మాజీ భర్తపై గే కామెంట్స్‌.. క్షమాపణలు కోరిన ప్రముఖ సింగర్! | Singer Suchitra public apology to actor Karthik Kumar for comments as gay | Sakshi
Sakshi News home page

Singer Suchitra: మాజీ భర్తపై గే కామెంట్స్‌.. క్షమించాలంటూ వీడియో రిలీజ్!

Published Thu, Aug 15 2024 12:26 PM | Last Updated on Thu, Aug 15 2024 2:01 PM

Singer Suchitra public apology to actor Karthik Kumar for comments as gay

ప్రముఖ త‌మిళ సింగ‌ర్ సుచిత్ర ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంంది. గతంలో చాలామంది స్టార్‌ సెలబ్రిటీలపై సుచీలీక్స్‌ పేరుతో సంచలన ఆరోపణలు చేసింది. సినీతారలతో పాటు త‌న మాజీ భ‌ర్త న‌టుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్‌పై సైతం అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అప్ప‌ట్లో ఓ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూలో త‌న మాజీ భ‌ర్త కార్తీక్ కుమార్‌తో పాటు హీరో ధనుష్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ సైతం గే అంటూ సంచలన కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై మాజీ భర్త కార్తీక్ కుమార్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. 
 

అయితే తాజాగా సింగర్ సుచిత్ర తన మాజీ భర్తకు క్షమాపణలు చెప్పింది. దీనిపై ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసింది. అతన్ని గే అని పిలిచినందుకు బాధపడుతున్నా.. ఆయన కెరీర్‌ను నాశనం చేసే ఉద్దేశం నాకు లేదు.. అందుకే క్షమాపణలు కోరుతున్నా అని తెలిపింది. అయితే కార్తీక్ ఫిర్యాదు వల్లే పోలీసుల తనకు తరచుగా కాల్స్‌ వస్తున్నాయని పేర్కొంది. అందుకే తన వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించింది. కార్తీక్ మంచి వ్యక్తి అని.. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకుంటున్నట్లు వీడియోలో వివరించింది. అయితే మళ్లీ ఆ వీడియోను కొద్దిసేపటికే డిలీట్ చేసింది. 

అంతేకాకుండా తన క్షమాపణలను ఈ మెయిల్ ద్వారా కార్తీక్‌కు పంపుతానని చెప్పింది. ఇకపై అతని కెరీర్‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని తెలిపింది. ఇకపై అన్ని వదిలేసి మానసికంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సింగర్ సుచిత్రం వెల్లడించింది. కాగా.. గతంలో పలువురు కోలీవుడ్‌ అగ్రతారలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement