సింగర్‌ సుచిత్రకు లీగల్‌ నోటీసులు జారీ | Karthik Kumar Takes Legal Action Against Singer Suchitra | Sakshi
Sakshi News home page

సింగర్‌ సుచిత్రకు లీగల్‌ నోటీసులు జారీ

Published Sun, May 19 2024 4:34 PM | Last Updated on Sun, May 19 2024 5:07 PM

Karthik Kumar Takes Legal Action Against Singer Suchitra

సుచీ లీక్స్‌తో సింగర్‌ సుచిత్ర కోలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ తన మాజీ భర్త కార్తీక్‌ గే అంటూ షాకింగ్‌ కామెంట్‌ చేసింది. ఆ విషయం తెలిసిన తర్వాతే ఆయనతో విడాకులు తీసుకున్నానని ఆమె బాంబ్‌ పేల్చింది. అంతటితో ఆగని సుచిత్ర ఈ వివాదంలోకి హీరో ధనుష్‌ను కూడా లాగింది. పూటుగా మద్యం సేవించి హీరో ధనుష్‌, కార్తీక్‌ ఒకే గదిలో ఉండేవారని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

తాజాగా సుచిత్రకు తన మాజీ భర్త కార్తీక్‌ లీగల్‌ నోటీసులు జారీ చేశాడు. తనపైనే కాకుండా హీరో ధనుష్‌పై కూడా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు సుచిత్ర చేసిందంటూ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాడు.  ఇంటర్వ్యూ సమయంలో తన పట్ల  పరువు నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని, ఆపై అలాంటి వ్యాఖ్యలు మరోసారి ఆమె చేయకుండా చూడాలని తన లీగల్ టీమ్ ద్వారా ప్రత్యేకంగా డిమాండ్ చేశాడు.

సుచిత్రతో పాటు ఇంటర్వ్యూ హోస్ట్ చేస్తున్న రెండు యూట్యూబ్ ఛానెల్స్‌కు కూడా కార్తిక్‌ లీగల్ నోటీసులు పంపాడు. సదరు యూట్యూబ్ ఛానెల్‌లు విడుదలచేసిన వీడియోలు పూర్తిగా తమ పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే ఆ ఛానెల్‌లను రద్దు చేయాలని నోటీసులో పేర్కొన్నాడు. సుచిత్ర ఇప్పటికే త్రిష, కమల్‌ హాసన్‌, వనిత విజయ్ కుమార్ వంటి వారందరిపై ఆమె తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement