Vada Chennai
-
రొమాన్స్ సీన్లో నేనేం సిగ్గుపడలేదు కానీ..: ఆండ్రియా
కోలీవుడ్ నటి ఆండ్రియా ఈ బోల్డ్ అండ్ బ్యూటీ మొదట్లో గాయనిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత కథానాయకిగా తెరపైకి వచ్చారు. ఆమె పాడిన పాటలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. ఆమె గాయని మాత్రమే కాదు.. డబ్బింగ్లో కూడా మెప్పించారు. పలు చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన ఆండ్రియా.. కందా నాల్ ముదల్ చిత్రం ద్వారా 2005 తెరపై కనిపించింది. హీరోయిన్గా కొనసాగుతూనే పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది. కార్తీ యుగానికి ఒక్కడు చిత్రంలో ఆండ్రియా ఒక పాట పాడటమే కాదు అందులో చాలా హాట్‌గా కనిపించి యూత్‌ను ఆకట్టుకుంది. విశ్వరూపం, తడాఖా, ఉత్తమ విలన్, వడ చెన్నై, మాస్టర్ వంటి చిత్రాల్లో మెప్పించింది. నటిగా తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తూ.. ప్రస్తుతం పాన్ ఇండియా కథానాయకగా రాణిస్తుంది. ధనుష్ కథానాయకుడిగా నటించిన వడ చైన్నె చిత్రంలో దర్శకుడు అమీర్‌కు భార్యగా ఆండ్రియా ఛాలెంజ్ ఉన్న పాత్రలో నటించింది. తన భర్తను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూసే ఆమె అందుకోసం తనను తాను మార్చుకునే పాత్రలో అందరినీ మెప్పించింది. దీని గురించి ఆండ్రియా ఇటీవల ఒక భేటిలో పేర్కొంటూ వడచైన్నె చిత్రంలో ఒక రొమాన్స్ సన్నివేశంలో నటించడానికి తానేం సిగ్గు పడలేదని తెలిపింది. షూటింగ్లో భాగంగా కెమెరాల ముందు చేస్తున్న రొమాన్స్‌కు కూడా దర్శకుడు అమీర్ చాలా సిగ్గు పడ్డారని ఆమె పేర్కొంది. ఆండ్రియా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా మిష్కిన్ దర్శకత్వంలో ఆండ్రియా ప్రధాన పాత్ర పోషించిన పిశాచి– 2 చిత్రం విడుదల కావాల్సి ఉంది. -
ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్
ధనుష్ హీరోగా వడచైన్నె- 2 చిత్రాన్ని కచ్చితంగా చేస్తానని దర్శకుడు వెట్రిమారన్ పేర్కొన్నారు. 2018లో పార్ట్-1 ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే. తాజాగా తమిళ్ సినిమా చిత్ర పాత్రికేయుల సంఘం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకుడు వెట్రిమారన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు ధనుష్ కథా నాయకుడిగా వడచైన్నె - 2 చిత్రాన్ని కచ్చితంగా చేస్తానని ఆయన చెప్పారు. అంతకుముందు రెండు చిత్రాలు చేయాల్సి ఉందన్నారు. (ఇదీ చదవండి: అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే) అదే విధంగా నటుడు సూర్య కథా నాయకుడిగా ఆజన్బీ పుస్తకాన్ని చిత్రంగా తెరకెక్కించాలని అసురన్ చిత్ర షూటింగ్ సమయంలోనే నిర్ణియించానన్నారు. షూటింగ్‌కు ప్రారంభించాలనుకున్న సమయంలో కరోనా రావడంతో అది ఆగిపోయిందని చెప్పారు. పార్ట్-2 కథ రెడీగానే ఉంది. త్వరలో హీరో ధనుష్‌తో చర్చిస్తానని ఆయన పేర్కొన్నాడు. తాజాగా తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన 'విడుదల' సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో కమెడియన్ సూరి హీరోగా నటించగా విజయ్ సేతుపతి ముఖ్యపాత్ర పోషించాడు. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) -
ధనుష్‌తో సినిమా.. స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదన్న బన్నీ!
తమిళ చిత్రం విడుదల ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే! సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం సినిమా చాలా బాగుందంటూ చిత్రయూనిట్‌ను అభినందించాడు. ఈ సూపర్ హిట్ మూవీని వెట్రిమారన్ డైరెక్ట్ చేశాడు. ఆడుకాలం, కాక ముట్టై, విసరణై, వడ చెన్నై, అసురన్ వంటి ఎన్నో హిట్స్‌ను కోలీవుడ్‌కు అందించిన ఆయన త్వరలో టాలీవుడ్లో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జోరందుకుంది. స్ట్రయిట్ ఫిలిం ఏమో కానీ ఇప్పుడైతే విడుదలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. దర్శకుడు వెట్రిమారన్ విడుదల పార్ట్ 1 తెలుగులోనూ రిలీజ్ చేస్తున్న సందర్భంగా వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'గీతా ఆర్ట్స్ బ్యానర్లో నేను సినిమా చేయాలనుకున్నాను. ఈమేరకు చర్చలు కూడా జరిగాయి. నేను తీసిన ఆడుకాలం(తెలుగులో పందెంకోళ్లుగా రీమేక్ అయింది) సినిమా రిలీజయ్యాక చెన్నైలో అల్లు అర్జున్ నన్ను కలిశాడు. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇద్దామనుకుంటున్నా. నీకు ఇంట్రస్ట్ ఉంటే మంచి కథ రాయు అన్నాడు. అప్పుడు వడ చెన్నై స్క్రిప్ట్ చెప్పా. హీరో ధనుష్‌ను ఢీ కొట్టే రోల్ ఆఫర్ చేశా. హైదరాబాద్‌కు వచ్చి గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో ఆ పాత్ర గురించి వివరంగా చెప్పాను. కానీ మరొక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఆ సినిమాకు నో చెప్పాడు' అని వెల్లడించాడు. ఇకపోతే విడుదల సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 15న విడుదల కానుంది. ఇందులో కమెడియన్ సూరి హీరోగా నటించగా విజయ్ సేతుపతి ముఖ్యపాత్ర పోషించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ సినిమాకోసం పనిచేసిన తన శిష్యులు 25 మందికి తలా ఓ ప్లాట్ బహుమతిగా కొనిచ్చాడు వెట్రిమారన్. అలాగే చిత్రయూనిట్ అందరికీ తలా ఒక బంగారు నాణాన్ని బహుమతిగా ఇచ్చాడు. -
ఆ సీన్లు చేసుండాల్సింది కాదు!
‘‘ఏదైనా ఒక క్యారెక్టర్ బాగా చేస్తే ఆ తర్వాత అందరూ అలాంటి పాత్రలకే అడుగుతారు. చేసిన పాత్రలే చేస్తే నాకు బోర్ కొడుతుంది. చూసే ప్రేక్షకులు కూడా ఒకే రకమైన పాత్రల్లో కనిపిస్తోంది అంటారు’’ అంటున్నారు ఆండ్రియా జర్మియా. గాయనిగా, నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఆండ్రియా ‘వడ చెన్నై’ అనే తమిళ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్‌లో నటించారు. 2018లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఆ సినిమాలో ఆమె చేసిన చంద్ర తరహా పాత్రలకే అడుగుతున్నారట. ఆ విషయం గురించి ఆండ్రియా మాట్లాడుతూ – ‘‘వడ చెన్నై’ సినిమాలో నా కో–స్టార్ అమీర్‌తో కలిసి బెడ్రూమ్ సీన్స్ చేశాను. ఆ రొమాంటిక్ సీన్స్ చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. ఎందుకంటే చాలామంది దర్శకులు అలాంటి పాత్రలతో నా దగ్గరకు వస్తున్నారు. నాకిష్టం లేదు. ఒకవేళ రొమాంటిక్ సీన్స్ లేకుండా మంచి పాత్రకి అవకాశం వస్తే పారితోషికం తగ్గించుకోవడానికి కూడా నేను రెడీ’’ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ హీరోగా రూపొందిన ‘మాస్టర్’లో నటించారు ఆండ్రియా. ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ‘కా’, ‘వట్టమ్’, ‘మాళిగై’, ‘అర్ణ్మనై’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారామె. -
వన్స్‌మోర్
ఓ సినిమా హిట్ అయిందంటే ఆ కాంబినేషన్లో మరో చిత్రం ఎప్పుడు వస్తుందా? అనుకుంటుంటారు. ఆ కాంబినేషన్ మరోసారి కలసి పని చేస్తోందంటే ఇటు అభిమానులు, అటు ఇండస్ట్రీ కచ్చితంగా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అలా ఎన్నిసార్లు కలసి పని చేసినా వన్స్‌మోర్ అంటుంది. తమిళంలో అలాంటి యాక్టర్, డైరెక్టర్ కాంబినేషనే ధనుష్–వెట్రిమారన్. వీళ్ల కాంబినేషన్లో ‘పొల్లదావన్, ఆడుకుళం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. తాజాగా ‘వడ చెన్నై’ అనే మూడు భాగాల గ్యాంగ్‌స్టర్ డ్రామాలోని ఫస్ట్ పార్ట్ ఈనెల 17న రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పుడు మరో సినిమా కోసం ఈ కాంబినేషన్ రిపీట్ కానుందట. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందట. సాహిత్య అకాడమీ అవార్డ్ పొందిన ‘వెక్కై’ అనే నవల అధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. -
మరో టాలెంట్ చూపిస్తారట
ఇప్పటికే నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ధనుష్ తన మల్టీ టాలెంట్‌ను ప్రేక్షకులందరికీ చూపించారు. లేటెస్ట్గా తనలోని సంగీత దర్శకుడిని కూడా మనకు పరిచయం చేయడానికి రెడీ అయ్యారు. తన లేటెస్ట్ మూవీ ‘వడ చెన్నై’ ద్వారా ఈ కొత్త టాలెంట్‌ను పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ తెలియజేశారు. ధనుష్ పాడిన చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మరి సంగీత దర్శకుడిగా ఎన్ని మార్కులు వేయించుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే.. మరోవైపు పలు వాయిదాలు పడుతూ ఆగిపోతూ వస్తున్న ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ సినిమా దసరా రేస్‌కు రెడీ అయింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘా ఆకాశ్ నటించిన ఈ చిత్రం, ‘వడ చెన్నై’ఒకే నెలలో విడుదల కానున్నాయి. సో.. అక్టోబర్ నెలలోనే ధనుష్ రెండుసార్లు థియేటర్స్‌లో సందడి చేస్తారన్నమాట. -
అన్బు అక్టోబర్‌లో వస్తున్నాడు
దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘వడ చెన్నై’. ‘పొల్లాదవన్’, ‘ఆడుకలమ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘వడ చెన్నై’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం రిలీజ్ డేట్ కోసం ధనుష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి ఫుల్స్టాప్ పెడుతూ ‘‘అన్బు (ధనుష్ పాత్ర పేరు) మీ అందరి దగ్గరకు అక్టోబర్ 17న వస్తున్నాడు’’ అని సినిమా టీమ్ పేర్కొంది. వాస్తవానికి ‘వడ చెన్నై’ని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అక్టోబర్‌లో వస్తుంది. సెకండ్ పార్ట్ రిలీజ్‌ను ప్రకటించలేదు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ధనుష్ క్యారమ్‌బోర్డ్ ప్లేయర్‌గా కనిపిస్తారట. ఆండ్రియా, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. -
కమల్ బాటలో ధనుష్
తమిళసినిమా: లిప్‌లాక్ చుంబనాలకు నటుడు కమలహాసన్ పేటెంట్ అంటారు. లిప్‌లాక్ దృశ్యాల్లో నటించడానికి వెనుకాడిన రోజుల్లో కమలహాసన్ ఆ పాశ్చాత్య సంస్కృతికి దారులు తీశారు. ఆయన ప్రతి చిత్రంలోనూ తప్పనిసరిగా ఒక్క చుంబన సన్నివేశం అయినా ఉంటుంది. ఆ తరువాత లిప్లాక్లనేవి తమిళ సినిమాలోనూ కామన్ అయిపోయాయి. అయినా కమలహాసన్ చుంబన దృశ్యాలకు ప్రత్యేకత ఉంటుంది. అలాంటిది ఆయన బాటలో తాజాగా యువ నటుడు ధనుష్ పయనిస్తున్నారనిపిస్తోంది. ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం వడచెన్నై. ఆయనే సొంతంగా తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకుడు. ఇందులో నటి ఆండ్రియా, ఐశ్వర్యరాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న వడచెన్నై చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. అందులో ధనుష్, నటి ఐశ్వర్యరాజేశ్‌ల లిప్‌లాక్ సన్నివేశం కోలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంతో గాఢమైన చుంబన దృశ్యంలో నటి ఐశ్వర్యరాజేశ్ ఇంతకు ముందు నటించి ఉండదు కూడా. ఈ చిత్రానికి సెన్సార్ యూ సర్టిఫికెట్‌ను పొందడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విడుదలనంతరం ఈ సన్నివేశాలకు ఎలాంటి వ్యతిరేకత వస్తుందో చూడాలి. అయితే చిత్ర టీజర్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే వడచెన్నై చిత్రానికి ఆ చుంబనాల దృశ్యం అవసరం అయ్యిందని, ఈ చిత్రం కచ్చితంగా ప్రేమికులు మెచ్చే చిత్రంగా ఉంటుందని ధనుష్ పేర్కొన్నారు. దీనికి వెట్రిమారన్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఇందులో సముద్రకని, అమీర్, కిశోర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను లైకా ఫిలింస్ సంస్థ పొందింది. త్వరలోనే వడచెన్నై చిత్రం తెరపైకి రానుంది. -
ఒక్కడి చావుతో యుద్ధం ఆగదు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం వడ చెన్నై. ఆడుకాలం తర్వాత విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్షన్లో ధనుష్ నటిస్తున్న చిత్రం కావటంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఒక్కడి చావుతో ఈ యుద్ధం ఆగదు....గెలుపైనా ఓటమైనా...యుద్ధం చేయక తప్పదు....మనం ప్రతిఘటించకపోతే....వారు మనల్ని అణగదొక్కుతూనే ఉంటారు......ఇది మన ఊరు....గుడిసెలైనా...చెత్త కుప్పలైనా....వాటిని కాపాడుకోవడం కోసం మనం పోరాడాల్సిందే....``అని ధనుష్ సింపుల్ గా చెప్పిన డైలాగ్స్...చాలా పవర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకున్నాయి. మొత్తం మూడు గెటప్స్‌లో ధనుష్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. క్యారమ్స్ ఛాంపియన్.. కత్తి పట్టి గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడు?.. ఆ తర్వాత పరిస్థితులేంటి అన్నదే కథ. ఐశ్వర్య రాజేష్, ఆండ్రియా, కిషోర్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మొత్తం మూడు పార్టులుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వడ చెన్నై టీజర్ రీలిజ్
-
బర్త్‌డే స్పెషల్
‘పొల్లాదవన్, ఆడుకుళం’ వంటి బ్లాక్బాస్టర్ హిట్స్ తర్వాత దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ మూడోసారి ‘వడ చెన్నై’ సినిమా కోసం కలిశారు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. రెండు పార్ట్స్‌గా రిలీజ్ కానున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఆండ్రియా, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. వండర్‌బార్ ఫిల్మ్ బ్యానర్‌పై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇవ్వనున్నారు ధనుష్. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ట్రైలర్‌ని బర్త్‌డే స్పెషల్‌గా జూలై 28న రిలీజ్ చేసి, సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. -
అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్
తమిళసినిమా: నటుల పుట్టిన రోజులు, వారి చిత్రాల వేడుకలు అభిమానులకు బహుమతులుగా మారిపోయాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా ధనుష్ అభిమానులకు వచ్చే నెల రెండు బహుమతులు అందించనున్నారు. అందులో ఒకటి ఆయన పుట్టిన రోజు జూలై 28 కాగా, మరొకటి ధనుష్ నటించిన వడచెన్నై చిత్ర తొలి భాగం ట్రైలర్ విడుదల. అవును ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ, తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం వడచెన్నై. విచారణై చిత్రం తరువాత వెట్ట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఎట్టకేలకు వడచెన్నై తొలి భాగాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ధనుష్‌తో పాటు నటి ఆండ్రియా, ఐశ్వర్యరాజేశ్, సముద్రఖని, ఆమిర్, డేనియల్ బాలాజీ, కిశోర్, కరుణాస్, పవన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. చెన్నై నేపధ్యంలో సాగే గ్యాంగ్స్టర్స్ ఇతి వృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో ధనుష్ అన్బు అనే పాత్రలో విభిన్న గెటప్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం విడుదల హక్కులను లైకా సంస్థ కొనుగోలు చేయడం విశేషం. రజనీకాంత్ నటించిన కాలా చిత్ర విడుదల హక్కులను లైకా సంస్థనే పొందింది. వడచెన్నై చిత్ర ట్రైలర్‌ను నటుడు ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా జూలై 28న, చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇది ధనుష్ అభిమానులకు పండగ చేసుకునే విషయమే అవుతుంది. ధనుష్, దర్శకుడు వెట్ట్రిమారన్ కాంబినేషన్లో ఇంతకు ముందు పొల్లాదవన్, ఆడుగళం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు రావడంతో ప్రస్తుతం వడచెన్నై చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. -
టైమ్ దగ్గరపడింది
తమిళ సినిమా: వడచెన్నై ఈ పేరు చాలా కాలంగా వార్తల్లో నానుతోందనే చెప్పాలి. నటుడు ధనుష్, దర్శకుడు వెట్ట్రమారన్ల సక్సెస్‌పుల్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం వడచెన్నై. చిత్ర నిర్మాణం మొదలై చాలా కాలం అయ్యింది. ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. నటి ఆండ్రియ, ఐశ్వర్యరాజేశ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం తొలి భాగం చిత్రీకరణ ఎట్టకేలకు ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు ముందుగానే వెల్లడించాయి. ఇందులో ధనుష్ క్యారమ్ ఆటగాడిగా నటిస్తున్నారు. ఆయన ప్రేయసిగా నటి ఐశ్వర్యరాజేశ్ నటిస్తోంది. ఆండ్రియా విభిన్న పాత్రలో కనిపించనుందట. గత మార్చిలో చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చిత్ర తొలి భాగాన్ని జూన్‌లో విడుదల చేయాలని మొదట భావించారు. అనివార్య కారణాల వల్ల రజనీకాంత్ కథానాయకుడిగా ధనుష్ నిర్మించిన కాలా చిత్రం విడుదల వాయిదా పడి ఆ చిత్రం జూన్ 7వ తేదీన విడుదల కావడంతో వడచెన్నై చిత్ర విడుదలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొందని సమాచారం. ఇక వడచెన్నైకి టైమ్ దగ్గర పడ్డట్టు కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం తరువాత ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం మారి–2 తెరపైకి రానుంది. అయితే మధ్యలో ఆయన నటించిన హాలీవుడ్ చిత్రం ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ధనుష్ చిత్రం తెరపైకి వచ్చి ఏడాది దాటి పోయింది. వేల్లై ఇల్లా పట్టాదారి–2 చిత్రం తరువాత ఆయన చిత్రాలేవీ విడుదల కాలేదు. దీంతో ధనుష్ తాజా చిత్రం వడచెన్నై కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ధనుష్, వెట్ట్రిమారన్ల కాంబినేషన్లో చిత్రం అంటే అంచనాలు భారీ స్థాయిలోనే ఉంటాయి. మొత్తం మీద చిన్న గ్యాప్ తరువాత ఆయన చిత్రాలు వరుసగా తెరపైకి రానున్నాయన్నమాట. -
నార్త్ చెన్నై కుర్రాడి కథ
‘ఆడుకలమ్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘వడ చెన్నై’. మూడు పార్ట్స్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నేషనల్ లెవల్ క్యారమ్ ప్లేయర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు ధనుష్. నార్త్ చెన్నైలో 35 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, ఆండ్రియా హీరోయిన్లుగా కనిపించనున్నారు. సంతోశ్ నారాయణ్ సంగీతం సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, ధనుష్, వెట్రిమారన్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బెస్ట్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే, హీరో’ విభాగాల్లో నేషనల్ అవార్డ్ సాధించిన ‘ఆడుకలమ్’ సినిమా తర్వాత ఆ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగా పెట్టుకున్నారు ధనుష్ అభిమానులు. -
ధనుష్ ‘వడ చెన్నై’ ఫస్ట్ లుక్
పొల్లాదవన్ , ఆడుగలం సినిమాలతో సక్సెస్ సాధించిన హీరో ధనుష్, దర్శకుడు వెట్రి మారన్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వడ చెన్నై. ధనుష్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆండ్రియా మరో కీలక పాత్రలో నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సంతోష్ నారాయణ్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ధనుస్ మాస్‌లుక్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రంజాన్ కానుకగా జూన్ 14న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. #vadachennai first look !! #அன்பு it’s not just his name. pic.twitter.com/22J4wOOSkH — Dhanush (@dhanushkraja) 8 March 2018 -
మందు కొట్టాలి, సిగరెట్ తాగాలన్నారు: హీరోయిన్
చెన్నై: నటి ఆండ్రియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా సెలెక్టివ్ పాత్రల్లోనే కనిపించే ఆండ్రియా నటించిన తాజా తమిళ చిత్రం తరమణి. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో ఆండ్రియా నటనకు ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆండ్రియా ఐటీ కంపెనీలో పని చేసే మహిళగా నటించింది. అంతే కాదు ఒక పిల్లాడికి తల్లిగానూ నటించింది. అసలు విషయం ఇవేవీ కాదు. తరమణి చిత్రంలో మద్యం సేవించడం, దమ్ము కొట్టడం వంటి సన్నివేశాలలో నటించడమే విమర్శలకు దారి తీస్తోంది. అయితే తనపై వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోనంటోంది ఆండ్రియా. అదే విధంగా ఇమేజ్ గురించి కూడా ఆలోచించనని అంటోంది. తనకు కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంటుంది. దర్శకుడు రామ్ తరమణి చిత్ర కథ«ను చెప్పి ఇందులో మందు కొట్టాలి, సిగరెట్ తాగాలి అని చెప్పారనీ, కథ, తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే అన్నాననీ తెలిపింది. ప్రస్తుతం వడచెన్నై, తుప్పరివాలన్ చిత్రాలలో నటిస్తున్నాననీ, ఈ రెండు చిత్రాలలోనూ తన పాత్రలు వైవిధ్య నటనకు అవకాశం ఉంటుందనీ చెప్పింది. ముఖ్యంగా వడచెన్నై చిత్రంలో తనను చూసిన వారు ఈమె ఆండ్రియానేనా అని ఆశ్చర్య పోతారనీ అంది. ఇకపై కూడా విభిన్న కథా పాత్రలనే పోషించాలని నిర్ణయించుకున్నాననీ, అలాంటప్పుడు ఇమేజ్ గురించి పట్టించుకోననీ, ఎవరెలా విమర్శించినా బాధలేదని అంటోంది. -
జాక్‌పాట్ కొట్టిన ఐశ్వర్యరాజేశ్
ఒకరు జార విడుచుకున్న అవకాశం మరొకరికి జాక్‌పాట్ అవుతుంది. అలాంటి లక్కీఛాన్స్‌ను నటి ఐశ్వర్యరాజేశ్ దక్కించుకున్నారు. కోలీవుడ్‌లో సంచలన నటి అమలాపాల్. నటి నయనతార మూడుసార్లు ప్రేమలో విఫలమైన తరువాత టాప్ కథానాయకిగా రాణిస్తుంటే, నటి అమలాపాల్ పెళ్లిలో విఫలమైన తరువాత కథానాయకిగా బిజీ అయ్యారు. ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఎంతగా అంటే ఒప్పుకున్న చిత్రాన్నే వదులుకునేంత బిజీ అయ్యారు. ధనుష్‌తో వడచెన్నై, అరవిందస్వామికి జంటగా చదరంగవేట్టై–2, తిరుట్టుపయలే–2, భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రాలు ఈ భామ చేతిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో తను నటుడు ధనుష్ చిత్రం నుంచి వైదొలిగారు. ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో వడచెన్నై ఒకటి. వెట్ట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మొదట సమంతను కథానాయకిగా ఎంపిక చేశారు. అయితే చిత్రం ప్రారంభంలో ఆలస్యం జరగడంతో సమంత వైదొలిగారు. అదే విధంగా ఇందులో ధనుష్‌కు విలన్‌గా నటుడు విజయ్‌సేతుపతి నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆయన చిత్రం నుంచి బయటకు వచ్చేశారు. దీనంతటికీ కారణం వడచెన్నై చిత్ర షూటింగ్‌కు జాప్యం జరగడమేనని తెలిసింది. అయితే చాలా కాలం క్రితమే ప్రారంభమై కొంత చిత్రీకరణ తరువాత వాయిదా పడింది. ఇటీవలే మళ్లీ మొదలైంది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలను ఒప్పుకున్న నటి అమలాపాల్ కూడా వడచెన్నై చిత్రం నుంచి వైదొలిగారు. ఇప్పుడా పాత్ర నటి ఐశ్వర్యరాజేశ్‌ను వరించింది. ఇది ఆమెకు పెద్ద జాక్‌పాట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఐశ్వర్యరాజేశ్ తొలిసారిగా ప్రముఖ కథానాయకుడితో నటించడం ఇదే అవుతుంది. ఇప్పటి వరకూ చిన్న హీరోలతోనే నటిస్తూ వస్తున్న ఐశ్వర్య కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. అలాంటిది వడచెన్నై ఆమె నట జీవితాన్ని మలుపు తిప్పుతుందని భావించవచ్చు. ఈ చిత్రంలో నటి ఆండ్రియా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారన్నది గమనార్హం. వేల్రాజ్ ఛాయాగ్రహణం, సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఆయనంటే నాకిష్టం!
దక్షిణాది సంచలన తారల పట్టికలో నటి అమలాపాల్ పేరు తప్పకుండా నమోదవుతుంది.కోలీవుడ్‌లో ఒకటి రెండు చిత్రాలతోనే తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న నటి ఈ కేరళా భామ. నటిగా ఎంత వేగంగా ఎదిగిందో అంత తొందరగా దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇక అంత త్వరగా భర్త నుంచి విడాకులు పొందిన నటి అమలాపాలే. ఈ అమ్మడిపై వదంతుల పర్వం అధికమే. ఇటీవల గాయని సుచిత్ర పేర్కొన్న రాసలీలల వదంతుల్లో ఈ జాణ పేరు చోటు చేసుందన్నది గమనార్హం. ఇవన్నీ పక్కన పెడితే నటిగా చాలా బిజీగా ఉన్న అమలాపాల్‌తో చిట్‌చాట్... ప్ర: దర్శకుడు విజయ్ నుంచి విడిపోయిన మీరు ఇప్పటికీ ఆయనపై ప్రేమాభిమాలు ఉన్నాయని ఒక భేటీలో పేర్కొన్నారు. తాజాగా ఆయన నుంచి విడాకులు కూడా పొందారు.మళ్లీ విజయ్‌తో కలిసి జీవించే అవకాశం ఉందా? జ: ఆ విషయం గురించి ఎలా చెప్పగలను. జీవితంలో ఎన్నో మజిలీలుంటాయి. ఎప్పుడేమి జరుగుతుందో ఊహించలేంగా. ప్ర: విజయ్ అంటే కోపమా? జ: లేదు.విజయ్‌ని నేనిప్పిటికీ ప్రియమైన వ్యక్తిగానే భావిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మేమిద్దరం ఒకరినుంచి ఒకరం పలు అద్భుతమైన విషయాలను నేర్చుకున్నాం. ప్ర: నటుడు ధనుష్‌తో వరసగా చిత్రాలు చేయడం గురించి? జ: ధనుష్ నాకు ఇష్టమైన నటుడు. ఆయన చాలా ప్రతిభావంతుడు. తామిద్దరం వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో కలిసి నటిం చాం. ఆ చిత్రం మంచి విజయం సాధిం చింది. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌తో పాటు, వడచెన్నై చిత్రంలోనూ ధనుష్‌కు జంటగా నటిస్తున్నారు.ఆయనతో నటించ డం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ప్ర: వడచెన్నైలో చాలెంజింగ్ పాత్ర పోషిస్తున్నారట? జ: ఒక కాల ఘట్టంలో జరిగే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం వడచెన్నై. ఇందులో నేను ఉత్తర చెన్నైకి చెందిన యువతిగా నటిస్తున్నాను. ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పినప్పుడు నా పాత్ర నుంచి బయట పడడానికి రెండు రోజులు పట్టింది.అది నిజంగా చాలెంజింగ్‌తో కూడిన పాత్రే. మరో విషయం ఏమిటంటే హిందీ చిత్రం క్వీన్ మలయాళ రీమేక్‌లో నటించనున్నాను. దీనికి నటి రేవతి దర్శకత్వం వహించన్నారు. నేను చిన్నతనం నుంచి రేవతి చిత్రాలు చూస్తూ ఎదిగాను. ఆమె నాకిష్టమైన నటి.అలాంటి నటి దర్శకత్వంలో నటించనుండడం ఆనందంగా ఉంది. ప్ర: భవిష్యత్ ప్రణాళికలంటూ ఏమైనా? జ: వ్యాపారరంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాను. సమాజం నాకు చాలా ఇచ్చింది. వారికి ఏమైనా చేయడం నా బాధ్యత. అందుకే చెన్నైలో ఒక హోటల్‌ను నిర్మించనున్నాను. అందులో యోగా, ధ్యానం లాంటి శిక్షణ గదులను ఏర్పాటు చేయనున్నాను. అదే విధంగా నేనూ ఆరోగ్యంగా జీవించడానికి తగ్గట్టుగా నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను. -
బ్రేకప్ కే బాద్!
దర్శకుడు విజయ్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలా పాల్ ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. కెరీర్ పరంగా ఇద్దరూ సక్సెస్ చూసినా, వ్యక్తిగత జీవితం పరంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ‘ఇదీ కారణం’ అని చెప్పలేదు కానీ, ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయారు. భర్త నుంచి బ్రేకప్ కే బాద్... కథానాయిక అమలా పాల్ ఎడాపెడా సినిమాలు సంతకాలు చేసేస్తున్నారు. తమిళ చిత్రం ‘తిరుట్టు పయలే’కి సీక్వెల్‌గా రూపొంద నున్న చిత్రంలో నటించడానికి అంగీకరించానని సోమవారం ట్విట్టర్ ద్వారా అమలా పాల్ ప్రకటించారు. మరోవైపు ‘వడ చెన్నై’ చేస్తున్నారు. అలాగే కన్నడంలో ‘హెబ్బులి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఓ మలయాళ చిత్రం కూడా అంగీకరించారు. ఇవన్నీ ఇలా ఉండగా తాజా ఖబర్ ఏమిటంటే, ఓ తెలుగు చిత్రంలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అమలాపాల్ సమాచారం. ‘అల్లరి’ నరేశ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని కృష్ణానగర్ కబురు. మలయాళ చిత్రం ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి ఈ తాజా తెలుగు ప్రయత్నం రీమేక్ అని భోగట్టా. దాంతో, తెలుగు సినీ పరిశ్రమలో ఈ వార్త సంచలనం అవుతోంది. ఇదే కనక నిజమైతే కొంత గ్యాప్ తర్వాత హీరోయిన్ అమలా పాల్ తెలుగులో అంగీకరించిన చిత్రం ఇదే అవుతుంది.. భర్త విజయ్ నుంచి బ్రేక్ కే బాద్ కమిట్ అయిన తొలి తెలుగు చిత్రమూ ఇదే అవుతుంది. -
వడాచెన్నై మొదలైంది
తమిళ స్టార్ హీరో ధనుష్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఎంతో ఆశపడి చేయాలనుకున్న వడాచెన్నై ట్రయాలజీ ఫైనల్‌గా మొదలైంది. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఆడుకాలం సినిమాతో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు వెట్రిమారన్, ఈ సినిమాకు దర్శకుడు. ఆడుకాలం రిలీజ్ తరువాత వెంటనే వడాచెన్నై సినిమాను చేయాలని ప్లాన్ చేసినా.. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా తొలి భాగాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఈ సినిమాకు హీరోయిన్గా సమంతను తీసుకున్నారు. అయితే సమంత ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పటంతో ధనుష్ లక్కీ హీరోయిన్ అమలాపాల్‌ను ఫైనల్ చేశారు. ఇప్పటికే తొడరి సినిమా షూటింగ్ పూర్తి చేసిన ధనుష్ వడాచెన్నైతో పాటు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. #vadachennai - trilogy.Started shooting for part 1 today. director of polladhavan,aadukalam @VetriMaaran .bless us pic.twitter.com/Sq1nKoOXAn — Dhanush (@dhanushkraja) 22 June 2016 -
మూడేళ్ల ముచ్చటకు నో!
తమిళ సినిమా ‘వడ చెన్నై’లో సమంత నటించడం లేదనేది కన్ఫర్మ్ న్యూస్. సమంత తప్పుకున్నాక అమలా పాల్ని కథానాయికగా తీసుకున్నారు. ఇంతకీ సమంత ఎందుకు తప్పుకున్నారు? అనే పశ్నకు పలు సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా వినిపిస్తోన్న సమాధానం ‘మ్యారేజ్’ అని. నాగచైతన్యతో సమంత పెళ్లి కుదిరిందనే వార్త వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి సమంత తప్పుకోవడానికి పెళ్లి రీజన్ కాదట. అసలు కారణం ఏంటంటే.. సమంత ఈ సినిమాకి సంతకం చేసినప్పుడు దర్శక, నిర్మాతలు ఒక్క సినిమా మాత్రమే తీయాలనుకున్నారు. ఇప్పుడు ట్రయాలజీ ప్లాన్ చేశారట. అంటే.. ‘వడ చెన్నై’ పేరుతో మూడు సినిమాలు తీస్తారన్న మాట. అది కూడా వచ్చే రెండేళ్లలో ఈ మూడు సినిమాలు తీయాలనుకుంటున్నారట. ఈ ఏడాదితో కలుపుకుని ఈ చిత్రానికి మూడేళ్లు కేటాయించాల్సిన పరిస్థితి. ఆల్రెడీ వేరే చిత్రాలు అంగీకరించడంవల్ల ఈ ట్రయాలజీకి డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం అనిపించి, సమంత తప్పుకున్నారట. అంత వరకూ ఓకే. కానీ, సమంత కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు కదా అని ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ మినహా ఈ చెన్నై సుందరి చేతిలో మరో సినిమా లేదు. పెళ్లి కోసమే సమంత కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదన్నది కొందరి ఊహ. పైగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగచైతన్య, సమంత జంటగా మల్టీప్లెక్స్ థియేటర్లకూ, ఐస్‌క్రీమ్ షాపులకూ వెళ్లిన ఫొటోలు దర్శనమిస్తున్నాయి. మరి.. ‘వడ చెన్నై’ని ఎందుకు వద్దనుకున్నారో సమంతకే ఎరుక! -
వడచెన్నైకి ధనుష్ రెడీ
నటుడు ధనుష్ వడచెన్నై చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ప్రభుసాలమన్ దర్శకత్వంవలో తొడరి, దురెసైంథిల్‌కుమార్ దర్శకత్వంలో కొడి చిత్రాలను పూర్తి చేశారు. వీటిలో తొడరి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా వెట్ట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రానికి రెడీ అవుతున్నారు. వీరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.పొల్లాదవన్,ఆడుగళం వంటి విజయవంతమైన చిత్రాలు ధనుష్, వెట్ట్రిమారన్ కాంబినేషన్లో వచ్చాయి. వీటిలో పొల్లాదవన్ కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించింది. ఇక ఆడుగళం చిత్రం ధనుష్‌కు జాతీయ అవార్డును అందించింది. దీంతో వడచెన్నై చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజం. దర్శకుడు వెట్ట్రిమారన్ వడచెన్నై చిత్ర కథను చాలా కాలంగా వండుతున్నారు. ముందు ఈ చిత్రంలో నటుడు శింబును హీరోగా ఎంచుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో గానీ ధనుష్ హీరో అయ్యారు. సమంత హీరోయిన్గా నటించనున్నారు. ఒక ముఖ్య పాత్రలో నటి ఆండ్రియా వేశ్యగా నటించనున్నట్లు సమాచారం. ఇందులో విలన్‌గా డేనియల్ బాలాజీ నటించనున్నారు. తాజాగా నటుడు సముద్రకనిని ముఖ్యపాత్రకు ఎంపిక చేశారు. ఈ చిత్రం కోసం భారీ సెట్‌ను రూపొందిం చారు. వడచెన్నై చిత్ర ఫ్రీ పొడక్షన్స్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. వచ్చే నెలలో చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని తెలిసింది. ఈ చిత్రాన్ని బాహుబలి చిత్రం తరహాలో రెండు భాగాలుగా రూపొందించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.