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా ఉందని, కమల్ బర్త్ డే పార్టీల్లో వెండి తాంబూలాల్లో కొకైన్ వడ్డించారని ఇలా సెన్సేషనల్ కామెంట్లు చేస్తుంది. అంతే కాకుండా సుచీ లీక్స్ ఇష్యూలో వచ్చిన ఫోటోలను త్రిష తనకు ఇచ్చిందని సుచి చెప్పడం చాలా మందిని షాక్‌కు గురి చేసింది.తాజాగా వనిత విజయకుమార్ గురించి సుచిత్ర పలు వ్యాఖ్యలు చేసింది. అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వనితా విజయకుమార్ ఇంటిని తమిళ నటుడు బైల్వాన్ ఉపయోగించాడని సుచిత్ర తెలిపింది. ఒక బంగ్లాను వనితకు తన సిన్నిహితులు ఇస్తే.. దానిని నటుడు బైల్వాన్కు ఆమె ఇచ్చినట్లు సుచి తెలిపింది. అయితే ఆ బంగ్లాను అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వాడినందుకే సీల్ వేశారని సుచిత్ర పేర్కొంది. బైల్వాన్ అందరి గురించి కామెంట్లు చేస్తాడు కానీ, వనిత గురించి మాత్రం ఎక్కడా మాట్లడరు. దీనికి కారణం ఈ బంగ్లా కథే అంటూ సుచి చెప్పింది.బైల్వాన్ రంగనాథన్ అశ్లీల సినిమాలకు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని, తనకు ప్లేబ్యాక్ సింగర్ కాకముందే ఈ విషయాలన్నీ తెలుసని సుచిత్ర తెలిపింది. శరత్‌కుమార్, రాధా రవి వంటి వారు తమిళనాడులో ఇలాంటి అసభ్యకర చిత్రాలను తెరకెక్కించకుండా అడ్డుకున్నారని కూడా ఆమె గుర్తు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ సెలబ్రిటీలకు నిద్రలేకుండా సుచిత్ర చేస్తుంది. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో తెలియక భయంతో ఉన్నారని చెప్పవచ్చు. సుచిత్ర వెనుక ఎవరో ఉండే ఈ కథ నడుపుతున్నారని కూడా రూమర్స్ వస్తున్నాయి. -
సుచీ లీక్స్.. కమల్ హాసన్‌పై సంచలన ఆరోపణ చేసిన సుచిత్ర
కోలీవుడ్‌లో సుచీ లీక్స్ గొడవ మళ్లీ మొదలైంది. రోజుకొక సెలబ్రిటీ గురించి ఎదో వార్త వైరల్ అవుతూనే ఉంది. 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశంగా సుచీ లీక్స్ వైరల్ అయింది. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో చాలామంది ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్ టాపిప్‌గా మారిన విషయం తెలిసిందే.కొన్నేళ్ల తర్వాత సింగర్ సుచిత్ర మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ధనుష్, ఐశ్వర్య, త్రిష గురించి పలు విషయాలు తెలుపుతూ రచ్చ మొదలుపెట్టింది. తాజాగా కమల్ హాసన్‌పై సుచిత్ర సంచలన ఆరోపణ చేసింది. కమల్ హాసన్ ట్రాన్స్ జెండర్ అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో బాంబ్ పేల్చింది. తమిళ్ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా కమల్ కొనసాగిన విషయం తెలిసిందే. గత సీజన్లో విక్రమ్ సినిమాతో పాపులర్ అయిన మాయ కంటెస్టెంట్‌గా పాల్గొంది. కమల్‌తో పాటు మాయ కూడా ట్రాన్స్‌జెండర్స్ అయి ఉంటారంటూ సుచిత్ర తెలిపింది. ఆయనకు చుడీదార్, కుర్తా అంటే ఎక్కువ ఇష్టమని ఆమె తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 4లో సుచిత్ర కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. కమల్ విషయంలో రీసెర్చ్ చేసే ఈ విషయాలు చెబుతున్నానని సుచిత్ర పేర్కొంది. ఆ ఇంటర్వ్యూలో ఒక ట్రాన్స్ జెండర్‌తో కలిసి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమాలో క్లాసికల్ డాన్స్ చేస్తున్న సమయంలో ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ట్రాన్స్ జెండర్స్ మాదిరిగానే ఉంటాయని ఆమె గుర్తుచేసింది. అందులో కూడా కమల్ వైట్ డ్రెస్‌తో పాటు చుడీదార్ లాంటి దాన్ని ధరిస్తారని ఆమె తెలిపింది. కమల్ నిజజీవితంలో కూడా ఎక్కువగా అలాంటి దుస్తులే ధరిస్తారని ఆమె తెలిపింది. సుచిత్ర చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కమల్ వ్యక్తిగతంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్లు ఆయన ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వారు చెబుతున్నారు. మీడియా వారు కూడా ఆమెతో ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించకండి అంటూ వారు కోరుతున్నారు. “Kamal Hassan is a transgender!” 🤯Shocking revelation by singer #Suchitra Arava nibba galla battalu oodadeestundi 😂😂😂#SuchiLeakspic.twitter.com/eWN4RzYiij— Aaku Bhai (@samuraigambhira) May 15, 2024 -
సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
సుచి లీక్స్ గొడవ మళ్లీ మొదలైంది. 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం సుచీ లీక్స్. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిప్‌గా మారింది.సుచీ లీక్స్ తర్వాత సుచిత్ర జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకానొక సమయంలో సుచిత్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. తర్వాత భర్త కార్తీక్ కుమార్ ఆమెకు విడాకులు ఇచ్చి విడిపోయాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సుచిత్ర కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయింది. తదనంతరం, ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. చాలారోజుల తర్వాత ఇప్పుడు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్ విషయాలను ఆమె పంచుకుంది. ముఖ్యంగా ధనుష్-ఐశ్వర్య విడాకులు, సుచీ లీక్స్ ఇష్యూ తదితర విషయాలపై సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ముఖ్యంగా సుచీ లీక్స్ పేరుతో విడుదల చేసిన ఫోటోలన్నీ త్రిషనే ఇచ్చిందని ఆమె చెప్పడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. 'సుచీ లీక్స్ పేరుతో వచ్చిన అన్ని ఫోటోలు త్రిష ఇచ్చినవే. కానీ, ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాక ‘నేను హర్ట్ అయ్యాను’ అంటూ త్రిషనే జనాలకు ట్వీట్ చేసేది. త్రిష ఒక బిచ్.' అని సింగర్ సుచిత్ర సెన్సేషనల్ కామెంట్ చేసింది.సుచీ లీక్స్‌లో భాగంగా త్రిష, అమలాపాల్ వంటి హీరోయిన్లతో ధనుష్ ప్రైవేట్ ఫోటోలు లీకయ్యాయి. ఆ సమయం నుంచే ఐశ్వర్య, ధనుష్ మధ్య విభేదాలు వచ్చాయని, చివరకు చేసేదేమిలేక వారు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి. Trisha oruthi @trishtrashers bitch 🤣👀 https://t.co/9crRLcEUzE pic.twitter.com/kGaRJ8z16M— Nayanthara FC (@AjithTharan) May 14, 2024 -
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్.. గే అంటూ అతడి మాజీ భార్య, సింగర్ సుచిత్ర తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లయిన 11 ఏళ్లకు అతడి నిజ స్వరూపం తెలిసిందని, అప్పటిదాకా తను గే అని బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడలేదని పేర్కొంది. అమృత అతడిని పెళ్లి చేసుకుని తప్పు చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై నటుడు కార్తీక్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.నేనేమీ సిగ్గుపడను'నేను స్వలింగసంపర్కుడినా? ఒకవేళ అదే అయ్యుంటే మాత్రం బయటకు చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు. అది ఏదైనా సరే గర్వంగా చెప్పుకునేవాడిని. అంతేకానీ ముడుచుకుపోను. నా నగరంలో దర్జాగా ర్యాలీ చేసేవాడిని.. అన్నిరకాల వాళ్లు అందులో పాల్గొని వారు అండగా నిలబడేవాళ్లు. ఎవరూ దేనికీ తలదించుకోవాల్సిన అవసరం లేదు. గర్వంగా బతకండి' అంటూ ఓ వీడియో షేర్ చేశాడు.గొడవలు ఆగవా?ఇది చూసిన జనాలు అతడు ఎంతో శాంతంగా బదులివ్వడాన్ని మెచ్చుకుంటున్నారు. ఏళ్ల తరబడి మీరు కొట్టుకుంటూనే ఉన్నారు.. మీ గొడవలకు అంతనేదే లేదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మీరు మీ మాజీ భార్య గురించి ఎంతో మంచి మాటలు చెప్తే ఆమె మాత్రం ఇలా లేనిపోని మాటలనేసి అవమానిస్తుంటే చూడటానికి మాకే బాధగా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Karthik Kumar (@evamkarthik) చదవండి: సుచీలీక్స్ సంచలనం.. పెళ్లి తర్వాత ధనుష్- ఐశ్వర్య వేరేవాళ్లతో డేటింగ్.. ఆమె కంటే.. -
సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
సుచీలీక్స్‌తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి యావత్ సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి సెలబ్రిటీలపై విరుచుకుపడింది. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ గురించి మాట్లాడుతూ.. వాళ్లు పెళ్లయినప్పటినుంచి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. పెళ్లయిన విషయాన్నే మర్చిపోయి మిగతావాళ్లతో డేటింగ్ చేశారు. ఐశ్వర్య కంటే ధనుషే నయంభర్త మోసం చేశాడని ఆరోపించిన ఐశ్వర్య ఏమైనా పద్ధతిగా ఉందా? తను కూడా వేరేవాళ్లతో డేటింగ్ చేసి మోసం చేయలేదా? ఆమె కంటే ధనుషే నయం.. అయినా ఐశ్వర్య తన పిల్లలను ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారి కుమారులు యాత్ర, లింగ.. అమ్మమ్మ- తాతయ్యల వద్ద పెరిగితే బాగుంటుంది' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.కార్తీక్ గేభర్త కార్తీక్‌తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'కార్తీక్‌తో పెళ్లయిన 11 ఏళ్లకు అతడు గే అని తెలిసింది. అది బయటకు చెప్పే ధైర్యం అతడికి లేదు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాను. పూటుగా తాగిన తర్వాత ధనుష్, నా భర్త ఒకే గదిలో ఉండేవారు. రాత్రిపూట గదిలో నా భర్తతో ధనుష్‌కు ఏం పని?' అని ప్రశ్నించింది.అందుకే టార్గెట్‌కాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ మాజీ భర్త కార్తీక్.. సుచిత్ర మానసిక ఆరోగ్యం బాగోలేదని తెలిపాడు. అయితే తన మానసిక స్థితి బాగోలేదని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సుచిత్ర ఆరోపించింది. ఎప్పుడైతే డ్రగ్స్ వాడేందుకు ఒప్పుకోలేదో అప్పుడే తనను ధనుష్, కార్తీక్ టార్గెట్ చేశారని వెల్లడించింది.చదవండి: బాలీవుడ్లో రాణిస్తున్న బ్యూటీ.. ఫస్ట్ సినిమా తెలుగులోనే! -
మరోసారి హాట్‌టాపిక్‌గా మారిన సుచీలీక్స్, ఆ ఫోటోలతోనే..
Real Story Behind Suchi Leaks, Is Suchi Leaks Reason For Dhanush Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్ పేరు మరోసారి సంచలనమైంది. భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య- ధనుష్‌లు18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్నేహితులుగా,దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా ఇంతకాలం కలిసున్న తాము ఇకపై భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. నిజానికి వీరిద్దరి మధ్య సుచీ లీక్స్ వ్యవహారంతోనే కలహాలు మొదలయ్యాయని కోలీవుడ్ టాక్. తమిళనాట స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ధనుష్ పేరు సుచీ లీక్స్‌లో బయటపడటం అప్పట్లో సెన్సేషన్‌కు దారితీసింది. అసలేంటీ సుచీ లీక్స్? 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం సుచీ లీక్స్. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ లిస్ట్‌లో స్వయంగా రజనీకాంత్ అల్లుడు, అప్పటికే స్టార్ స్టేటస్ సంపాదించుకన్న ధనుష్ ఉండటం మరింత హాట్ టాపిక్‌గా మారింది. త్రిష, అమలాపాల్ వంటి హీరోయిన్లతో ధనుష్ ప్రైవేట్ ఫోటోలు లీకయ్యాయి. దీనికి తోడు కొందరు హీరోయిన్లతో ధనుష్‌కు ఉన్న అఫెర్లను చాలా కాలంగా భరిస్తూ వచ్చిన ఐశ్వర్య.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
పిచ్చిదాన్ని కాదు.. మిస్సవ్వలేదు: సుచిత్ర
‘సుచీ లీక్స్’తో కోలీవుడ్‌లో దుమారం రేపిన సింగర్ సుచిత్ర(సారొస్తారా సాంగ్ ఫేం) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంతవాళ్లే తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందుకే తనను క్లినిక్‌లో చేర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుచిత్ర కనిపించడం లేదంటూ ఆమె సోదరి సునీత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిగారింటి నుంచి తన నివాసానికి వచ్చే క్రమంలో ఆమె మిస్సయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుచిత్ర మానసిక వైకల్యంతో బాధపడుతోందని.. అందుకే త్వరగా తన జాడను కనిపెట్టాలని