ఆయనంటే నాకిష్టం! | Amala Paul about Dhanush | Sakshi
Sakshi News home page

ఆయనంటే నాకిష్టం!

Published Wed, Mar 8 2017 2:42 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

ఆయనంటే నాకిష్టం!

ఆయనంటే నాకిష్టం!

దక్షిణాది సంచలన తారల పట్టికలో నటి అమలాపాల్‌ పేరు తప్పకుండా నమోదవుతుంది.కోలీవుడ్‌లో ఒకటి రెండు చిత్రాలతోనే తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న నటి ఈ కేరళా భామ. నటిగా ఎంత వేగంగా ఎదిగిందో అంత తొందరగా దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇక అంత త్వరగా భర్త నుంచి విడాకులు పొందిన నటి అమలాపాలే. ఈ అమ్మడిపై వదంతుల పర్వం అధికమే. ఇటీవల గాయని సుచిత్ర పేర్కొన్న రాసలీలల వదంతుల్లో ఈ జాణ పేరు చోటు చేసుందన్నది గమనార్హం. ఇవన్నీ పక్కన పెడితే నటిగా చాలా బిజీగా ఉన్న అమలాపాల్‌తో చిట్‌చాట్‌...

ప్ర: దర్శకుడు విజయ్‌ నుంచి విడిపోయిన మీరు ఇప్పటికీ ఆయనపై ప్రేమాభిమాలు ఉన్నాయని ఒక భేటీలో పేర్కొన్నారు. తాజాగా ఆయన నుంచి విడాకులు కూడా పొందారు.మళ్లీ విజయ్‌తో కలిసి జీవించే అవకాశం ఉందా?
జ: ఆ విషయం గురించి ఎలా చెప్పగలను. జీవితంలో ఎన్నో మజిలీలుంటాయి. ఎప్పుడేమి జరుగుతుందో ఊహించలేంగా.

ప్ర: విజయ్‌ అంటే కోపమా?
జ: లేదు.విజయ్‌ని నేనిప్పిటికీ ప్రియమైన వ్యక్తిగానే భావిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మేమిద్దరం ఒకరినుంచి ఒకరం పలు అద్భుతమైన విషయాలను నేర్చుకున్నాం.

ప్ర: నటుడు ధనుష్‌తో వరసగా చిత్రాలు చేయడం గురించి?
జ: ధనుష్‌ నాకు ఇష్టమైన నటుడు. ఆయన చాలా ప్రతిభావంతుడు. తామిద్దరం వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో కలిసి నటిం చాం. ఆ చిత్రం మంచి విజయం సాధిం చింది. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌తో పాటు, వడచెన్నై చిత్రంలోనూ ధనుష్‌కు జంటగా నటిస్తున్నారు.ఆయనతో నటించ డం చాలా సంతోషంగా భావిస్తున్నాను.

ప్ర: వడచెన్నైలో చాలెంజింగ్‌ పాత్ర పోషిస్తున్నారట?
జ: ఒక కాల ఘట్టంలో జరిగే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం వడచెన్నై. ఇందులో నేను ఉత్తర చెన్నైకి చెందిన యువతిగా నటిస్తున్నాను. ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పినప్పుడు నా పాత్ర నుంచి బయట పడడానికి రెండు రోజులు పట్టింది.అది నిజంగా చాలెంజింగ్‌తో కూడిన పాత్రే. మరో విషయం ఏమిటంటే హిందీ చిత్రం క్వీన్  మలయాళ రీమేక్‌లో నటించనున్నాను. దీనికి నటి రేవతి దర్శకత్వం వహించన్నారు. నేను చిన్నతనం నుంచి రేవతి చిత్రాలు చూస్తూ ఎదిగాను. ఆమె నాకిష్టమైన నటి.అలాంటి నటి దర్శకత్వంలో నటించనుండడం ఆనందంగా ఉంది.

ప్ర: భవిష్యత్‌ ప్రణాళికలంటూ ఏమైనా?
జ: వ్యాపారరంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాను. సమాజం నాకు చాలా ఇచ్చింది. వారికి ఏమైనా చేయడం నా బాధ్యత. అందుకే చెన్నైలో ఒక హోటల్‌ను నిర్మించనున్నాను. అందులో యోగా, ధ్యానం లాంటి శిక్షణ గదులను ఏర్పాటు చేయనున్నాను. అదే విధంగా నేనూ ఆరోగ్యంగా జీవించడానికి తగ్గట్టుగా నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement