Real Story Behind Suchi Leaks, Is Suchi Leaks Reason For Dhanush Divorce - Sakshi
Sakshi News home page

Dhanush Divorce: సుచీలీక్స్‌ .. ధనుష్‌ కాపురంలో చిచ్చు పెట్టిందా?

Published Tue, Jan 18 2022 6:37 PM | Last Updated on Wed, Jan 19 2022 7:18 AM

Real Story Behind Suchi Leaks, Is Suchi Leaks Reason For Dhanush Divorce - Sakshi

Real Story Behind Suchi Leaks, Is Suchi Leaks Reason For Dhanush Divorce: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ పేరు మరోసారి సంచలనమైంది. భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు ఊహించని షాక్‌ ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య- ధనుష్‌లు18 ఏళ్ల తర్వాత తమ  వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

స్నేహితులుగా,దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా ఇంతకాలం కలిసున్న తాము ఇకపై భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. నిజానికి వీరిద్దరి మధ్య సుచీ లీక్స్‌ వ్యవహారంతోనే కలహాలు మొదలయ్యాయని కోలీవుడ్‌ టాక్‌. తమిళనాట స్టార్‌ హీరోగా పేరు సంపాదించుకున్న ధనుష్‌ పేరు సుచీ లీక్స్‌లో బయటపడటం అప్పట్లో సెన్సేషన్‌కు దారితీసింది. 

అసలేంటీ సుచీ లీక్స్‌?
2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం సుచీ లీక్స్‌. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.

ఈ లిస్ట్‌లో స్వయంగా రజనీకాంత్‌ అల్లుడు, అప్పటికే స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకన్న ధనుష్‌ ఉండటం మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. త్రిష, అమలాపాల్‌ వంటి హీరోయిన్లతో ధనుష్‌ ప్రైవేట్‌ ఫోటోలు లీకయ్యాయి. దీనికి తోడు కొందరు హీరోయిన్లతో ధనుష్‌కు ఉన్న అఫెర్లను చాలా కాలంగా భరిస్తూ వచ్చిన ఐశ్వర్య.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement