కమల్‌ బాటలో ధనుష్‌ | Liplock Scenes In Danush Vada Chennai Movie | Sakshi
Sakshi News home page

కమల్‌ బాటలో ధనుష్‌

Published Wed, Aug 1 2018 11:17 AM | Last Updated on Wed, Aug 1 2018 12:04 PM

Liplock Scenes In Danush Vada Chennai Movie - Sakshi

వడచెన్నై చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: లిప్‌లాక్‌ చుంబనాలకు నటుడు కమలహాసన్‌ పేటెంట్‌ అంటారు. లిప్‌లాక్‌ దృశ్యాల్లో నటించడానికి వెనుకాడిన రోజుల్లో కమలహాసన్‌ ఆ పాశ్చాత్య సంస్కృతికి దారులు తీశారు. ఆయన ప్రతి చిత్రంలోనూ తప్పనిసరిగా ఒక్క చుంబన సన్నివేశం అయినా ఉంటుంది. ఆ తరువాత లిప్‌లాక్‌లనేవి తమిళ సినిమాలోనూ కామన్‌ అయిపోయాయి. అయినా కమలహాసన్‌ చుంబన దృశ్యాలకు ప్రత్యేకత ఉంటుంది. అలాంటిది ఆయన బాటలో తాజాగా యువ నటుడు ధనుష్‌ పయనిస్తున్నారనిపిస్తోంది. ధనుష్‌ నటిస్తున్న తాజా చిత్రం వడచెన్నై. ఆయనే సొంతంగా తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెట్రిమారన్‌ దర్శకుడు.

ఇందులో నటి ఆండ్రియా, ఐశ్వర్యరాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న వడచెన్నై చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. అందులో ధనుష్, నటి ఐశ్వర్యరాజేశ్‌ల లిప్‌లాక్‌ సన్నివేశం కోలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంతో గాఢమైన చుంబన దృశ్యంలో నటి ఐశ్వర్యరాజేశ్‌ ఇంతకు ముందు నటించి ఉండదు కూడా. ఈ చిత్రానికి సెన్సార్‌ యూ సర్టిఫికెట్‌ను పొందడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విడుదలనంతరం ఈ సన్నివేశాలకు ఎలాంటి వ్యతిరేకత వస్తుందో చూడాలి. అయితే చిత్ర టీజర్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

అయితే వడచెన్నై చిత్రానికి ఆ చుంబనాల దృశ్యం అవసరం అయ్యిందని, ఈ చిత్రం కచ్చితంగా ప్రేమికులు మెచ్చే చిత్రంగా ఉంటుందని ధనుష్‌ పేర్కొన్నారు. దీనికి వెట్రిమారన్‌ దర్శకుడు కావడంతో అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఇందులో సముద్రకని, అమీర్, కిశోర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను లైకా ఫిలింస్‌ సంస్థ పొందింది. త్వరలోనే వడచెన్నై చిత్రం తెరపైకి రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement