lip lock scenes
-
ముద్దు సన్నివేశాల్లో నటించడం పై అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
-
హీరోయిన్‌తో లిప్‌లాక్.. నాని ఇంట్లో గొడవలు!
ఈ మధ్య కాలంలో చాలా సినిమాలో లిప్‌లాక్ సన్నివేశాలు ఉంటున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కథ డిమాండ్ మేరకే అలాంటి సీన్స్ పెడితే.. మరికొన్ని సినిమాల్లో మాత్రం మసాలా యాడ్ చేయడం కోసమే అన్నట్లుగా ముద్దు సన్నివేశాలు పెడుతున్నారు. హీరో నాని సైతం కొన్ని సినిమాల్లో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించాడు. తాజా చిత్రం ‘హాయ్ నాన్న’లో కూడా హీరోయిన్‌తో లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇదే విషయంపై టీజర్ లాంచ్ ఈవెంట్లో ఓ విలేకరి నుంచి నానికి ఓ వింత ప్రశ్న ఎదురైంది. ‘మీ ప్రతి సినిమాలోనూ లిప్‌లాక్ సీన్స్ కనిపిస్తున్నాయి. దర్శకుడు ఆ సన్నివేశాలు యాడ్ చేస్తున్నారా? లేదా మీరు అలాంటి సీన్ పెట్టాలని కండీషన్ పెడుతున్నారా’? అని ఓ విలేకరి ప్రశ్నించాడు. (చదవండి: విజయశాంతి 45 ఏళ్ల ప్రస్థానం.. ఆమె జీవితంలో మలుపు తిప్పిన సినిమా) దానికి నాని ఇలా సమాధానం ఇచ్చాడు. ‘నా ప్రతి సినిమాలోనూ లిప్‌లాక్ సీన్స్ లేవు. అంటే సుందరానికీ.. మూవీతో పాటు దసరా సినిమాలో కూడా ముద్దు సన్నివేశాలు లేవు. కొన్ని సినిమాల్లో మాత్రం ఆ తరహా సీన్స్ ఉన్నాయి. అలాంటి సీన్స్‌లో నటించినప్పుడు మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతుంటాయి. అయితే నేను ఒక నటుడిని. కథ డిమాండ్ మేరకే అలాంటి సీన్స్‌లో నటిస్తాను. (చదవండి: పెళ్లికి ముందు కూడా నరకం చూశా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్) నా గత చిత్రాలను చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. సినిమాకు ఆ సీన్ అవసరం అనుకుంటేనే.. నటిస్తాను తప్ప.. ప్రమోషన్స్ కోసమే, లేదా మసాలా యాడ్ చేయడం కోసమో నటించను’ అని నాని సమాధానం ఇచ్చాడు. ‘హాయ్ నాన్న’టీజర్ చూశాక.. మళ్లీ మీ ఇంట్లో గొడవలు అయ్యే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. ‘ఏమో ఇప్పుడే రిలీజ్ చేశాం. ఇంట్లో ఎలా ఉంటుందో చూడాలి’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు నాని. ఇక ‘హాయ్ నాన్న’విషయాకొస్తే.. నాని తండ్రి పాత్రలో నటిస్తున్న ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మృణాలు ఠాకూర్ హీరోయిన్. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. డిసెంబర్ 7న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
దీపికా బోల్డ్ సీన్స్‌పై భర్త రణ్వీర్ స్పందన, ఏమన్నాడంటే..
Ranveer Singh Intresting Comments On Wife Deepika: బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె నటించిన తాజా చిత్రం గెహ్రియాన్. ఇందులో దీపికా ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయింది. యంగ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేదితో లిప్ లాక్, రొమాంటి సీన్స్‌లో నటించింది. తన కజిన్ బాయ్‌ఫ్రెండ్‌తో ఎఫైర్ పెట్టుకునే అమ్మాయిగా దీపికా ఈ మూవీలో కనిపించింది. ఇక ఈ సినిమాలో దీపిక తన పాత్ర, ఇంటిమేట్లో సీన్స్‌పై వీపరితమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న తరుణంలో రణ్వీర్ తన భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇటీవల దీపికా-రణ్‌వీర్‌లు పర్యటనకు వెళ్లిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఈ బాలీవుడ్ జంట లిప్ కిస్ ఇచ్చుకుంటూ కనిపించారు. ఇదే ఫొటోను రణ్వీర్ షేర్ చేస్తూ.. గెహ్రియాన్‌లో ఆమె నటనపై ప్రశంసలు కురింపించాడు. ఇందులో తన నటన అద్భుతమని, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఆసక్తిగా స్పందించాడు. అంతేకాదు దీపికాను పోగుడుతూ అర్థంకానీ కఠినమైన ఇంగ్లీష్ పదాలతో ఆమె పాత్రను కొనియాడాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చదవండి: ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్ ‘మీ లాంటి భర్త ఉంటే.. ప్రతి అమ్మాయి లక్కీ గర్ల్’ అని, క్యూట్ కపుల్, మీరు ఈ ఇంగ్లీష్‌ను కేంద్ర మంత్రి శశిథరూర్ దగ్గర నేర్చుకున్నారా? అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో దీపికా, సిద్ధార్థ్ చతుర్వేదితో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. అంతేకాదు లెక్కలేనని లిప్ లాక్‌లు కూడా ఇచ్చింది. దీంతో ఇంటిమేట్ సీన్స్‌లో నటించేందుకు మీ ఆయన(రణ్వీర్ సింగ్) అనుమతి తీసుకున్నావా అంటూ ఆమెపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వీటిపై ఇప్పటికే దీపికా స్పందిస్తూ ట్రోలర్స్‌పై అసహనం వ్యక్తం చేసింది. అసలు ఇంత తెలివి తక్కువగా ఎలా ఉంటారంటూ వారిపై మండిపడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) -
ఆ హీరోయిన్‌తో రవితేజ లిప్‌లాక్!
సినిమాల్లో లిప్‌లాక్ సీన్స్ ఇప్పడు కామన్ అయిపోయాయి. అసలు ముద్దులేని సినిమాలు రావడమే గగనమైపోయింది. ఇక బాలీవుడ్ సినిమాల్లో అయితే కనీసం ఒక్కటైనా ముద్దు సీన్ ఉండాల్సిందే. అక్కడ కథ లేని సినిమాలు వస్తున్నాయేమో కానీ ముద్దు లేని సినిమాలు మాత్రం రావడంలేదు. ఇక ఈ లిప్‌లాక్‌లు ఇప్పుడు టాలీవుడ్లో కూడా కామనైపోయింది. ముఖ్యంగా విజయ్‌దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ తర్వాత తెలుగు సినిమాల్లో ముద్దు సీన్లు ఎక్కువైపోయాయి. (చదవండి : ముద్దు పెట్టలేదని రిజెక్ట్ చేసింది: అక్షయ్) మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. తాజాగా రామ్ పోతినేని కూడా ‘రెడ్’తో ఆ జోన్లోకి వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు మాస్ మహా రాజా రవితేజ కూడా ఇంగ్లీష్ ముద్దు పెట్టబోతున్నాడట. ‘క్రాక్’ సూపర్ హిట్ తర్వాత రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ మినాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘ఖిలాడి’లో రవితేజ ఒక లిప్‌లాక్ సీన్లో నటించారట. బాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరితో కలిసి ముద్దు సనివేశంలో నటించారట మన మాస్ మహారాజా. ఈ సీన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. వాస్తవానికి లిప్‌లాక్ సీన్ చేయడానికి రవితేజ మొదట్లో ఒప్పుకోలేదట. కానీ, డైరెక్టర్ రమేశ్ వర్మ చాలా కష్టపడి రవితేజను ఒప్పించాడట. ఇష్టంలేకున్నా దర్శకుడి బలవంతం మేరకు లిక్‌లాక్ సీన్‌కు రవితేజ అంగీకరించాడట. మొత్తానికి మాస్ మహారాజా కూడా ఇంగ్లీష్ ముద్దు ఇచ్చి ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చేశాడన్నమాట. -
లిప్ లాక్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ
సాక్షి, చెన్నై: లిప్ లాక్‌లపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ తమిళ ఆడియో ఆవిష్కరణ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మీడియాతో మాట్లాడారు. లిప్ లాక్‌లపై మీడియా అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ కొంత ఉద్వేగంగా మాట్లాడాడు. ‘సినిమాలో వచ్చే లిప్ లాక్ దృశ్యాలు చూసేవాళ్లకు వినోదంగా, సరదాగా ఉంటుంది. ఈ సన్నివేశాల్లో పాల్గొన్న నటీనటుల గురించి హేళనగా మాట్లాడతారు. కానీ.. సినిమా అనేది చాలా సీరియస్ విషయం, సినిమా అంటే మంచి కథ, అందులోనే భవిష్యత్తు, నిర్మాత డబ్బులు, దర్శకుడి జీవితం, కొత్త ఆర్టిస్టులకు వాళ్లని వాళ్లు నిరూపించుకునే వేదిక. ఇక హీరోయిన్లు వాళ్ల కెరీయర్, తాము ఎన్నుకున్న రంగంలో ఏదైనా సాధించాలనే తపనతో వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం. ఇవన్నీ సినిమాతో ముడిపడి ఉంటాయి. సినిమాల్లో లిప్ లాక్ సీన్లు రొమాంటిక్‌గా చూడటాపిరి వినోదంగా ఉంటాయి. కానీ.. ఆయా సన్నివేశాలు మా జీవితాలపై సీరియస్‌గా ఉంటుంది. ఆ సీన్లు చూసి నటీనటుల గురించి చాలా ఈజీగా కామెంట్ చేస్తారు. అంతేకాదు సినిమా చూసి ....ఆయా క్యారెక్టర్లను వీళ్లు ఇంతే అనటం ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసు. సినిమా విడుదల తర్వాత లభించే హిట్‌తో మాకు రిలాక్స్ దొరుకుతుంది. ఇది ఆటలాడుకునే విషయం కాదు. సినిమా అంటేనే సీరియస్. డియర్ కామ్రేడ్ అలాంటి సినిమానే కానీ లిప్ లాక్ సినిమా కాదు. ఇక నేను హైదరాబాద్‌లో చదువుకుంటున్నప్పుడు తెలంగాణా, అదీ పక్కా హైదరాబాదీ యాస అలవాటైంది. సినిమాల్లో సాధారణంగా యాస లేకుండా తెలుగు మాట్లాడాలని చెప్పేవారు. కానీ నా యాసలోనే మాట్లాడటం, అది సక్సెస్ కావటంతో మిగిలిన చిత్రాల్లో కూడా ఇలాగే కొనసాగిస్తున్నా.’ అని తెలిపాడు. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న కన్నా ముందు హీరోయిన్ సాయి పల్లవి సంప్రదించారని అయితే ముద్దు సన్నివేశాలు ఉండటంతో ఆ సినిమాను ఆమె తిరస్కరించినట్లు సమాచారం. -
లిప్‌లాక్‌కు ఓకే కానీ..