పోలీసులకు విఙ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు సుచిత్ర ఓ స్టార్ హోటల్లో బస చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చినందు వల్లే సుచిత్ర కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని.. ప్రస్తుతం ఆమెను తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన సుచిత్ర ఓ వెబ్‌సైట్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘నేను మిస్సవ్వలేదు. కొన్ని గంటలపాటు వారితో కాంటాక్ట్‌లో లేనందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడేమో నాకు పిచ్చి పట్టిందన్నట్లుగా ఓ క్లినిక్‌లో చేర్పించారు. సునీత, ఆమె భర్త బయట నాకోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ఏదో కుట్ర దాగున్నట్లు అనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు. కాగా కోలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల వ్యక్తిగత ఫొటోలను సుచీ లీక్స్ పేరిట 2017లో సుచిత్ర తన ట్విటర్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర దుమారం రేగడంతో తన భార్య ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ సుచిత్ర భర్త కార్తిక్ కుమార్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశాడు. ఇక తదనంతర కాలంలో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. -
మళ్లీ మొదలైన సుచీ లీక్స్
పెరంబూరు (చెన్నై): ‘ఎలా వెళ్లానో మళ్లీ అలాగే వచ్చా.. పలువురి నటీనటుల ఆంతరంగిక వ్యవహారాలు మళ్లీ విడుదల కానున్నాయి’ అంటూ వైరల్‌గా వ్యాపిస్తున్న వీడియో కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది. సుచీ లీక్స్ పేరుతో ఏడాది క్రితం హీరో, హీరోయిన్ల శృంగార చిత్రాలు, ఆంతరంగిక విషయాలు బయటపడి కోలీవుడ్ తారల గుండెల్లో రైళ్లు పరుగెత్తిన విషయం తెలిసిందే. నాడు గాయని సుచిత్ర ట్విట్టర్ ద్వారా వెలువడిన ఈ వ్యవహారాలు కలకలం రేపాయి. అయితే తనకు వీటితో ఎలాంటి సంబంధం లేదని, తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని సుచిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దానికోసం ఎదురు చూస్తున్నా!
సినిమానే కాదు అందులో నటించే కళాకారులు మనస్థత్వాలు విచిత్రంగా ఉంటాయి. కొందరు వారి గురించిన వాస్తవాలు వెలుగు చూస్తే మనస్తాపానికి గురవుతారు. మరి కొందరు అలాంటివి ఎక్కడ బహిరంగం అవుతాయోనని భయపడతారు. ఇంకోరకం ఉంటారు. వారు అలాంటి అంశాలను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ కోవకు చెందిన నటే అమలాపాల్. దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది తిరక్కుండానే విడాకులిచ్చేసిన ఈ అమ్మడు మళ్లీ నటిగా రాణిస్తోంది. ఈ విషయంలో అమలాపాల్‌ను లక్కీ నటి అనే అనాలి. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ ఏదో విధంగా నిత్యం వార్తల్లో ఉంటునే ఉంది. ఇటీవల నటుడు కమలహాసన్‌ను కలిసి తెగ సంబరపడిపోయిన అమలాపాల్ ఒక ఏటీలో పేర్కొంటూ సుచీ లీక్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అంది. ఏమిటీ అర్థం కాలా? కొన్ని రోజులు వెనక్కు వెళ్లి గాయని సుచిత్ర పుట్టించిన కలకలం గుర్తు తెచ్చుకోండి. మీకే అర్థం అవుతుంది. గాయని సుచిత్ర ఆ మధ్య సినీ ప్రముఖుల పర్సనల్ విషయాలను, రాసలీలలను ఒక్కొక్కటి తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసి కేక పెట్టించిన విషయం తెలిసిందే. ఇంకా చాలా మంది ప్రముఖుల రాసలీలలను బయట పెడతానని పేర్కొంది. దీంతో చిత్ర పరిశ్రమ అట్టుడికిపోయింది. కొందరైతే సుచిత్రపై చర్యలకు సిద్ధమయ్యారు కూడా. దీంతో సీన్ మారిపోయింది. తన ట్విట్టర్ హ్యాక్ చేశారని సుచిత్ర వెల్లడించింది. సుచిత్ర లీక్ చేస్తానన్న వారి లిస్ట్‌లో నటి అమలాపాల్ పేరు కూడా ఉందట. అదేమిటో చూడాలని ఆసక్తిగా ఉందని సుచీ లీక్స్ కోసం ఎదురు చూస్తున్నానని నటి అమలాపాల్ ఇటీవల ఇచ్చిన ఒక భేటీలో పేర్కొంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.