దానికోసం ఎదురు చూస్తున్నా!
సినిమానే కాదు అందులో నటించే కళాకారులు మనస్థత్వాలు విచిత్రంగా ఉంటాయి. కొందరు వారి గురించిన వాస్తవాలు వెలుగు చూస్తే మనస్తాపానికి గురవుతారు. మరి కొందరు అలాంటివి ఎక్కడ బహిరంగం అవుతాయోనని భయపడతారు. ఇంకోరకం ఉంటారు. వారు అలాంటి అంశాలను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ కోవకు చెందిన నటే అమలాపాల్. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది తిరక్కుండానే విడాకులిచ్చేసిన ఈ అమ్మడు మళ్లీ నటిగా రాణిస్తోంది. ఈ విషయంలో అమలాపాల్‌ను లక్కీ నటి అనే అనాలి.
చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ ఏదో విధంగా నిత్యం వార్తల్లో ఉంటునే ఉంది. ఇటీవల నటుడు కమలహాసన్‌ను కలిసి తెగ సంబరపడిపోయిన అమలాపాల్ ఒక ఏటీలో పేర్కొంటూ సుచీ లీక్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అంది. ఏమిటీ అర్థం కాలా? కొన్ని రోజులు వెనక్కు వెళ్లి గాయని సుచిత్ర పుట్టించిన కలకలం గుర్తు తెచ్చుకోండి. మీకే అర్థం అవుతుంది. గాయని సుచిత్ర ఆ మధ్య సినీ ప్రముఖుల పర్సనల్ విషయాలను, రాసలీలలను ఒక్కొక్కటి తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసి కేక పెట్టించిన విషయం తెలిసిందే.
ఇంకా చాలా మంది ప్రముఖుల రాసలీలలను బయట పెడతానని పేర్కొంది. దీంతో చిత్ర పరిశ్రమ అట్టుడికిపోయింది. కొందరైతే సుచిత్రపై చర్యలకు సిద్ధమయ్యారు కూడా. దీంతో సీన్ మారిపోయింది. తన ట్విట్టర్ హ్యాక్ చేశారని సుచిత్ర వెల్లడించింది. సుచిత్ర లీక్ చేస్తానన్న వారి లిస్ట్‌లో నటి అమలాపాల్ పేరు కూడా ఉందట. అదేమిటో చూడాలని ఆసక్తిగా ఉందని సుచీ లీక్స్ కోసం ఎదురు చూస్తున్నానని నటి అమలాపాల్ ఇటీవల ఇచ్చిన ఒక భేటీలో పేర్కొంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.