చెన్నై : బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయ్యి కథానాయికలుగా నిలదొక్కుకున్న వారు అరుదే. అలాంటి నటీమణుల్లో ప్రియా భవానీశంకర్ ఒకరు. బుల్లితెర ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆయనతో కలిసి ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలని భావించింది. దీంతో ఆమె నటిస్తున్న కల్యాణం ముదల్ కాదల్ వరై సీరియల్ నుంచి వైదొలిగింది. అయితే ఆమె నటనకు దూరం కావడాన్ని ప్రేక్షకులు ఇష్టపడలేదు. అలా నటనను కొనసాగించిన ప్రియా భవానీశంకర్ మేయాదమాన్ చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. ఆ మధ్య నటుడు కార్తీతో కడైకుట్టిసింగంతో, ఇటీవల నటుడు ఎస్జే.సూర్యకు జంటగా మాన్స్టర్ చిత్రాల్లో నటించి సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది. ఇలా హీరోయిన్గా సక్సెస్ బాటలో పయనిస్తున్న ప్రియా భవానీశంకర్ తాజాగా ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఆ ఫొటో ఇప్పుడు అభిమానుల మతి పోగొడుతోంది. ఫొటోలో ఉన్నది ప్రియ భవానీశంకరేనా? ఇంత అందంగా ఉంటుందా? అని ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రియ నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అని కొందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ అమ్మడు తెగ ఖుషీ అవుతోంది. కొందరైతే తల(నటుడు అజిత్)కు జంటగా నటిస్తే చూడాలనుందనే కోరికను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఒక భేటీలో లిప్‌లాక్ సన్నివేశాలు, బికినీ దుస్తులు ఈ రెండింటిలో ఒక దాంటో నటించాలంటే దేన్ని ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు ప్రియాభవానీశంకర్ స్పందిస్తూ లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికైనా ఒప్పుకుంటాను కానీ బికినీ దుస్తుల్లో నటించడానికి ఎంత మాత్రం ఒప్పుకోనని ఖరాకండీగా చెప్పింది. అంతే కాదు వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడం లేదని, తనకు నచ్చిన కథ పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్లు ఈ అమ్మడు పేర్కొంది. మొత్తం మీద లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి రెడీ అని దర్శక నిర్మాతలకు ప్రియాభవానీ శంకర్ బహిరంగంగానే చెప్పేసిందన్నమాట. -
కమల్ బాటలో ధనుష్
తమిళసినిమా: లిప్‌లాక్ చుంబనాలకు నటుడు కమలహాసన్ పేటెంట్ అంటారు. లిప్‌లాక్ దృశ్యాల్లో నటించడానికి వెనుకాడిన రోజుల్లో కమలహాసన్ ఆ పాశ్చాత్య సంస్కృతికి దారులు తీశారు. ఆయన ప్రతి చిత్రంలోనూ తప్పనిసరిగా ఒక్క చుంబన సన్నివేశం అయినా ఉంటుంది. ఆ తరువాత లిప్లాక్లనేవి తమిళ సినిమాలోనూ కామన్ అయిపోయాయి. అయినా కమలహాసన్ చుంబన దృశ్యాలకు ప్రత్యేకత ఉంటుంది. అలాంటిది ఆయన బాటలో తాజాగా యువ నటుడు ధనుష్ పయనిస్తున్నారనిపిస్తోంది. ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం వడచెన్నై. ఆయనే సొంతంగా తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకుడు. ఇందులో నటి ఆండ్రియా, ఐశ్వర్యరాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న వడచెన్నై చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. అందులో ధనుష్, నటి ఐశ్వర్యరాజేశ్‌ల లిప్‌లాక్ సన్నివేశం కోలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంతో గాఢమైన చుంబన దృశ్యంలో నటి ఐశ్వర్యరాజేశ్ ఇంతకు ముందు నటించి ఉండదు కూడా. ఈ చిత్రానికి సెన్సార్ యూ సర్టిఫికెట్‌ను పొందడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విడుదలనంతరం ఈ సన్నివేశాలకు ఎలాంటి వ్యతిరేకత వస్తుందో చూడాలి. అయితే చిత్ర టీజర్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే వడచెన్నై చిత్రానికి ఆ చుంబనాల దృశ్యం అవసరం అయ్యిందని, ఈ చిత్రం కచ్చితంగా ప్రేమికులు మెచ్చే చిత్రంగా ఉంటుందని ధనుష్ పేర్కొన్నారు. దీనికి వెట్రిమారన్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఇందులో సముద్రకని, అమీర్, కిశోర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను లైకా ఫిలింస్ సంస్థ పొందింది. త్వరలోనే వడచెన్నై చిత్రం తెరపైకి రానుంది. -
అప్పుడు లిప్‌స్టిక్ వాడను
‘నా నడుము ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనుకోలేదు’ అని తమిళ చిత్రం ‘తిరుట్టుపయలే 2’ కోసం నడుము కనిపించేట్లు చీర కట్టుకోవడం గురించి అమలా పాల్ చేసిన కామెంట్ ఇది. ఆ వివాదం చల్లబడుతుండగానే తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చేశారీ బ్యూటీ. సినిమాల్లో లిప్‌లాక్ సన్నివేశాల గురించి, ఆ సీన్లను పండించడానికి తాను ఏం చేస్తాననే విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బోల్డ్‌గా చెప్పేసి, మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు అమలా పాల్. ‘‘సినిమాల్లో పెదవి ముద్దు సన్నివేశాల్లో నటించడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మామూలు సన్నివేశాలు పండించడానికి నా వంతుగా ఎంత ప్రయత్నం చేస్తానో లిప్‌కిస్ సీన్లను పండించడానికి కూడా అలాగే చేస్తా. అయితే, పెదవి ముద్దుల సన్నివేశాలు తీస్తున్నప్పుడు లిప్‌స్టిక్ వేసుకుంటే బాగుండదు. అది లేకపోతే సీన్ బాగా పండుతుందన్నది నా ఫీలింగ్. అందుకే లిప్‌కిస్ సీన్స్ చిత్రీకరణప్పుడు నేను లిప్‌స్టిక్ వాడను’’ అని సెలవిచ్చారీ బ్యూటీ. -
నటి మీనాక్షితో లిప్‌లాకా?
తమిళసినిమా: ఇప్పుడు సినిమాల్లో సర్వసాధారణ అంశం హీరోహీరోయిన్ల లిప్ లాక్ సన్నివేశాలు. అలాంటిది అదీ ఒక హీరో లిప్ లాక్ సన్నివేశంలో నటించాలని అనగానే కరెంట్ షాక్ కొట్టినట్లు వద్దు బాబోయ్ అంటూ పారిపోవడం ఆ చిత్ర యూనిట్నే ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్త నటుడు రఫీ కథానాయకుడిగా పరిచయమవుతూ హైటెక్ పిక్చర్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నేర్ముగం. మీరానందన్, మీనాక్షి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మిరండవన్ చిత్రాన్ని తెరకెక్కించిన మురళీకృష్ణ కథ, కథనం, దర్శకత్వం బాధ్యత లు నిర్వహిస్తున్నారు. పాండియరాజన్, జిన్నా, సిజర్ మనోహర్, నెల్లై శివ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ మానసికంగా వేదనకు గురైన మనుషుల ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం నేర్ముగం అని తెలిపారు. అలాంటి ఏడు జంటలు అడవిలో పడే పాట్లే చిత్ర కథ అని చెప్పారు. వాళ్లలో ముఖ్య జంటగా హీరోహీరోయిన్లు రఫీ, మీనాక్షి నటిస్తున్నారని చెప్పారు. ఒక సందర్భంలో హీరో హీరోయిన్ను లిప్ టూ లిప్ ముద్దు పెట్టుకోవాల్సి వస్తుందని, ఆ విషయాన్ని నటి మీనాక్షికి చెప్పి ఆమె సమ్మతించేలా కన్వెన్స్ చేశామని అన్నారు. హీరో రఫీకి ఈ చుంభనం విషయం చెప్పగానే మీనాక్షితో లిప్‌లాకా? అంటూ బెదిరిపోయారని పేర్కొన్నారు. ఏదో నటనపై ఆశతో తానే నిర్మాతగా చిత్రాన్ని చేస్తున్నానని, పెళ్లి అయిన వాడికి ఈ లిప్‌లాక్ సన్నివేశాలు ఏంటని, ఈ విషయం తన భార్యకు తెలిస్తే విడాకుల వరకూ వెళుతుందని, అందుకే చచ్చినా చేయనని అన్నారని వివరించారు. చివరకు ఆ సన్నివేశాన్ని వేరే జంటతో చిత్రీకరించినట్లు దర్శకుడు చెప్పారు. యువతను, ప్రేమికుల్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రంలో ప్రేమ, సెంటిమెంట్, హాస్యం, థ్రిల్లర్, యాక్షన్ ఉంటాయని తెలిపారు. -
ఈమె ముద్దు చాలా కాస్ట్లీ
ముద్దంటే చేదా? నీకా ఉద్దేశం లేదా? అంటూ పాత కాలపు హీరోలు పాడుకునేవారు. ఇప్పుడలాంటి అవసరం లేదు. ఇప్పుడు దాదాపు అన్ని చిత్రాల్లోనూ చుంబనాల దృశ్యాలుంటున్నాయి. లిప్‌లాక్‌లకు నేటి తరం హీరోయిన్లు ఏ మాత్రం వెనుకాడటం లేదు. కాకపోతే వాటికంటూ ఒక రేటును డిమాండ్ చేస్తున్నారంతే. తాజాగా ఈ తరహా వ్యాపారంలో నటి లక్ష్మీ మీనన్ ముందంజలో ఉన్నారు. కుంకీ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈ మలయాళ భామ ఆ చిత్రంలో ఒంటినిండా దుస్తులు ధరించి కొండ ప్రాంత పడుచుగా నిండుగా కనిపించింది. బొద్దుగా ముద్దు గా బాగుందనిపించింది. అదే సమయంలో కుంకీ చిత్రం విజయం సాధించడంతో కోలీవుడ్‌కు మరో పక్కింటి అమ్మాయిలా మంచి హీరోయిన్ లభించిందనుకున్నారు. అనుకున్నట్లుగానే లక్ష్మీ మీనన్ తదుపరి చిత్రాలు సుందరపాండియన్, కుట్టిపులి, పాండియనాడు చిత్రాల్లోనూ లంగా ఓణి, చీర అంటూ సంప్రదాయ బద్దంగా కనిపించింది. అయితే అన్ని చిత్రాల్లో లంగా ఓణిలను అంటిపెట్టుకుని సంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ మడికట్టుకుని ఉంటే లాభం లేదనుకుందో ఏమో, ఆ తరువాత నటించిన నాన్ శిగప్పు మనిదన్ చిత్రంలో ఏకంగా లిప్‌లాక్ సన్నివేశాల్లోనే రెచ్చిపోయి నటించేసింది. అంతేకాదు ఇకపై ఇలాంటి ముద్దు సన్నివేశాలకు, కురచ దుస్తులు ధరించి నటించే గ్లామరస్ పాత్రలకు రెడీ అంటూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేసింది. మరో విషయం ఏమిటంటే లక్ష్మీమీనన్ ప్రకటన ఆమె తల్లికి, దర్శక నిర్మాతలకు తెగ ఆనందాన్నిచ్చేసిందని సమాచారం. దీంతో కోలీవుడ్ దర్శక నిర్మాతలు లక్ష్మీమీనన్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటింపజేయడానికి సిద్ధం అయ్యారట. ఇక ఈ సంచలన నటి తల్లి మాత్రం ఒక్కో ముద్దు సన్నివేశానికి అదనంగా పది లక్షలు పారితోషికం చెల్లించుకోవాలంటూ డిమాండ్ చేసే పనిలో పడ్డారట. కొందరి అవసరం ఇంకొందరికి అవకాశం అంటే ఇదేనేమో.