![suchi leaks again stirs Kollywood - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/23/Suchitra.jpg.webp?itok=q5OBwxwU)
గాయని సుచిత్ర
పెరంబూరు (చెన్నై): ‘ఎలా వెళ్లానో మళ్లీ అలాగే వచ్చా.. పలువురి నటీనటుల ఆంతరంగిక వ్యవహారాలు మళ్లీ విడుదల కానున్నాయి’ అంటూ వైరల్‌గా వ్యాపిస్తున్న వీడియో కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది. సుచీ లీక్స్ పేరుతో ఏడాది క్రితం హీరో, హీరోయిన్ల శృంగార చిత్రాలు, ఆంతరంగిక విషయాలు బయటపడి కోలీవుడ్ తారల గుండెల్లో రైళ్లు పరుగెత్తిన విషయం తెలిసిందే.
నాడు గాయని సుచిత్ర ట్విట్టర్ ద్వారా వెలువడిన ఈ వ్యవహారాలు కలకలం రేపాయి. అయితే తనకు వీటితో ఎలాంటి సంబంధం లేదని, తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని సుచిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment